Get MYLO APP
Install Mylo app Now and unlock new features
💰 Extra 20% OFF on 1st purchase
🥗 Get Diet Chart for your little one
📈 Track your baby’s growth
👩⚕️ Get daily tips
OR
Article Continues below advertisement
Pregnancy
3 November 2023 న నవీకరించబడింది
శతాబ్దాలుగా, టీ ట్రీ ఆయిల్ ఒక అధ్బుతమైన ఉత్పాదనగా కీర్తించబడుతోంది, ఎందుకంటే ఇది మొటిమలు, అతిగా పొడిబారడం, కందిన చర్మం, ఇన్‌ఫెక్షన్లు, మచ్చలు, మంట వంటి ఎన్నో రకాల చర్మ సమస్యలకు తగిన చికిత్స అందివ్వగలదు. టీ ట్రీ ఆయిల్ అనేది ఒక వైవిధ్యమైన గొప్ప ఉత్పాదన. మీ చర్మ సంరక్షణాలయంలో దీనికొక విశిష్ట స్థానాన్ని ఇవ్వడం సముచితం.
చర్మ సంరక్షణలో టీ ట్రీ ఆయిల్‌ను చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి అసలు ఏమీ తెలియదు. టీ ట్రీ ఆయిల్ ఒక అద్భుతమైన ద్రవ్యం, మీ చర్మం కోసం నాణ్యతలోరాజీపడని ఉత్పత్తులనే వాడటం ఎంతో ముఖ్యం. సరిగ్గా అటువంటి నాణ్యత ఉన్న ఉత్పాదన అయిన, మైలో కేర్ టీ ట్రీ ఫేస్ క్రీమ్ మీ చర్మాన్ని లోలోపల నుండే పునరుద్ధరించదానికి దోహదపడుతుంది. అంతేకాకుండా, క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల సమయానుకూలమైన చక్కని ఫలితాలను అందుకోవడం ఖాయం!
టీ ట్రీ ఆయిల్‌ను మెలల్యూకా ఆయిల్ అని కూడా అంటారు, ఎందుకంటే ఈ విశిష్టమైన నూనెను మెలల్యూకా ఆల్టర్నిఫోలియా అనే (ఆస్ట్రేలియాలో దొరికే స్థానిక మొక్క) మొక్క నుండి సంగ్రహిస్తారు. మార్కెట్‌లో కనపించే నాసిరకపు కాస్మెటిక్ చర్మ సంరక్షణ ఉత్పత్తుల మాయాజాలానికి నిస్సందేహంగా అందరూ ఆకర్షితులవుతారు కానీ, అవి హానికారక రసాయనాలతో తయారైనవనే అవగాహన లేకుండానే వాటిని కొనేస్తున్నారు. ఇలాంటి స్కిన్‌కేర్ ప్రాడక్ట్‌లను కొనే బదులు, మీరు సహజమైన పదార్థాలతో చేసిన ప్రాడక్ట్‌లను తెలివిగా ఎంచుకొని కొనాలి.
Article continues below advertisment
మీ సౌందర్య రక్షణలో టీ ట్రీ ఆయిల్ ఉన్న ప్రాడక్ట్‌ని జతచేయడం నిస్సందేహంగా మంచి ఎంపిక అవుతుంది. మైలో కేర్ టీ ట్రీ ఆయిల్ ఫేస్‌వాష్ మరియు ఫేస్ క్రీమ్‌ను ఎంచుకోవడం మీకు సర్వదా క్షేమదాయకమే, ఎందుకంటే అవి అద్భుతాలను ఆవిష్కరించగల గొప్ప సాధనాలు. హానికారక రసాయనాలు మిళితమై ఉన్న అన్నిరకాల స్కిన్‌కేర్ ప్రాడక్ట్‌లకు ధీటుగా సహజమైన ఇంకా సున్నితమైన టీ ట్రీ ఆయిల్ ఒక్కటే సరైన ప్రత్యామ్నాయం. ఈ విశిష్టమైన ఆయిల్ అద్భుతమైనది, ఎందుకంటే ఇది అందరూ ప్రధానంగా ఎదుర్కొనే చర్మ సమస్యలను పరిష్కరించగలదు. ఇంకా ఈ క్రింద కనబరిచిన దీని విలక్షణ గుణాల వల్ల తిరిగి ఆరోగ్యకరమైన చర్మాన్నిపొందేందుకు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది:
1. యాంటీ బాక్టీరియల్
2. పరిమళం
3. శిలీంద్ర నాశిని
4. యాంటీ మైక్రోబయల్
Article continues below advertisment
5. కీటకనాశిని
6. యాంటీవైరల్
7. యాంటీసెప్టిక్
ఇప్పుడు, టీ ట్రీ ఆయిల్ వంటి సహజ పదార్ధం మీ చర్మాన్ని తిరిగి పూర్వస్థితికి తేవడంలో ఎలా దోహదపడుతుంది అనే సందేహం మీకు ఉన్నట్లయితే, ఈ ఉత్తమ ఉత్పాదన అందించే అద్భుత ప్రయోజనాల గురించి మీకు సరిగ్గా తెలిసి ఉండక పోవచ్చు. మైలో కేర్ టీ ట్రీ ఫేస్‌వాష్ ఇంకా ఫేస్ క్రీమ్ వాడటం వల్ల కలిగే ప్రయోజనాలను మీరు తప్పక తెలుసుకోవాలి:
· మొటిమలను నివారిస్తుంది
Article continues below advertisment
· టాక్సిన్లను తొలగిస్తుంది
· చర్మాన్ని లోపలి నుండి తేమగా ఉంచి పోషణ అందిస్తుంది
· చర్మానికి మెరుపును తెస్తుంది
· జిడ్డు చర్మాన్ని నివారిస్తుంది
· నల్ల మచ్చలను నయం చేస్తుంది
Article continues below advertisment
· మంటను తగ్గిస్తుంది
· చర్మం కోసుకున్నపుడు, దోక్కుపోయినప్పుడు ఇదొక యాంటిసెప్టిక్‌లా పనిచేస్తుంది
మీకు ఇది కూడా నచ్చుతుంది: టీ ట్రీ వలన మీ చర్మానికి కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాలు
వెచ్చని వాతావరణం కాస్త చల్లబడటం మొదలైనప్పుడే మీ స్కిన్‌కేర్ సాధనాలకు కొన్ని అధ్భుతమైన ఉత్పత్తులను చేర్చే సరైన సమయం ఆసన్నమైనట్లు అనుకోవాలి. చర్మం నిస్తేజంగా మారడానికి గల సాధారణ కారాణాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి:
మీరు ఈమధ్య తగినంత నీళ్ళను త్రాగుతున్నారా? అలా త్రాగనట్లయితే, తగినంత నీళ్ళను తీసుకోవాల్సిన సమయం ఇది! తగినంత నీరు తీసుకోకపోతే సంభవించే డీహైడ్రేషన్ చర్మంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. వాస్తవానికి, ఇది మీ చర్మాన్ని మాత్రమే కాకుండా మీ అన్ని అంతర్గత అవయవాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. డీహైడ్రేషన్ మీ చర్మానికి తామర, సోరియాసిస్ వచ్చే అవకాశాలను పెంచడమే కాకుండా చర్మం ముడతలు పడేలా చేస్తుంది.
Article continues below advertisment
రోజువారీ స్కిన్‌కేర్ ప్రస్థానంలో మాయిశ్చరైజర్‌ని తప్పనిసరిగా కలిగి ఉండటమనేది ఎంతో ముఖ్యం. మీ స్కిన్‌కేర్ సాధనాలలో ఈ కీలకమైన అంశాన్ని చేర్చకపోతే, మీ చర్మం అసహజ మార్పులకు లోనవుతుంది. మీ చర్మపు మొటిమలకు తగినంత టీ ట్రీ ఫేస్ క్రీమ్‌ను వాడకపోవడం వల్ల చర్మం పొడిబారడం, దద్దుర్లు లాంటి సమస్యలు రావచ్చు. అంతేకాకుండా, చర్మం వేగంగా వృద్ధాప్య లక్షణాలను చూపించే అవకాశముంది.
వృద్ధాప్యమనేది ఒక సహజమైన ప్రక్రియ అయినప్పటికీ, వయసు రీత్యా ఏర్పడే మచ్చలు లేదా ముడతలను రూపుమాపేందుకు మీరు ఎన్నెన్నో చేయగలరు. అందుకోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతోపాటు మంచి చర్మ సంరక్షణ విధానాన్ని అవలంభించాలని తెలుసుకోవాలి.
మన చర్మం దాదాపు ప్రతిరోజూ మృత చర్మ కణాలను తొలగించుకుంటుంది. అయినప్పటికీ, కొన్నిసార్లు ఈ కణాలన్నీ పెరుకుపోయి ఉండవచ్చు, వాటిని తొలగించకపోతే అది ఇతర చర్మ సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల, సాధారణంగా మీ చర్మాన్ని వారానికి రెండు లేదా మూడు సార్లు ఎక్స్‌ఫోలియేట్ (మృత చర్మ కణాలను తొలగించే ప్రక్రియ) చేయడం చాలా అవసరం.
మీ చర్మాన్ని పొడిబారనివ్వడం ఇంకా అందుకు ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం వల్ల దద్దుర్లు, పొక్కులు లేదా మీ చర్మానికిది అసమానంగా పొక్కులు ఊడేందుకు దారితీయవచ్చు. ఈ విధంగా అసమానంగా పొక్కులు ఊడటం వల్ల మీ చర్మం UV (అతినీలలోహిత కిరణాలు) వల్ల దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల, మీకు చర్మం పొడిబారే సమస్యలు ఉన్నట్లయితే, టీ ట్రీ క్రీమ్‌తో మీ చర్మ పోషణని చక్కగా కొనసాగించండి.
పొగ త్రాగడం, అలాగే మద్యం సేవించడం అలవాట్లున్న వ్యక్తికి అవి మొత్తం ఆరోగ్యంపైనే కాకుండా, చర్మంపైన కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తవానికి, కొన్నాళ్ళ తరువాత చికిత్సకు లొంగని, ఎన్నో చర్మ సమస్యలను వారు ఎదుర్కోవాల్సి రావొచ్చు. అందువల్ల, మీ చర్మ ఆరోగ్యానికి పొగ త్రాగడం లేదా మద్యపానం, ఇవి రెండూ మానేయడం మంచి పరిష్కారం!
Article continues below advertisment
ప్రతి ఒక్కరూ తమ ముఖం కాంతిమంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. అయితే, మీరు త్వరగా ఇలాంటి మెరుపుని మీ ముఖంలో చూడాలనుకుంటే మీరు ఎంతో ప్రయాస పడవలసి ఉంటుంది. కాబట్టి, మీ నిస్తేజమైన ఇంకా పొడిబారిన చర్మానికి మెరుపును తెప్పించడానికి మీరు ఈ క్రింది పద్దతులను అనుసరించవచ్చు:
· మీ చర్మంతో సున్నితంగా వ్యవహరించాలి. మీ ముఖంపైనుండే చర్మం మీరు అనుకొనే దానికంటే ఎంతో సున్నితంగా ఉంటుంది. మైలో కేర్ టీ ట్రీ ఫేస్ వాష్ వాడిన తర్వాత మీ చర్మాన్ని మెల్లగా తడుతూ తడి ఆరేలా చేసుకోవచ్చు.
· మీ రోజువారీ చర్మ సంరక్షణలో ఎక్స్‌ఫోలియేషన్(మృత చర్మకణాల తొలగింపు)ను ఒక ముఖ్య భాగంగా చేసుకోవాలి. మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల అది మృతకణాలు పెరుకుపోకుండా సహాయపడుతుంది. అందువలన, ఇలా చేయడం వల్ల, త్వరగా మీరు ముఖంలో ఆ కాంతిని పొందవచ్చు!
· ముఖంపై మరీ వేడిగా ఉన్న నీటిని వాడటం మానుకోండి ఎందుకంటే వేడి నీరు మీ ముఖంపై రంధ్రాలు తెరుచుకొనేలా చేస్తుంది లేదా లేత కాలిన గాయాలు కావడం మూలాన చర్మరక్షణకు హాని కలుగవచ్చు.
· మైలో కేర్ టీ ట్రీ ఫేస్ వాష్‌తో మీ ముఖాన్ని సున్నితంగా కడుక్కోవాలి. మైలో కేర్ టీ ట్రీ ఫేస్ వాష్‌లో టీ ట్రీ ఆయిల్ ఉంటుంది, ఇది రక్తస్రావాన్ని జరగకుండా చేయడమే కాక సూక్ష్మక్రిమినాశక గుణాలను కూడా కలిగి ఉంటుంది
Article continues below advertisment
· ఎల్లప్పుడూ మీ ముఖాన్ని మెత్తని కాటన్ టవల్‌తో అద్దుకొని ఆరనివ్వాలి అంతేకాని టవల్‌ను మీ ముఖంపై గట్టిగా రుద్దకూడదు.
· మైలో కేర్ టీ ట్రీ ఫేస్ క్రీమ్‌ను ప్రతిరోజూ రెండుసార్లు అప్లై చేయాలి, ఎందుకంటే అందులో ఉన్న వేప, తులసి, మల్టీఫ్రూట్ ఎక్స్‌ట్రాక్ట్‌లు ఇంకా టీ ట్రీ ఆయిల్ మీ చర్మాన్ని పునరుద్ధరించడంలో దోహదపడతాయి.
· మీది మొటిమలు వచ్చే అవకాశం గల చర్మం అయినట్లయితే, మొటిమను గిల్లడము లేదా చిదమడం లాంటివి చేయకూడదు. మొటిమను వత్తి చిదిమించడం వల్ల దాని చుట్టూ ఉన్న బ్యాక్టీరియా సులభంగా గాయంలోకి చేరవచ్చు, తద్వారా చర్మ రంధ్రానికి ఇన్ఫెక్షన్ సోకుతుంది. అంతేకాకుండా, మీ మొటిమను చిదమడం వల్ల అది మచ్చలు ఏర్పడేందుకు దారితీయవచ్చు.
· పోషకాలున్న, సమతుల్య ఆహారం తీసుకోవాలి ఇంకా పుష్కలంగా నీళ్లు ఇతర ద్రవాలు త్రాగాలి.
· ఫేస్ యోగా సాధనకి తగినంత సమయాన్ని కేటాయించాలి ఇంకా సుమారు 8 గంటల పాటు ఏకధాటిగా అంతరాయలు లేని నిద్రను ఆస్వాదించాలి.
Article continues below advertisment
· మీ బెడ్‌కవర్‌లు ఇంకా తువ్వాళ్లను తరచుగా మార్చుకుంటూ ఉండాలి. అందువల్ల, దిండు కవర్లు ఇంకా తువ్వాళ్లలో డెడ్ స్కిన్ సెల్స్(మృత చర్మ కణాలు) ఉంటాయి, మీరు వాటిని శుభ్రం చేయకుండా లేదా మార్చకుండా వాడితే, అవి మీ చర్మానికి అంటిపెట్టుకోగలవు.
· కొత్త చర్మ కణాలు ఎదిగేందుకు కాస్త ఓపికగా వేచి ఉండాలి ఇంకా చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించకుండా మీ సున్నితమైన చర్మంపై ఎలాంటి ఉత్పత్తులను కూడా వాడకూడదు. మైలో కేర్ టీ ట్రీ ఫేస్‌వాష్ మీ చర్మాన్ని మచ్చలు లేకుండా ఇంకా నల్లని మచ్చలను నివారించడంలో సహాయపడే గుణాలను కలిగి ఉంది. అందువలన, ఈ విధంగా, మీరు మృదువైన మరియు సున్నితమైన చర్మాన్ని పొందడం ఖాయం!
· మీ చర్మ రకాన్ని తెలుసుకోవడం కూడా ముఖ్యం, ఆపై మీరు చర్మ రకానికి తగిన ఉత్పత్తులను ఏవో తెలుసుకొని వాటిని కొనాలి. ఏదైనా స్కిన్‌కేర్ ప్రాడక్ట్‌లను ఉపయోగించే ముందు లేబుల్‌ను జాగ్రత్తగా చదవడం మర్చిపోకూడదు. మీ చర్మానికి అనుకూలంగా లేని ఉత్పత్తులను వాడటం వల్ల అవి దద్దుర్లు, పొక్కులు లేదా పొడిబారడం లాంటి అనేక చర్మ సమస్యలకు దారితీయవచ్చు.
మైలో కేర్ టీ ట్రీ ఫేస్ వాష్ వంటి మంచి నాణ్యమైన టీ ట్రీ ఆయిల్ ఉత్పత్తులు ఖచ్చితంగా మీ చర్మాన్ని తిరిగి కాంతివంతగా చేసేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా, టీ ట్రీ ఆయిల్ క్రీమ్‌తో చర్మం యొక్క సహజ రక్షణను కూడా మెరుగుపరుచుకోవచ్చు, అంతేకాకుండా దీనితో అనేక ఇతర చర్మ సమస్యలను కూడా నివారించుకోవచ్చు. అయితే, మీరు తప్పనిసరిగా రోజువారీ చర్మ సంరక్షణ ప్రక్రియను కొనసాగించడం ఎంతో ముఖ్యం, ఎందుకంటే ఇది కాలక్రమేణా అనేక రకాల చర్మ సమస్యలను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది!
Article continues below advertisment
Yes
No
Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
(1,284 Views)
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
(207 Views)
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
(601 Views)
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
(169 Views)
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
(111 Views)
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
(435 Views)
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |