Updated on 18 September 2023
మంచి ప్రజాదరణ పొందిన స్టార్‌ఫ్రూట్, అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, గర్భధారణలో స్టార్‌ఫ్రూట్ తినడం సురక్షితమేనా అనే సందేహం ఇప్పటికీ ఉంది. ఈ వ్యాసం ప్రత్యేకంగా ఈ సందేహానికి సమాధానం ఇవ్వడానికి ఉద్దేశించబడింది. కానీ ప్రారంభించే ముందు, గుర్తుంచుకోవలసిన అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, గర్భవతుల ఆహారంలో ఏదైనా కొత్త పదార్థాలను చేర్చుకొనే ముందు వైద్యుని తప్పనిసరిగా సంప్రదించాలి. అంతేకాక, గర్భవతులు సరైన ఆహారాన్ని అందుకుంటున్నారని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. గర్భధారణలో స్టార్‌ఫ్రూట్ తినడం వల్ల కలిగే కొన్ని సాధారణ ఆరోగ్య ప్రయోజనాలు మరియు నష్టాలను చూద్దాం.
స్టార్ ఫ్రూట్ అనేది ఐదు కోణాలు కలిగి, మైనపు పసుపు-ఆకుపచ్చని రంగు పండు, దీనిని కారాంబోలా అని కూడా అంటారు. అవెర్రోవా కరంబోలా అని పిలవబడే చక్కని ఫలాలని ఇచ్చే ఈ చెట్టు శ్రీలంకకు చెందినది. స్టార్ ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు మరియు ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. స్టార్‌ఫ్రూట్‌లో విటమిన్‌లు, కార్బోహైడ్రేట్‌లు, కెరోటినాయిడ్ సమ్మేళనాలు, సేంద్రీయ ఆమ్లాలు, ఖనిజాలు మరియు ఇతర పదార్ధాలతో సహా చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి, ఇవి ప్రత్యేకంగా ఆరోగ్యానికి దోహదపడతాయి, అంతేకాక ఈ స్టార్‌ఫ్రూట్‌లు గర్భధారణలో మంచిని చేస్తాయి. దాని పోషకాహార జాబితాలో విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు మరియు సేంద్రీయ ఆమ్లాలను కలిగి ఉంది, ఇవన్నీ ఆరోగ్యకరమైన గర్భధారణకు ఇంకా సులువైన ప్రసవానికి ఎంతో కీలకమైనవి. గర్భధారణలో స్టార్ ఫ్రూట్ ప్రయోజనాలు మరియు దానిలోని పోషకాహార జాబితా గురించి మరింత తెలుసుకోవడానికి ఇది చదవడం కొనసాగించండి.
గర్భధారణలో స్టార్‌ఫ్రూట్ తీసుకోవడం సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. పోషక విలువలు ఎక్కువగా ఉన్నందున, దీనిని కాబోయే తల్లి ఆహారంలో చేర్చవచ్చు. ఈ పండులోని ఖనిజాలు, విటమిన్లు, ఫోలిక్ యాసిడ్ మరియు ఇతర పోషకాలు గర్భధారణ సమయంలో వారికి అవసరమైన శక్తిని అందిస్తాయి. గర్భవతిగా ఉన్నప్పుడు, తాజా స్టార్ ఫ్రూట్ రసం తాగడం వల్ల గొంతు మరియు నోటి ఇన్ఫెక్షన్‌లను ఇది సమర్థవంతంగా నివారించి నయం చేస్తుంది. ఈ పండు అనేక ఇతర ఆరోగ్య సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంది. స్టార్ ఫ్రూట్‌లో ఆక్సలేట్ సారం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, కిడ్నీ వ్యాధి చరిత్ర కలిగినవారు, వీటిని తీసుకోకూడదు ఇంకా వీటిని తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో మునగ: ప్రయోజనాలు & సైడ్ ఎఫెక్ట్స్
చాలా మంది గర్భవతులకు గర్భదారణలో మలబద్ధకం ఒక సాధారణ సమస్యగా మారుతుంది. స్టార్ ఫ్రూట్ తినడం వల్ల మలబద్ధకం ఇంకా ఇతర జీర్ణ సమస్యలు నివారించబడుతాయి. ఈ పండు ఆరోగ్యకరమైనదే కాక డయేరియా నివారణకు సహాయపడుతుంది. అయితే, జీర్ణ సమస్యలను నయం చేసుకొనేందుకు స్టార్ ఫ్రూట్ తీసుకొనే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
స్టార్ ఫ్రూట్‌ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అంతేకాక, ఇది శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిల వల్ల రాగల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.
విటమిన్లు, కార్బోహైడ్రేట్లు మరియు ఖనిజాలను అందించే మంచి వనరు ఈ స్టార్‌ఫ్రూట్, ఇంకా ఈ పోషకాలన్నీ గర్భధారణ సమయంలో శిశువు ఆరోగ్యకరంగా ఎదిగేందుకు తోడ్పడతాయి.
ప్రోటీన్, విటమిన్ సి మరియు కాల్షియం అన్నీ స్టార్ ఫ్రూట్‌లో ఉంటాయి ఇంకా ఇవన్నీ కలిసి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి, తద్వారా ఇది వైరస్ ఇంకా బ్యాక్టీరియాతో పోరాడుతుంది మరియు పరిసరాల మార్పు వల్ల తలెత్తే వ్యాధుల నుండి పిల్లలను కాపాడుతుంది.
గర్భిణీ స్త్రీలలో రక్తపోటు అసాధారణతలు కలగడమనేది వాస్తవం, స్టార్ ఫ్రూట్‌లో అధిక స్థాయిలో పొటాషియం ఉంటుంది, ఇది పెరిగిన రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అందుకే, గర్భవతులు స్టార్ ఫ్రూట్ తీసుకోవాలని వైద్యులిచ్చే సలాహాకీ ఇది ఒక ప్రధాన కారణం.
యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి. అంతేకాక, యవ్వనభరిత రూపాన్ని అలాగే ఉంచేందుకు దోహదపడతాయి. స్టార్ ఫ్రూట్‌లోని ఎపికాటెచిన్, గాల్లిక్ యాసిడ్ ఇంకా క్వెర్సెటిన్ వంటి అదనపు పదార్థాలు దానిని మరింత ఆరోగ్యవంతమైన ఫలంగా చేస్తాయి. ఇటువంటి పదార్థాలు అనేక రకాల సానుకూల ఆరోగ్య ప్రభావాలతో నిండిన శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు. స్టార్‌ఫ్రూట్ మొక్కల సమ్మేళనాలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి ఇంకా ఇవి ఎలుకలలో కొవ్వు కాలేయ వ్యాధిని ప్రమాదాన్నితగ్గించే లక్షణాలను ప్రదర్శించాయి. అంతేకాక, కాలేయ క్యాన్సర్ నుండి ఎలుకలను రక్షించే దాని సామర్థ్యంపై పరిశోధనలు చేస్తున్నారు.
స్టార్ ఫ్రూట్‌లోని అధిక ఆక్సలేట్ సారం కారణంగా, కొంతమంది వీటివల్ల ప్రతికూల ప్రభావాలను పొందవచ్చు. అందువల్ల, కిడ్నీ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా స్టార్ ఫ్రూట్ తినడం ఇంకా దాని రసాన్ని తాగడం చేయకూడదు లేదా దానిని తీసుకునే ముందు వైద్య సలహాను తీసుకోవాలి. ఇప్పటికే మూత్రపిండ సమస్యలు ఉన్నవారు స్టార్ ఫ్రూట్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల స్టార్ ఫ్రూట్ టాక్సిసిటీతో పాటు అది మూత్రపిండ వైకల్యానికి దారి తీయవచ్చు, దీని ఫలితంగా మానసిక అలజడి, మూర్ఛలు ఇంకా మరణం వంటి నరాల సంబంధిత సమస్యలు కూడా దాపురిస్తాయి. ప్రిస్క్రిప్షన్ మందులు తీసుకునే వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షపండు వలె, స్టార్ ఫ్రూట్ కూడా శరీరం మందులను శోషించుకొనే ఇంకా వినియోగించుకొనే ప్రక్రియని ప్రభావితం చేస్తుంది. దీని సారాంశం ఏమిటంటే, స్టార్ ఫ్రూట్ రుచికరమైనది, అంతేకాక గర్భధారణలో స్టార్ ఫ్రూట్ ప్రయోజనాలు అపారమైనవి. ఇందులో లభించే కేలరీలు తక్కువైనా, ఇది యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ మరియు విటమిన్ సి అందించే అద్భుత వనరు. ఈ పండును తినే ముందు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు లేదా ప్రిస్క్రిప్షన్ మందులు తీసుకునే వారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. కానీ చాలా మందికి, స్టార్ ఫ్రూట్ వారి ఆహారంలో చేర్చుకొనే రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన ఫలంగా అలలారుతోంది.
Reference
1. Lakmal K, Yasawardene P, Jayarajah U, Seneviratne SL. (2021). Nutritional and medicinal properties of Star fruit (Averrhoa carambola): A review. Food Sci Nutr.
What is star fruit in Telugu, Is it safe to eat star fruit during pregnancy in Telugu, Benefits of eating star fruit in Telugu, What are the risks of eating start fruit during pregnancy in Telugu, Star fruit during pregnancy in English, Star fruit during pregnancy in Hindi, Star fruit during pregnancy in Tamil,Star fruit during pregnancy in Bengali
Yes
No
Written by
saradaayyala
saradaayyala
Star Fruit During Pregnancy: Benefits & Risks
Can Breastfeeding Mom Eat Mango: Debunking Myths & Providing Expert Advice
PCOS and Sex: Exploring Impact on Health and Debunking Common Myths
Dates for PCOS: How to Harness their Health Benefits
Coconut Water for PCOS: Discovering the Natural Support You've Been Missing
How to Boost Fertility in Your 30s: The Ultimate Guide
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Baby Cot | Carry Nest | Baby Pillow | Baby Toothbrush | Diapers & Wipes - Baby Clothing | Wrappers | Winter Clothing | Socks | Cap, Mittens & Booties | Baby Towel | Laundry Detergent | Diapers & Wipes - Feeding & Lactation | Feeding Bottle | Grooved Nipple | Fruit Feeder | Manual Breast Pump | Baby Sipper | Skin | SHOP BY CONCERN | Dry & Dull Skin | Cloth Diaper | Maternity dresses | Stretch Marks Kit | Stroller |