Pregnancy
4 April 2023 న నవీకరించబడింది
గర్భం దాల్చడం అనేది ప్రతి స్త్రీకి ఒక వరం లాంటిది. పెళ్లి అయిన స్త్రీలు తమ ప్రేమకి ప్రతిరూపంగా పుట్టబోయే బిడ్డ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే.. పురిటి నొప్పులు ఎంత కష్టతరమైనా వాటిని ఇష్టంగా భరించడానికే స్త్రీలు ఆసక్తి చూపిస్తారు. తమ బిడ్డని చూసుకోవాలని ఎంతగానో ఆశపడతారు. అయితే పుట్టేది ఆడబిడ్డ అయినా, మగబిడ్డ అయినా క్షేమంగా ఉండాలని ప్రతి తల్లి తండ్రులు కోరుకుంటారు.
అయితే.. కొంతమందికి ఆడపిల్లని కనాలని మరికొంతమందికి మగ పిల్లాడిని కనాలని ఉంటుంది. అయితే.. ఎవరు పుడతారు అన్న విషయం మాత్రం దైవేచ్ఛ. నెలలు నిండి డెలివరీ అయ్యేవరకూ ఎవరు పుడతారు అన్న కుతూహలం ఉంటూనే ఉంటుంది. అయితే.. హిందువుల వైదిక కర్మలలో రెండవ కర్మ అయిన పుంసవనం ద్వారా మగబిడ్డని లేదా ఆడబిడ్డని పొందవచ్చు.
ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, ఇది వేదాలలో చెప్పబడింది. పుంసవన అనేది గర్భం కనిపించడం ప్రారంభించినప్పుడు, సాధారణంగా గర్భం దాల్చిన మూడవ నెలలో లేదా తర్వాత మరియు సాధారణంగా గర్భంలో పిండం కదలడానికి ముందు ఆచరించే ఆచారం. గర్భంలో పిండం అభివృద్ధి చెందుతూ ఉండగా ఈ ఆచారాన్ని జరిపిస్తుంటారు. అలాగే ఈ వేడుకను స్త్రీ గర్భం పదిలంగా ఉండడానికి, పుట్టబోయే బిడ్డ ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండి సుఖ ప్రసవం అయ్యేలా ఉండాలని జరిపిస్తారు.
పుంసవన ఆచారం యొక్క మూలాలు అథర్వ వేదంలో 4.3.23 మరియు 4.6.2 సెక్షన్లలో కనిపిస్తాయి. (1) అథర్వ వేదంలో గర్భస్రావాలను నివారించడానికి, లింగం గురించిన మంత్రాలు కూడా ఉన్నాయి. అలాగే.. కుమార్తె లేక కుమారుడు కలగడం కోసం అందుకు తగిన ఆహరం తీసుకోవాలని కూడా సూచించబడింది.
ఈ వేడుకను ప్రాంతాన్ని బట్టి అక్కడి పద్ధతిలో జరిపిస్తుంటారు. అయితే.. అన్నిటి ఉద్దేశ్యం ఒక్కటే. భర్త తన భార్యకి ఏదైనా ఆమె కోరింది అందించడమే. ఒక పద్ధతి లో అయితే పెరుగు, పాలు మరియు నెయ్యి (స్పష్టమైన వెన్న) కలిపిన పేస్ట్ మిశ్రమాన్ని భర్త భార్యకు అందిస్తాడు. కొన్ని పద్ధతులలో యజ్ఞాన్ని నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణను జరిపిస్తారు. వేద మంత్రాల సమక్షంలో భర్త మర్రి ఆకుల రసాన్ని తాను కుమారుడు కావాలనుకుంటే భార్య కుడి నాసికా రంధ్రంలోను, కుమార్తె కావాలనుకుంటే ఎడమ నాసికా రంధ్రంలోను వేస్తారు. అలాగే ఈ వేడుకకు హాజరైన అందరికి విందు భోజనాన్ని పెట్టిస్తారు.
భారతీయ పురాతన ఆచారాలలో చెప్పబడ్డ పుంసవనం గురించి ఈ ఆర్టికల్ లో వివరించడం జరిగింది. ప్రస్తుత కాలంలో కేవలం ఆడపిల్లలే కావాలని, కేవలం మగపిల్లలే పుట్టాలని ఎవరూ గిరి గీసుకుని కోరుకోవడం లేదు. ఎవరు పుట్టినా.. వారికి ఆనందంగా ఆహ్వానం పలుకుతున్నారు. అయితే.. ఇటువంటి సంప్రదాయాలు కూడా ఉన్నాయి అని తెలుసుకోవడం కోసమే ఈ ఆర్టికల్ ను ఇవ్వడం జరిగింది.
Yes
No
Written by
Sarada Ayyala
Get baby's diet chart, and growth tips
గర్భధారణ సమయంలో ఎకోస్ప్రిన్ ఎందుకు సిఫారసు చేయబడుతుంది?
భారతదేశంలో సరైన కార్డ్ సెల్ బ్యాంకులని ఎలా ఎంచుకోవాలి
పిలోనిడల్ సిస్ట్ (తిత్తి) అంటే ఏమిటి? కారణాలు, చికిత్స మరియు లక్షణాలు
బారసాల అంటే ఏమిటి..? ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు జరిపించాలి?
పుణ్యవచనం అంటే ఏమిటి? డెలివరీ అయ్యిన తరువాత ఈ ఆచారం ఎందుకు పాటిస్తారు?
అన్నప్రాశన అంటే ఏమిటి? పిల్లలకు అన్నప్రాశన ఎప్పుడు చేయాలి?
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |