Baby Care
28 November 2023 న నవీకరించబడింది
బిడ్డ శుభ్రత గురించి జాగ్రత్తలు తీసుకోవడం వారి ఆరోగ్యం మరియు చర్మానికి చాలా మంచిది. డైపర్ మార్చిన ప్రతిసారి ఆ ప్రదేశాన్ని కడగడం మంచి ఆలోచన కాదు. అప్పుడు బేబీ వైప్స్ ఉపయోగపడతాయి. అయినప్పటికీ బేబీ వైప్స్ ఉపయోగించడం పై తల్లిదండ్రుల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ‘బేబీ వైప్స్ వాడటం వల్ల దద్దుర్లు వస్తాయా?, వాటి వాడకం మా శిశువుకి మంచిదేనా? అనే ప్రశ్నలు మీ మదిలో మెదలుతున్నట్లయితే, వాటికి సమాధానాలు సిద్ధంగా ఉన్నాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: మీ బిడ్డను తడిగా మరియు దద్దుర్లు లేకుండా ఉంచడంలో క్లాత్ డైపర్ ఎంత సమర్థంగా ఉంటుంది?
ఈ ప్రశ్నకు సమాధానం సులువైనది కాదు. మీ శిశువు కోసం ఎలాంటి వెట్ వైప్స్ ఉపయోగిస్తున్నారన్న దాన్ని బట్టి, అది దద్దుర్లు కలిగిస్తుందా లేదా అన్నది నిర్ణయమవుతుంది. మీ శిశువు చర్మానికి దద్దుర్లు కలిగించని బేబీ వైప్స్ యొక్క లక్షణాలు ఇక్కడ ఉన్నాయి.
1. మీరు కొనుగోలు చేసే బేబీ వైప్స్ చర్మ సంరక్షణ పదార్థం తో తయారు చేసి ఉండాలి. అందులో వాడిన వస్త్రం మెత్తగా ఉండాలి మరియు అది శిశువు కోమల చర్మానికి సరిపడేలా చేయగలిగేలా ఉండాలి.
2. మీ శిశువు కోసం ఉపయోగించే వెట్ వైప్స్ లో సహజమైన మరియు మెత్తని పదార్థాలైన కలబంద సారం, విటమిన్ ఇ, సహజ నూనెలు వంటివి ఉండేలా చూసుకోండి.
3. ఆల్కహాల్, పారాబెన్స్, మరియు ఇతర హానికర రసాయనాలు లేకుండా ఉండే వెట్ వైప్స్ ను మాత్రమే మీ శిశువు కోసం కొనుగోలు చేయండి.
4. నీటి-ఆధారిత బేబీ వైప్స్ సున్నితమైన మీ బిడ్డ చర్మానికి దద్దుర్లు లాంటి హాని కలిగించవు మరియు మాయిశ్చరైజింగ్ కూడా చేస్తాయి.
అయినప్పటికీ మీ బిడ్డ చర్మం మీద వాటిని రఫ్ గా వాడితే దద్దర్లు కలిగే అవకాశం ఉంది. మీ శిశువు చర్మాన్ని శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మరియు మీరు ఆన్లైన్లోగానీ, స్టోర్లో గానీ కొనేటప్పుడు పైన చెప్పిన అన్ని లక్షణాలు ఉన్న బేబీ వైప్స్ ను మాత్రమే కొనుగోలు చేయండి.
బేబీ వైప్స్ ఉపయోగాలు తెలుసుకోవడానికి మరియు బేబీ వైప్స్ ను మీ శిశువుకి స్నానం చేసే సమయంలో స్పాంజ్ లా ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోవడానికి చదువుతూ ఉండండి.
మీ శిశువు మంచి ఆరోగ్యం కోసం శిశువు చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉంచడం చాలా ముఖ్యమైన అంశం. స్పాంజ్ బాత్ అచ్చంగా అదే చేస్తుంది. రోజూవారీగా తరచుగా శిశువుకి స్నానం చేయించడం వల్ల వారికున్న మృదువైన చర్మం దెబ్బతిని చర్మం పొడిగా అవుతుంది. చర్మం పొడిబారకుండా స్నానం చేయించడానికి స్పాంజ్ బాత్ సరైన ప్రత్యామ్నయం. బేబీ వైప్స్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. అందులో ఒకటే స్పాంజ్ బాత్.
కాబట్టి, ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే: అవును, మీ శిశువుకి బేబీ వైప్స్ ఉపయోగించి స్పాంజ్ బాత్ చేయించవచ్చు. నిజానికి సాధారణ ఉతకబడే వస్త్రాల కంటే బేబీ వైప్స్ వల్ల శిశువు చర్మం మరింత కొత్తదనంతో, మాయిశ్చరైజ్ అవుతుంది. అయినప్పటికీ స్పాంజ్ బాత్ చేయించేటప్పుడు కొన్ని విషయాల పట్ల మీరు జాగ్రత్త తీసుకోవాలి.
1. శిశువుని పడుకోబెట్టడానికి అవసరమైన టవల్ తో సహా అన్ని వస్తువులైన బేబీ వైప్స్, బేబీ క్లెన్సర్, ఫ్రెష్ సెట్ క్లాత్స్, డాంప్ స్పాంజ్, వేడి నీరు, చిన్న గది ఉంచుకోవాలి.
2. బేబీ వైప్స్ తో మీ శిశువు శరీరాన్ని తుడవండి. పలు ప్రదేశాలకు ప్రత్యేకించి ముఖానికి, లైంగికావయవాల వద్ద కొత్త బేబీ వైప్స్ ఉపయోగించండి.
3. మీ అరచేతిలో కొంచెం బేబీ క్లెన్సర్ తీసుకొని దానికి 2-3 చుక్కల నీటిని కలిపి నురగ వచ్చేలా కలపండి ఆ తర్వాత దాన్ని మీ శిశువు చర్మానికి రాయండి.
4. తిరిగి శుభ్రం చేయడానికి మళ్లీ బేబీ వైప్స్ ఉపయోగించండి. కళ్లు, చెవులు, ముక్కు వద్ద జాగ్రత్త తీసుకోండి.
5. స్నానం ముగిశాక ఆరబెట్టి ఆ తర్వాత శరీరానికి మాయిశ్చరైజర్ పూసి తాజా బట్టలను తొడిగించండి.
ఒకవేళ మీరు మీ బేబీ స్పాంజ్ బాత్ కోసం బేబీ వైప్స్ ఉపయోగిస్తున్నట్లయితే వాటిలో ఆల్కహాల్, పారాబెన్స్, ఇతర హానికర రసాయనాలు లేకుండా ఉండే నీటి ఆధారిత బేబీవైప్స్ మాత్రమే వినియోగించండి. వైప్స్ గనుక సహజ పదార్థాల ద్వారా తయారైతే అవి హానికలిగించకుండా, శిశువు కోమలమైన చర్మానికి మృదుత్వాన్ని, మాయిశ్చరైజేషన్ ను అందించడంలో సాయపడతాయి. 98% నీటి-ఆధారితంగా తయారైన మైలో కేర్ బేబీ జెంటిల్ వైప్స్ ను మీరు ప్రయత్నించవచ్చు. వాటిలో ఎలాంటి ఆల్కహాల్ గాని ఇతర రసాయనాలుగానీ ఉండవు మరియు అదనపు మృదుత్వాన్ని అందిస్తాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: అప్పుడే పుట్టిన శిశువుల విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి?
శిశువు నుండి వచ్చే వ్యర్థాలను శుభ్రం చేయడంలో అమ్మ ఉపయోగించే రహస్యమే బేబీ వైప్స్. ఒకవేళ మీ దగ్గర ఆల్కహాల్ లేని, పీహెచ్-బాలన్స్డ్ వైప్స్ ఉన్నట్లయితే అన్ని రకాల పనులకు దాన్ని ఉపయోగించవచ్చు మరియు అది లేకుండా జీవించడం కష్టమే అని చెప్పవచ్చు.
వైప్స్ ద్వారా మీ జీవితం సులువవుతుందని చెప్పడానికి ఇక్కడ మార్గాలున్నాయి.
1. అవును! అసలైన లక్ష్యం - డైపర్ మార్చడం
2. తిన్న తర్వాత శిశువు చేతులు, ముఖం తుడిచేందుకు
3. బయటకు వెళ్లే సమయంలో మిమ్మల్ని, మీ శిశువుని శుభ్రం చేయడానికి
4. చిన్నారి ముక్కును చీదేందుకు
5. జారిపోయినప్పుడు పాసిఫైయర్ (నోట్లో పెట్టే పీక లాంటిది) ను తుడిచేందుకు
6. గాయమైనప్పుడు ప్రథమ చికిత్సా కిట్ లేకపోతే దాన్ని తుడిచేందుకు
7. పిల్లల టాయ్స్ ను శుభ్రపరచడానికి
8. మీ మేకప్ ను తుడవడానికి
9. స్నికర్స్ తుడవడానికి ఉత్తమ క్లీనర్
10. గోడల మీద క్రేయాన్స్ రాతలను పోగొట్టే మ్యాజిక్ గా పని చేస్తుంది
11. ఫర్నీచర్ తుడవడానికి
12. కుటుంబమంతా కలసి తిన్న తర్వాత టేబుల్ శుభ్రం చేయడానికి
13. వైట్ బోర్డ్స్ తుడవడానికి
14. కళ్లజోడు తుడవడానికి - అది స్క్రాచెస్ ను కూడ తగ్గిస్తుంది.
15. మీ శిశువు కోసం ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్ చేయడం కోసం
16. డీవీడీ లైబ్రరీ మరియు పుస్తకాలను శుభ్రం చేయడానికి
17. కారులో ఉన్న ప్యూక్ ను శుభ్రం చేయడానికి
18. హై చైర్స్ శుభ్రం చేయడానికి వేగవంత మార్గం
19. యోగా మ్యాట్ శుభ్రం చేయడానికి
20. చీమలు మరియు క్రిములను చంపడానికి
21. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత లేదా ఆట స్థలానికి వెళ్లి వచ్చిన తర్వాత శుభ్రం చేసుకోవడం కోసం కారులో హ్యాండీగా ఉంచడానికి
వైప్స్ వల్ల ఉండే చాలా దగ్గరి ఉపయోగాలు ఇవి. వీటిని మీరు మరిన్ని సృజనాత్మక పనుల కోసం ఉపయోగిస్తారని మేము నమ్ముతున్నాము. మీరు వైప్స్ ఇంకా దేని కోసం ఉపయోగిస్తారో కామెంట్ ద్వారా తెలియజేయండి! దాంతో పాటు మీ శిశువు కోసం మీరు ఏ బేబీ వైప్స్ వాడుతున్నారో, ఎందుకు వాడుతున్నారో కామెంట్ల ద్వారా తెలియజేయండి.
TAGS :
baby wipes in telugu, uses of baby wipes in telugu, how to use baby wipes in telugu, 21 Every Day Uses of Baby Wipes We Bet You Had Never Thought of In English, 21 Every Day Uses of Baby Wipes We Bet You Had Never Thought of In Hindi, 21 Every Day Uses of Baby Wipes We Bet You Had Never Thought of In Tamil
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips
శిశువుల వెయిట్ చార్ట్ ఇదీ: పుట్టినప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు | Ideal Baby Weight Chart: Birth to 1 Year in Telugu
మహిళల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఏది సహాయపడుతుంది? | What Helps in Improving Women's Mental Health in Telugu
చిన్ననాటి రుగ్మతలు అనగానేమి? ఇవి ఎలా ఉంటాయి? వీటికి కారణాలు, చికిత్స ఏమిటి? | Childhood Disorders: Meaning, Symptoms & Treatment in Telugu
మెటర్నల్-ఫిటల్ మెడిసిన్ యొక్క ప్రాముఖ్యత? ప్రమాదకర గర్భాలకు ఈ టాబ్లెట్ ఎందుకు సూచించబడుతుంది |Importance of Maternal - Fetal Medicine in High Risk Pregnancies in Telugu
The Ultimate Guide to Consuming Turmeric Milk During Pregnancy
గర్భధారణ సమయంలో చెరకు రసం తీసుకోవడం: ప్రయోజనాలు, జాగ్రత్తలు | Sugarcane Juice in Pregnancy: Benefits & Precautions in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |