This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భవతి కడుపులోని శిశువు గుండె ఆలస్యంగా కొట్టుకోవడానికి కారణాలు

Pregnancy Journey
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: May 19, 2026
గర్భవతి కడుపులోని శిశువు గుండె ఆలస్యంగా కొట్టుకోవడానికి కారణాలు
Likes76 Likes|
Read time5 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • గర్భధారణ ఏడు వారాల్లోపు కడుపులోని శిశువు హృదయ స్పందన వినిపించకపోవచ్చు. ఏడు వారాల తర్వాత ట్రాన్స్‌వేజినల్ అల్ట్రాసౌండ్ ద్వారా గుండెచప్పుడు తెలుసుకోవచ్చు.
  • ప్రెగ్నెన్సీ తేదీల్లో తప్పులు, వంపు తిరిగిన గర్భాశయం, ఉమ్మనీరు అడ్డంకి, తల్లి అధిక బరువు వంటి కారణాల వల్ల గర్భస్థ శిశువు గుండె చప్పుడు ఆలస్యంగా గుర్తించబడవచ్చు.
  • హార్ట్‌బీట్ వినిపించకపోతే తల్లిదండ్రులు కంగారుపడకుండా, వైద్యుల సలహా మేరకు కొన్ని రోజుల తర్వాత మళ్లీ అల్ట్రాసౌండ్ లేదా డాప్లర్ టెస్ట్ చేయించుకోవాలి.
  • గర్భధారణ ప్రయాణాన్ని సురక్షితంగా మార్చేందుకు ఏం కావాలి? Explore our Baby Wellness Kit | Skincare Gift Set for Newborns.
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Rating3.9
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
Organic Aloe Vera (300 ml)
Organic Aloe Vera (300 ml)
Rating4.4

ఇల్లాలు గర్భవతి అయితే ఆ ఇల్లంతా ఆనందమే. ఆ భార్యాభర్తల ఆనందానికి అవధులు ఉండవు. అందమైన శిశువుకు జన్మనిచ్చేందుకు తల్లి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. గర్భవతిగా ఈ ప్రయాణంలో అత్యంత ఉత్తేజకరమైన సందర్బం ఏంటంటే.. కడుపులో పెరుగుతున్న బిడ్డ మొదటి గుండెచప్పుడు వినడం. కడుపులో పెరుగుతున్న బిడ్డ మొదటి గుండెచప్పుడు వినపడటం, గర్భవతిగా ఆ తల్లి ప్రయాణం సాఫీగా సాగుతుందనడానికి సంకేతం. కడుపులోని పిండం గుండెచప్పుడు వినిపించిందంటే.. గర్భస్రావ ప్రమాదం తగ్గినట్టు అర్థం చేసుకోవచ్చు. అయితే గర్భంలోని పిండంలో ఒక్కోసారి హృదయ స్పందన ఉండకపోవచ్చు లేదా గుండె చప్పుడు ఆలస్యంగా రావొచ్చు. ఇందుకు కొన్ని కారణాలుంటాయి. గర్భవతి కడుపులోని శిశువు హృదయ స్పందన ఆలస్యం కావడానికి గల కారణాలను ఇక్కడ తెలుసుకోండి.

గర్భవతిగా ఉన్నప్పుడు గుండె ఆలస్యంగా కొట్టుకోవడం

ఆరువారాలకు హృదయ స్పందన వినిపించకపోవడానికి పలు కారణాలు ఉంటాయి. తల్లిదండ్రులు అందుకు గల కారణాలు తెలుసుకొని, తమ ప్రెగ్నెన్సీ ప్రయాణం సాఫీగా సాగిపోయేలా సిద్ధం కావాలి. గర్భంలోని శిశువు హృదయ స్పందన ఆలస్యం కావడానికి కారణాలు ఇవే.

1. గర్భధారణ వయస్సు

గర్భవతి అయిన ఏడు వారాల లోపు కడుపులోని శిశువు హృదయ స్పందన వినిపించకపోవచ్చు. ఏడు వారాల తర్వాత ట్రాన్స్‌వేజినల్ అల్‌ట్రాసౌండ్ టెస్ట్ ద్వారా గుండెచప్పుడు వినొచ్చు. అబ్డామినల్ అల్ట్రాసౌండ్ విషయానికి వస్తే, హృదయ స్పందన సున్నితంగా ఉన్నందున మరింత సమయం పట్టొచ్చు.

2. వేర్వేరు రకాల అల్ట్రాసౌండ్స్

ఒకవేళ తల్లి 8 వారాల గర్భవతి అయి, బిడ్డ పెరుగుతున్నా, హృదయ స్పందన వినిపించకపోతే, ట్రాన్స్‌వేజినల్ అల్‌ట్రాసౌండ్ ద్వారా గుండెచప్పుడు తెలుసుకోవడం మంచిది. గర్భవతిగా ఉన్నప్పుడు ప్రారంభ సమయంలో, అబ్డామినల్ అల్‌ట్రాసౌండ్‌తో పోలిస్తే, ట్రాన్స్‌వేజినల్ అల్‌ట్రాసౌండ్ ద్వారా సులువుగా హృదయస్పందనను కనిపెట్టవచ్చు. 10 వారాల తర్వాత హ్యాండ్‌హెల్డ్ డాప్లర్ ద్వారా గుండెచప్పుడు వినొచ్చు.

3. తేదీల ఖచ్చితత్వం

ఏడువారాల గర్భం తర్వాత కూడా ట్రాన్స్‌వేజినల్ అల్ట్రాసౌండ్ ద్వారా గుండెచప్పుడు తెలుసుకోకపోతే, ప్రెగ్నెన్సీ తేదీల్లో ఏవైనా తప్పులు ఉండే అవకాశం ఉంది. గర్భం ప్రారంభ రోజుల్లో అండోత్సర్గంలో వ్యత్యాసాలు ఉండటం వల్ల ఈ పరిస్థితి రావొచ్చు. అందుకే అల్ట్రాసౌండ్‌లో హార్ట్‌బీట్ వినిపించకపోతే తల్లిదండ్రులు కంగారు పడకూడదు. ఓసారి వైద్యుల్ని సంప్రదించి, కొంతసమయం తర్వాత మళ్లీ అల్ట్రాసౌండ్ చేయించాలి.

4. వంపు తిరిగిన గర్భాశయం

పెల్విస్‌లో గర్భాశయం ఉన్న స్థితి కూడా, గర్భంలోని పిండం హృదయ స్పందనను గుర్తించడానికి కారణం అవుతుంది. ఈ పరిస్థితి సుమారు 20 శాతం మంది మహిళల్లో ఉంటుంది. ఇలాంటి మహిళల్లో, గర్భాశయం అబ్డామినల్ వాల్‌కు దూరంగా ఉంటుంది. అయితే కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు. రోజులు గడుస్తున్నకొద్దీ, గర్భాశయం విస్తరించి అబ్డామినల్ వాల్‌కు దగ్గరగా వస్తుంది. గర్భస్థ శిశువు గుండె కూడా పెరుగుతుంది. ఈ విధంగా శిశువు హృదయ స్పందన వినొచ్చు.

5. గర్భస్థ శిశువును గుర్తించడం

గర్భవతి అయిన మొదటి కొన్ని రోజుల వరకు పిండం చిన్నగా ఉంటుంది కాబట్టి గర్భస్థ శిశువును గుర్తించడం కష్టం కావొచ్చు. డాప్లర్‌ను జూమ్ చేసి బేబీ హార్ట్‌బీట్‌ను గుర్తించవచ్చు. డాప్లర్ సాయంతో శిశువు హృదయ స్పందన గుర్తించడానికి చాలా ఓపిక, అదృష్టం కావాలి. మొదటి ప్రయత్నంలో హృదయ స్పందన గుర్తించలేకపోతే, తల్లిదండ్రులు వైద్యుల సలహా మేరకు కొన్ని రోజుల తర్వాత మళ్లీ డాక్టర్‌ను కలవాలి.

6. ఉమ్మనీరు ద్వారా అడ్డంకి

ఉమ్మనీరు ద్వారా అడ్డంకి కలగడం కూడా గర్భస్థ శిశువు హృదయ స్పందనను గుర్తించలేకపోవడానికి మరో కారణంగా చెప్పొచ్చు. ఈ పరిస్థితి వల్ల వైద్యులు గర్భస్థ శిశువు గుండెచప్పుడును గుర్తించలేకపోవచ్చు. ఒకవేళ గర్భాశయం వెలుపలి గోడపై మాయ పెరుగుతున్నట్టైతే, డాప్లర్ ద్వారా రక్త ప్రసారాన్ని గుర్తించవచ్చు. కానీ గుండెచప్పుడు గుర్తించలేరు. రోజులు గడుస్తున్నకొద్దీ చప్పుడు పెరుగుతుంది. అయినా శిశువు హృదయ స్పందన బలహీనంగా ఉన్న కారణంగా డాప్లర్ ద్వారా గుర్తించడం కష్టం. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల తర్వాత హృదయ స్పందన చప్పుడు పెరగొచ్చు. డాప్లర్ ద్వారా హార్ట్ బీట్ గుర్తించవచ్చు.

7. అధిక బరువు

గర్భవతుల ఆరోగ్యం విషయానికి వస్తే, కొవ్వు పొర కూడా డాప్లర్ పనితీరుకు ఆటంకం కలిగించి, గర్భస్థ శిశువు హృదయ స్పందన తెలుసుకోలేకపోవడానికి కారణం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. అల్ట్రాసౌండ్ ద్వారా బొడ్డు దిగువ భాగంలో ట్రాన్స్‌డ్యూసర్ ఉపయోగించి బేబీ హార్ట్ బీట్ తెలుసుకోవచ్చు. ఒకవేళ అబ్డామినల్ అల్ట్రాసౌండ్ హార్ట్‌ బీట్‌ను గుర్తించలేకపోతే.. ట్రాన్స్‌వేజినల్ అల్ట్రాసౌండ్ ద్వారా శిశువు హృదయ స్పందన తెలుసుకోవచ్చు. ఇక 10 వారాల గర్భం తర్వాత హృదయ స్పందన లేకపోతే, శిశువు బతికే ఉందా అన్న అనుమానం తల్లిదండ్రుల్లో మొదలవుతుంది. తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా, వైద్యుల్ని కలిసి, వారి సూచనలు పాటించి, ప్రెగ్నెన్సీ విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలి.

ముగింపు

గర్భస్థ శిశువు హృదయ స్పందన ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అని వైద్యులతో మాట్లాడి తెలుసుకోవచ్చు. సాధారణంగా ఏడు వారాల గర్భం తర్వాత శిశువు హృదయ స్పందన తెలుసుకోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో 9 వారాల వరకు కూడా హృదయ స్పందన ఉండకపోవచ్చు. కానీ ప్రెగ్నెన్సీ విజయవంతం కావొచ్చు. ఇందుకు గర్భస్థ శిశువు హృదయ స్పందన ఆలస్యం కావడానికి పైన వివరించిన కారణాలు ఉండొచ్చు. తల్లిదండ్రులు కంగారుపడకుండా, తరచూ వైద్యుల్ని కలుస్తూ, వారి సలహాలు పాటించాలి.

గర్భధారణ ప్రయాణంలో తల్లుల నమ్మకమైన సహచరులు

ప్రతి హృదయ స్పందనను ఆనందంగా అనుభవించేందుకు, మీ ప్రెగ్నెన్సీ ప్రయాణానికి అవసరమైన పోషణ మరియు సంరక్షణ ఉత్పత్తులు ఇక్కడ ఉన్నాయి.

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

418 Moms bought
₹999₹154535% Off
Rating
3.9
()
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2005 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
Organic Aloe Vera (300 ml)

Organic Aloe Vera (300 ml)

Nurtures Skin & Hair | Reduces Suntan | Soothes Burns | Enhances Hair Resilience

4133 Moms bought
₹289₹32912% Off
Rating
4.4
(45)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.