Want to raise a happy & healthy Baby?
Baby Sleep Management
28 April 2023 న నవీకరించబడింది
కొత్త తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే సంక్లిష్టమైన ప్రశ్నలలో ఒకటి "పసి పిల్లలను ఎలా పడుకోబెట్టాలి?" అనేది. పసి పిల్లలలో సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ ప్రమాదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వారు నిద్రలో ఉన్న సమయంలో అనుకోని ఇబ్బందుల వలన ప్రాణాలను పోగొట్టుకునే అవకాశం ఎక్కువ. అందుకే వారు నిద్ర పోతున్న సమయంలో అప్రమత్తంగా చూసుకుంటూ ఉండాలి. అలాగే.. వారు పడుకునే పొజిషన్ ను కూడా గమనించుకుంటూ ఉండాలి.
సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ (SIDS) ప్రమాదాన్ని నివారించడానికి సురక్షితమైన నిద్ర గురించి సలహాలకు కొరత లేదు. అయితే మీ బిడ్డ రాత్రిపూట దొర్లుతూ అతని/ఆమె పొట్టపై నిద్రపోతే? ఇది సురక్షితమేనా? అన్న సందేహం చాలా మంది కొత్త తల్లితండ్రులతో కలుగుతూ ఉంటుంది. ఈ ప్రమాదం గురించిన సందేహాలు మీకు కూడా ఉంటె.. వాటి నివృత్తి కోసం ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవండి.
మొదటి సంవత్సరంలో పిల్లలు వారి వెన్నుపై నిద్రించడం చాలా ముఖ్యం. ఒక సంవత్సరం తర్వాత ఎటువంటి ఆరోగ్య ప్రమాదాలు లేకుండా పిల్లలలో SIDS ప్రమాదం తగ్గుతుంది. మొదటి ఏడాది వారికి శరీరంలో అవయవాలు పూర్తి పటిష్టంగా ఉండవు. మొదటి ఏడాదిలో వారి వెన్ను గట్టిపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరియు ఈ సమయంలో వారు వారి వెన్నుపై నిద్రించడం ద్వారం SIDS ప్రమాదాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది.
పొట్టపై పడుకోవడం వలన వారికి ముక్కు మూసుకునిపోయి శ్వాసకి ఇబ్బంది ఎదురుకావచ్చు. వారికి తల తిప్పి పడుకోవాలన్న విషయం కూడా తెలియదు. కాబట్టి వారికి తెలియకుండానే శ్వాస సమస్యతో ఇబ్బంది పడతారు. అందుకే వారికి కొంత జ్ఞానం వచ్చి, శారీరకంగా బలం వచ్చే వరకు వెల్లకిలా పడుకోవడమే సరైనది.
పొట్టపై నిద్రపోవడం SIDS ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇతర అధ్యయనాలు కూడా శిశువు స్వయంగా విడిచిపెట్టిన శ్వాసను పీల్చినప్పుడు ఎగువ శ్వాసనాళంలో అడ్డంకి ఏర్పడుతుంది. ఇది కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరగడానికి మరియు ఆక్సిజన్ స్థాయిలను తగ్గించడానికి కారణమవుతుంది అని సూచిస్తున్నాయి. వదులుతున్న శ్వాసను పీల్చడం వల్ల శరీరంలోని వేడిని తప్పించుకోవడం కష్టతరం అవుతుంది. ఫలితంగా శరీరం వేడెక్కుతుంది. బొడ్డుపై నిద్రిస్తున్న శిశువులకు రక్తపోటు కూడా అకస్మాత్తుగా తగ్గుతుంది.
శిశువు ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడటానికి మీరు అనుసరించాల్సిన పద్ధతుల్లో ఒకటి స్వాడ్లింగ్. ఇది పాత పద్ధతి, ఇది అవయవాల (కాళ్లు, చేతులు) కదలిక పరిమితం చెయ్యడానికి శిశువులను దుప్పటి లేదా గుడ్డలో చుట్టడం. కాకపోతే తప్పుగా చేస్తే, శిశువు వేడెక్కడం వంటి కొన్ని ప్రమాదాలు జరగవచ్చు. ఇది సరైన మార్గంలో చేశారని నిర్ధారించుకోవడానికి, దుప్పటి చాలా గట్టిగా ఉందా అని చెక్ చేయండి. శిశువు యొక్క ఛాతి మరియు స్వాడిల్ మధ్య మూడు వేళ్లను ఉంచి టైట్ గా ఉందా అని చెక్ చేసి సరి చెయ్యండి.
పొట్ట మీద నిద్రపోవడం మంచిదే కానీ వారు ఒక సంవత్సరం మైలురాయిని దాటిన తర్వాత మాత్రమే వారిని పొట్ట మీద నిద్రపోయేందుకు అనుమతించవచ్చు. అంతే కాకుండా వారు సురక్షితమైన వాతావరణంలో నిద్రపోతున్నారని మీరు నిర్ధారించుకోవాలి.
Yes
No
Written by
Dhanlaxmi Rao
పసి పిల్లలకు ఏ వయసులో ఎంత నిద్ర అవసరం అవుతుంది? ఇప్పుడే తెలుసుకోండి!
పిల్లల మానసిక అభివృద్ధికి ఎలాంటి యాక్టివిటీస్ ఉండాలి? ఓ లుక్ వేయండి!
మీ బిడ్డకి వచ్చినది జలుబా లేదా అలెర్జీనా అన్న తేడాని ఎలా కనిపెట్టాలి?
పిల్లలలో అంబిలికల్ హెర్నియా (బొడ్డు) గురించి మీకు తెలియాల్సిన నిజాలు..!
అబార్షన్ తర్వాత.. ప్రెగ్నెన్సీ రావడం కష్టం ఎందుకు కష్టం అవుతుంది?
పుట్టు వెంట్రుకలు ఎందుకు తీయిస్తారు? తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆచారానికి కల ప్రాముఖ్యత ఏమిటి?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Vitamin C | Tea Tree | Aloe Vera | Rose Water | Skin - Hair Care | SHOP BY CONCERN | Hairfall | Dry and Damaged Hair | Hair Growth | Shop By Ingredient | Onion | Coconut | Skin - Fertility | By Concern | PCOS | Pregnancy Test Kit | Fertility For Her | Ovulation Test Kit | Fertility For Him | By Ingredient | Cloth Diaper | Maternity dresses | Stretch Marks Kit | Stroller |