This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

గర్భధారణలో స్టార్ ఫ్రూట్ తినవచ్చా? దీని వల్ల ప్రయోజనాలు ఏమిటి? | Star Fruit Benefits During Pregnancy in Telugu

Written by - Sarada AyyalaLast updated: May 29, 2026
గర్భధారణలో స్టార్ ఫ్రూట్ తినవచ్చా? దీని వల్ల ప్రయోజనాలు ఏమిటి? | Star Fruit Benefits During Pregnancy in Telugu
Read time7 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • స్టార్ ఫ్రూట్ (కారాంబోలా) విటమిన్లు, ఖనిజాలు, ఫోలిక్ యాసిడ్ మరియు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంది, ఇవి గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.
  • గర్భధారణలో స్టార్ ఫ్రూట్ తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు రక్తపోటు సమతుల్యంగా ఉంటుంది.
  • అయితే, స్టార్ ఫ్రూట్‌లో అధిక ఆక్సలేట్ ఉన్నందున, కిడ్నీ సమస్యలు లేదా ప్రిస్క్రిప్షన్ మందులు తీసుకునేవారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి.
  • గర్భధారణలో పోషకాహారానికి ఏది ఉత్తమం? Explore our Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each.
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
Rating4.3
Organic Aloe Vera (300 ml)
Organic Aloe Vera (300 ml)
Rating4.4
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Rating4.9

మంచి ప్రజాదరణ పొందిన స్టార్‌ఫ్రూట్, అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, గర్భధారణలో స్టార్‌ఫ్రూట్ తినడం సురక్షితమేనా అనే సందేహం ఇప్పటికీ ఉంది. ఈ వ్యాసం ప్రత్యేకంగా ఈ సందేహానికి సమాధానం ఇవ్వడానికి ఉద్దేశించబడింది. కానీ ప్రారంభించే ముందు, గుర్తుంచుకోవలసిన అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, గర్భవతుల ఆహారంలో ఏదైనా కొత్త పదార్థాలను చేర్చుకొనే ముందు వైద్యుని తప్పనిసరిగా సంప్రదించాలి. అంతేకాక, గర్భవతులు సరైన ఆహారాన్ని అందుకుంటున్నారని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. గర్భధారణలో స్టార్‌ఫ్రూట్ తినడం వల్ల కలిగే కొన్ని సాధారణ ఆరోగ్య ప్రయోజనాలు మరియు నష్టాలను చూద్దాం.

స్టార్ ఫ్రూట్ అంటే ఏమిటి? (What is Star fruit in Telugu)

స్టార్ ఫ్రూట్ అనేది ఐదు కోణాలు కలిగి, మైనపు పసుపు-ఆకుపచ్చని రంగు పండు, దీనిని కారాంబోలా అని కూడా అంటారు. అవెర్రోవా కరంబోలా అని పిలవబడే చక్కని ఫలాలని ఇచ్చే ఈ చెట్టు శ్రీలంకకు చెందినది. స్టార్ ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు మరియు ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. స్టార్‌ఫ్రూట్‌లో విటమిన్‌లు, కార్బోహైడ్రేట్‌లు, కెరోటినాయిడ్ సమ్మేళనాలు, సేంద్రీయ ఆమ్లాలు, ఖనిజాలు మరియు ఇతర పదార్ధాలతో సహా చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి, ఇవి ప్రత్యేకంగా ఆరోగ్యానికి దోహదపడతాయి, అంతేకాక ఈ స్టార్‌ఫ్రూట్‌లు గర్భధారణలో మంచిని చేస్తాయి. దాని పోషకాహార జాబితాలో విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు మరియు సేంద్రీయ ఆమ్లాలను కలిగి ఉంది, ఇవన్నీ ఆరోగ్యకరమైన గర్భధారణకు ఇంకా సులువైన ప్రసవానికి ఎంతో కీలకమైనవి. గర్భధారణలో స్టార్ ఫ్రూట్ ప్రయోజనాలు మరియు దానిలోని పోషకాహార జాబితా గురించి మరింత తెలుసుకోవడానికి ఇది చదవడం కొనసాగించండి.

తల్లి కాబోయే వారు స్టార్ ఫ్రూట్ తీసుకోవడం సురక్షితమేనా? (Is It safe to consume star fruit while expecting in Telugu)

గర్భధారణలో స్టార్‌ఫ్రూట్ తీసుకోవడం సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. పోషక విలువలు ఎక్కువగా ఉన్నందున, దీనిని కాబోయే తల్లి ఆహారంలో చేర్చవచ్చు. ఈ పండులోని ఖనిజాలు, విటమిన్లు, ఫోలిక్ యాసిడ్ మరియు ఇతర పోషకాలు గర్భధారణ సమయంలో వారికి అవసరమైన శక్తిని అందిస్తాయి. గర్భవతిగా ఉన్నప్పుడు, తాజా స్టార్ ఫ్రూట్ రసం తాగడం వల్ల గొంతు మరియు నోటి ఇన్ఫెక్షన్‌లను ఇది సమర్థవంతంగా నివారించి నయం చేస్తుంది. ఈ పండు అనేక ఇతర ఆరోగ్య సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంది. స్టార్ ఫ్రూట్‌లో ఆక్సలేట్ సారం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, కిడ్నీ వ్యాధి చరిత్ర కలిగినవారు, వీటిని తీసుకోకూడదు ఇంకా వీటిని తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో మునగ: ప్రయోజనాలు & సైడ్ ఎఫెక్ట్స్

గర్భధారణ సమయంలో స్టార్‌ఫ్రూట్ ప్రయోజనాలు (Star fruit Benefits During Pregnancy in Telugu)

గర్భిణీ స్త్రీలు తియ్యగా-పుల్లగా చవులూరించే రుచి కోసం కోరుకునే ఆహారాలలో ఈ స్టార్‌ఫ్రూట్ ఒకటి. ఈ విలక్షణ పండులోని ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిద్దాం ఇంకా స్టార్‌ఫ్రూట్ గర్భధారణకు ఎందుకు మంచిదో తెలుసుకుందాం:

1. జీర్ణ సంబంధ రుగ్మతలను నయం చేస్తుంది (Digestive disorders are treated)

చాలా మంది గర్భవతులకు గర్భదారణలో మలబద్ధకం ఒక సాధారణ సమస్యగా మారుతుంది. స్టార్ ఫ్రూట్ తినడం వల్ల మలబద్ధకం ఇంకా ఇతర జీర్ణ సమస్యలు నివారించబడుతాయి. ఈ పండు ఆరోగ్యకరమైనదే కాక డయేరియా నివారణకు సహాయపడుతుంది. అయితే, జీర్ణ సమస్యలను నయం చేసుకొనేందుకు స్టార్ ఫ్రూట్ తీసుకొనే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

2. రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది (Improves elevated cholesterol levels)

స్టార్ ఫ్రూట్‌ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అంతేకాక, ఇది శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిల వల్ల రాగల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.

3. ఆరోగ్యకరమైన శిశువు ఎదుగుదలకు ఊతమిస్తుంది (Encourages the baby's healthy development)

విటమిన్లు, కార్బోహైడ్రేట్లు మరియు ఖనిజాలను అందించే మంచి వనరు ఈ స్టార్‌ఫ్రూట్, ఇంకా ఈ పోషకాలన్నీ గర్భధారణ సమయంలో శిశువు ఆరోగ్యకరంగా ఎదిగేందుకు తోడ్పడతాయి.

4. రోగనిరోధక శక్తిని పెంచుతుంది (Increases immunity)

ప్రోటీన్, విటమిన్ సి మరియు కాల్షియం అన్నీ స్టార్ ఫ్రూట్‌లో ఉంటాయి ఇంకా ఇవన్నీ కలిసి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి, తద్వారా ఇది వైరస్ ఇంకా బ్యాక్టీరియాతో పోరాడుతుంది మరియు పరిసరాల మార్పు వల్ల తలెత్తే వ్యాధుల నుండి పిల్లలను కాపాడుతుంది.

5. రక్తపోటును సమతుల్యపరుస్తుంది (Stabilizes blood pressure)

గర్భిణీ స్త్రీలలో రక్తపోటు అసాధారణతలు కలగడమనేది వాస్తవం, స్టార్ ఫ్రూట్‌లో అధిక స్థాయిలో పొటాషియం ఉంటుంది, ఇది పెరిగిన రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అందుకే, గర్భవతులు స్టార్ ఫ్రూట్ తీసుకోవాలని వైద్యులిచ్చే సలాహాకీ ఇది ఒక ప్రధాన కారణం.

6. యాంటీఆక్సిడెంట్ల మూలం (A source of antioxidants)

యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి. అంతేకాక, యవ్వనభరిత రూపాన్ని అలాగే ఉంచేందుకు దోహదపడతాయి. స్టార్ ఫ్రూట్‌లోని ఎపికాటెచిన్, గాల్లిక్ యాసిడ్ ఇంకా క్వెర్సెటిన్ వంటి అదనపు పదార్థాలు దానిని మరింత ఆరోగ్యవంతమైన ఫలంగా చేస్తాయి. ఇటువంటి పదార్థాలు అనేక రకాల సానుకూల ఆరోగ్య ప్రభావాలతో నిండిన శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు. స్టార్‌ఫ్రూట్ మొక్కల సమ్మేళనాలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి ఇంకా ఇవి ఎలుకలలో కొవ్వు కాలేయ వ్యాధిని ప్రమాదాన్నితగ్గించే లక్షణాలను ప్రదర్శించాయి. అంతేకాక, కాలేయ క్యాన్సర్ నుండి ఎలుకలను రక్షించే దాని సామర్థ్యంపై పరిశోధనలు చేస్తున్నారు.

స్టార్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి? (What are Risks of Eating Star Fruit in Telugu)

స్టార్ ఫ్రూట్‌లోని అధిక ఆక్సలేట్ సారం కారణంగా, కొంతమంది వీటివల్ల ప్రతికూల ప్రభావాలను పొందవచ్చు. అందువల్ల, కిడ్నీ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా స్టార్ ఫ్రూట్ తినడం ఇంకా దాని రసాన్ని తాగడం చేయకూడదు లేదా దానిని తీసుకునే ముందు వైద్య సలహాను తీసుకోవాలి. ఇప్పటికే మూత్రపిండ సమస్యలు ఉన్నవారు స్టార్ ఫ్రూట్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల స్టార్ ఫ్రూట్ టాక్సిసిటీతో పాటు అది మూత్రపిండ వైకల్యానికి దారి తీయవచ్చు, దీని ఫలితంగా మానసిక అలజడి, మూర్ఛలు ఇంకా మరణం వంటి నరాల సంబంధిత సమస్యలు కూడా దాపురిస్తాయి. ప్రిస్క్రిప్షన్ మందులు తీసుకునే వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షపండు వలె, స్టార్ ఫ్రూట్ కూడా శరీరం మందులను శోషించుకొనే ఇంకా వినియోగించుకొనే ప్రక్రియని ప్రభావితం చేస్తుంది. దీని సారాంశం ఏమిటంటే, స్టార్ ఫ్రూట్ రుచికరమైనది, అంతేకాక గర్భధారణలో స్టార్ ఫ్రూట్ ప్రయోజనాలు అపారమైనవి. ఇందులో లభించే కేలరీలు తక్కువైనా, ఇది యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ మరియు విటమిన్ సి అందించే అద్భుత వనరు. ఈ పండును తినే ముందు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు లేదా ప్రిస్క్రిప్షన్ మందులు తీసుకునే వారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. కానీ చాలా మందికి, స్టార్ ఫ్రూట్ వారి ఆహారంలో చేర్చుకొనే రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన ఫలంగా అలలారుతోంది.

Reference
1. Lakmal K, Yasawardene P, Jayarajah U, Seneviratne SL. (2021). Nutritional and medicinal properties of Star fruit (Averrhoa carambola): A review. Food Sci Nutr.

Tags

What is star fruit in Telugu, Is it safe to eat star fruit during pregnancy in Telugu, Benefits of eating star fruit in Telugu, What are the risks of eating start fruit during pregnancy in Telugu, Star fruit during pregnancy in English, Star fruit during pregnancy in Hindi, Star fruit during pregnancy in Tamil,Star fruit during pregnancy in Bengali

గర్భిణీ తల్లుల ఆరోగ్యానికి విశ్వసనీయ తోడు

మీ గర్భధారణ ప్రయాణంలో సరైన పోషకాహారం మరియు ఆరోగ్యకరమైన శిశువు ఎదుగుదలకు తోడ్పడే ఉత్పత్తులు ఇక్కడ ఉన్నాయి.

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2005 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest

3701 Moms bought
₹499₹64923% Off
Rating
4.3
(88)
Organic Aloe Vera (300 ml)

Organic Aloe Vera (300 ml)

Nurtures Skin & Hair | Reduces Suntan | Soothes Burns | Enhances Hair Resilience

4133 Moms bought
₹289₹32912% Off
Rating
4.4
(45)
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress

531 Moms bought
₹917₹129829% Off
Rating
4.9
(50)

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.