

Updated on 3 November 2023
అసలు రొమ్ము క్యాన్సర్ అంటే ఏమిటి?
కణాల పెరుగుదలను నియంత్రించే జన్యువులలో మ్యుటేషన్ అనే మార్పులు సంభవించినపుడు క్యాన్సర్ వస్తుంది. కణాలను అనియంత్రిత మార్గంలో విభజించేందుకు, అవి గణనీయంగా పెరిగేందుకు మ్యుటేషన్ అనుమతిస్తుంది. రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ము కణాలలో అభివృద్ధి అవుతుంది. ఇది రొమ్ము యొక్క లోబుల్స్ (తల్లి పాలను ఉత్పత్తి చేసేవి), సన్నని గొట్టాలలో సంభవిస్తుంది. లోబుల్స్ అనేవి పాలను ఉత్పత్తి చేసే గ్రంథులు. నాళాలు అనేవి పాలను చనుమొనల వరకు తీసుకెళ్లేవి. రొమ్ములోని కొవ్వు కణజాలం అలాగే ఫైబరస్ కనెక్టివ్ కణజాలం (ప్రొటీన్ ఫైబర్లతో ఏర్పడే కణజాలం) లో క్యాన్సర్ సంభవిస్తుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: రొమ్ములో కంతులు- కారణాలు, చికిత్స
రొమ్ము క్యాన్సర్ యొక్క 10 ప్రారంభ సంకేతాలు
మీ వేళ్లతో మీ రొమ్ముల చుట్టు పక్కల ప్రాంతాలను మీ వేళ్లతో ప్రెస్ చేయడం (ఒత్తడం ద్వారా) ద్వారా గడ్డలను గుర్తించవచ్చు. చంక, చనుమొనలు, శోషరస కణాల చుట్టూ గడ్డలు ఏర్పడతాయి.
మీ రొమ్ముల చుట్టూ దురద వస్తే..
తాకినపుడు వేడిగా అనిపించే మరియు ఎరుపుగా ఉండే చర్మం.
మీకు వెన్ను లేదా వెనకాల, వెన్నముక భాగంలో నొప్పిగా ఉంటే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.
రొమ్ము కణతి (ట్యూమర్) అనేది మీ రొమ్ముల పరిమాణాన్ని మారుస్తుంది.
మీ రొమ్ముల్లో ఏర్పడిన గడ్డ అనేది ఒక విత్తనం వలే అభివృద్ధి చెందుతుంది. దీని వల్ల మీరు పడుకున్నపుడు మీ రొమ్ములు సున్నితంగా ఉంటాయి.
రొమ్ము క్యాన్సర్ అనేది పాల నాళాల్లో ప్రారంభం అవుతుంది. ఇది నీటి రూపంలో, పాలరూపంలో, రక్తం రూపంలో ఉత్సర్గ (బయటకు పంపడం, విడుదల) ను చూపుతుంది.
అసాధారణంగా సున్నితంగా ఉండే చనుమొనలు ఒక్కసారిగా సున్నితత్వాన్ని కోల్పోతాయి. రొమ్ము కణితుల (ట్యూమర్స్) వల్ల ఇది సంభవిస్తుంది.
మీరు తల్లిపాలు ఇవ్వకపోయినా.. మీ చనుమొనలు ఫ్లాట్‌గా, అసమాన ఆకారంలో ఉంటే..
రొమ్ముల మీద ఉండే చర్మం ఎరుపు రంగులోకి డింపుల్డ్గా మారుతుంది. లేదా నారింజ రంగులా చర్మం మారుతుంది.
ఇందులో మీలో ఉన్న క్యాన్సర్ కణాలు రొమ్ము నాళాలకు పరిమితం అయి ఉంటాయి. చుట్టుపక్కల ఉన్న రొమ్ము కణాజాలాలకు వ్యాప్తి చెందలేవు.
ఇది మీ రొమ్ములలో పాలను ఉత్పత్తి చేసే గ్రంథులలో ప్రారంభం అవుతుంది. క్యాన్సర్ కణాలు చుట్టు పక్కల ఉండే ఇతర కణజాలాలను ప్రభావితం చేయవు.
ఇది మొదటగా మీ రొమ్ము పాల నాళాల్లో ప్రారంభం అవుతుంది. తర్వాత నెమ్మదిగా మీ రొమ్ము ఇతర కణజాలాలకు కూడా వ్యాపిస్తుంది. అనంతరం దగ్గర్లోని ఇతర కణజాలాలకు మరియు ఇతర అవయవాలకు కూడా వ్యాపిస్తుంది.
ఇది మొదట మీ రొమ్ము లోబుల్స్ (పాలను ఉత్పత్తి చేసేవి) లో అభివృద్ధి చెంది తర్వాత ఇతర కణజాలాలకు వ్యాప్తి చెందుతాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: రొమ్ము నొప్పికి కారణాలు: ఆడవాళ్ళకు రొమ్ము నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకోండి
1) చనుమొన మీద పాజెట్ వ్యాధి (చనుమొన చుట్టూ తామర వ్యాధిలా)
2) ఫిలోడస్ కణతి (ఒక రకమైన కణతి)
3) ఆంజియోసార్కోమా (ఒక రకమైన క్యాన్సర్)
4) ఇన్ఫ్లమేటరీ(కోరికలు పుట్టించే) రొమ్ము క్యాన్సర్
5) ట్రిపుల్ నెగటివ్ రొమ్ము క్యాన్సర్
మీ రొమ్ములోని అసాధారణ కణాలు వేగంగా రెట్టింపు అయినపుడు మీకు రొమ్ము క్యాన్సర్ వస్తుంది. రొమ్ము క్యాన్సర్ వచ్చే కొన్ని ప్రమాదకర కారకాలు ఉన్నాయని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. అవి కింది విధంగా ఉన్నాయి.
55 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
మహిళల్లో ఎక్కువగా వస్తుంది.
మీ తల్లిదండ్రులు, తోబుట్టువుల్లాంటి దగ్గరి వారికి రొమ్ము క్యాన్సర్ ఉంటే మీకు కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
పొగాకు (టొబాకో) అనేది రొమ్ము క్యాన్సర్‌తో పాటు అనేక రకాల క్యాన్సర్లకు కారణం అవుతుంది.
ఆల్కహాల్ తాగడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
ఊబకాయం అనేది రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాకుండా రొమ్ము క్యాన్సర్ తిరిగి వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
మీరు కనుక తలకు, మెడకు లేదా చాతి భాగంలో రేడియేషన్ థెరపీ చేయించుకుంటూ ఉంటే... మీకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీని వాడే వ్యక్తులు రొమ్ము క్యాన్సర్‌తో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మీ రొమ్ము క్యాన్సర్ దశ, గ్రేడ్, పరిమాణం మరియు రకాన్ని బట్టి మీ రొమ్ము క్యాన్సర్ చికిత్స గురించి మీ వైద్యుడు మీకు సలహా ఇస్తాడు. ఇది మీ ఓవరాల్ ఆరోగ్యం, మీ ఎంపికలపై ఆధారపడి ఉంటుంది.
i) రొమ్ము క్యాన్సర్ సర్జరీ (శస్త్ర చికిత్స)
ii) రేడియేషన్ థెరపీ
iii) కీమోథెరపీ
iv) హార్మోన్ థెరపీ
v) మందులు ఇస్తూ చికిత్స చేయడం
vi) ఇమ్యూనోథెరపీ
vii) సహాయక (పాలియేటివ్) సంరక్షణ
రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన అన్ని వాస్తవాలను గురించి తెలుసుకోండి. మీలో ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. సకాలంలో పరీక్షలు, మీ రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవడం, ఏవైనా గడ్డలను గుర్తిస్తే వెంటనే నిర్ధారణకు వెళ్లండి. మహిళలు 40 సంవత్సరాల నుంచి వార్షిక మామోగ్రామ్(రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే ఒక రకమైన స్కానింగ్) చేయించుకోవాలి. ఇది ముందుగానే రోగ నిర్ధారణ చేసేందుకు మరియు చికిత్స చేసేందుకు ఉపయోగపడుతుంది.
Yes
No

Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips











গর্ভাবস্থায় আলুবোখরা: উপকারিতা ও ঝুঁকি | Prunes During Pregnancy: Benefits & Risks in Bengali

গর্ভাবস্থায় হিং | ঝুঁকি, সুবিধা এবং অন্যান্য চিকিৎসা | Hing During Pregnancy | Risks, Benefits & Other Treatments in Bengali

স্তনের উপর সাদা দাগ: লক্ষণ, কারণ এবং চিকিৎসা | White Spots on Nipple: Causes, Symptoms, and Treatments in Bengali

গর্ভাবস্থায় পোহা: উপকারিতা, ধরণ এবং রেসিপি | Poha During Pregnancy: Benefits, Types & Recipes in Bengali

গর্ভাবস্থায় মাছ: উপকারিতা এবং ঝুঁকি | Fish In Pregnancy: Benefits and Risks in Bengali

গর্ভাবস্থায় রেড ওয়াইন: পার্শ্ব প্রতিক্রিয়া এবং নির্দেশিকা | Red Wine During Pregnancy: Side Effects & Guidelines in Bengali

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |