Updated on 3 November 2023
కెమికల్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది ఒక పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్, ఇది క్లినికల్ ప్రెగ్నెన్సీకి విరుద్ధంగా కెమికల్స్‌ని ఉపయోగిస్తుంది. దీనిలో డాక్టర్ అల్ట్రాసౌండ్ ద్వారా మీ శిశువు ఎదుగుదలను చూడవచ్చు. గతంలోని మహిళలు తమకు కెమికల్ ప్రెగ్నెన్సీ ఉందని తెలుసుకునే అవకాశం తక్కువగా ఉండేది. ఆధునిక ప్రెగ్రెన్సీ టెస్టులు చాలా సున్నితమైనవి. అవి తప్పిన పీరియడ్‌కు మూడు లేదా నాలుగు రోజుల ముందు ప్రెగ్నెన్సీని గుర్తిస్తాయి. అన్ని ప్రెగ్నెన్సీల్లో సగానికి పైగా గర్భస్రావం సంభవిస్తుంటుంది. వీటిలో ఎక్కువ భాగం కెమికల్ ప్రెగ్నెన్సీలు. ఏదేమైనా మహిళలకు ఉన్న కెమికల్ ప్రెగ్నెన్సీల నిజమైన సంఖ్యను తెలుసుకోవడం కష్టం. ఈ ప్రెగ్నెన్సీల్లో చాలా వరకు స్త్రీకి లక్షణాలు కనిపించకముందే లేదా ఆమె రుతుస్రావం(పీరియడ్) అవ్వకముందే అవి ముగిసిపోతాయి. కెమికల్ ప్రెగ్నెన్సీ ఉన్నా చాలా మంది మహిళలకు దాని గురించి తెలియదు. ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలలో గర్భస్రావం బాధాకరంగా ఉంటుంది. ఇది మీకు సంభవిస్తే కోలుకోవడానికి, నష్టాన్ని ఎదుర్కోవటానికి అవసరమైన సహాయాన్ని పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి.
ఒక కెమికల్ ప్రెగ్నెన్సీలో పిండం HCG (హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్)ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పెరగడానికి అవసరమైన హార్మోన్. ప్రెగ్నెన్సీని గుర్తించడానికి వైద్యులు ఈ హార్మోన్‌ను ప్రెగ్నెన్సీ టెస్టులను ఉపయోగిస్తారు. పిండం ఎదుగుదల ఆగిపోయినప్పుడు HCGని ఉత్పత్తి చేయడం ఆగిపోతుంది. కెమికల్ ప్రెగ్నెన్సీ సమయంలో పిండం ఎదుగుదల ఎందుకు ఆగిపోతుందో ఎవరికీ అర్థం కాదు. జన్యుపర లేదా డీఎన్‌ఏ సమస్య కారణంగా పిండం అభివృద్ధి చెందడం ఆగిపోతుంది. పిండం గర్భాశయ లైనింగ్లో ఇంప్లాంట్(అభివృద్ధి) చెందకపోవచ్చు. దీని వల్ల మీ HCG స్థాయిలు పడిపోతాయి. ప్రెగ్నెన్సీ టెస్టుల్లో నెగిటివ్ చూపిస్తుంది.
ఒకవేళ మీకు కెమికల్ ప్రెగ్నెన్సీ ఉన్నట్లయితే.. మీ పీరియడ్ సాధారణంగా ప్రెగ్నెన్సీ కోల్పోయిన 4 నుంచి 6 వారాల తరువాత ప్రారంభమవుతుంది.
కెమికల్ ప్రెగ్నెన్సీ అంటే మీరు ఎప్పటికీ గర్భం ధరించలేరని లేదా ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వలేరని అర్థం కాదు. గర్భస్రావానికి చికిత్స లేనప్పటికీ, గర్భం దాల్చడంలో మీకు సహాయపడే మార్గాలు ఉన్నాయి. మీకు అనేక కెమికల్ ప్రెగ్నెన్సీలు ఉంటే, సమస్యను గుర్తించేందుకు మీ డాక్టర్ పరీక్షలు చేయవచ్చు. మీ డాక్టర్ అంతర్లీనంగా ఉన్న సమస్యను నయం చేయగలిగితే, మీరు మరొక కెమికల్ ప్రెగ్నెన్సీ కలగకుండా నివారించవచ్చు. చికిత్స చేయని ఇన్ఫెక్షన్ వల్ల గర్భస్రావం జరిగితే.. ఉదాహరణకు ఇన్ఫెక్షన్ను తొలగించడానికి యాంటీ బయోటిక్స్ తీసుకోవడం వల్ల గర్భం ధరించే, ఆరోగ్యకరమైన డెలివరీ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. గర్భాశయ సమస్యల వల్ల నష్టం సంభవిస్తే.. ఆరోగ్యకరమైన గర్భధారణ కోసం మీకు సర్జరీ అవసరం కావచ్చు. శరీరంలో ప్రెగ్నెన్సీ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపించే ఏకైక పరిస్థితి కెమికల్ ప్రెగ్నెన్సీ మాత్రమే కాదని మీరు తెలుసుకోవాలి. అండం గర్భాశయం వెలుపల అమర్చినప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా అధిక HCG స్థాయిలకు దారితీస్తుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఒక కెమికల్ ప్రెగ్నెన్సీ లాగా కనిపించవచ్చు. కాబట్టి మీ డాక్టర్ దాని కోసం టెస్టులు చేయించమని అడగవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ - లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ & దానిని ఎలా గుర్తించాలి?
గర్భం దాల్చిన పది నుంచి పద్నాలుగు రోజుల తర్వాత, రాబోయే పీరియడ్ సమయంలో తేలికపాటి యోని రక్తస్రావం జరగవచ్చు. గర్భాశయ గోడలో ఫలదీకరణ అండం ఇంప్లాంటేషన్ రక్తస్రావానికి కారణమవుతుంది.
గర్భస్రావం మీకు, మీ పార్ట్నర్కి కష్టంగా ఉండవచ్చు. మీరు చాలా కాలం నుంచి ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించినట్లయితే లేదా IVF చేయించుకున్నట్లయితే ప్రారంభంలోనే ప్రెగ్నెన్సీ నష్టపోవడం తీవ్రంగా బాధ కల్గించవచ్చు. ఈ సమయంలో ఎమోషన్ సపోర్ట్ ఎంతో అవసరం. ఇది జరిగిన తరువాత చాలా రోజులపాటు మీకు తిమ్మిరి మరియు రక్తస్రావం ఉండవచ్చు. మీ భావోద్వేగాలు మామూలు స్థితికి రావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. స్నేహితులు, కుటు౦బ సభ్యులు, అలాగే మీ ఆధ్యాత్మిక సలహాదారు, ఈ సమయంలో మీకు సహాయం చేయవచ్చు. నష్టం మిమ్మల్ని మరీ కుంగదీస్తే మీరు డాక్టర్ని సంప్రదించండి. నష్టం నుంచి కోలుకోవడానికి మీకు మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం అవసరం కావచ్చు.
IVF, ఇతర సంతానోత్పత్తి చికిత్సల తరువాత కెమికల్ ప్రెగ్నెన్సీ సాధారణం. వీర్యం IVFతో అండాన్ని ఫలదీకరణం చేస్తుంది. ఫెర్టిలిటీ క్లినిక్ మీ పిండాన్ని ఇంప్లాంట్ చేస్తుంది. పిండం ఇంప్లాంట్ తరువాత HCGని ఉత్పత్తి చేస్తుంది. ఇది పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్‌ని జనరేట్ చేస్తుంది. కానీ పిండం పెరగదు. ప్రతి 4 IVF ప్రెగ్నెన్సీల్లో ఒకటి కెమికల్ ప్రెగ్నెన్సీ. IVF ప్రక్రియ జరిగిన 2 వారాల తరువాత డాక్టర్లు ప్రెగ్నెన్సీ టెస్టులు చేయడం వల్ల ఈ అధిక సంఖ్యకు కారణంగా ఉండవచ్చు.
చాలా మంది ప్రారంభ ప్రెగ్నెన్సీ కోల్పోయిన తర్వాత వెంటనే మరొక ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తుంటారు. కెమికల్ ప్రెగ్నెన్సీ అయ్యాక రెండు వారాల తరువాత మీరు అండోత్సర్గము చేయవచ్చు. ప్రెగ్నెంట్ కావచ్చు.
కెమికల్ ప్రెగ్నెన్సీలు 50-75% నష్టాలను కలిగిస్తాయి. అయినప్పటికీ అవి వంధ్యత్వాన్ని సూచించవు. చాలా మంది డాక్టర్లు కెమికల్ ప్రెగ్నెన్సీలను పాజిటివ్ ఇండికేటర్లుగా చూస్తారు. భవిష్యత్తులో మీరు గర్భవతి కావచ్చనే సానుకూల సూచికలుగా చూస్తారు. తప్పుడు పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎల్లప్పుడూ కెమికల్ ప్రెగ్నెన్సీని సూచించదని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. అనేక కారణాల వల్ల తప్పుడు పాజిటివ్ రిపోర్టులు వస్తుంటాయి. కెమికల్ ప్రెగ్నెన్సీలు క్రోమోజోమ్ అసాధారణతలు లేదా విఫలమైన IVF నుంచి ఉద్భవిస్తాయి. పని చేయడం, వ్యాయామం చేయడం, లైంగిక సంపర్కం చేయడం లేదా గర్భనిరోధకాన్ని ఉపయోగించడం ప్రెగ్నెన్సీ లాస్‌ని ప్రేరేపించదు. మీరు అడ్వాన్సుడ్ మెటర్నల్ ఏజ్(సుమారు 35ఏళ్లు దాటినవారు)లో ఉంటే.. థైరాయిడ్ వ్యాధి కలిగి ఉంటే.. లేదా గడ్డకట్టే రుగ్మత(క్లాటింగ్ డిజార్డర్) ఉంటే.. మీకు ముందస్తు గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది.
ఈ పోస్ట్ కెమికల్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి? దానికి కారణమేమిటి? ఇతర సంబంధిత సమాచారాన్ని కవర్ చేస్తుంది. కెమికల్ ప్రెగ్నెన్సీ అంటే మీ శరీరం హెల్దీ ప్రెగ్నెన్సీని కలిగి ఉండదని కాదు. ముందస్తు గర్భస్రావానికి గల కారణాలను మీరు తెలుసుకున్నట్లయితే సరైన చికిత్సను పొందవచ్చు. మీ డాక్టర్ని సంప్రదించండి. మీ ఆప్షన్లను పరిశీలించండి. మీ డాక్టర్ కౌన్సిలింగ్ లేదా సపోర్ట్ గ్రూప్స్‌ని రెకమండ్ చేయవచ్చు. గర్భస్రావం తరువాత మీకు భావోద్వేగాల పరంగా సహాయం అవసరమైతే ఇవి సహాయపడతాయి.
Chemical pregnancy in telugu, Meaning of chemical pregnancy in telugu, difference between pregnancy and chemical pregnancy in telugu, symptoms of chemical pregnancy in telugu, treatment for chemical pregnancy in telugu.
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips
গর্ভাবস্থায় আলুবোখরা: উপকারিতা ও ঝুঁকি | Prunes During Pregnancy: Benefits & Risks in Bengali
গর্ভাবস্থায় হিং | ঝুঁকি, সুবিধা এবং অন্যান্য চিকিৎসা | Hing During Pregnancy | Risks, Benefits & Other Treatments in Bengali
স্তনের উপর সাদা দাগ: লক্ষণ, কারণ এবং চিকিৎসা | White Spots on Nipple: Causes, Symptoms, and Treatments in Bengali
গর্ভাবস্থায় পোহা: উপকারিতা, ধরণ এবং রেসিপি | Poha During Pregnancy: Benefits, Types & Recipes in Bengali
গর্ভাবস্থায় মাছ: উপকারিতা এবং ঝুঁকি | Fish In Pregnancy: Benefits and Risks in Bengali
গর্ভাবস্থায় রেড ওয়াইন: পার্শ্ব প্রতিক্রিয়া এবং নির্দেশিকা | Red Wine During Pregnancy: Side Effects & Guidelines in Bengali
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |