hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore

Lowest price this festive season! Code: FIRST10

ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • గర్భవతిగా ఉన్న మహిళలు ఎక్కువగా నిద్రపోతారా? (Do Women Sleep A Lot During Pregnancy in Telugu?) arrow

In this Article

    గర్భవతిగా ఉన్న మహిళలు ఎక్కువగా నిద్రపోతారా? (Do Women Sleep A Lot During Pregnancy in Telugu?)

    Pregnancy

    గర్భవతిగా ఉన్న మహిళలు ఎక్కువగా నిద్రపోతారా? (Do Women Sleep A Lot During Pregnancy in Telugu?)

    3 November 2023 న నవీకరించబడింది

    నిజానికి, ప్రెగ్నెన్సీ రావటం చాలా మంది మహిళల జీవితంలో ఒక కొత్త ప్రారంభం అని చెప్పవచ్చు. అయితే, గర్భం దాల్చటమే చాలా మార్పులను తీసుకురాగలదు కూడా. మీ శరీరం అయితే ఇదివరకులాగా అలానే ఉంటుంది లేదా మీరు ఊహించని విధంగా మారుతుంది. మీరు ఇంతకుముందు ఎప్పుడూ ఇష్టపడని విషయాల మీద బలమైన ఇష్టాన్ని పెంచుకుంటారు లేదా ఎంతసేపూ నిద్రపోవాలని కూడా చూస్తుంటారు. మీరు ఈ మధ్యనే గర్భం దాల్చారని తెలుసుకుంటే, మీరు ఇది ప్రస్తుత జీవితం అని అంగీకరించాల్సిన కొన్ని విషయాలు ఉండవచ్చు. గర్భవతి మహిళలు వారిలో ఎదుగుతున్న బిడ్డను మోయడానికి వారి శరీరాలను తిరిగి శక్తివంతం చేయడానికి సాధారణంగా చేసే ఒక విషయం గురించి మరింత తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవడం కొనసాగించండి!

    గర్భవతిగా ఉన్న మహిళలు అంత ఎక్కువగా పడుకోడానికి కారణమేమిటి? (What Makes A Pregnant Woman Sleep So Much in Telugu?)

    మీరు కడుపుతో ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ మూడవ ట్రైమిస్టరులో చాలా నిద్రపోవడం మీతోపాటు మీ బిడ్డపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాదు, ఇది మీ ప్రసవం సమయం అలాగే డెలివరీపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. నిద్రలేమి చాలా సంక్లిష్టతలు ఇంకా సమస్యలను తెచ్చిపెడుతుంది, అందులో ఒకటి ప్రీక్లాంప్సియా.ఈ స్థితిలో మీ రక్తపోటు, అలాగే మీ మూత్రపిండాలు ప్రభావితం అవుతాయి. ఫలితంగా ప్రీక్లాంప్సియా అకాలంగా ప్రసవానికి కూడా దారితీయవచ్చు. అందుకని, ప్రెగ్నెన్సీ సమయం నిజంగా మీరు ఎక్కువగా పడుకోవాల్సిన సమయం, ఆవిధంగా మీరు ఈ సమయంలో చాలా పడుకోవటానికి ప్లాన్ చేసుకోవాలి కూడా!

    మీరు ఈ మధ్యనే గర్భం దాలిస్తే, మీ శరీరంలో మొదటగా గమనించిన మార్పులలో ఒకటి ఎప్పుడూ ఉండే అలసట అయి ఉండొచ్చు. కొన్నిసార్లు మంచం పైనుండి దిగడానికి కూడా ఓపిక ఉండకపోవచ్చు. కానీ మరోవైపు, నిద్ర దూరం కాలేని విషయం కూడా. మీరు ఎక్కువగా పడుకోవడానికి ప్రధాన కారణాలలో ఒకటి ప్రెగ్నెన్సీ సమయంలో జరిగే మీ హార్మోన్ల హెచ్చుతగ్గులు కావచ్చు. ప్రొజెస్టెరాన్ హార్మోన్ స్థాయి ఈ సమయంలో పెరుగుతుంది కాబట్టి, రక్తపోటు ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలతో సహా చాలా మార్పులను మీరు గమనించవచ్చు. అందుకనే, మీరు నిజానికి ఎక్కువ అలిసిపోతున్నట్లు భావించవచ్చు!

    ఏది ఎలా ఉన్నా, మీరు ప్రెగ్నెన్సీ యొక్క మొదటి ట్రైమిస్టరుని పూర్తి చేసిన వెంటనే, మళ్ళీ బలం పుంజుకుని తీరాలి. మళ్ళీ, మీ మూడవ ట్రైమిస్టరు దగ్గరకు వస్తున్నప్పుడు, మీకు మళ్ళీ తీవ్ర అలసట, బలహీనత కలగవచ్చు. మీ బిడ్డ యొక్క పెరుగుతున్న బరువును మీ శరీరం భరించవలసి ఉంటుంది కాబట్టి, మీ శరీరంపై ఈపాటికే తగినంత ఒత్తిడి ఉండి. మూడవ ట్రైమిస్టరులో తీవ్ర అలసట కలుగుతుంది. అంతేకాదు, మీరు రాత్రిపూట ప్రశాంతంగా, పూర్తిగా పడుకోలేకపోవడానికి మీ అలసట కూడా కారణం కావచ్చు. అలా కాకుండా, మీరు గర్భవతి కావడానికి ముందునుండే పడుకోవడంలో ఇబ్బంది ఉంటే, మీరు గర్భవతిగా ఉన్న సమయంలో పడుకోవడం చాలా కష్టం అవుతుంది. ఏదేమైనా, మీ నిద్రను మెరుగుపరచుకోడానికి ఇంకా తర్వాత రోజు పొద్దున మరింత శక్తివంతంగా ఉండటానికి మీరు చాలా పనులు చేయవచ్చు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీకి సంబంధించిన టాప్ 10 డేంజర్ సంకేతాలు

    ప్రెగ్నెన్సీ సమయంలో రోజంతా నిద్రపోవడం సాధారణమేనా (Is It Normal To Sleep All Day During Pregnancy in Telugu)?

    ఈ సమయంలో, మీరు నిద్రను విలాసవంతమైన అలవాటుగా ఎప్పుడూ చూడకూడదు. ముఖ్యంగా మీరు మీ గర్భంలో కొత్త ప్రాణాన్ని మోస్తున్నప్పుడు ఇది విలాసమైన అలవాటుకంటే చాలా అవసరమైన విషయం అని అర్థం చేసుకోవడం మరింత ముఖ్యం. గర్భవతి మహిళలకి రాత్రిపూట ఎక్కువ నిద్రపోవడం అవసరం కావచ్చు. అలా లేనప్పుడు వారు పగటిపూట కొద్ది కొద్దిగా కునుకులు తీసుకోవడం ద్వారా ఈ పూర్తి నిద్రని భర్తీ చేయవలసి ఉంటుంది. చాలా శారీరక అలాగే భావోద్వేగ అవరోధాలు పడుకోనివ్వకుండా మెలకువగా ఉంచుతాయి కాబట్టి చాలామంది గర్భవతి మహిళలకి రాత్రిపూట 10 గంటలు నిద్రపోవడం సవాలుగా మారుతుంది. కొత్తగా తల్లి కాబోతూ ఉండటం లేదా మీ కుటుంబానికి కొత్త సభ్యులు జత కాబోతుండటం గురించి అనుక్షణం ఆందోళన చెందటం మిమ్మల్ని నిద్రలేమికి గురిచేస్తుంది. మీకు ప్రసవంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటే, మీరు మీ బిడ్డ యొక్క ఆరోగ్యం లేదా ఇతర పరిస్థితుల గురించి ఎక్కువ ఆందోళన చెందుతారు. అదనంగా, మీకు ఒకవేళ బోర్లా పడుకునే అలవాటు ఉంటే, సౌకర్యవంతమైన భంగిమలలో నిద్రపోవడం కష్టం కావచ్చు. మీ ప్రెగ్నెన్సీ సమయంలో తగినంత పడుకోవాలని డాక్టర్ సిఫారసు చేసినప్పటికీ, తగినంత నిద్ర అంటే ఎంతసేపు లేదా తగినంత విశ్రాంతి అంటే ఎంత అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఎక్కువసేపు నిద్ర మీ బిడ్డకు అలాగే మీకు కూడా సమస్య కాదా అని మీరు ఆలోచిస్తున్నారా? ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా నిద్రపోవడం ఎందుకు సమస్యగా మారుతుందో మరింత తెలుసుకోవడానికి మీరు చదవడం కొనసాగించాలి!

    మీరు నిద్రపోవడాన్ని మరింత కష్టతరం చేసే కొన్ని ఇబ్బందులు (Problems That Might Make It Difficult For You To Fall Asleep in Telugu)

    కింద ఇచ్చిన ఇబ్బందులలో దేని వల్లనైనా నిద్రపోవడం మీకు కష్టంగా అనిపిస్తే, తొందరగా పడుకోవడానికి రకరకాల వ్యూహాలను ప్రయత్నించి చూడండి!

    గుండెల్లో మంట (Heartburn)

    చాలామంది గర్భవతి మహిళలు ముఖ్యంగా అజీర్ణం కారణంగా, సాధారణంగా గుండెల్లో మంటకు సంబంధించిన సమస్యలతో బాధపడతారు. దాని ప్రభావం వలన మీ ఛాతీ లేదా గొంతులో మంటగా అనుభూతి కలగవచ్చు. ఈ మంట భావన వలన మిమ్మల్ని రాత్రంతా మేల్కొని ఉండేలా చేయవచ్చు లేదా చక్కగా నిద్రపోతున్నప్పుడు మేల్కొలపవచ్చు. అందుకని, ఈ మంటని తగ్గించడానికి మీరు కారం, ఘాటైన ఆహారాలు తినకుండా ఉండటం మంచిది. అంతేకాదు, మీరు రాత్రిపూట భారీగా తినడాన్ని తగ్గించుకోవచ్చు.

    కాళ్ళలో తిమ్మిరి (Restless Legs)

    మీరు పడుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, సాధారణంగా రెస్ట్ లెస్ లెగ్స్ సిండ్రోం (RLS) అని పిలిచే కండరాల నొప్పులున్న కాళ్ళు తిమ్మిరి పట్టడం వలన నిద్రపట్టడం కష్టతరం అవుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మీకు RLC మందులు తీసుకోవడానికి అనుమతి ఇవ్వకపోయినా, మీరు ప్రినేటల్ విటమిన్లను తీసుకోవడం ద్వారా ఈ పరిస్థితిని నియంత్రించవచ్చు. ప్రినేటల్ విటమిన్లలో కొన్ని ఫోలేట్ అలాగే ఐరన్ కి సంబంధించి కూడా ఉంటాయి. అంతేకాదు, మీరు మీ శరీరాన్ని స్ట్రెచ్ చేస్తూ ఉండాలి, ఎక్కువగా ద్రవపదార్థాలు తాగుతూ ఉండాలి.

    నిద్రలేమి (Insomnia)

    కొన్నిసార్లు, మీ రాత్రిపూట నిద్రలో నిద్రలేమి నెమ్మదిగా ఏర్పడటాన్ని మీరు గమనించవచ్చు, అది నెమ్మదిగా పూర్తిస్థాయి నిద్రలేమిగా మారుతుంది. కొన్నిసార్లు, నిద్రలేమికి ముఖ్యకారణం మీ మెదడు శాంతిగా లేకపోవటం. నిద్రలేమికి కొన్ని సురక్షితమైన మందులను సూచించమని మీరు మీ డాక్టరుని కోరవచ్చు, అలాగే, ప్రెగ్నెన్సీ సమయంలో మీరు తీసుకోకూడని మందులు కూడా చాలా ఉన్నాయి. మీకు మనస్సులో ఆందోళనగా ఉంటే, మిమ్మల్ని ఇబ్బందిపెట్టే కొన్ని విషయాల గురించి డైరీలో రాయడానికి ప్రయత్నించవచ్చు. మిమ్మల్ని తరచుగా ఇబ్బంది పెట్టే విషయాలను నోట్ చేయండి అలాగే మీరు పడుకుంటున్నప్పుడు వాటిని పట్టించుకోకుండా విడిచిపెట్టడానికి ప్రయత్నించండి. మీరు ఎక్కువసేపు పగటిపూట పడుకోవడం మానుకోవాలి. పైన చెప్పిన కొన్నిపనులు చేయడం వల్ల రాత్రిపూట సులువుగా నిద్రలోకి జారుకోవచ్చు!

    కాళ్ళ యొక్క కండరాలు పట్టేయడం (Leg cramps)

    కాళ్ళ తిమ్మిర్లు ఖచ్చితంగా మీరు రాత్రిపూట నొప్పితో మేలుకోవడానికి లేదా మంచంపై త్వరగా పొజిషన్లు మార్చటానికి నిస్సందేహంగా మంచి కారణాలు. అలా మీ నిద్ర పూర్తి అవదు. కాలి తిమ్మిర్లు ప్రధానంగా కాలి పిక్కల కండరాలు హఠాత్తుగా సంకోచవ్యాకోచాలు చేయడంతో సంబంధం కలిగి ఉంటుంది. కొన్నిసార్లు, ఈ సంకోచవ్యాకోచాలు మీ పాదాల వద్ద లేదా మీ తొడలలో కూడా రావచ్చు. గర్భవతి మహిళలు ఒకవేళ ప్రినేటల్ విటమిన్లు తీసుకోకపోతే లేదా అవసరమైన పోషకాల కొరతతో బాధపడుతుంటే ఈ సంకోచవ్యాకోచాలు వారిలో మరింత తీవ్రంగా ఉంటాయి. మీరు డీహైడ్రేటడ్ గా ఉంటే, తీవ్రమైన కాళ్ళ తిమ్మిరి కూడా అనుభవించవచ్చు. కాళ్ల తిమ్మిరిని నివారించడానికి మీరు చేయగలిగే పనులలో మంచిది ఒకటి మీ ప్రినేటల్ విటమిన్లు తీసుకోవడం అలాగే ప్రతిరోజూ ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవడం!

    మూడవ ట్రైమిస్టరులో ఎక్కువగా నిద్రపోవడం, చాలా ప్రమాదాలను తెస్తుందని కూడా మీరు గుర్తుంచుకోవాలి. నిజానికి, ఒక అధ్యయనం ప్రకారం, ప్రెగ్నెన్సీ సమయంలో ముఖ్యంగా ఆఖరి నెలలో, తొమ్మిది గంటల పాటు ఎటువంటి ఆటంకం లేకుండా పడుకునే మహిళలకు ప్రసవం సమయంలో బిడ్డ పుట్టకుండా మరణించే అవకాశం ఎక్కువ ఉంది. ఏదేమైనా, చాలామంది శాస్త్రవేత్తలు ఈ కాళ్ల తిమ్మిర్లు లేని పగళ్ళు లేదా రాత్రులు ప్రధానంగా పిండం కదలిక లేకపోవడం వల్ల సంభవించాయని అలాగే అది ప్రసవం సమయంలో బిడ్డ మరణానికి కారణం కాదని భావిస్తున్నారు.

    ప్రెగ్నెన్సీ సమయంలో మీరు పడుకునే దినచర్యని ఎలా మెరుగుపర్చుకోవాలి? (How To Improve Your Sleep Routine During Pregnancy?)

    మీకు అతిగా పడుకోవడం ఇష్టం లేనప్పటికీ, ఎనిమిది గంటలపాటు గాఢంగా పడుకుని నిద్రని పూర్తి చేయడం సాధారణంగా మంచి విషయం, ఎందుకంటే గాఢనిద్ర వలన ప్రెగ్నెన్సీ యొక్క చివరి దశలతో సంబంధం ఉన్న చాలా లాభాలు ఉన్నాయి. ప్రశాంతంగా నిద్రపోవడం మీకు సవాలుగా అనిపిస్తే మీరు నిరాశ చెందనవసరం లేదు. మీ నిద్రశైలిని మెరుగుపరచడానికి మీరు చాలా విషయాలు చేయవచ్చు. మీరు చేయగలిగే కొన్ని విషయాలు కింద లిస్టులా ఇవ్వబడ్డాయి.

    మీరు ప్రెగ్నెన్సీ పిల్లోని వాడవచ్చు (You May Want To Use A Pregnancy Pillow)

    ప్రెగ్నెన్సీ రాకముందు మీకు ఒకవేళ వెల్లకిలా పడుకునే అలవాటు ఉంటే మీకు పడుకోవడం కష్టం కావచ్చు. అందుకని, అలాంటి సందర్భాలలో, ప్రెగ్నెన్సీ పిల్లోపై పడుకోవడం చాలా సాయం చేస్తుంది. మీకు కావలసిన సౌకర్యవంతమైన పొజిషన్లో పడుకోవడంతోపాటుగా మీరు మరింత విశ్రాంతిని పొందుతారు.

    మీరు మీకు మానసిక ఒత్తిడిని కలిగించే ఆలోచనలని వ్యక్తపరిచి పరిష్కరించవచ్చు (You Can Address Thoughts That Stress You Out)

    మీ డెలివరీ లేదా ప్రసవం రోజు గురించి చింతిస్తున్నారా? లేదా పడుకునేముందు మిమ్మల్ని అదే పనిగా వేధించే ఇంకో ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఈ సమస్యలని పరిష్కరించుకోవడం లేదా వాటి గురించి రాయడం మీ మనస్సుకి ఈ ఇబ్బందులని ఎదుర్కోవడంలో సాయం చేస్తుంది. అంతేకాదు, మీకు రాత్రంతా మంచి నిద్ర కూడా పడుతుంది!

    మీరు రోజూ వ్యాయామం చేయవచ్చు కూడా (You May Also Want To Exercise Daily)

    వ్యాయామం చేయడం, అది కూడా ప్రెగ్నెన్సీ సమయంలో చేయడం నిద్రని మెరుగుపరచటంతో సహా చాలా ఇతర లాభాలని కూడా అందిస్తుంది. దీనివల్ల మీ బిడ్డ పుట్టబోయే ముందు, మీ శరీరం ఆరోగ్యంగా ఇంకా బలంగా ఉండటానికి సాయం దొరకటంతోపాటు, మీ రోజువారీ ఇంటిపనులని మొత్తం పూర్తిచేయడానికి మీకు మరింత ఓపిక ఉంటుంది.

    మీరు మసాజ్ చేయించుకోవచ్చు (You Can Opt For A Massage)

    స్పర్శ ఇచ్చే అనుభూతి మీకు చాలా తొందరగా పడుకోవడానికి సాయం చేస్తుంది. మీ వీపు లేదా పాదాలని మసాజ్ చేయమని మీరు మీ భాగస్వామిని కోరవచ్చు. ఇది మీ మూడ్ని మెరుగుపరచడంలో కూడా సాయపడుతుంది, అంతేకాకుండా మీకు నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

    మీరు ఆరోగ్యకరమైన నిద్ర దినచర్య అలవాటుని ఏర్పర్చుకోవచ్చు (You May Want To Establish A Healthy Sleeping Habit)

    మీరు ఒకసారి కొత్త నిద్ర దినచర్యని మొదలుపెట్టాక దానికి కట్టుబడి ఉండండి. ఒకే సమయంలో నిద్రపోవటం చాలా రకాలుగా లాభం అందిస్తుంది. మొదటిది, రాత్రిపూట మంచి నిద్ర రావడానికి మీ మూడ్ ని సరిగ్గా సెట్ చేయగలదు. అలాగే మీకు, మీ పెరుగుతున్న పొట్టకి ఇంకా మీ భాగస్వామికి మంచంపై తగినంత పడుకునే స్థలాలు ముందే నిర్థారణ చేసుకోవచ్చు. అంతేకాకుండా, పడుకునే సమయానికి కనీసం ఒక గంట ముందు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలని స్విచ్ ఆఫ్ చేయడాన్ని అలవాటు చేసుకోండి. గది ఉష్ణోగ్రత విషయానికొస్తే, మీరు మంచి-నాణ్యమైన నిద్ర కోసం మీ థర్మోస్టాట్ను సర్దుబాటు నచ్చినవిధంగా చేసుకోవచ్చు. ప్రత్యేకించి మీరు రోజంతా అలిసిపోయాక నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నెమ్మదైన అలాగే ప్రశాంతమైన సంగీతం కూడా అద్భుతాన్ని చేయగలదు. రాత్రిపూట నిద్ర మంచిగా పట్టాలంటే మరొక దారి పడుకునే ముందు లైట్లను పూర్తిగా ఆపివేయడం.

    మళ్ళీ చెప్తున్నాం, మీకు రాత్రి నిద్రపట్టక పూర్తిగా మెలకువగానే ఉంటే, అన్ని సమయాలలో అలసిపోయినట్లు అన్పిస్తే, మీరు అస్సలు ఇవన్నీ పాటించాలని కంగారు పడనవసరం లేదు! అలాంటీ సందర్భాలలో మీరు పగటిపూట కూడా ఏ సమయంలోనైనా మంచి కునుకు తీయడానికి ప్రయత్నించవచ్చు. కానీ మరీ ఎక్కువసేపు పడుకోకుండా చూసుకోండి. అప్పుడు మళ్ళీ రాత్రి దినచర్యకి ఆటంకం కలుగుతుంది. నిజానికి ప్రతి గర్భవతి మహిళ ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. వాస్తవానికి, నిద్రలేకపోవడం ఊబకాయం, డిప్రెషన్ అలాగే టైప్-2 డయాబెటిస్తో సహా చాలా దీర్ఘకాలిక వ్యాధులను తీసుకువస్తుంది. తగినంత పడుకోకపోవడం వలన గర్భవతి మహిళలలో చాలా తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులు అభివృద్ధి అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు, ఇవి ప్రసవం యొక్క పూర్తి ప్రక్రియను మరింత క్లిష్టతరం చేస్తాయి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో అతిగా నిద్రపోవడం మామూలేనా?

    గర్భవతిగా ఉన్న మహిళ అసలు ఎన్ని గంటలు పడుకోవచ్చు? (How Many Hours Should A Pregnant Woman Sleep?)

    సాధారణంగా, గర్భవతిగా ఉన్న మహిళ రోజుకు ఎనిమిది నుండి తొమ్మిది గంటలు పడుకోవాలి. ఒక అధ్యయనం ప్రకారం, ఆరు గంటలు లేదా అంతకంటే తక్కువ నిద్రపోయే గర్భవతి మహిళలకి ప్రసవం ఎక్కువ సమయం కొనసాగుతుంది. నిజానికి, ఆమెకి సిజేరియన్ డెలివరీ అయ్యే అవకాశం కూడా ఉంది. నిద్ర యొక్క ప్రాముఖ్యత గురించి మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మీ మొదటి ట్రైమిస్టరులో తగినంత పడుకోకపోతే, ముఖ్యంగా మూడవ ట్రైమిస్టరులో మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

    అంతేకాకుండా, నిద్రలేమి లక్షణాలను నిర్లక్ష్యం చేయడం ప్రీక్లాంప్సియా అభివృద్ధికి దారితీయవచ్చు కూడా, ఇది అధిక రక్తపోటు, చేతులు విపరీతంగా వాచటం అలాగే మూత్రంలో ప్రోటీన్లు కన్పించడానికి దారితీస్తుంది. కానీ, చాలామంది మహిళలకి సాధారణంగా గర్భం యొక్క మూడవ ట్రైమిస్టరులో ప్రీక్లాంప్సియా రావచ్చు. ప్రీక్లాంప్సియా యొక్క కొన్ని లక్షణాలు మీ సౌలభ్యం కోసం కింద ఇవ్వబడ్డాయి.

    1. భరించలేని తలనొప్పితో బాధపడుతూ ఉంటారు.
    2. మీ చూపు చివరికి అస్పష్టంగా మారవచ్చు లేదా చాలా విషయాలను చూడటానికి మీకు సాయం అవసరం కావచ్చు.
    3. మీకు అనుక్షణం వికారంగా అనిపించవచ్చు. వాంతులు కూడా దీనిలో ఒక సాధారణ లక్షణం.
    4. మామూలు పనులు చేస్తున్నప్పుడు కూడా మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని అనుభవిస్తూ ఉంటారు.
    5. తరచుగా మూత్రానికి వాష్ రూమ్ కు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది.
    6. మీ పొట్ట యొక్క పై భాగంలో సూదిలాగా గుచ్చుతున్నట్లు ఉండే నొప్పి లేదా సాధారణ నొప్పిని అనుభూతి చెందుతారు.

    మీరు ఎప్పుడూ, ప్రెగ్నెన్సీ ముందు కూడా ఏదైనా స్లీప్ డిజార్డరుతో బాధపడుతుంటే, మీరు గర్భవతి అయినప్పుడు ఆ పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ఉదాహరణకు చెప్పాలంటే, మీకు ఇప్పటికే స్లీప్ ఆప్నియా ఉంటే, ప్రెగ్నెన్సీ సమయంలో గురక మరింత తీవ్రంగా లేదా అధ్వాన్నంగా మారవచ్చు. ఎక్కువ బరువు ఉన్న మహిళలకి, గర్భం దాల్చినప్పుడు పరిస్థితి మరింత దిగజారిపోతుంది. నెమ్మదిగా, గుండెల్లో మంట, పొద్దునపూట వికారం అలాగే కాళ్ళ కండరాలు పట్టేయడం వంటి ఇతర ప్రెగ్నెన్సీ లక్షణాలు కూడా తీవ్రమవుతాయి.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Related Topics

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.