This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

కోరింత దగ్గు: దీని లక్షణాలు ఏమిటి? దీని వల్ల వచ్చే ప్రమాదాలను ఎలా నివారించాలి?

Cold & Cough
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
కోరింత దగ్గు:  దీని లక్షణాలు ఏమిటి? దీని వల్ల వచ్చే ప్రమాదాలను ఎలా నివారించాలి?
Read time6 min

కోరింత దగ్గును పెర్టుసిస్ అని కూడా పిలుస్తారు. ఇది శ్వాసకోస వ్యవస్థకు సంభవించే ప్రమాదకరమైన అంటువ్యాధి. ఇది సంభవించినపుడు అధిక శ్వాసతో కూడిన తీవ్రమైన హ్యాకింగ్ దగ్గు (పొడి దగ్గు లేదా చిరాకు, మంటతో కూడిన దగ్గు) వస్తుంది. హూప్ అనే శబ్దం కూడా వస్తుంది. టీకాలు రాకముందు కోరింత దగ్గు అనేది చిన్నారుల్లో సహజంగా వచ్చే వ్యాధి. కానీ ఇప్పుడు ఇది ఇంకా టీకాలు వేసుకోని చిన్నపిల్లలను లేదా టీకా నుంచి క్షీణించిన (టీకా వేసుకుని చాలా రోజులు అయితే) రోగనిరోధక వ్యవస్థ ఉన్న పెద్దలు మరియు టీనేజర్లను ప్రభావితం చేస్తుంది. కోరింత దగ్గు అనేది ప్రాణాంతక వ్యాధిగా పరిగణించబడనప్పటికీ ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో సంభవిస్తుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు మరియు చిన్నపిల్లలతో సన్నిహితంగా ఉండే వ్యక్తులు కోరింత దగ్గుకు వ్యాక్సిన్లు తీసుకోవడం మంచిది.

కోరింత దగ్గు లక్షణాలు

మీకు కోరింత దగ్గు సోకినట్లయితే లక్షణాలు కనిపించేందుకు 7 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. కొన్ని సార్లు ఇంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. చాలా సందర్భాల్లో లక్షణాలు ప్రారంభంలో తేలికపాటి జ్వరం, సాధారణంగా వచ్చే జలుబు లాగే కనిపిస్తాయి. ప్రారంభంలో ఈ కింది లక్షణాలు కూడా కనిపించొచ్చు.

  • ముక్కు దిబ్బడ (ముక్కు నిండిపోయి ఉండడం)
  • కారుతున్న ముక్కు
  • జ్వరం
  • దగ్గు
  • ఎరుపు రంగులోకి మారిన మరియు కారుతున్న కళ్లు

కొన్ని వారాల తర్వాత ఈ లక్షణాలు మరింత తీవ్రతరమవుతాయి. దట్టమైన శ్లేష్మం శ్వాసనాళాల్లో పేరుకుపోతుంది. ఇది తీవ్రమైన (అనియంత్రిత) దగ్గుకు దారి తీస్తుంది. విరామం లేకుండా దగ్గడం వలన ఈ కింది పరిస్థితులు సంభవించవచ్చు.

  • వాంతులు
  • విపరీతమైన అలసట
  • ముఖం నీలం లేదా ఎరుపు రంగులోకి మారడం
  • దగ్గిన తర్వాత మీరు శ్వాస తీసుకున్నపుడు ఎక్కువ తీవ్రతతో కూడిన హూప్ శబ్దం.

అయితే కోరింత దగ్గుతో బాధపడేవారు అందరూ హూప్ శబ్దాలు చేసే అవకాశం లేదు. పెద్దలైనా, పిల్లలైనా, యుక్త వయసులో ఉన్న వారు అయినా ఊపిరి సలపకుండా దగ్గుతూ ఉంటె వారిని కోరింతదగ్గు బాధితులుగా గుర్తించాలి.

వైద్యుడి వద్దకు వెళ్లేందుకు కారణాలు

మీరు లేదా మీ బిడ్డ దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడుతూ ఉంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. విరామం లేని దగ్గు కింది వాటికి దారితీస్తుంది.

  1. వాంతులు
  2. ఎక్కువ తీవ్రతతో కూడిన హూపింగ్ శబ్దంతో శ్వాస.
  3. నీలం లేదా ఎరుపు రంగులోకి మారడం
  4. ఊపిరి పీల్చుకునేందుకు కష్టపడడం, శ్వాసల మధ్య గుర్తించదగిన విరామాలు

కోరింత దగ్గు యొక్క ప్రమాద కారకాలు

మనం బాల్యదశలో ఉన్నపుడు అందరం కోరింత దగ్గుకు టీకాలు తీసుకుంటాం. అయినా కానీ ఈ టీకా యొక్క సమర్థత చివరికి తగ్గిపోతుంది. ఫలితంగా చాలా మంది యువకులు, పెద్దలు ఈ అంటువ్యాధి సంభవించినపుడు ప్రభావితం అవుతారు. అంతే కాకుండా వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండే 12 నెలల కంటే తక్కువ వయసు ఉన్న చిన్నారులు లేదా రికమెండ్ చేసిన వ్యాక్సిన్లను పూర్తిగా తీసుకోని వారు ఈ కోరింత దగ్గు వలన ఎక్కువగా బాధపడే ప్రమాదం ఉంది. అటువంటి వారు కోరింత దగ్గు వల్ల మరణించే ప్రమాదం కూడా ఉంది.

మీకు ఇది కూడా నచ్చుతుంది: బ్రోన్కియెలైటస్ వర్సెస్ బ్రోన్కైటిస్

కోరింత దగ్గు వల్ల వచ్చే సమస్యలు

పెద్దవారు మరియు యుక్తవయసు వారు పెర్టుసిస్ (కోరింతదగ్గు) నుంచి ఎటువంటి సమస్యలు లేకుండా కోలుకోగలుగుతారు. ఒక వేళ సమస్యలు వస్తే మాత్రం.. నిరంతరంగా వచ్చే తీవ్రమైన దగ్గు వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి:

  • ఉదర హెర్నియాలు
  • పగిలిన లేదా గాయపడిన పక్కటెముకలు
  • కళ్ల చర్మంలో బ్రోకెన్(విరిగిపోయి ఉన్న) రక్తనాళాలు

శిశువుల విషయంలో మరీ ముఖ్యంగా 6 నెలల కంటే తక్కువ వయసు కలిగిన వారిలో కోరింత దగ్గుకు సంబంధించిన లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. మరియు అవి ఈ కింది వాటిని కలిగి ఉంటాయి:

  • న్యుమోనియా(ఊపిరితిత్తుల వ్యాధి)
  • మూర్చ
  • శ్వాస నెమ్మదిగా తీసుకోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం
  • బ్రెయిన్ డ్యామేజ్
  • డీ హైడ్రేషన్ లేదా బరువు తగ్గడం

శిశువులు మరియు చిన్న పిల్లలు కోరింత దగ్గుతో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున వారు ఆసుపత్రిలో చేరే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్లో ఈ సమస్యలు ప్రాణాంతకం కూడా కావొచ్చు.

కోరింత దగ్గు నివారణ మార్గాలు

కోరింత దగ్గును నివారించేందుకు ఉన్న ఏకైక, ప్రభావవంతమైన మార్గం పెర్టుసిస్ వ్యాక్సిన్​ను తీసుకోవడం. టెటానస్(ధనుర్వాతం), డిప్తీరియా(గొంతు లేదా కంఠం వాయడం) వంటి మరో రెండు ప్రాణాంతక వ్యాధుల నివారణ కోసం కూడా ఈ వ్యాక్సిన్ పని చేస్తుంది. శిశువులను ప్రాణాంతక (తీవ్రమైన) వ్యాధుల నుంచి దూరంగా ఉంచేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులు టీకాలను సిఫారసు చేస్తారు. పెర్టుసిస్ వ్యాక్సిన్ 5 ఇంజక్షన్ల ద్వారా ఇస్తారు. 2 నెలలు, 4 నెలలు, 6 నెలలు, 18 నెలలు మరియు చివరగా 4 నుంచి 6 సంవత్సరాల మధ్య వివిధ వయసుల్లో ఈ ఇంజక్షన్లను ఇస్తారు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: టీకాలు వేసిన తర్వాత పిల్లలు ఏడవడం సాధారణమేనా? వారిని ఎలా కూల్ చేయాలి?

వ్యాక్సిన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్

ఈ వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల తరచుగా మరియు సాధారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్ తేలికపాటి జ్వరం, తలనొప్పి, క్రాకినెస్(కుంగిపోవడం), ఇంజిక్షన్ వేసిన ప్రాంతంలో పుండ్లు పడడం, అలసట.

బూస్టర్ షాట్స్

మీ డాక్టర్ ఈ కింది సందర్భాలలో ఫెర్టుసిస్ మందుల కోసం బూస్టర్ షాట్స్​ను రికమెండ్ చేయొచ్చు.

1. యుక్తవయసులో ఉన్నవారికి:

టీకా ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తి 11 సంవత్సరాల వయసులో తగ్గిపోతుంది. మీ పిల్లలను టెటానస్, డిఫ్తీరియా, కోరింత దగ్గు నుంచి రక్షించేందుకు బూస్టర్ షాట్ తీసుకోవాలని మీ వైద్యుడు సూచించవచ్చు.

2. పెద్దలకు:

పెద్దలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి టెటానస్, డిఫ్తీరియా, పెర్టుసిస్ టీకాలు తీసుకోవాలని డాక్టర్లు సిఫారసు చేస్తారు. ఈ టీకా వేసుకోవడం వల్ల మీ చుట్టూ ఉన్న శిశువులకు మీ వల్ల కోరింత దగ్గు వ్యాపించే ప్రమాదం కూడా తగ్గుతుంది.

3. గర్భవతులకు:

చాలా మంది వైద్యులు గర్భిణీ స్త్రీలకు గర్భం దాల్చిన 27 నుంచి 36 వారాల మధ్య పెర్టుసిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని సిఫారసు చేస్తారు. మీ శిశువు పుట్టిన మొదటి కొన్ని నెలల తర్వాత శిశువును కోరింత దగ్గు బారినుంచి రక్షించేందుకు ఈ వ్యాక్సిన్ వేస్తారు.

నివారణ కోసం మందులు

కోరింత దగ్గుతో భాదపడుతున్న ఎవరితోనైనా మీరు దగ్గరగా మెదిలితే మీకు కూడా కోరింత దగ్గు రాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు యాంటీ బయాటిక్స్ తీసుకోవాలని మీ వైద్యుడు మీకు సిఫారసు చేయొచ్చు. మీరు ఈ కింది దశలో ఉన్నపుడు మీకు నివారణ మందులు కూడా సిఫారసు చేయొచ్చు.

  • గర్భవతి
  • ఆరోగ్య సంరక్షణ ప్రదాత (హెల్త్​కేర్ ప్రొవైడర్​)
  • 12 నెలల కంటే తక్కువ వయసు
  • అధిక సమస్యలను కలిగించే ఆరోగ్య పరిస్థితి… ఆస్తమా వంటి జబ్బులు లేదా బలహీన రోగనిరోధక వ్యవస్థ
  • పెర్టుసిస్ (కోరింత దగ్గు) ఉన్న వారితో జీవిస్తే
  • కోరింత దగ్గు ఇన్ఫెక్షన్(సంక్రమణ) ప్రమాదం ఎక్కువ ఉన్న వారితో జీవిస్తే

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.