This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

Cloth Diapers: మీ బిడ్డను తడిగా మరియు దద్దుర్లు లేకుండా ఉంచడంలో క్లాత్ డైపర్ ఎంత సమర్థంగా ఉంటుంది?

Baby Care
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Jan 22, 2026
Cloth Diapers: మీ బిడ్డను తడిగా మరియు దద్దుర్లు లేకుండా ఉంచడంలో క్లాత్ డైపర్ ఎంత సమర్థంగా ఉంటుంది?
Likes1 Likes|
Read time4 min

మీరు క్లాత్ డైపర్‌లను మొదటిసారి ఉపయోగించడం గురించి ఆలోచిస్తున్నట్లయితే, అందుబాటులో ఉన్న విభిన్న ఉత్పత్తులు, స్టైల్స్ మరియు దృక్కోణాల మధ్య వెతుక్కోవడం/ సెలెక్ట్ చేస్కోవడం మీకు చాలా ఇబ్బందిగా అనిపించవచ్చు. డైపర్లు, కొత్తగా తల్లైన వారికి మరియు వారి శిశువులకు కోసమే తయారుచేయబడినవి అని నిరూపించబడినప్పటికీ, అవి అనేక ప్రతికూలతలతో వస్తాయి. డైపర్లను ఉపయోగించడంలో వచ్చే అతి సాధారణ ఇబ్బంది/ప్రతికూలత తడి మరియు దద్దుర్లు ఏర్పడటం. మనం ఇప్పుడు, డైపర్ దద్దుర్లు యొక్క అతి సాధారణ కారణాలలో కొన్నింటిని చూద్దాం.

తక్కువ పరిశుభ్రత (Poor Hygiene)

మీరు మీ బిడ్డకు డైపర్ మార్చిన ప్రతిసారీ శుభ్రం చేయడం చాలా అవసరం. క్లాత్ డైపర్‌ను తొడిగే ముందు, మలం లేనప్పుడు కూడా బిడ్డను తడి వైప్ తో తుడిచి, గాలికి ఆరబెట్టండి లేదా పొడిగా ఉంచండి. సరిగ్గా శుభ్రం చేయలేకపోవడం లేదా తక్కువ పరిశుభ్రత విధానాలు వలన, చాలా సందర్భాలలో మూత్రం మరియు మలం యొక్క అవశేషాలు అక్కడ మిగలడానికి కారణమవుతాయి. ఫలితంగా శిశువులలో దద్దుర్లు ఏర్పడతాయి. పట్టించుకోకపోయిన్నట్లైతే, పేలవమైన పరిశుభ్రత అలవాటు వల్ల శిశువులలో వైద్యం అవసరమైయ్యే కొన్ని వ్యాధులకు దారితీయవచ్చు.

వెట్ వైప్స్ ఉపయోగించడం (Wet Wipes)

శిశువులలో దద్దుర్లు రావడానికి చాలా సాధారణ కారణాలలో ఇదీ ఒకటి. అయినప్పటికీ ప్రజలు డైపర్‌లపై ఎక్కువ దృష్టి పెడతారు కానీ వైప్‌లను ఉపయోగించడంలో మాత్రం విఫలమవుతారు. డిస్పోజబుల్ (ఒకసారి మాత్రమే వాడి పడేసేవి) వైప్స్‌లో మీ శిశువు చర్మానికి సున్నితంగా ఉండే రసాయనాలు, సువాసనలు మరియు మాయిశ్చరైజ్‌లు భారీ మొత్తంలో ఉంటాయి.

డైపర్ మార్చడంలో ఆలస్యం (Delayed Diaper Change)

చాలామంది శిశువు చర్మం నుండి ఎక్కువసేపు తేమను దూరంగా ఉంచే డిస్పోజబుల్ డైపర్‌లను ఉపయోగిస్తారు. మీ శిశువును ఎక్కువసేపు తడిగా ఉంచడం లేదా తడిగా ఉన్న డైపర్‌లో ఉంచడం వల్ల దద్దుర్లు వస్తాయి. మీ పిల్లలకి, మీరు ప్రతి రెండు గంటలకొకసారి డైపర్లను మార్చాలి. మీరు క్లాత్ డైపర్‌లను తరచుగా మార్చవలసి ఉన్నప్పటికీ, అవి డిస్పోజబుల్ డైపర్‌ల కంటే మెరుగ్గా ఉంటాయి. ఎందుకో ఇప్పుడు చూద్దాం.

1. సులభమైన సంరక్షణ (Easy to Care the cloth diapers)

సాధారణంగా తల్లులు ఇంట్లో క్లాత్ డైపర్‌లను జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టం. అయినప్పటికీ, ఆధునిక క్లాత్ డైపర్‌లు వివిధ రకాలుగా మరియు పరిమాణాలలో వచ్చినందున వాటిని ఉపయోగించడం ఇప్పుడు సులభం. ఈరోజు మీరు చూసే చాలా క్లాత్ డైపర్‌లు సులువుగా ఫిట్ అవుతాయి మరియు ఉపయోగించడానికీ, కడగడానికీ సులభంగా ఉంటాయి.

2. తేమను వేగంగా తెలియజేస్తాయి (Gives Faster Sensation to Wetness)

పిల్లలలో క్లాత్ డైపర్‌లను ఉపయోగించడం వల్ల వేగంగా తేమను తెలియజేస్తాయి. నేడు క్లాత్ డైపర్‌లు సాధారణమైన వాటిలాగా పేలవమైన డిజైన్‌లలో లేవు. అంతేకాకుండా, అవి డిస్పోజబుల్ డైపర్లు కంటే తక్కువగా లీక్ అవుతాయి.

3. శిశువులలో దద్దుర్లు తగ్గిస్తాయి (Minimize Rashes in Babies)

1955 నుండి చూసినట్లయితే డిస్పోజబుల్ డైపర్‌ల వాడకం డైపర్ దద్దుర్లు 7% నుండి 78%కి పెరిగాయి. రసాయనాలు, అల్ట్రా-అబ్సర్బెంట్ జెల్స్ మరియు డిస్పోజబుల్ డైపర్‌లలో అమ్మోనియా ఏర్పడటం దద్దుర్లు ఏర్పడటానికి ముఖ్యమైన కారణాలు. మరోవైపు, క్లాత్ డైపర్లలో వేరే ఏ పదార్థాలు గానీ శోషక జెల్లు గానీ ఉండవు.

4. శుభ్రపరచడానికి సులభం (Easy to Clean)

తల్లిపాలు తాగే శిశువుల మలం నీటిలో కరుగగలిగేది. అయితే, క్లాత్ డైపర్లలో మలం యొక్క అవశేషాలు ఉంటాయి. అందువల్ల, వాటిని తరచుగా కడగాలి. మీ బిడ్డ ఇంకా శిశువుగా ఉన్నప్పుడు, మీరు వాషింగ్ మెషీన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

మీరు సహజంగా తయారు చేసిన క్లాత్ డైపర్ ఉత్పత్తులను ఉపయోగించండి. క్లాత్ డైపర్‌లు శిశువులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి, ఎందుకంటే వాటిలో ఎటువంటి రసాయనాలు ఉండవు. ఉపయోగించడం మరియు కడగడం సులభతరం చేస్తూ ఉతకగలిగే మరియు సర్దుబాటు చేయగల ఇన్‌సర్ట్‌లతో రీయూజబుల్ క్లాత్ డైపర్‌ల యొక్క ఖచ్చితమైన కలయిక కోసం మయిలో ఎసెన్షియల్స్ హ్యాపీ బమ్స్ కాంబోను చెక్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా, ఉత్తమమైన నాణ్యమైన ఉత్పత్తులను ఉపయోగించడానికి ప్రయత్నించండి మరియు మీ శిశువు యొక్క సున్నితమైన చర్మంపై అన్ని రకాల దద్దుర్లు నివారించడానికి నివారణ చర్యలను పాటించండి.

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.