
తల్లిదండ్రులుగా ఉండటం అనేది మాన్యువల్‌గా రాదు. అంతేకాకుండా పిల్లలందరూ భిన్నంగా ఉంటారు. కాబట్టి ప్రతి చిన్న విషయం మిమ్మల్ని భయపెడుతూ ఉండవచ్చు. మొదట, మీరు మీ శిశువు యొక్క శరీర ద్రవాల గురించి చాలా ఆందోళన చెందుతూ ఉండచ్చు. కానీ శుభవార్త ఏంటంటే, మీ శిశువు మొదటి 6 నుండి 12 నెలల్లో తరచుగా మల విసర్జన,మూత్ర విసర్జన చేయడం మరియు వాంతి చేసుకోవడం (కక్కడం) సాధారణం. మలం, మూత్ర విసర్జన మరియు శిశువు కక్కడం విషయానికి వస్తే మీరు ఏమి ఆశించాలి, ఎప్పుడు ఆందోళన చెందాలి అనే వివరాలు ఇక్కడ ఉన్నాయి.
పిల్లలు చాలా మల విసర్జన చేస్తారు. ఇతరులకన్నా ఎక్కువ చేస్తారు. తల్లిపాలు తాగే చాలా మంది పిల్లలు తల్లి పాలు ఇస్తున్నప్పుడు లేదా తర్వాత తరచుగా విసర్జన చేస్తారు. దీనికి విరుద్ధంగా, డబ్బా పాలు తాగే శిశువులు కొన్ని రోజులకు ఒకసారి మాత్రమే మల విసర్జన చేయవచ్చు. ఒక్కోసారి పిల్లలు వేరువేరు సమయాల్లో మలవిసర్జన చేయవచ్చు. కాకపోతే శిశువు చురుకుగా ఉన్నంత కాలం, మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ శిశువు అసౌకర్యంగా ఉన్నట్లు మీరు గమనిస్తే, అంతా సవ్యంగా ఉందని నిర్ధారించుకోవడానికి మీ వైద్యుడిని సంప్రదించండి.
పసి పిల్లలకు పాటీ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి? అందుకోసం కొన్ని టిప్స్!
పిల్లలు మల విసర్జన కంటే ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తారు. వాళ్ల స్ప్రింగులు వదులవ్వటానికి కొంత సమయం పట్టవచ్చు కానీ, డెలివరీ అయిన 2 నుండి 5 రోజుల తర్వాత, శిశువు రోజుకు 8 నుండి 10 డైపర్లను ఉపయోగిస్తుంది. కాకపోతే మిగతా విషయాల లాగానే, ఇక్కడ కూడా మినహాయింపులు ఉంటాయి. మీ బిడ్డ రోజుకు 4 నుండి 5 గుడ్డలు తడి చేయకపోతే, అంతా సవ్యంగానే ఉందని నిర్ధారించుకోవడానికి మీ వైద్యుడిని సంప్రదించండి. కొన్నిసార్లు మీ బిడ్డ మూత్ర విసర్జన చేశారనే విషయాన్ని ఈ రోజు దొరికే ఎక్స్ ట్రా అబ్జార్బెన్ట్ (ఎక్కువ తడిని పీల్చుకునేవి) డైపర్‌లు కప్పిపుచ్చవచ్చని తెలుసుకోండి. మూత్రం తాకినప్పుడు రంగును మార్చే అబ్జార్బెన్ట్ లైన్ కలిగి ఉన్న డైపర్‌ల కోసం వెతకండి.
కొంతమంది పిల్లలు రోజుకు 12 సార్లు కంటే ఎక్కువ కక్కుతారు! కొంతమంది పిల్లలు కొద్దిగా ఉమ్మి వేస్తారు, మరికొందరు వాంతి చేసుకుంటారు. శిశువు ప్రతిదీ బయటకు తీస్తుంటే మీ బిడ్డకు తగినంత పోషకాహారం లభిస్తుందో లేదో మీరు కంగారు పడుతూ ఉండవచ్చు. కానీ మీ బిడ్డ క్రమం తప్పకుండా మూత్ర విసర్జన మరియు విసర్జన మల చేస్తున్నంత కాలం మీరు మనశ్శాంతిగా ఉండవచ్చు. ఎందుకంటే ఆహారంలో ఎక్కువ భాగం ఇప్పటికే శరీరంలో జీర్ణమై ఉంటుంది. ఎందుకంటే బయటకు వచ్చే వాటిలో ఎక్కువ భాగం ఆహారంతో కలిసిన కడుపులోని పిత్తం.
మీ బిడ్డ ఆపకుండా వాంతి చేస్తుంటే, భోజనం నియమిత సమయాల్లో కొంచెం కొంచెం ఇవ్వడానికి ప్రయత్నించండి. మీరు మీ బిడ్డకు చనుబాలు ఇచ్చిన తర్వాత జీర్ణం అయ్యేందుకు వారిని నిటారుగా ఉంచి వారి వీపును రుద్దవచ్చు. వారు వాంతులు చేసుకోకుండా ఉండేందుకు వారికి త్రేన్పులు వచ్చేలా చేసేందుకు ప్రయత్నించండి. కక్కుకోవడం అనేది చాలా మంది పిల్లలు చేసే సాధారణమైన విషయం అయినా, మీ బిడ్డ చిరాకుగా లేదా అసౌకర్యంగా ఉన్నట్లు కనిపిస్తే, అది రిఫ్లక్స్ లేదా మిల్క్ అలర్జీ సమస్య కావచ్చు. ఇది కానీ మీ బిడ్డకు హాని కలిగించే మరేదైనా సూచనను మీరు గమనిస్తే, మీ శిశువైద్యునితో అపాయింట్‌మెంట్‌ని షెడ్యూల్ చేయండి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: మీ శిశువు ఆరోగ్యంగా ఉందని చెప్పే 8 సాధారణ గుర్తులు
సరైన టెక్నిక్, సమయం మరియు తల్లిపాలు ఇచ్చే వ్యవధి శిశువు యొక్క జీర్ణవ్యవస్థపై ఖచ్చితంగా మంచి ఫలితాలను కలిగి ఉంటుంది. సందేహం కలిగినప్పుడు, వైద్య నిపుణుల సలహాను తీసుకోండి! అనుమానం కలిగినప్పుడు అడగటం ఎప్పుడు మంచిదే
Baby poop in telugu, All you need to know about baby poop in telugu, baby pee and baby spit-up information in telugu, Everything you need to know about baby poop, pee, and spit-up in English, Everything you need to know about baby poop, pee, and spit-up in Hindi, Everything you need to know about baby poop, pee, and spit-up in Tamil, Everything you need to know about baby poop, pee, and spit-up in Bengali.
Yes
No















Ma Babu ki 3 ma running every feeding tharuvatha motion velthunnadu any thing problem
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |