Updated on 18 September 2023
ముడి తేనె తీసుకోవడం సురక్షితమే, అయితే, శిశువులకు తేనె సరిపడదని ఖచ్చితంగా చెప్పవచ్చు. తేనెలో మానవులకి హాని కలిగించే విషపూరితమైన క్లోస్ట్రిడియం బోటులినమ్ బ్యాక్టీరియా ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఇది మెటబాలిజం విషమీకరణకి దారి తీస్తుంది. అయినప్పటికీ, ఎక్కువ సంఖ్యలో ఎదిగిన పిల్లలు ఇంకా పెద్దలు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థలను కలిగి ఉంటారు ఇంకా చిన్న మొత్తంలో బోటులినమ్ బ్యాక్టీరియాతో పోరాడటానికి తగినంత గట్ బ్యాక్టీరియాను కలిగి ఉంటారు. ఒక సంవత్సరం లోపు చిన్న పిల్లలలో ఈ రక్షణ వ్యవస్థ ఇంకా వృద్ధి చెంది ఉండదు.
గర్భధారణ సమయంలో తేనె తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. తేనెలో ఆవశ్యకమైన విటమిన్లు, ఖనిజాలు మరియు చిన్న మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల, కాబోయే తల్లికి ఇంకా ఎదుగుతున్న శిశువుకి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. దగ్గు, జలుబు లేదా గొంతు నొప్పికి తేనె ఒక మంచి ఔషధం. గర్భధారణ సమయంలో పాశ్చరైజ్డ్ తేనెను తీసుకోవడం సురక్షితం. అంతేకాకుండా, ఇది తప్పనిసరిగా ప్రభుత్వం ఆమోదించిన పద్ధతుల్లో సేకరించి ఉండాలి. ఫ్రక్టోజ్ (38%) మరియు గ్లూకోజ్ (31%), ఈ రెండు సరళ చక్కెరలు ఇంకా నీరు (17%) కలిసి తేనె తయారవుతుంది
రోగనిరోధక వ్యవస్థకు ఊతమిచ్చే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంకా యాంటీఆక్సిడెంట్ గుణాలను తేనె కలిగి ఉండవచ్చని ప్రాచీన సాహిత్యం వల్ల తెలుస్తుంది. అదనంగా, ఇది గాయం-నయం చేసే శక్తివంతమైన సామర్ధ్యాలను కలిగి ఉన్నట్లు భావిస్తారు.
తేనె నిద్రలేమికి చికిత్స చేయడానికి ఉపయోగించే హిప్నోటిక్ ప్రభావాన్ని కలిగి ఉందని ఆయుర్వేద సాహిత్యం పేర్కొంది. పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే సుఖనిద్ర ప్రాప్తిస్తుంది.
తీవ్రమైన దగ్గుకు చికిత్స చేసేందుకు ఒక సాధారణ ఇంటి చిట్కా అల్లం లేదా నిమ్మ రసంతో కలిపిన తేనె తీసుకోవడం. తేనెలో యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయని భావిస్తారు, ఇది శరీరంలో వైరస్ కార్యకలాపాలను నిరోధిస్తుంది, సాధారణ జలుబును నివారిస్తుంది ఇంకా దగ్గు లక్షణాలను తగ్గిస్తుంది..
ఒక అధ్యయనం ప్రకారం, క్రమం తప్పకుండా తేనె తీసుకోవడం వల్ల అల్సర్లకు మూలకారణమైన హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా పెరుగుదలను మందగించవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం, వివిధ రకాల అల్సర్లకు చికిత్స చేయడంలో తేనె ప్రభావాన్ని నిర్ధారించడానికి మరిన్ని యాదృచ్ఛిక క్లినికల్ ట్రయల్స్ అవసరం..
యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాల కారణంగా గాట్లు, గాయాలు ఇంకా జుట్టు కుదురు పరిస్థితుల చికిత్సలో తేనెను పైపూతగా ఉపయోగిస్తారు. గోరువెచ్చని నీరు ఇంకా తేనెను తలకు పట్టించడం ద్వారా చుండ్రు మరియు దురద నుండి ఉపశమనం పొందవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో ఏ కాఫ్ సిరప్ సురక్షితమైనది?
పోషకాహారం పరంగా, గర్భధారణలో తేనె చక్కెర లాంటి తీయదనంతో, చక్కెర కన్నా మరింత ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. అయినప్పటికీ, తేనెను మితంగానే తీసుకోవాలి, ఎందుకంటే ఇందులో చక్కెరలు ఉంటాయి కాబట్టి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మహిళలు రోజుకు 6 టీస్పూన్ల కంటే ఎక్కువ చక్కెరను తినకూడదని సలహా ఇస్తుంది. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారు లేదా గర్భధారణలో వచ్చే మధుమేహం కలిగి ఉన్నవారు, ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలను చక్కగా నిర్వహించాలని అనుకొనే వారు, తేనెను ఇంకా చక్కెర జోడించిన ఇతర పదార్థాలను పూర్తిగా దూరం ఉంచాల్సివుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణలో రక్తంలో చక్కెర స్థాయిల గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలేమిటి?
అవును తీసుకోవచ్చు. తేనె ఉత్పత్తి కేంద్రాలు, రోడ్డు పక్కన ఉన్న దుకాణం లేదా రైతు మార్కెట్‌లో పాశ్చరైజ్ చేయని లేదా ముడి తేనెను నిల్వ చేయవచ్చు. గర్భధారణ సమయంలో ముడి తేనె భద్రతపై పరిశోధన ఫలితాలు ఇప్పటికీ లేనందున, ఇది ప్రమాదకరమని భావించడానికి ఎటువంటి కారణాలు లేవు. పాశ్చరైజ్ చేయని పాల చీజ్ ఇంకా డెలి మాంసాలతో సంబంధం ఉన్న లిస్టెరియోసిస్ వచ్చే ప్రమాదం పాశ్చరైజ్ చేయని తేనెతో ఉండదు. ముడి తేనె పాశ్చరైజ్ చేయబడనందున, ఇది బహుశా పాశ్చరైజ్ చేసినదాని కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.
శిశువులు తేనె ద్వారా బోటులిజం విషప్రక్రియకు గురయ్యే ప్రమాదముంది. అందుకే శిశువులకు తేనె ఇవ్వకూడదని వైద్యులు తరచుగా హెచ్చరిస్తూ ఉంటారు. గర్భధారణ సమయంలో తేనె పుట్టబోయే పిల్లలకు హాని కలిగించే అవకాశం ఉన్నందున, తేనె తీసుకొనేందుకు భయపడతారు. డాక్టర్ గారు వారించనంత వరకు గర్భవతులు తేనెను తీసుకోవడం ఆమోదయోగ్యమైనది. బోటులినమ్ టాక్సిన్ అధిక పరమాణు బరువు కలిగి ఉండటం వలన, అది పుట్టబోయే బిడ్డను ఆవరించి రక్షించే మావి గుండా బిడ్డకు చేరడం కష్టతరం చేస్తుంది. పెద్దలు ఈ టాక్సిన్‌కు ఎదుర్కొని, తమను తాము రక్షించుకోవడానికి, మంచి రోగనిరోధక ప్రతిస్పందనను ఇంకా వివిధ రకాల మంచి గట్ బ్యాక్టీరియాను కూడా కలిగి ఉండాల్సివుంది.
నిపుణుల సిఫార్సుల ప్రకారం, ఒక చెంచా తేనెలో 8.6 గ్రాముల చక్కెరలు ఉంటాయి. అందువల్ల, గర్భవతులు తమ రోజువారీ తేనె వినియోగాన్ని 5 టేబుల్ స్పూన్లు లేదా 180-200 కేలరీలకు పరిమితం చేయాలి.
గర్భవతులు తేనె తీసుకొనేందుకు అనుమతించబడినప్పటికీ, దాని వల్ల కలిగే ప్రయోజనం వారు దానిని ఆహారంలో ఎలా చేర్చుకుంటారో దాని బట్టి ఉంటుంది.
ఆరోగ్యకరమైన తేనె రకాన్ని ఎంచుకోవాలనుకుంటే ముందు ముడి తేనె కోసం వెతకాలి. ముడి రకాల తేనె పాశ్చరైజ్ చేయబడదు ఇంకా ఇందులో వడపోతను ప్రక్రియ అసలే ఉండదు. అందువల్ల, దానిలోని పోషక విలువలు చెక్కుచెదరక అలాగే ఉంటాయి. కాబట్టి, ఆ కొత్త తేనె బాటిళ్ళను ప్రయత్నించడం మానుకోవద్దు!
References
1. Rizzoli, V., Mascarello, G., Pinto, A., Crovato, S., Mirko Ruzza, Tiozzo, B., & Licia Ravarotto. (2021). “Don’t Worry, Honey: It’s Cooked”: Addressing Food Risk during Pregnancy on Facebook Italian Posts.
Is it ok to eat honey during pregnancy in Telugu, What are the benefits of eating honey during pregnancy in Telugu, What are the side-effects of honey during pregnancy in Telugu Honey During Pregnancy in English, Honey During Pregnancy in Hindi, Honey During Pregnancy in Tamil, Honey During Pregnancy in Bengali
Yes
No
Written by
kakarlasirisha
kakarlasirisha
Can Breastfeeding Mom Eat Mango: Debunking Myths & Providing Expert Advice
PCOS and Sex: Exploring Impact on Health and Debunking Common Myths
Dates for PCOS: How to Harness their Health Benefits
Coconut Water for PCOS: Discovering the Natural Support You've Been Missing
How to Boost Fertility in Your 30s: The Ultimate Guide
Everything You Need to Know About the Length of Vagina
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Skin - Bath & Body | By Concern | Body Moisturizer | Brightening | Tan Removal | By Ingredient | Skin - Hygiene | By Concern | UTIs & Infections | Diapers & Wipes | Disposable Diapers | Baby Wipes | Cloth Diapers | Diapers & Wipes - Baby Care | Hair | Skin | Bath & Body | Diapers & Wipes - Baby Wellness | Diaper Rash | Mosquito Repellent | Maternity dresses | Stretch Marks Kit | Stroller |