hamburgerIcon

Orders

login

Profile

Profile
Skin Care
Skin Brightening
Anti Ageing
Skin Hydration
Acne and Blemishes
Dry and Dull Skin
Dark Circles
Skin Care Super Saver Combos
Hair Care
Hairfall
Dry and Damaged Hair
Hair Growth
Super Saver Combos
Preg & Moms
Boost Breast Milk Supply
Breast Pump
Fertility
Stretch Marks Care
Maternity Wear
Maternity Gear
Baby Care
Diapers & WipesBaby DiapersCloth DiapersBest Baby Wet Wipes in IndiaSuper Saver Combos
Baby WellnessDiaper Rash Mosquito Repellent Anti-ColicSuper Saver Combo
Baby CareSkinHairBath & BodySuper Saver Combos
Feeding & LactationFeeding BottleBoost Breast Milk SupplySipperBreast PumpTeethers & NibblersGrooved NippleNursing PadsSuper Saver Combos
Baby ClothingBaby Detergent & Cleanser in IndiaBaby TowelCap, Mittens & BootiesSocksWrappersWinter Clothing
Baby GearCarriersStrollersDiaper BagBathtubs and Potty Seat Carry NestDry SheetBaby Pillow
Diapers
Baby Diapers
Cloth Diapers
Best Baby Wet Wipes in India
Super Saver Combos
More
Bath & BodyBody MoistureBrighteningTan Removal
FertilityFertility For Her
HygieneUTI and Infection
WeightWeight ManagementDigestive HealthSuper Saver Combos
Daily WellnessDigestive Health
This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow

  • Care for Baby arrow

  • 9 నెలల శిశువు ఫుడ్ చార్ట్/మీల్ ప్లాన్ - వారం 1 (9 Month Old Baby Food Chart/Meal Plan – Week 1 in Telugu) arrow

In this Article

    9 నెలల శిశువు ఫుడ్ చార్ట్/మీల్ ప్లాన్ - వారం 1 (9 Month Old Baby Food Chart/Meal Plan – Week 1 in Telugu)

    Care for Baby

    9 నెలల శిశువు ఫుడ్ చార్ట్/మీల్ ప్లాన్ - వారం 1 (9 Month Old Baby Food Chart/Meal Plan – Week 1 in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    నిజానికి మీ చిన్న శిశువు కోసం ఆహారాన్ని నిర్ణయించే విషయానికి వస్తే కాస్త ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుందనడంలో సందేహం లేదు. మీరు మీ చిన్నారిని చాలా వాటి నుండి దూరంగా ఉంచాలనుకోవడం చాలా కష్టంగా మారుతుంది. 9 నెలల వయస్సు వచ్చేసరికి, మీ బిడ్డ తల్లిపాలు లేదా డబ్బా పాలతో పాటుగా ఘన రూపంలో ఆహారాన్ని కూడా తినవచ్చు.

    ఈ ఆర్టికల్ చదవడం ద్వారా, మీరు మీ 9 నెలల శిశువు యొక్క డైట్ ప్లాన్ కు కొన్ని ఉత్తమ ఘన ఆహారాలను యాడ్ చేయవచ్చు. అంతేకాకుండా, చేర్చిన ఆహారాల నుండి మీ బిడ్డ అన్ని ప్రయోజనకరమైన పోషకాలను కూడా పొందడం ఖాయం! ఇబ్బందిపడకుండా ఉండటం కోసం మీ బిడ్డ యొక్క ఆహారం మృదువుగా ఉండేలా చూసుకోండి.

    మీ బిడ్డ ఆకలిని విశ్లేషించడం (Analyzing Your Baby’s Appetite in Telug8)

    మీ బిడ్డ ఆకలి దాదాపు ప్రతిరోజూ మారుతుందని మీరు గ్రహించవచ్చు. ఇంకా మీ బిడ్డ తన పోషణలో ఎక్కువ భాగాన్ని మీ రొమ్ము పాలు లేదా డబ్బా పాల నుండి పొందేలా చూసుకోవాలి. ఆహారంతో పాటు మీ బిడ్డకు నీటిని కూడా అందించడాన్ని లెక్కలోకి తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు హైడ్రేటెడ్ గా ఉండేలా మీ బిడ్డను ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇది మీ బిడ్డ యొక్క జీర్ణక్రియ ప్రక్రియలో కూడా సహాయపడుతుంది.

    మీ బిడ్డకు మీరు తినిపించే ఆహారం తగిన సైజులో ఉందని చూసుకోవడం కూడా మీకు చాలా అవసరం. మీ బిడ్డ ఇంకా నమలడం మరియు మింగడం ఎలాగో నేర్చుకుంటున్నందున, ఈ సమయంలో ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఆహారాన్ని సాధ్యమైనంత మృదువుగా చేయడానికి ప్రయత్నించవచ్చు లేదా దానిని ప్యూరీగా మార్చవచ్చు. అలా కాకుండా మీరు ఆహారాన్ని చిన్న సైజుల్లో లేదా పట్టీలుగా కూడా కత్తిరించవచ్చు. తద్వారా మీ బిడ్డకు మింగడం సులభం అవుతుంది. అందువల్ల CPRతో కూడిన బేబీ సేఫ్టీ కోర్సును నేర్చుకోవడం ఈ దశలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

    మీ బిడ్డ ప్రతిరోజు సుమారు 7 ఔన్సుల నీటిని తాగాలని సూచిస్తున్నాము . మళ్లీ ఇతర పానీయాల విషయానికి వస్తే మీరు తల్లి పాలు, నీరు లేదా డబ్బా పాలను పట్టించాలి. ఈ దశలో వీలైనంత వరకు తియ్యటి పానీయాలను దూరంగా ఉంచడానికి ప్రయత్నించండి. మీ బిడ్డకు దాదాపు ఒక సంవత్సరం వయస్సు ఉన్నప్పుడు మీరు ఆవు పాలను పరిచయం చేయవచ్చు. భోజన సమయాల్లో మరియు స్నాక్స్ లాగా మీ బిడ్డకు మీరు ఏమి ఇవ్వవచ్చనే దాని గురించి పూర్తి షెడ్యూల్ ఇక్కడ ఇవ్వబడింది:

    9 నెలల వయస్సు బిడ్డ కొరకు డైట్ - వారం 1, రోజు 1 (9 Month Old Baby Food Chart/Meal Plan – Week 1 Day 1)

    కింది మీల్ పాటర్న్ (భోజన సరళి)ని ఫాలో అవడం ద్వారా మీ బిడ్డ యొక్క మొదటి రోజుని క్లాసిక్ రీతిలో ప్రారంభించండి. అందువల్ల ఈ విధంగా మీరు మీ బిడ్డ ఆకలిని మరింత మెరుగ్గా ట్రాక్ చేయగలుగుతారు.

    • ఉదయాన్నే- తల్లి పాలు/ఫార్ములా ఫీడ్
    • అల్పాహారం - గోధుమ షీర్
    • మధ్య ఉదయం - తల్లి పాలు/ఫార్ములా ఫీడ్
    • లంచ్ - రాగి (ఫింగర్ మిల్లెట్)- పెసరపప్పు (పెసరపప్పు) సూప్
    • సాయంత్రం - తల్లి పాలు/డబ్బా పాలు
    • డిన్నర్ - కాయధాన్యాలు- చిలగడదుంప సూప్

    9 నెలల వయస్సు బిడ్డ కోసం డైట్ - వారం 1, రోజు 2 (9 Month Old Baby Food Chart/Meal Plan – Week 1 Day 2)

    మీ బిడ్డ యొక్క రెండవ రోజులో, మొదటి రోజుతో పోలిస్తే విభిన్నంగా ఉండవచ్చు. ఇది మీ తొమ్మిది నెలల బిడ్డ యొక్క డైట్ ఛార్టులో మరిన్ని రకాల ఆహారాన్ని చేర్చి, మంచి పోషణను అందేలా చూస్తుంది.

    • ఉదయాన్నే- తల్లి పాలు/డబ్బా పాలు
    • అల్పాహారం - నెయ్యి లేదా వెన్నతో తెల్లటి ఢోక్లా
    • మధ్య ఉదయం - తల్లి పాలు/డబ్బా పాలు
    • మధ్యాహ్నం - రాగి (ఫింగర్ మిల్లెట్)- పెసరపప్పు (పెసరపప్పు) సూప్
    • సాయంత్రం - తల్లి పాలు/డబ్బా పాలు
    • రాత్రి - డిన్నర్ - భాగర్/(చిరుధాన్యం)- పెసర పప్పు (పెసరపప్పు స్ప్లిట్) సూప్

    9 నెలల వయస్సు బిడ్డ కోసం డైట్ - వారం 1, రోజు 3 (9 Month Old Baby Food Chart/Meal Plan – Week 1 Day 3)

    మీ బిడ్డ యొక్క 3వ రోజు కోసం సూప్‎లను చేర్చేలా చూసుకోండి. వెరైటీలను మార్చడం ద్వారా మీ బిడ్డ నమలడాన్నిమెరుగుపరిచేందుకు కూడా సహాయపడతాయి.

    • ఉదయాన్నే- తల్లి పాలు/ఫార్ములా ఫీడ్
    • అల్పాహారం - సత్తు (బార్లీ) మిక్స్
    • మధ్య ఉదయం - తల్లి పాలు/ఫార్ములా ఫీడ్
    • లంచ్ - బీట్ రూట్ - బ్రోకలీ - పుట్టగొడుగుల సూప్
    • సాయంత్రం - తల్లి పాలు/ఫార్ములా ఫీడ్
    • డిన్నర్ - కాయధాన్యాలు- చిలగడదుంప సూప్

    9 నెలల వయస్సు బిడ్డ కోసం డైట్ - వారం 1, రోజు 4 (9 Month Old Baby Food Chart/Meal Plan – Week 1 Day 4)

    మీ బిడ్డ యొక్క నాలుగో రోజులో సాధారణ ప్లాన్ కాకుండా పండ్లు లేదా వెజిటబుల్ ప్యూరీలు కూడా చేర్చవచ్చు.

    • ఉదయాన్నే- తల్లి పాలు/ఫార్ములా ఫీడ్
    • అల్పాహారం - చిలగడదుంప + పోహా (అటుకుల) పొడి
    • మధ్య ఉదయం - తల్లి పాలు/ఫార్ములా ఫీడ్
    • లంచ్ - బచ్చలికూర- గుమ్మడికాయ ప్యూరీ
    • సాయంత్రం - తల్లి పాలు/ఫార్ములా ఫీడ్
    • డిన్నర్ - క్యారెట్ లో ముంచిన రోటీ- పెసరపప్పు పప్పు (పెసరపప్పు స్ప్లిట్) సూప్

    9 నెలల వయస్సు బిడ్డ కోసం డైట్ - మొదటి వారం, 5వ రోజు (9 Month Old Baby Food Chart/Meal Plan – Week 1 Day 5)

    • ఉదయాన్నే- తల్లి పాలు/ఫార్ములా ఫీడ్
    • అల్పాహారం - మెత్తని అరటిపండు
    • మధ్య ఉదయం - తల్లి పాలు/ఫార్ములా ఫీడ్
    • లంచ్ - నెయ్యి లేదా వెన్నతో ఇడ్లీ
    • సాయంత్రం - తల్లి పాలు/ఫార్ములా ఫీడ్
    • డిన్నర్ - పప్పు (కాయధాన్యాలు)- బచ్చలికూర సూప్

    9 నెలల వయస్సు బిడ్డ కోసం డైట్ - మొదటి వారం, 6వ రోజు (9 Month Old Baby Food Chart/Meal Plan – Week 1 Day 6)

    • ఉదయాన్నే- తల్లి పాలు/ఫార్ములా ఫీడ్
    • అల్పాహారం - ఉడికించిన గుడ్డు పచ్చసొన లేదా ఇంట్లో తయారుచేసిన పనీర్ (కాటేజ్ చీజ్)
    • మధ్య ఉదయం - తల్లి పాలు/ఫార్ములా ఫీడ్
    • లంచ్ - పాలక్ (బచ్చలికూర) కిచిడీ
    • సాయంత్రం - తల్లి పాలు/ఫార్ములా ఫీడ్
    • డిన్నర్ - రాగులు (ఫింగర్ మిల్లెట్)- మొత్తం పెసరపప్పు (పెసరపప్పు) సూప్

    9 నెలల వయస్సు బిడ్డ కోసం డైట్ - మొదటి వారం, 7వ రోజు (9 Month Old Baby Food Chart/Meal Plan – Week 1 Day 7)

    • ఉదయాన్నే- తల్లి పాలు/ఫార్ములా ఫీడ్
    • అల్పాహారం - మెత్తని అరటిపండు
    • మధ్య ఉదయం - తల్లి పాలు/ఫార్ములా ఫీడ్
    • లంచ్ - పప్పులో ముంచిన రోటీ
    • సాయంత్రం - తల్లి పాలు/ఫార్ములా ఫీడ్
    • డిన్నర్ - గుడ్డులోని పచ్చసొన లేదా పప్పుతో అన్నం

    మీ బిడ్డ ఇప్పటికి ఘనాహారం తీసుకుంటున్నప్పటికీ, పోషకాహారంలో ఎక్కువ భాగం తల్లిపాల నుండి రావాలి. మీ బిడ్డకు ఒక సంవత్సరం వయస్సు వచ్చేంత వరకు, ఇతర ఆహారాలను కాంప్లిమెంటరీగా పరిగణించండి. తల్లిదండ్రులు సాధారణంగా తమ పిల్లలకు పాలిస్తూ వెజిటబుల్ ప్యూరి లేదా ఇతర విధంగా ఘనమైన ఆహారాలను తినిపించడం ప్రారంభిస్తారు. మీ బిడ్డ తినగల కొన్ని ఉత్తమ ఆహారాలు కింద పేర్కొనబడ్డాయి!

    • పీచెస్, స్ట్రాబెర్రీలు అలాగే పుచ్చకాయలు వంటి పండ్లు.
    • బ్రోకలీ, బీన్స్ మరియు చిలగడదుంపలు వంటి తాజా కూరగాయలు.
    • గుడ్లు, చేపలు అలాగే గ్రౌండ్ మీట్ ప్రోటీన్ యొక్క అద్భుతమైన వనరులుగా పనిచేస్తాయి.
    • ఆలివ్ ఆయిల్ మరియు అవోకాడోలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు.
    • ఐరన్-ఎక్కువ కలిగిన తృణధాన్యాలు మరియు పాస్తా.

    మీ బిడ్డకు అవసరమైన కొన్ని కీలక పోషకాలు ఏవి (What Are Some Of The Key Nutrients That Your Baby Needs in Telugu)?

    మీ బిడ్డకు అనేక రకాల ఆహారాన్ని తినిపించడం వల్ల వారికి ప్రయోజనకరమైన పోషకాలు లభిస్తాయి. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అదేవిధంగా మీ బిడ్డ అవయవాల అభివృద్ధికి సహాయపడతాయి. ఎముకల ఆరోగ్యంతో పాటు రోగనిరోధక వ్యవస్థ విషయానికి వస్తే, విటమిన్ డి చాలా ముఖ్యమైనదిగా మారవచ్చు.

    అనేక డబ్బా పాల బ్రాండ్ లు ఈ ఆవశ్యక పోషకాలతో నిండినట్లు చెబుతున్నా, మీ బిడ్డ ప్రతిరోజూ, మరీముఖ్యంగా మొదటి సంవత్సరంలో విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలని రెకమండ్ చేయబడుతోంది. మొదటి సంవత్సరంలో వేగవంతమైన ఎదుగుదలతో పాటు, మీ బిడ్డ అభివృద్ధి కూడా ఇమిడి ఉండటమే దీనికి కారణం. ఎందుకంటే కొన్ని విటమిన్ల లోపం తీవ్రమైన ఆరోగ్య కండీషన్లకు దారితీస్తుంది.

    విటమిన్ డి తో పాటు ఐరన్ కూడా మీ బిడ్డకు అవసరమైన ఒక ముఖ్యమైన పోషకం. ఈ రోజు మీ బిడ్డ తినగలిగే అనేక ఐరన్-ఎక్కువగా కలిగిన తృణధాన్యాలు ఉన్నాయి. మీ బిడ్డకు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను కూడా తినిపించేలా చూసుకోండి. ఈ కొవ్వు ఆమ్లాలు కంటి, మెదడు మరియు రోగనిరోధక శక్తి అభివృద్ధికి సహాయపడతాయి!

    మీ బిడ్డ దూరంగా ఉండాల్సిన కొన్ని ఆహారాలు ఏవి (What Are Some Of The Foods That Your Baby Needs To Avoid in Telugu) ?

    మీ బిడ్డ తన మొదటి సంవత్సరంలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అందువల్ల కొన్ని ఆహారాలు ప్రమాదకరమైనవి లేదా ఫుడ్ పాయిజనింగ్ కు కారణం కావచ్చు. దూరంగా ఉండాల్సిన కొన్ని ఆహారాలలో కొన్నింటిని కింద లిస్ట్ లో చేర్చడం జరిగింది.

    • తేనె
    • సరిగ్గా ఉడకని గుడ్డు లేదా మాంసం
    • మెర్య్కురీ ఎక్కువగా కలిగిన చేప
    • చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు
    • ఉప్పు ఆహార పదార్థాలు
    • పాశ్చరైజ్ చేయని ఆహార పదార్థాలు
    • ఇబ్బంది కలిగించే ఆహారాలు

    ఒక సంవత్సరం వయస్సు లేని పిల్లలు ఆవు పాలను తీసుకోకూడదు. తమ పోషక అవసరాలలో ఎక్కువ భాగాన్ని తల్లిపాల ద్వారా మాత్రమే తీర్చాల్సి ఉంటుంది. అలా కాకుండా శిశువులు ఓట్ మీల్ తో పాటు డబ్బా పాలతో కలిపిన స్మూతీలను కూడా తీసుకోవచ్చు.

    సాధ్యమైనంత వరకు చక్కెర ఆహార పదార్థాలను దూరంగా ఉండేలా చూసుకోండి. అంతేకాకుండా ఆహారంలో అధిక సోడియం కంటెంట్ శిశువు యొక్క అభివృద్ధి చెందుతున్న మూత్రపిండాలపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. అందువల్ల ఈ దశలో ఉప్పు కంటెంట్ ను పరిమితం చేయడం ఉత్తమం. తొమ్మిది నెలల బిడ్డకు ప్రతిరోజూ సుమారు 800 కేలరీలు అవసరం అవుతాయి. వాస్తవానికి సుమారు 450 కేలరీలు కేవలం తల్లిపాల నుండి మాత్రమే రావాలి. మీ పిల్లలు తమకు కావలసినంత తినే అవకాశాన్ని ఇవ్వండి.

    ఆహారానికి సంబంధించిన అలెర్జీ రియాక్షన్లను ఎలా గుర్తించాలి (How To Recognize Allergic Reactions Involving Food in Telugu)?

    మీ బిడ్డకు తొమ్మిది నెలల వయస్సు వచ్చే సమయానికి, గుడ్లు మరియు పీనట్ బటర్ వంటి కొన్ని ఆహార పదార్థాలను మీరు పరిచయం చేసి ఉండవచ్చు. ఇదే సమయంలో మీరు అలెర్జీ కారకాలను సాధ్యమైనంత త్వరగా పరిచయం చేయాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో సాధారణ లక్షణాలను మరింత విశ్లేషించడానికి, అలెర్జీ లక్షణాలను నివారించడం సులభం అవుతుంది. కొన్ని అవకాశమున్న అలెర్జీ రియాక్షన్లు ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి.

    • గర్ గర్ అని శబ్దం రావడం
    • నోటిలో వాపు
    • దద్దుర్లు
    • నీళ్ల విరేచనాలు
    • వాంతి
    • పొట్ట వద్ద తిమ్మిరి

    ఒకవేళ మీ బిడ్డ తేలికపాటి రియాక్షన్లను ఎదుర్కొన్నట్లయితే లేదా ఎక్కువైన సందర్భాల్లో, అనాఫిలాక్సిస్ ని ఎదుర్కొన్నట్లయితే, వెంటనే మీ శిశు వైద్యుడిని సంప్రదించండి.

    ముగింపు (Conclusion)

    వాస్తవానికి పేరెంటింగ్ అనేక సవాళ్లు మరియు ఎగ్జైటింగ్ దశలను కలిగి ఉంటుంది. తొమ్మిది నెలల వయస్సులో ఉన్న మీ బిడ్డకు ఆరోగ్యకరమైన భోజనాన్ని ప్లాన్ చేయడానికి చాలా సమయం పడుతుంది. మీ బిడ్డ కొరకు కస్టమైజ్డ్ డైట్ ఛార్టును తయారు చేయడం ద్వారా, మీరు ముందుగానే భోజనాన్ని ప్లాన్ చేయవచ్చు. మీరు మీ బిడ్డకు దూరంగా ఉంచాల్సిన కొన్ని ఆహార పదార్థాలను పరిగణనలోకి తీసుకోవడం మీకు చాలా ముఖ్యం.

    అలా కాకుండా, మీరు మీ బిడ్డకు తినిపిస్తున్న ఆహారం మెత్తగా, సరిగ్గా వండినట్లుగా అదేవిధంగా ఇబ్బందికరంగా ఉండకుండా సౌకర్యవంతమైన సైజుల్లో కత్తిరించినట్లుగా ధృవీకరించుకోండి. మీ బిడ్డ దూరంగా ఉండాల్సిన కొన్ని ఆహారాలలో పాశ్చరైజ్ చేయని ఆహారాలు, చక్కెర ఆహారాలు అదేవిధంగా ఉప్పుతో కూడిన ఆహారాలు కూడా ఉన్నాయి. పైన పేర్కొన్న టిప్స్ ని పాటించడం ద్వారా, మీ బిడ్డ ఆరోగ్యవంతంగా ఎదగడాన్ని మీరు తప్పకుండా చూస్తారు.

    Tags:

    9 Month Old Baby Food Chart in telugu, food chart for 9th month baby in telugu, diet plan for 9th month baby in telugu, 9 Month Old Baby Food Chart/Meal Plan – Week 1 in English, 9 Month Old Baby Food Chart/Meal Plan – Week 1 in Hindi, 9 Month Old Baby Food Chart/Meal Plan – Week 1 in Bengali, 9 Month Old Baby Food Chart/Meal Plan – Week 1 in Tamil

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on TOI
    Mylo featured on inc42
    Mylo featured on Business Standard
    Mylo featured on YourStory
    Mylo featured on ANI
    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo
    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.