hamburgerIcon

Orders

login

Profile

Profile
This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow

  • Pregnancy Complications arrow

  • ముత్యాల గర్భం (మోలార్ ప్రెగ్నెన్సీ) arrow

In this Article

    ముత్యాల గర్భం (మోలార్ ప్రెగ్నెన్సీ)

    Pregnancy Complications

    ముత్యాల గర్భం (మోలార్ ప్రెగ్నెన్సీ)

    3 November 2023 న నవీకరించబడింది

    శుక్రకణం అండంతో ఫలదీకరణం చెందినప్పుడు ఒక స్త్రీ గర్భవతి అవుతుంది. కొన్నిసార్లు ఈ దశలు కలగాపులగం అయిపోయి అసాధారణ ప్రెగ్నెన్సీకి దారితీయవచ్చు. మోలార్ ప్రెగ్నెన్సీ అరుదైన గర్భసంబంధ ట్రోఫోబ్లాస్టిక్ వ్యాధి. ఫలదీకరణం సమయంలో అండం, శుక్రకణం సరిగ్గా కలయిక చెందకుండా ఆరోగ్యకరమైన ప్లేసెంటా బదులుగా క్యాన్సర్ లేని కణితిని ఏర్పరుస్తాయి. అప్పుడు ఈ స్థితి వస్తుంది. ఈ కణితి పెరుగుతున్న పిండానికి అండనివ్వలేదు. అందుకని గర్భస్రావం జరిగిపోతుంది. దీన్ని హైడాతిడిఫార్మ్ మోల్ అని కూడా అంటారు. మామూలు మాటల్లో చెప్పాలంటే.. గర్భాశయంలో ఒక కణితి పెరిగి, ద్రవం నిండిన తిత్తిని (సిస్టు) ఏర్పరుస్తుంది.

    మోలార్ ప్రెగ్నెన్సీ యొక్క రకాలు

    మొదటిది పూర్తిస్థాయి మోలార్ ప్రెగ్నెన్సీ, మరొకటి పాక్షికమైన మోలార్ ప్రెగ్నెన్సీ.

    పూర్తిస్థాయి మోలార్ ప్రెగ్నెన్సీలో.. ప్లేసెంటా లేదా మావి యొక్క కణజాలం ఒక ద్రవం నిండిన సిస్టుని ఏర్పరుస్తుంది. ఈ కేసులో పిండం అనేదే ఉండదు. అదే పాక్షికమైన మోలార్ ప్రెగ్నెన్సీలో.. రెండు రకాల కణజాలాలు అంటే క్రమ పద్ధతిలోనివి అలాగే క్రమ పద్ధతిలో లేకుండా ఉన్నవి, రెండూ ప్లేసెంటా లేదా మావిలో కన్పిస్తాయి. ఈ కేసులో పిండం ఉండవచ్చు కానీ బతకదు. మోలార్ ప్రెగ్నెన్సీ ఒక అరుదైన క్యాన్సర్ రకానికి దారితీయవచ్చు. అందుకని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయడం అవసరం.

    ముత్యాల గర్భం (మోలార్ ప్రెగ్నెన్సీ) లక్షణాలు

    సాధారణంగా.. మొదట్లో మోలార్ ప్రెగ్నెన్సీ కూడా సాధారణ గర్భంలాగానే అన్పిస్తుంది. కానీ ఈ స్థితిలో అత్యంత సాధారణంగా కన్పించే లక్షణాలు ఇవి -

    • గర్భం యొక్క మొదటి 3-4 నెలలలో యోని నుండి ముదురు బ్రౌన్ లేదా ప్రకాశవంతమైన ఎర్రని రక్తం స్రవించబడుతుంది.
    • విపరీతమైన వికారం అలాగే వాంతులు
    • అధిక BP అలాగే గర్భవతి అయిన 20 వారాల ముందే ప్రొటీన్యురియా స్థితి కన్పించటం; ఈ స్థితిని ప్రీక్లాంప్సియా అని కూడా అంటారు.
    • అధిక HCG స్థాయిలు (హ్యూమన్ కోరియోనిక్ గొనాడోట్రోపిన్)
    • పెల్విక్ (కటి) ప్రాంతంలో ఒత్తిడి లేదా నొప్పి
    • అసాధారణంగా పొట్ట సైజు పెరిగిపోవటం
    • పిండం యొక్క గుండె చప్పుడు లేదా కదలిక లేకపోవటం
    • యోని నుండి కణాలు గుత్తుల ఆకారంలో లేదా ద్రాక్షపండ్ల రూపంలో ఉన్న సిస్టులు బయటకి స్రవించబడతాయి.
    • థైరాయిడ్ ఎక్కువగా పనిచేయటం లేదా హైపర్ థైరాయిడిజం

    మీకు ఇది కూడా నచ్చుతుంది: కెమికల్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి?

    మోలార్ ప్రెగ్నెన్సీ రావటానికి కారణాలు

    ఒక ఆరోగ్యకరమైన మనిషి కణంలో.. సాధారణంగా 23 క్రోమోజోముల జతలు ఉంటాయి. సాధారణ ఫలదీకరణంలో అయితే ఒక జతలో ఒక క్రోమోజోము తండ్రి నుండి మరొక క్రోమోజోము తల్లి నుండి వస్తాయి. ఒక పూర్తిస్థాయి మోలార్ ప్రెగ్నెన్సీలో.. ఒక అండంతో ఒకటి కన్నా ఎక్కువ శుక్రకణాలు ఫలదీకరణం చెందుతాయి. తండ్రి యొక్క క్రోమోజోములు నకలు కాబడతాయి. ఫలితంగా తల్లి యొక్క క్రోమోజోములు కన్పించకుండా పోతాయి.

    అదే పాక్షిక మోలార్ ప్రెగ్నెన్సీలో.. రెండు శుక్రకణాలు ఒక అండంతో కలుస్తాయి. ఫలితంగా పిండంలో తల్లి నుండి ఒక క్రోమోజోము వస్తుంది. కానీ తండ్రి నుండి రెండు క్రోమోజోములు వస్తాయి. అలా పిండంలో 45 క్రోమోజోములకి బదులుగా మొత్తం 69 క్రోమోజోములు ఉంటాయి.

    మోలార్ ప్రెగ్నెన్సీలో ప్రమాద కారకాలు

    ఈ ముత్యాల గర్భ స్థితి అభివృద్ధి చెందటానికి సాయపడే ప్రమాద కారకాలు కింద ఇవ్వబడ్డాయి: తల్లి యొక్క వయస్సు- 43 ఏళ్ళ కన్నా ఎక్కువ లేదా 15 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న తల్లులకి మోలార్ ప్రెగ్నెన్సీ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మోలార్ ప్రెగ్నెన్సీ యొక్క చరిత్ర- ఒకవేళ ఒక మహిళకి గతంలో మోలార్ ప్రెగ్నెన్సీ వచ్చిన చరిత్ర ఉంటే, ఆమెకి రెండవసారి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ రెండవసారి వచ్చే అవకాశం రేటు 1: 100 గా ఉంటుంది.

    మోలార్ ప్రెగ్నెన్సీని నిర్థారించటం

    ఒకవేళ డాక్టరు ముత్యాల గర్భమని అనుమానించినా లేదా గుర్తించినా, వారు ఒక రక్తపరీక్ష అలాగే అల్ట్రాసౌండు పరీక్షని చేయమని సూచిస్తారు.

    8 – 9 వారాల సమయంలో పూర్తిస్థాయి మోలార్ ప్రెగ్నెన్సీ స్థితిలో అల్ట్రాసౌండు చిత్రం ఈ కింది లక్షణాలని చూపించవచ్చు-

    • పిండం లేకపోవటం.
    • ఉమ్మనీరు లేకపోవటం
    • తిత్తుల (సిస్టుల) రూపంలో మందపాటి ప్లేసెంటా ఉండటం
    • అండాశయ సిస్టులు

    పాక్షిక మోలార్ ప్రెగ్నెన్సీ యొక్క అల్ట్రాసౌండ్ చిత్రంలో ఈ కింది లక్షణాలని పరిశీలించవచ్చు:

    • ఒక చిన్న, ఊహించని పిండం.
    • తక్కువ స్థాయిలో ఉమ్మనీరు
    • అసాధారణ ప్లేసెంటా

    పై ఫలితాలతో మోలార్ ప్రెగ్నెన్సీని నిర్థారించాక, మీ డాక్టరు అదనపు మెడికల్ స్థితుల గురించి పరీక్షిస్తారు. అవేంటంటే:

    • ప్రీక్లాంప్సియా
    • హైపర్ థైరాయిడిజం (రక్తంలో అధిక స్థాయిలో థైరాయిడ్ హార్మోన్)
    • రక్తహీనత

    చికిత్స

    • సాధారణంగా ముత్యాల గర్భం లేదా మోలార్ ప్రెగ్నెన్సీ నిలబడదు, గర్భస్రావం జరిగిపోతుంది.
    • ఒకవేళ దానంతట అది గర్భస్రావం ద్వారా పోకపోయినా, గర్భం తీసివేయటం ద్వారా తగ్గించే చికిత్స చేస్తారు.
    • ఈ ప్రక్రియ చేసే ముందు మిమ్మల్ని పడుకోబెట్టడానికి సాధారణ అనస్తీషియా ఇస్తారు.
    • కొన్నిసార్లు మోలార్ ప్రెగ్నెన్సీని తొలగించడానికి మందులు కూడా ఇచ్చి గర్భస్రావం అయ్యేలా చేస్తారు.

    ఫాలో అప్

    hCG హార్మోన్ స్థాయి సాధారణంగా ఉందని నిర్థారించుకోవటానికి క్రమం తప్పకుండా రక్తం ఇంకా మూత్ర పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఒకవేళ ఆ హార్మోన్ స్థాయి సాధారణానికి రాకపోతే.. మరింత చికిత్స అవసరపడుతుంది.

    సపోర్టు

    మోలార్ ప్రెగ్నెన్సీ లేదా ముత్యాల గర్భం తొలగించబడ్డాక శారీరకంగా అలాగే మానసికంగా కోలుకోవటానికి సమయం పడుతుంది. ఏ తల్లికైనా తన గర్భాన్ని కోల్పోవటం సవాలుగానే ఉంటుంది. మోలార్ ప్రెగ్నెన్సీ తర్వాత ప్రత్యేకించి శారీరకంగా అలాగే మానసికంగా కోలుకోవటానికి కొంతకాలం పడుతుంది. అందుకని కోలుకోవటానికి తగినంత సమయం ఇవ్వాలి. మీ భావోద్వేగాల గురించి మీ కుటుంబం, స్నేహితులతో పంచుకోవటం మీ దుఃఖాన్ని అధిగమించేలా చేస్తాయి. మీ భావోద్వేగాలని మేనేజ్ చేయటంలో ఇబ్బందిగా అన్పిస్తే, మీ డాక్టరుని లేదా కౌన్సెలర్‌ని సంప్రదించండి.

    మీ అపాయింట్మెంటుకి సిద్ధం అవటం

    మీరు ఒకవేళ గర్భవతిగా ఉండి, వికారం, వాంతులు తీవ్రంగా ఉండి, యోని నుండి రక్తం అలాగే ద్రాక్ష పండ్లలాంటి సిస్టులు బయటకి స్రవిస్తూ ఉంటే వెంటనే మా డాక్టరు వద్ద అపాయింట్మెంట్ బుక్ చేయడానికి మమ్మల్ని సంప్రదించండి. సమస్య మరీ సంక్లిష్టంగా మారకుండా నివారించటానికి ముందుగానే గుర్తించడం, దానికి చికిత్స చేయడం చాలా అవసరం. మీరు మైలోఫ్యామిలీలో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేదా నేరుగానే మమ్మల్ని సంప్రదించవచ్చు.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on TOI
    Mylo featured on inc42
    Mylo featured on Business Standard
    Mylo featured on YourStory
    Mylo featured on ANI
    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo
    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.