hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Preparing For Delivery arrow
  • అపోహలు – వాస్తవాలు: వేడిచేసే పదార్థాల వల్ల గర్భం పోతుందా (Myths and Facts: Can Heat Inducing Food Cause Miscarriage in Telugu) ? arrow

In this Article

    అపోహలు – వాస్తవాలు: వేడిచేసే పదార్థాల వల్ల గర్భం పోతుందా (Myths and Facts: Can Heat Inducing Food Cause Miscarriage in Telugu) ?

    Preparing For Delivery

    అపోహలు – వాస్తవాలు: వేడిచేసే పదార్థాల వల్ల గర్భం పోతుందా (Myths and Facts: Can Heat Inducing Food Cause Miscarriage in Telugu) ?

    3 November 2023 న నవీకరించబడింది

    ప్రెగ్నెన్సీ అనేది ప్రతి స్త్రీ జీవితంలో ఒక ముఖ్యమైన దశ. అయితే ఈ దశలో, శరీరంలోని స్వీయ రక్షక లక్షణాలు చాలా వరకు కోల్పోతాయి. ముఖ్యంగా ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యల విషయంలో ప్రతికూల కారకాలు మరింత హాని కలిగిస్తాయి. గణాంకాలను బట్టి, వైద్యపరంగా ధృవీకరించబడిన అన్ని గర్భాలలో దాదాపు 15% శిశువును కోల్పోవడం జరుగుతుంది. రెండవ సారి గర్భం వచ్చిన తల్లికి "గర్భస్రావం జరిగే అవకాశాలు" ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్య చుట్టూ అనేక అపోహలు ఉన్నాయి. కానీ చాలా మందిలో, గర్భస్రావానికి కొన్ని ఆహారాలు కారణమవుతున్నాయి.

    గర్భస్రావం అంటే ఏమిటి (What is Miscarriage in Telugu)?

    గర్భస్రావం అంటే గర్భం పోవడం. 20 వారాల లోపు, పిండం యొక్క బరువు 500 గ్రాములు మించనప్పుడు ఇది జరుగవచ్చు. 80% కంటే ఎక్కువ గర్భస్రావాలు ముందుగానే, 12 వారాలలోపు జరుగుతాయి. ఈ సమయంలో పిండం యొక్క అవయవాలు తయారవడం మొదలవుతుంది. అందువల్ల దేని ప్రభావమైనా హానికరం కావచ్చు. చాలాసార్లు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు తెలియకుండానే మామూలుగా నెల వచ్చినట్లే రక్తస్రావం ఉంటుంది. దీనివల్ల పిండంలో మిగిలిపోయిన అవశేషాలు పూర్తిగా బయటకు రావు. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరం. ఇది తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. 22 వారాల తర్వాత గర్భస్రావం జరిగిందంటే, నెలలు పూర్తవకుండా పిల్లలు పుట్టినట్లు లెక్క. పిల్లలు 650 గ్రాముల కంటే ఎక్కువ బరువున్నట్లు అర్థం.

    ప్రెగ్నెన్సీలో ఏ లక్షణాలను విస్మరించకూడదు (What Are the Symptoms That Should Not Be Neglected)?

    • ప్రెగ్నెన్సీలో యోని నుండి రక్తస్రావం కావడం ద్వారా గర్భస్రావం జరిగే ప్రమాదం సూచించబడుతుంది. దాని తీవ్రత, వ్యవధి, రంగు ఎలా ఉన్నప్పటికీ, మీరు వెంటనే డాక్టర్ ని ఖచ్చితంగా కలవాలి.
    • నడుము కింది నుండి, తొడ లోపలి వైపున వచ్చే నొప్పి యుటెరిన్ హైపర్టోనిసిటీని, పెరుగుతున్న పిండాన్ని బయటపడేయటానికి శరీరం చేసే ప్రయత్నాన్ని సూచిస్తుంది.
    • బహుశా రక్తస్రావం, ఇబ్బందుల తీవ్రత తక్కువగా ఉండవచ్చు, కానీ అలాంటి లక్షణాలను పట్టించుకో కుండా ఉండకూడదు. గర్భిణీ స్త్రీకి పరీక్షలలో నిరాశాజనకమైన ఫలితం తెలిసినట్లయితే, సురక్షితమైన పరిస్థితి వచ్చే వరకు గర్భాన్ని ఉంచడానికి సాధ్యమైన ప్రయత్నాలన్నింటినీ చేయడమే వైద్యుల పని.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో రక్తస్రావం? దీని అర్థం ఏమిటి? మీరు వైద్యుడిని సంప్రదించాలా

    గర్భిణీ స్త్రీలు తినకూడని ఆహారాలు ఏమిటి (Foods to Avoid By Pregnant Ladies in Telugu)?

    మంచి జీవన ప్రమాణాల కోసం, అబార్షన్‌కు కారణమయ్యే కొన్ని ఆహార పదార్థాలు ఎంత రుచిగా ఉన్నా సరే తినకూడదు. ప్రెగ్నెన్సీలో మీరు తీసుకునే ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. అదనపు చక్కెర, ఆల్కహాల్ వంటి విషపూరిత పదార్థాలతో పాటు, పచ్చి చేపలు, వేయించిన ఆహారాలు, ఉడకని మాంసం, సరిగ్గా కడగని పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. అవి కలుషితమై శిశువుకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.

    అందువల్ల, ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్ ఎ, సి వంటి విటమిన్లు, మినరల్స్‌తో పాటు, బాగా ఉడికినవి, పోషక విలువలు కలిగినవి అయిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అలాగే, క్రింద, మేము గర్భస్రావానికి కారణమయ్యేవి ప్రెగ్నెన్సీలో తినకూడని అనేక ముఖ్యమైన పదార్థాలను ఇచ్చాము. కాబట్టి, ఇవి తప్పక పాటించండి!

    · ఆల్కహాలిక్ పానీయాలు (Alcoholic Drinks)

    గర్భిణీ స్త్రీలు తీసుకోకూడని ముఖ్య పదార్థాలలో మద్యం ఒకటి. ఇది ముందే బిడ్డ పుట్టడం, ఎదుగుదలలో లోపాలు, గుండె జబ్బులకు కారణమవుతుంది. ఇది పిండం యొక్క శరీరంలో ఇది పేరుకుపోయి తొలగించలేని విధంగా తయారవుతుంది.

    · ఉడకని చేపలు, మాంసం (Raw Fish, Meat)

    కొన్ని చేపలలో పాదరసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పదార్థాన్ని ఎక్కువగా తీసుకుంటే, శిశువుకు నాడీ సంబంధిత లోపాలు కలుగుతాయి. షార్క్, మార్లిన్, బ్లూఫిన్ ట్యూనా, ఆరెంజ్, స్వోర్డ్ ఫిష్ వంటివి ప్రెగ్నెన్సీలో తీసుకోకూడని చేపలకు కొన్ని ఉదాహరణలు.

    వీటితో పాటుగా, సుషీ, గుల్లల వంటి పచ్చి ఆహారాలు, మాంసాల వంటి తక్కువగా ఉడికించిన ఆహారాలు తీసుకోకూడదు, ఎందుకంటే వీటిలో అబార్షన్ కు, ముందుగానే బిడ్డ పుట్టడానికి కారణమయ్యే లిస్టెరియా బ్యాక్టీరియాలతో కలుషితం కావచ్చు. లేదా సిస్టిసెర్కోసిస్ వంటి వ్యాధులను కలిగించవచ్చు. ఇది నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి, మెదడు పనితీరును దెబ్బతీస్తుంది.

    · పచ్చి గుడ్లు (Raw Eggs)

    పచ్చి గుడ్డు తినడం చాలా మందికి సాధారణ అలవాటు ఉండకపోవచ్చు, కానీ మయోనైస్, సీజర్ సలాడ్, ఎగ్‌నాగ్, హాలండైస్ లను తరచుగా ఆహారంలో తీసుకుంటూ ఉండవచ్చు. సాల్మొనెల్లా కల్తీ జరగకుండా ఉండటానికి, ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. తినడానికి ముందు గుడ్లు ఉడికించాలని గుర్తుంచుకోండి.

    · పాడైన చీజ్‌లు (Expired Cheese)

    బ్లూ, ఫెటా, బ్రీ, కామెంబర్ట్, గోర్గోంజోలా వంటి చీజ్‌లు, పాశ్చరైజ్ చేయని పాలు లేదా పాశ్చరైజ్ చేయని పాల పదార్థాలలో లిస్టేరియా ఉన్నందున వాటికి దూరంగా ఉండాలి. ఈ బాక్టీరియం పిండం లేదా నవజాత శిశువుకు ప్రాణాంతక సమస్యలను కలిగిస్తుంది, గర్భస్రావాలు, అకాల జననాలు, రక్తం విషపూరితం అవ్వడానికి కారణం అవుతుంది.

    · పండని బొప్పాయి (Unriped Papaya)

    ప్రెగ్నెన్సీ మొదట్లో బొప్పాయి గర్భస్రావానికి ఎలా కారణమవుతుంది? బొప్పాయి, ముఖ్యంగా ఆకుపచ్చ రంగులో ఉన్న పచ్చి, గర్భస్రావానికి కారణమవుతుందని అంటారు. ఇది గర్భస్రావానికి కారణమయ్యే ఆహార పదార్థాలలో ఒకటి. పచ్చి బొప్పాయిలో ఉండే ఒక ఎంజైమ్, ఇది గర్భాశయ సంకోచాలను కలిగిస్తుంది అంటే ప్రసవం మాదిరిగా నొప్పులు వస్తాయి, ఇది గర్భస్రావానికి దారితీస్తుంది. పండని బొప్పాయి అబార్షన్‌కు ఎంత వరకు కారణమవుతుందని కూడా మీరు అడగవచ్చు. ఇంత తింటే అవుతుందని కాదు కానీ, పండని బొప్పాయి అకాల ప్రసవానికి దారితీయవచ్చు. కాబట్టి, ప్రెగ్నెన్సీలో దీనికి దూరంగా ఉండాలి.

    · సరిగ్గా కడగని పండ్లు, కూరగాయలు (Not Properly Washed Fruits, Vegetables)

    మీరు సరిగ్గా కడిగిన పండ్లు, కూరగాయలను మాత్రమే తినాలి. సరిగా కడగకపోతే, ఈ ఆహార పదార్థాలలో టాక్సోప్లాస్మోసిస్ తో కలుషితం కావచ్చు. ఇది గర్భస్రావం, అకాల పుట్టుక, వైకల్యం, శిశువు మరణాలకు కూడా కారణమవుతుంది.

    · మసాలాలు, కారంగా ఉండే పదార్థాలు (Spicy Foods)

    మసాలాలు, కారాలు కొన్ని సందర్భాల్లో, కడుపులో యాసిడ్ లేదా ఇతర గ్యాస్ట్రిక్ సమస్యలను కలగజేస్తాయి కనుక ప్రెగ్నెన్సీలో ఇబ్బందులను కలుగజేయవచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఇది ప్రసవానికి కారణమయ్యే ఆహార పదార్థాలలో చేర్చబడినప్పటికీ, అది పని చేస్తుందనడానికి ఎటువంటి ఆధారాలూ లేవు.

    · పైనాపిల్ (Pineapple)

    పైనాపిల్ లో అనేక లక్షణాలు ఉంటాయి. కొంతమంది తల్లుల అభిప్రాయం ప్రకారం, దీనిని శిశువు పుట్టుకకు దోహదపడే, ప్రసవానికి తోడ్పడే ఆహారాలలో కూడా చేర్చవచ్చు. తాజా పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ గర్భాశయం దృఢత్వాన్ని కోల్పోయేలా చేస్తుందని నమ్ముతారు. ఏది ఏమైనప్పటికీ, దీనికి ఆధారాలు ఉన్నప్పటికీ, నిజానికి పైనాపిల్స్‌లో ఉన్న బ్రోమెలైన్ చాలా తక్కువగా ఉందని తెలిసింది. ప్రేగులపై ప్రభావం చూపించాలంటే ఒక స్త్రీ కనీసం ఒక పండు పూర్తిగా తినాలి.

    · సుగంధ ద్రవ్యాలు, మూలికలు (Spices)

    ఇది బాగా పరీక్షించబడినది. తులసి, ఒరేగానో, వాము, కొత్తిమీర, సేజ్, సోంపు, మిరియాలు వంటి మూలికలు గర్భాశయ సంకోచాలకు కారణమవుతాయని నమ్ముతారు. అంటే ప్రసవం మాదిరిగా నొప్పులు వస్తాయి. అయినప్పటికీ, వీటిలో చాలా వరకు గర్భధారణ సమయంలో తీసుకోకూడదని చెబుతారు. ఎందుకంటే అవి గర్భస్రావానికి కారణమవుతాయి. అయితే, అవి గర్భాశయ సంకోచాలకు కారణమయ్యే అవకాశం ఉంది. అంటే ప్రసవం మాదిరిగా నొప్పులు వస్తాయి. ముందుజాగ్రత్తగా, ఎంత తీసుకుంటున్నారో చూసుకొని తక్కువగా తీసుకోవడం మంచిది. దేనికైనా డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిది.

    · వెల్లుల్లి (Garlic)

    మసాలా దినుసుల మాదిరిగానే, వెల్లుల్లి పిండాన్ని ప్రేరేపించడానికి, కదిలించడానికి, ప్రసవానికి సిద్ధం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. వెల్లుల్లిని తగినంత పరిమాణంలో తినడం అనేది నిరూపితమైన పద్ధతి అయినా కాకపోయినా, పురాతన కాలం నుండి ప్రసవానికి సహాయపడటానికి ఉపయోగించే మార్గాలలో ఇది కూడా ఒకటి.

    · కోహోష్ అనే మొక్క (cohosh Plant)

    ఇది ప్రపంచవ్యాప్తంగా దొరికేది కాదు. ఇది అమెరికాలో దొరికే మొక్క. దీనిని టీ రూపంలో వినియోగిస్తారు. కోహోష్ టీ నొప్పులకు కారణమవుతుంది. ఇది శాస్త్రీయపరంగా నిరూపితం కానప్పతకీ, జాగ్రత్తగా ఉండటం ఎప్పటికప్పుడు డాక్టర్ ని సంప్రదించడం మంచిది. పైన పేర్కొన్న ఆహార పదార్థాలు రెండవ త్రైమాసికంలో గర్భస్రావం కలిగేలా చేస్తాయి. వీటితో పాటు, తీవ్రమైన ఒత్తిడి, అధిక శారీరక శ్రమ, అనారోగ్యకరమైన జీవనశైలి, తల్లి శరీరాన్ని క్షీణింపజేస్తాయి, పిండం ఒక దశలో దీనిని భరించలేకపోతుంది. అలాగే, ప్రెగ్నెన్సీలో రకరకాల మందులను నియంత్రణ లేకుండా వాడటం కూడా గర్భస్రావం జరగడానికి దోహదపడుతుంది. అనుభవజ్ఞులైన డాక్టర్ ని సంప్రదించిన తర్వాత, సురక్షితమైన మూలికలను కూడా ముందుగానే ఉపయోగించాలి.

    మీకు గర్భస్రావం జరుగుతుందేమోనని అనుమానంగా ఉంటే ఏమి చేయాలి (What To Do If You Have Doubted About Abortion)?

    కొద్దిపాటి అనుమానం ఉన్నా కూడా, మీరు వెంటనే నిపుణులను సంప్రదించాలి. భయాందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. చాలా సందర్భాలలో, ప్రశాంతంగా ఉండటం, సకాలంలో వైద్య సహాయం తీసుకోవడం గర్భం కొనసాగటానికి సహాయపడుతుంది. రక్తస్రావం కనిపించిన తరువాత, కోరియన్ డిటాచ్మెంట్- గర్భాశయం గోడలపై ఉండే, పిండం యొక్క పొరలు కనిపించాయని అర్థం. ఇలా జరిగితే మీరు వెల్లకిలా పడుకుని అంబులెన్స్‌కు కాల్ చేయాలి. ఇలాంటి స్థితిలో సొంత వైద్యాలు చేయడం మంచిది కాదు.

    డాక్టర్ గర్భస్రావం జరిగే అవకాశం ఉందని గుర్తించినట్లయితే పరీక్షలు చేస్తారు. ఇవి పరిస్థితిని మరింత స్పష్టంగా తెలుసుకోవడానికి, ప్రమాద స్థాయిని గుర్తించడానికి సహాయపడతాయి. అన్నింటికంటే ముందు, అభివృద్ధి చెందుతున్న పిండం యొక్క హృదయ స్పందనను డాక్టర్ పరీక్షిస్తారు. ప్లాసెంటా, పిండం యొక్క పరిస్థితి గురించి తెలుసుకోవడానికి, గర్భాశయం యొక్క నిర్మాణం గురించిన విషయాలను తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ పరీక్ష సహాయపడుతుంది. గైనకాలజిస్ట్ పరిస్థితిని సరిగ్గా తెలుసుకోగలుగుతారు.

    ప్రసవానికి ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు (Remember These Things Before Delivery)

    కొన్ని రకాల ఆహార పదార్థాలు గర్భస్రావానికి కారణమవుతాయి, కానీ పైన తెలిపిన చాలా ఆహార పదార్థాలు, సప్లిమెంట్‌లు ప్రసవానికి దోహదం చేస్తాయనేది శాస్త్రీయంగా నిరూపించబడలేదు. ఇంకా, ఏ సంస్థా కూడా దీనికి మద్దతు ఇవ్వడం లేదు.

    ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఈ పదార్థాలు తీసుకోవడం తగ్గించాలి. అనవసరమైన రిస్క్ తీసుకోకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి. ప్రసవానికి దోహదపడటానికి ఈ ఆహారాలను తీసుకోవాలనే నిర్ణయం వ్యక్తిగతమైనది. అయితే, ప్రమాదకరం కాదని మాకు తెలిసిన ఆహారాలను ఎంచుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము. ఉదాహరణకు, పైనాపిల్ విషయంలో, పెద్దగా ప్రమాదాలు వచ్చే అవకాశాలు తక్కువే. చాక్లెట్ వంటి ఇతర ఉత్పత్తులను కూడా కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ఆరోగ్యాన్ని లేదా మన బిడ్డ ప్రాణాన్ని పణంగా పెట్టకూడదు. సరైన సమయం వస్తుంది. కాబట్టి, డెలివరీ కోసం ప్రశాంతంగా, విశ్రాంతిగా వేచి ఉండటం మంచిది.

    రిఫరెన్సెస్(References) :

    1. Adebiyi A, Adaikan PG, Prasad RN. (2002). Papaya (Carica papaya) consumption is unsafe in pregnancy: fact or fable?. www.pubmed.ncbi.nlm.nih.gov

    Tags:

    Heat inducing foods during pregnancy in telugu, can pregnants eat heat inducing foods in telugu, can pregnants eat papaya in telugu, what are the causes of abortion in telugu, do heat inducing foods cause abortion in telugu.

    Also Read In:

    Bengali: মিথ এবং ঘটনা: তাপ-প্ররোচিত খাবার কি গর্ভপাত ঘটাতে পারে?

    English: Myths and Facts: Can Heat Inducing Food Cause Miscarriage?

    Tamil: வெப்பத்தை தூண்டுகிற உணவினால் கருச்சிதைவு ஏற்படுமா?

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.