hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్: అర్థం, కారణాలు, రకాలు, చికిత్స arrow

In this Article

    ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్: అర్థం, కారణాలు, రకాలు, చికిత్స

    Getting Pregnant

    ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్: అర్థం, కారణాలు, రకాలు, చికిత్స

    3 November 2023 న నవీకరించబడింది

    అసలు ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి?

    ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ (IBS) అనేది కడుపులో, పేగులలో ఏర్పడే అనారోగ్య సమస్య. చాలావరకు లక్షణాలు జీర్ణాశయానికి సంబంధించినవే ఉంటాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధి. ఎక్కువ కాలం దీని ప్రభావం ఉంటుంది. దీర్ఘకాలిక చికిత్సలు, మందుల ద్వారా నియంత్రించవచ్చు. ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ లక్షణాలు మానవ శరీర తీరును బట్టి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలు తీవ్రంగా, మరికొన్ని సందర్భాల్లో తేలికపాటిగా ఉండవచ్చు. మనిషి తన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా ఈ రుగ్మత నుంచి బయటపడవచ్చు. ఒకవేళ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లయితే వైద్యుల్ని సంప్రదించి మందులు తీసుకోవడం మంచిది. కోలోరెక్టాల్ క్యాన్సర్, పేగులలో ఉండే కణజాల మార్పులకు ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ కారణం కాదు.

    GI ఫంక్షనల్ డిజార్డర్ అంటే ఏమిటి?

    జీఐ ఫంక్షనల్ డిజార్డర్ అనేది జీర్ణాశయం బయట పేగులలో ఏర్పడే వ్యాధి. మానవుడి కడుపులో పదేపదే వస్తున్న రుగ్మతను బట్టి తీవ్రతను నిర్ధారిస్తారు. జీఐ ట్రాక్ట్ పనితీరు సరిగ్గా లేనప్పుడు, జీఐ ఫంక్షనల్ డిజార్డర్ అనే రుగ్మత ఏర్పడుతుంది. జీఐ ఫంక్షనల్ డిజార్డర్‌ను ఎన్నో రకాల పరీక్షలు జరిపినా నిర్ధారించడం కష్టం.

    ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్‌లోని రకాలు

    ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ రకాలు నిర్ధారించడానికి మానవుడి పేగులలోని కదలికలు, రోగి బాధపడుతున్న తీవ్రతను బట్టి పలు రకాలుగా విభజిస్తారు. ఐబీఎస్ రకాన్ని బట్టి చికిత్స ఉంటుంది.

    ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ రకాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

    • IBS C - మలబద్ధకంతో IBS Cని నిర్ధారిస్తారు. ఈ లక్షణాలు మానవ వ్యర్ధాలను గట్టిగా, ముద్దగా మార్చివేస్తుంది.
    • IBS D - ఇది తీవ్రమైన విరేచనాలతో ఉంటుంది. దీనిని IBS D అంటారు. అతిసారం మాదిరిగా ఉండవచ్చు. విరోచనాలు క్రమంగా తగ్గకుండా ఉంటే దీనిని IBS D గా నిర్ణయిస్తారు.
    • ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఎం- మానవ వ్యర్ధాలు గడ్డలు గడ్డలుగా గట్టిగా, నీళ్ల విరేచనాలు కలిపి ఉంటే దాన్ని IBS M అని అంటారు.

    ఇరిటబుల్ బోవెల్ తీవ్రత ఎవరిపై ఎక్కువగా ఉంది?

    ఎవరికైతే విస్కెరల్ లైనింగ్‌లో రక్తపోటు ఉంటుందో, అలాంటి వారిలో ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పేగు సమస్యలు వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. తీవ్రమైన ఒత్తిడితో బాధపడే వారిలో ధూమపానం, మద్యపానం ఎక్కువగా చేసేవారిలో సైతం ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది.

    ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ కారణాలు

    ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి . అవి ఈ కింది వాటిగా చెప్పుకోవచ్చు.

    • కుటుంబంలో ఉన్న వ్యక్తి ఈ పేగు సమస్యలు ఉండటం ఐబీఎస్ రావడానికి ఓ కారణం. వంశపారంపర్యంగా ఐబిఎస్ వచ్చే అవకాశం ఉంది. ఇది వ్యక్తి యొక్క తరతరాలకు ఈ రుగ్మత రావచ్చు.
    • ఆహారపు అసహనం: మానవుడికి ఒకవేళ ఆహారం పట్ల అసహనము, సున్నితత్వం కలిగి ఉండటం, తరచుగా తింటూ ఉండటం వల్ల కూడా ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్‌కు కారణం కావచ్చు
    • డిస్మోటిలిటీ- పొట్టలోపల జీర్ణాశయంతార పేగుల్లో కదలిక సరిగ్గా లేకపోతే, జీర్ణ సంబంధమైన సమస్యలు వస్తాయి. ఆహారం స్వీకరించడంలో సమస్యలు ఏర్పడితే మనిషిలో డిస్మొటిలిటీ ఏర్పడి ఐబీఎస్‌కి దారితీస్తుంది.
    • నరాల్లో తీవ్ర సున్నితత్వం: మానవ శరీరంలోని గట్ నరాలు సున్నితంగా మారిన విసురల్ ప్రాంతంలో సమస్యలు ఏర్పడి, ఐబీఎస్‌కు కారమం కావచ్చు.
    • మానవ మెదడు గట్ సరిగ్గా పనిచేయకపోవడం: మనిషి మెదడు గట్ చాలా సున్నితమైన ప్రదేశము. ప్రాముఖ్యత కలిగినది. మెదడు గట్ మధ్య అనుసంధానము సరిగా లేనటైతే జీఐ ట్రాక్ట్ పనిచేయదు దీని. వల్ల కూడా ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలున్నాయి.

    ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ లక్షణాలు ఏంటీ?

    మానవుడిలో ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ లక్షణాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు తరచుగా పొత్తికడుపులో నొప్పి కలగడం, ఉబ్బరం, పదేపదే తిమ్మిర్లు రావడం లాంటివి ఐబీఎస్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. పేగుల కదలికలలో మార్పులు సంభవించినట్లయితే వెంటనే అనుభవజ్ఞులైన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ వైద్యుడిని సంప్రదించాలి.

    ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ చికిత్సలు ఏమిటి?

    ఇప్పటివరకు ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్‌ను నిర్ధారించడానికి సరైన పరీక్షలు ఏమీ లేవు. ఎవరికైనా ఐబీఎస్ అని అనుమానం ఉన్నట్లయితే వివిధ రకాలైన పరీక్షలు చేయించుకునేందుకు అనుభవజ్ఞులైన గ్యాస్ట్రియోఇంటరాలజిస్ట్ వైద్యులను సంప్రదించాలి. వైద్యుడు చేసిన పరీక్షల ద్వారా పరిస్థితిని బట్టి రోమ్ విధానాలను అనుసరించి, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్‌ను నిర్ధారిస్తారు. రోమ్ ప్రమాణాల ప్రకారం వారానికి ఒకసారి కనీసం మూడు నెలల పాటు పేగు కదలికలు కష్టతరమై.. కడుపు మళ్లీమళ్లీ వస్తుంటే ఐబీఎస్‌గా పరిగణించవచ్చు. దీంతో పాటు మల విసర్జన యొక్క ఫ్రీక్వెన్సీలో మార్పులు ఉంటాయి. లేదా మలం భిన్నంగా కనిపించవచ్చు. ఇది ఏ రకమైన ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్‌ని నిర్ధారిస్తారు. దీన్ని వ్యక్తి లక్షణాలు, కదలికలను బట్టి వైద్యులు ఏ రకమైన ఐబీయస్ అని పరిగణిస్తారు.

    ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ చికిత్సలు

    ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ తికిత్సలు చాలా రకాలుగా ఉన్నాయి. వ్యక్తుల భిన్న శరీర తత్వాలను బట్టి ఇది మారొచ్చు. కాబట్టి అందరికీ ఒకే రకమైన చికిత్స పనిచేయదు. అయితే ఐబీఎస్ లక్షణాలు ఉన్న వ్యక్తి అనుభవజ్ఞులైన గ్యాస్ట్రియోఎంట్రాలజిస్ట్ సలహాలు సూచనలు నిర్ధారణ చేయించుకోవాలి. రోగి యొక్క పరిస్థితిని మెరుగుపరచడానికి వైద్యులు ఆహారపు అలవాటు, జీవనశైలిలలో మార్పులు తీసుకురావాలని సూచిస్తారు. ఎక్కువగా నీరు తాగమని, ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉండేలా చూడాలని, కాఫీ టీ లాంటి పదార్థాలకు దూరంగా ఉండమని చెబుతారు. ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్‌కు గురైన వ్యక్తి ఆహారపు అలవాట్లను బెరీజు వేసుకొని వేసుకొని, రక్త పరీక్షలను కూడా చేయిస్తారు. ఉదాహరణకు వ్యక్తి లోపల లాక్టోస్ లోపం ఉన్నట్లయితే కాల్షియం లభించే ఆహారపదార్థాలు తినమని సలహా ఇస్తారు. పాలను వాడకూడదని చెప్తారు.

    ఐబీఎస్ ఉన్న వ్యక్తి పైన చెప్పిన అలవాట్లను మార్చుకుంటూ, శరీరానికి కావాల్సిన వ్యాయామాలు కూడా క్రమం తప్పకుండా చేయాలి. ఒకవేళ తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతూ, ఐబీఎస్ తీవ్రంగా ప్రభావితం చేస్తుంటే, యాంటీ డిప్రెషన్, యాంటీ స్ట్రెస్ మందులు, సప్లిమెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్): చికిత్స, నిర్వహణ

    వైద్యుడిని ఎప్పుడు కలవాలి

    ఒకవేళ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ లక్షణాలు ఉన్నట్లయితే, బొడ్డు కింద భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటే వైద్యుల్ని సంప్రదించాలి. ఐబీఎస్‌ను గుర్తించడంలో సమయం చాలా పడుతుంది. దీని నిర్ధారణకు ఎన్నో రకాల పరీక్షలను జరపాల్సి ఉంటుంది. ఐబీఎస్‌కు సరైన చికిత్స కోసం సరైన రోగ నిర్ధారణ చాలా ముఖ్యం.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Sarada Ayyala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Related Topics

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.