This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో చెరకు రసం తీసుకోవడం: ప్రయోజనాలు, జాగ్రత్తలు | Sugarcane Juice in Pregnancy: Benefits & Precautions in Telugu

Diet & Nutrition
Written by - Swetha Raoచివరిగా నవీకరించబడింది: May 29, 2026
గర్భధారణ సమయంలో చెరకు రసం తీసుకోవడం: ప్రయోజనాలు, జాగ్రత్తలు | Sugarcane Juice in Pregnancy: Benefits & Precautions in Telugu
Likes1 Likes|
Read time7 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • గర్భధారణ సమయంలో చెరకు రసం తాగడం సురక్షితం; ఇందులో కార్బోహైడ్రేట్లు, పొటాషియం, సోడియం పుష్కలంగా ఉంటాయి, కొవ్వు లేదా కొలెస్ట్రాల్ ఉండవు.
  • చెరకు రసం మలబద్ధకం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, రక్తపోటును నియంత్రిస్తుంది, కామెర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • మధుమేహం ప్రమాదం ఉన్న గర్భిణీలు చెరకు రసం నివారించాలి; రోడ్డు పక్కన దుకాణాల నుండి తాగకుండా, పరిశుభ్రతను పాటిస్తూ మితంగా తీసుకోవాలి.
  • గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన పానీయాలతో పాటు ఏ ఇతర పోషకాహారం మీ శరీరానికి అవసరం? Explore our Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each.
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
Rating4.3
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Rating4.9
Organic Aloe Vera (300 ml)
Organic Aloe Vera (300 ml)
Rating4.4

గర్భం అనేది నిస్సందేహంగా స్త్రీకి కలిగే అద్భుతమైన, ఉత్తేజకరమైన అనుభవాలలో ఒకటి. తొమ్మిది నెలల పాటు మరొక మనిషిని తన లోపల మోస్తునట్లు ఊహించుకోవడం కూడా విచిత్రంగా ఉంటుంది. గర్భం దాల్చినప్పుడల్లా, బిడ్డను ఆరోగ్యంగా ఉంచడానికి అధిక రక్షణ దాదాపు తక్షణమే ప్రారంభమవుతుంది. హార్మోన్ల మార్పులు, పిల్లల పట్ల తల్లి బాధ్యతల కారణంగా ఇది సహజం. బహుశా అందుకే గర్భధారణ సమయంలో చెరకు తినడం సురక్షితమో కాదో తెలుసుకోవడం చాలా మంది మహిళలకు ముఖ్యం. చెరకు అనేది చక్కెరను తయారు చేయడానికి ఉపయోగించే ముడి పదార్థం. ప్రజలు ప్రతిరోజూ ఆహార పదార్థాలతో, పానీయాలతో తీసుకుంటారు. చెరకు ఉత్పత్తులలో బెల్లం కూడా ఒకటి, దీనిని తరచుగా చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. అయితే, సాధారణంగా ప్రతి ఒక్కరూ చెరకు రసం గురించి ఆందోళన చెందుతారు. ఎందుకంటే దానిలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దీన్ని దృష్టిలో ఉంచుకుని గర్భధారణ సమయంలో చెరకు రసం తీసుకోవచ్చో లేదో కింది కథనం వివరిస్తుంది.

చెరకు రసంలోని పోషక విలువలు (Nutritional Value of Sugarcane Juice in Telugu)

చెరకు రసంలోని పోషక విలువలను అధ్యయనం చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఇది దాని ఆరోగ్య ప్రయోజనాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. కింది పట్టికలో చెరకు రసంలోని పోషక పదార్థాల కంటెంట్, వాటి 100 మిల్లీలీటర్ల సాంద్రత వివరించబడింది.

Nutrient list

Concentration per 100 millilitres

మాంసకృత్తులు

0 గ్రాములు

కొవ్వు

0 గ్రాములు

కొలెస్ట్రాల్

0 మిల్లీగ్రాములు

కార్బోహైడ్రేట్లు

21.14 గ్రాములు

చక్కెర కంటెంట్

7.27 గ్రాములు

సోడియం

44 మిల్లీగ్రాములు

పొటాషియం

12 మిల్లీగ్రాములు

చెరకు రసంలో కొవ్వు లేదా కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి, రక్తంలో క్రమరహిత లిపిడ్ ప్రొఫైల్స్ చరిత్ర ఉన్న మహిళలకు ఇది సురక్షితం. అంతే కాకుండా, ఎవరైనా అధిక యూరిక్ యాసిడ్ లేదా యూరియా కంటెంట్ కలిగి ఉంటే, గర్భధారణ సమయంలో చెరకు రసం తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఉండదు కాబట్టి.

గర్భధారణ సమయంలో చెరుకు రసం తీసుకోవడం సురక్షితమేనా? (Is Sugarcane Juice Safe to Consume During Pregnancy in Telugu)

కార్బోహైడ్రేట్లు, సోడియం, పొటాషియం అధికంగా ఉన్నందున గర్భధారణ సమయంలో చెరకు రసం త్రాగడం సురక్షితమే. అయినప్పటికీ, గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటే, పండ్ల రసంలో వివిధ రూపాల్లో చక్కెర అధికంగా ఉంటుంది కాబట్టి డైటీషియన్, గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణలో రక్తంలో చక్కెర స్థాయిల గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలేమిటి?

చెరుకు రసం వల్ల గర్భస్రావం అవుతుందా? (Does Sugarcane Juice Cause Miscarriage in Telugu)

చాలామంది స్త్రీలు "చెరకు రసం వల్ల గర్భస్రావం అవుతుందా?" అనే ప్రశ్న వేస్తారు. దానికి సమాధానం, కాదు. గర్భధారణ సమయంలో చెరకు రసం వల్ల కలిగే అసంఖ్యాకమైన ప్రయోజనాలు లేదా ఏ రకమైన విష పూరిత పదార్ధాలు లేకపోవడం వల్ల మొదటి లేదా రెండవ త్రైమాసికంలో గర్భస్రావం జరిగే అవకాశం లేదు. గర్భిణీ స్త్రీలు ప్రతిరోజూ చెరకు రసం తీసుకున్నప్పటికీ, ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం కలిగించదు.

గర్భధారణ సమయంలో చెరకు రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు (Benefits of Drinking Sugarcane Juice in Pregnancy)

1. మలబద్ధకం లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌ను నియంత్రిస్తుంది (Eases constipation or irritable bowel syndrome)

గర్భధారణ సమయంలో చెరకు రసం తీసుకోవడం వల్ల ప్రధానమైన ప్రయోజనాలలో మలబద్ధకం లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. తరచుగా గర్భిణీ స్త్రీలు సక్రమంగా లేని జీర్ణక్రియ, పెద్ద ప్రేగు ద్వారా సరికాని ప్రేగు కదలిక మొదలైన వాటి కారణంగా మలబద్ధకంతో బాధపడుతున్నారు. ఇది ఉబ్బరం, పొట్టలో పుండ్లు, తరచుగా వాంతులు కూడా కలిగిస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే చెరకు రసం తీసుకోవడం వల్ల ప్రేగు కదలికలు తగ్గుతాయి, మలబద్ధకం నుండి ఉపశమనం పొందుతారు.

2. అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది (Helps fight infections)

వివిధ యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల, గర్భధారణ సమయంలో చెరకు రసం తీసుకివడం శరీరానికి మరింత రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు, ముఖ్యంగా జలుబు, దగ్గుకు వ్యతిరేకంగా పోరాడే అవకాశాలను పెంచుతుంది. గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా చెరుకు రసం తాగే మహిళలు బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడించాయి.

3. బిలివర్డిన్, బిలిరుబిన్ గాఢతను సమతుల్యం చేస్తుంది (Balances biliverdin and bilirubin concentration)

చెరకు రక్తంలో బిలిరుబిన్, బిలివర్డిన్ గాఢతను తగ్గిస్తుంది. ఇంకా కాలేయం, పిత్తాశయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. బిలిరుబిన్, బిలివర్డిన్ అధిక శాతంలో ఉంటే గర్భధారణ సమయంలో కామెర్లతో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అది తల్లికి, పిండానికి హాని కలిగిస్తుంది. అందుకే గర్భధారణ సమయంలో చెరకు రసం తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

4. రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది (Controls the blood pressure levels)

గర్భధారణ సమయంలో చెరకు తినడం సురక్షితమేనా అని ఎవరికైనా సందేహం కలిగితే, చింతించాల్సిన పని లేదు. చెరకు రసంలో అధిక పొటాషియం, మెగ్నీషియం స్థాయిలు అనేవి రక్తపోటును నియంత్రించడంలో, హెచ్చుతగ్గులను తగ్గించడంలో సహాయపడతాయి. ఫలితంగా, మొత్తం గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. తద్వారా గర్భం ఆరోగ్యంగా ఉంటుంది.

గర్భధారణ సమయంలో చెరకు రసం తాగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Precautions to be Taken While Drinking Sugarcane Juice During Pregnancy in Telugu)

  1. గర్భధారణ సమయంలో చెరకు రసం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు, అయినప్పటికీ పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. కాబట్టి గర్భధారణ సమయంలో వీలైనంత వరకు రోడ్డు పక్కన దుకాణాలు లేదా డబ్బాల నుండి చెరుకు రసం తాగడం మానేయాలి.
  2. గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్న గర్భిణీ స్త్రీలు చెరకు రసం తీసుకోవడం నివారించాలి. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్లు, గ్లూకోజ్ అధికంగా ఉంటాయి.
  3. రక్తంలో గ్లూకోజ్ సాంద్రత పెరిగే ప్రమాదాన్ని తగ్గించడానికి చెరకు రసాన్ని ప్రతిరోజూ లేదా ప్రత్యామ్నాయ రోజులలో మితంగా తీసుకోవాలి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో సపోటా ప్రయోజనాలు & సైడ్ ఎఫెక్ట్స్(దుష్ప్రభావాలు)

ముగింపు (Conclusion)

గర్భధారణ సమయంలో చెరకు రసం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి, చెరకు రసం తీసుకోవడం వల్ల గర్భం లేదా పిండం ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ చెరకు రసం ప్రయోజనాలు ఆశ్చర్యకరమైనవి, ఆచరణాత్మకమైనవి. అయినప్పటికీ, గర్భధారణ సమయంలో ఈ చెరకు రసం ఆహారంలో చేర్చడానికి ముందు గైనకాలజిస్ట్ లేదా ప్రసూతి వైద్యుడిని సంప్రదించడం మంచిది.

References

1. A Singh, U R Lal, et al.; (2015). Phytochemical profile of sugarcane and its potential health aspects; Pharmacognosy Review

2. D McCaffrey; (2011). Raw Sugarcane Juice Nature’s Perfect Wonder Food; CDC

3. Gestational Diabetes Mellitus; (2003). American Diabetes Association Diabetes Care

Tags

Sugarcane Juice During Pregnancy in Telugu, Nutritional Value of Sugarcane Juice in Telugu, Is Sugarcane Juice Safe During Pregnancy in Telugu, Benefits of Sugarcane Juice During Pregnancy in Telugu, Precautions of Sugarcane Juice During Pregnancy in Telugu, Sugarcane Juice in Pregnancy in English, Sugarcane Juice in Pregnancy in Hindi, Sugarcane Juice in Pregnancy in Tamil, Sugarcane Juice in Pregnancy in Bengali

గర్భిణీ తల్లుల పోషణ ప్రయాణానికి నమ్మకమైన తోడు

మీ గర్భధారణ సమయంలో సమతుల్య పోషణ, ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కోసం సహాయపడే ఉత్పత్తులు మీ శ్రేయస్సును మెరుగుపరుస్తాయి.

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2005 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest

3672 Moms bought
₹499₹64923% Off
Rating
4.3
(88)
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress

530 Moms bought
₹917₹129829% Off
Rating
4.9
(50)
Organic Aloe Vera (300 ml)

Organic Aloe Vera (300 ml)

Nurtures Skin & Hair | Reduces Suntan | Soothes Burns | Enhances Hair Resilience

4133 Moms bought
₹289₹32912% Off
Rating
4.4
(45)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.