Pregnancy
8 February 2024 న నవీకరించబడింది
స్ట్రెచ్ మార్క్స్ అనేవి మీ చర్మం వేగంగా సాగినా లేదా సంకోచించినా చర్మంపై వచ్చే మచ్చలు. ఇది అప్పుడే గర్భం దాల్చి పిల్లలని కన్నవారికి లేదా బరువుని వేగంగా తగ్గటం లేదా పెరగటం చేసినవారిలో సాధారణంగా కనిపించే ఇబ్బంది. గర్భవతులకి సామాన్యంగా పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ వారి ప్రెగ్నెన్సీ కాలంలో ఆఖరి ట్రైమిస్టరులో వస్తాయి. ఈ స్ట్రెచ్ మార్క్స్ హానికరం కావు కానీ, ఇవి ఆ వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తాయి.
మనుషుల చర్మంలో కొల్లాజెన్ ఉండటం వలన అది సాగేగుణాన్ని కలిగివుంటుంది. అలాగే చర్మం వేగంగా సాగినప్పుడు, మనిషి శరీరం సరిపోయినంత కొల్లాజెన్ ను ఉత్పత్తి చేయలేదు. అప్పుడు దానివలన ఎక్కువగా సాగిపోయిన చర్మ ప్రాంతాలలో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. ఎవరికైనా స్ట్రెచ్ మార్క్స్ ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాదాపు 90 శాతం మందికి ఇవి శరీరంలోని వివిధ భాగాలలో వస్తాయి. అవి ఎక్కడంటే -
మీరు మీ చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ ని సులభంగా గుర్తుపట్టవచ్చు. పొట్టపై లేదా ఏ శరీర భాగంపైన అయినా స్ట్రెచ్ మార్క్స్ అలల ఆకారంలో ఉన్న గీతల రూపంలో కన్పిస్తాయి, దురద కూడా పెడుతుంటాయి. ఈ స్ట్రెచ్ మార్క్స్ యొక్క రంగు ఆ వ్యక్తి యొక్క చర్మం రంగుపై ఆధారపడి ఉంటుంది; అవి ఊదా, ఎరుపు, పింక్ లేదా ఎర్రని బ్రౌన్ రంగులలో ఏవైనా కావచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో చర్మ సంరక్షణ - అనుసరించాల్సిన చిట్కాలు
పొట్టపై స్ట్రెచ్ మార్కులు ముఖ్యంగా రెండు కారణాల వలన వస్తాయి, అవి ఏంటంటే -
ఈ కింది పరిస్థితులలో ఎప్పుడైనా కూడా పొట్టపై స్ట్రెచ్ మార్కులు ఏర్పడటం గమనించవచ్చు. -
స్ట్రెచ్ మార్క్స్ చూడటానికి ఇబ్బందికరంగా ఉంటాయి, అలాగే కొన్నిసార్లు ఇవి ఎంత తొందరగా మసకబారతాయా అని అవి వచ్చినవారు ఎదురుచూస్తుంటారు. వీరు వీలైతే తక్షణమే ఈ స్ట్రెచ్ మార్క్స్ ని తొలగించుకోవడానికి ఇష్టపడతారు. అనుక్షణం త్వరగా పొట్టపై వచ్చిన స్ట్రెచ్ మార్క్స్ ని ఎలా తొలగించుకోవాలి అని జవాబులు వెతుకుతూ ఉంటారు. స్ట్రెచ్ మార్కులని నయం చేయడంలో సాయపడే కొన్ని కాస్మెటిక్ పద్ధతుల గురించి కింద ఇవ్వబడింది
మీకు ఇది కూడా నచ్చుతుంది: డెలివరీ తర్వాత స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి? ఈ టిప్స్ మీకోసమే!
ఫ్రాక్సెల్ స్కిన్ థెరపీ అన్నది నొప్పిలేకుండా చర్మంపై స్ట్రెచ్ మార్కులని తొలగించే ప్రక్రియ. అతిగా సాగటం వలన దెబ్బతిన్న చర్మాన్ని ఈ ప్రక్రియ నయం చేస్తుంది. ఈ ప్రక్రియ కొత్త అలాగే పాత స్ట్రెచ్ మార్కులు రెండింటికీ వర్తిస్తుంది. అలాగే ఈ ప్రక్రియ మచ్చలు, ఎండ వలన దెబ్బతిన్న చర్మం ఉన్నవారికి కూడా మంచిది.
ఇది ఏ రకమైన సూదులు అలాగే ఆపరేషన్ కూడా అవసరం లేకుండా చేసే ప్రక్రియ. చర్మంలోకి మైక్రోస్కోపిక్ లేజర్ని పంపుతూ ఈ ప్రక్రియని చేస్తారు. అది చర్మం యొక్క సాగే గుణాన్ని పెంచటానికి కావలసిన కొల్లాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఫలితంగా స్ట్రెచ్ మార్కులు సులభంగా తొలగిపోతాయి. అలాగే ప్రక్రియ కూడా తక్కువ నొప్పితో, వేగంగా అయిపోతుంది. ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి గంట పడుతుంది, కొన్నిరోజులలోనే పేషెంట్లు తమ సాధారణ జీవితానికి వెళ్ళిపోవచ్చు.
CO2 లేజర్ చికిత్స స్ట్రెచ్ మార్కులు గాఢంగా, స్పష్టంగా ఏర్పడిన వ్యక్తులకి సరిపోతుంది. పొట్టపై ఉన్న స్ట్రెచ్ మార్కులని తొలగించడానికి ఇది చాలా ప్రభావవంతమైన దారి అని చెప్పవచ్చు. ఈ ప్రక్రియని ఫ్రాక్సెల్ స్కిన్ థెరపీకి అనుబంధంగా నిర్వహించవచ్చు లేదా విడిగా పూర్తి చికిత్సగా కూడా వాడవచ్చు. CO2 లేజర్ చికిత్స సమర్థవంతంగా పొట్టపై స్ట్రెచ్ మార్కులని తొలగించిన తర్వాత, కొన్నిరోజుల పాటు శరీరం కోలుకునేలా విశ్రాంతి తీసుకొని తీరాలి.
CO2 లేజర్లు చర్మంపై కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి మైక్రోస్కోపిక్ పంక్చర్లు లేదా సూక్ష్మ రంధ్రాలని చేస్తాయి. ఈ పద్ధతి స్ట్రెచ్ మార్కులని చిన్నవిగా చేసి, నెమ్మదిగా చర్మం నుండి తొలగిస్తుంది. స్ట్రెచ్ మార్కులు తీవ్రంగా ఉన్న పేషెంట్లకి ఏదైనా కనిపించే ఫలితం చూడటానికి మూడు నుండి ఆరునెలల పాటు చాలాసార్లు CO2 లేజర్లతో చికిత్స అవసరం కావచ్చు.
ఏ ఇతర మచ్చలాగానైనా, స్ట్రెచ్ మార్కులు కూడా కాలంతోపాటు మాడిపోయి, మసకబారిపోతాయి. పొట్ట, పొత్తికడుపుపై వచ్చిన స్ట్రెచ్ మార్కుల యొక్క శాశ్వత చికిత్సలో భాగంగా స్ట్రెచ్ మార్కుల కింద ఉన్న ఆరోగ్యకరమైన చర్మ కణజాలాలని తిరిగి నిర్మించటం అలాగే ఇప్పుడు ఉన్న మచ్చలని మసకబారేలా చేయడం వంటివి ఉంటాయి. లేజర్ స్ట్రెచ్ మార్క్ రిమూవల్ వంటి ప్రత్యేక లేజర్ చికిత్సలని స్ట్రెచ్ మార్కులని శాశ్వతంగా తొలగించటానికి డెర్మటాలజీ క్లినిక్‌లలో నిర్వహించవచ్చు.
సమతుల ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ అలాగే ఒంటిని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం ద్వారా మీరు సులభంగా స్ట్రెచ్ మార్కులు రాకుండా నివారించుకోవచ్చు. ఒక డైటీషియన్‌ని సంప్రదించి సరైన డైట్ తీసుకోవడం స్ట్రెచ్ మార్కులు వచ్చే అవకాశాలని తగ్గించటంలో సాయపడుతుంది. స్ట్రెచ్ మార్కులన్నవి సహజమైనవే, శరీరంపై అవి రాకుండా మనం ఆపలేం. అలాగే, ఒక వ్యక్తికి స్ట్రెచ్ మార్కులంటూ వచ్చాక, వారు అవంతట అవి సమసిపోయేవరకూ ఎదురుచూడవచ్చు లేదా ఎవరైనా నిపుణుడిని సంప్రదించి కాస్మెటిక్ చికిత్స కోసం సాయాన్ని తీసుకోవచ్చు.
Stretch Marks Meaning in Telugu, Stretch Marks during Pregnancy in Telugu, Stretch Marks due to Weight Gain in Telugu, Stretch Marks after Pregnancy in Telugu, How to get rid from Stretch Marks in Telugu, Stretch Marks On Stomach: Causes, Treatment And Prevention in English, Stretch Marks On Stomach: Causes, Treatment And Prevention in Tamil, Stretch Marks On Stomach: Causes, Treatment And Prevention in Bengali
Yes
No
Written by
Sri Lakshmi
Get baby's diet chart, and growth tips
గర్భవతులు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది? | Should Pregnant Women Get Flu Shots in Telugu
Vaginal Delivery - మీరు వెగైనల్ డెలివరీనే ఎందుకు ఎంచుకోవాలి? ఇందులోని అనుకూలతలు మరియు ప్రతికూలతల గురించి తెలుసుకోండి.
గర్భవతులు పెయింటింగ్ వేయొచ్చా? | Can pregnant women paint in Telugu
గర్భం దాల్చినప్పుడు కీలక పాత్ర పోషించే మాయ (ప్లాసెంటా) ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది?
గర్భధారణలో పనీర్ తీసుకోవడం మంచిదేనా? దాని ప్రయోజనాలు, దుష్ప్రభావాలు & తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు
గర్భధారణలో BPD అంటే ఏమిటి? | What is BPD in Pregnancy in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |