This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

సీమంతం అంటే ఏమిటి? గర్భవతులకు ఈ వేడుకని ఎందుకు జరిపిస్తుంటారు?

Pregnancy
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: May 29, 2026
సీమంతం అంటే ఏమిటి? గర్భవతులకు ఈ వేడుకని ఎందుకు జరిపిస్తుంటారు?
Likes4 Likes|
Read time4 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • సీమంతం అనేది గర్భిణీ స్త్రీలకు జరిపే వైదిక వేడుక, హిందువుల షోడశ సంస్కారాలలో ఒకటి. తల్లి, బిడ్డ, తండ్రి క్షేమాన్ని కోరుతూ ఈ వేడుకని జరిపిస్తారు.
  • సాధారణంగా ఏడవ నెలలో సీమంతం జరిపిస్తారు, కొన్ని ప్రాంతాలలో ఐదవ లేదా తొమ్మిదవ నెలలో కూడా చేస్తారు. తల్లికి సౌభాగ్యం, బిడ్డ క్షేమమే ప్రధాన ఉద్దేశ్యం.
  • వేడుక సమయంలో గర్భిణీకి పారాణి, కుంకుమ, గాజులు తొడిగి, ఒడిలో చలిమిడి, పండ్లు, పువ్వులు పెడతారు. గాజులు సుఖ ప్రసవానికి సహాయపడతాయని నమ్మకం.
  • గర్భిణీ సంరక్షణకు ఏ ఉత్పత్తులు సహాయపడతాయి? Explore our Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g.
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
Stretch Marks Kit (Stretch Mark Oil + Stretch Marks Cream - 100ml each)
Stretch Marks Kit (Stretch Mark Oil + Stretch Marks Cream - 100ml each)
Rating4.5
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Rating4.2

గర్భం దాల్చడం అనేది ప్రతి స్త్రీకి ఒక వరం లాంటిది. పెళ్లి అయిన స్త్రీలు తమ ప్రేమకి ప్రతిరూపంగా పుట్టబోయే బిడ్డ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే.. పురిటి నొప్పులు ఎంత కష్టతరమైనా వాటిని ఇష్టంగా భరించడానికే స్త్రీలు ఆసక్తి చూపిస్తారు. తమ బిడ్డని చూసుకోవాలని ఎంతగానో ఆశపడతారు.

సీమంతం అంటే ఏమిటి?

తొమ్మిది నెలల పాటు తమ బిడ్డని కడుపులో మోస్తూ ఎన్నో కలలు కంటుంటారు. ఈ తొమ్మిది నెలల కాలం వారు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. గర్భిణీ కుటుంబ సభ్యులు కూడా ఆమెకు సహకరిస్తూ ఆమె సంతోషంగా బిడ్డకి జన్మనిచ్చేలా చూసుకుంటారు. అయితే.. తల్లి, బిడ్డతో పాటు తండ్రి క్షేమాన్ని కూడా ఆశిస్తూ చేసే వైదిక వేడుకని సీమంతం అని పిలుస్తారు. హిందువులు జరుపుకునే షోడశ సంస్కారాలలో సీమంతం ఒకటి. జన్మకి ముందే ఈ వేడుకని జరిపిస్తారు. దీనిని సంస్కృతంలో "సీమంతోన్నయన" అని పిలుస్తుంటారు. సీమంతాన్నే పాపిడి తీయడం అని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటుంటారు. అంటే.. భర్త తన భార్యని పాపిడి తీసినంత జాగ్రత్తగా, అపురూపంగా చూసుకోవాలనే ఉద్దేశ్యంలో ఇలా అంటారు.

సీమంతం ఎవరికి చేస్తారు?

తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఈ వేడుకను జరుపుకుంటుంటారు. గర్భం దాల్చిన తరువాత ఏడవ నెల నడుస్తున్న గర్భిణీ స్త్రీలకు ఈ వేడుకను జరిపిస్తారు. కొన్ని ప్రాంతాలలో గర్భం దాల్చిన ఐదవ నెలలోను, మరికొంతమంది తొమ్మిదవ నెల వచ్చిన తరువాత ఈ వేడుకను జరిపిస్తుంటారు. ఎవరు ఎప్పుడు జరిపినా.. తల్లికి సౌభాగ్యము, బిడ్డ క్షేమంగా ఉండడమే ఈ వేడుక ప్రధాన ఉద్దేశ్యం.

సీమంతం వేడుక సమయంలో ఏమి చేస్తారు?

వాస్తవానికి సీమంతాన్ని ప్రతి భర్తా, తన భార్యకు దగ్గర ఉండి చేయాల్సిన వేడుక. ప్రస్తత కాలంలో అది కేవలం ఆడవారి వేడుకగా నిర్వహించబడుతోంది. ఈ వేడుక జరిపే రోజున తల్లి గర్భం దాల్చిన తన కూతురు కాళ్ళకి పారాణి రాసి, నుదుటిన కుంకుమ పెట్టి, చేతికి గాజులను తొడిగి, ఒడిలో చలిమిడిని పెడుతుంది. అలాగే ఆమెకు, ఆమె అత్తగారికి కొత్త చీరని పెడుతుంది. అలానే, రకరకాల స్వీట్స్, పువ్వులను, పండ్లను కూడా ఒడిలో పెడుతుంది.

ఈ వేడుక రోజున భర్త తేనే, ఆవు పాలు, మేడి రసం, మద్ది పాలు కలగలిపిన మిశ్రమంలో ముళ్ల పంది ముల్లుని ముంచి భార్య పాపిడి మొదలు నుంచి చివరి వరకు రాసి.. తరువాత ఆ ముల్లుని గర్భానికి రక్షగా కడతారు. శాస్త్రంలో పంది ముల్లు ఆయుష్షు కారకుడైన శనీశ్వరునికి ప్రతీకగా చెప్పబడింది.

అందుకే పంది ముల్లుని ఉపయోగించి పైన చెప్పిన విధంగా రాయడం వలన పుట్టబోయే శిశువు ఆయుష్మంతుడు అవుతాడని శాస్త్రోక్తి. అయితే.. ప్రస్తుతం ఈ విధానాన్ని చాలా మంది మర్చిపోయారు. కేవలం తల్లి తండ్రులు, అత్తమామలు, భర్త, ముత్తైదువులు ఆశీర్వచనాలు, గాజులు తొడగడం వంటివి మాత్రమే పాటిస్తున్నారు. ఇది భర్త భార్యకు చేయవలసిన వేడుక. కానీ.. ఆడవారి వేడుకగా జరిగిపోతోంది. ఈ వేడుకని ఏడవ నెలలో చేస్తే అత్యుత్తమ ఫలితం, ఐదవ నెలలో చేస్తే మధ్యమ ఫలితం, తొమ్మిదవ నెలలో చేస్తే అథమ ఫలితాలు లభిస్తాయి.

సీమంతంలో గాజులు ఎందుకు తొడుగుతారు?

తెలుగు వారికి ఎన్ని శుభకార్యాలు ఉన్నప్పటికీ.. వేటిలోనూ లేని విధంగా సీమంతం వేడుకలో గాజులు తొడిగే సంప్రదాయం ప్రాముఖ్యత సంతరించుకుంది. గర్భిణీ స్త్రీకి గాజులు తొడిగి.. పండంటి బిడ్డకు జన్మనివ్వాలి అంటూ ముత్తైదువులు ఆశీర్వదిస్తారు. ఆలా ఎందుకు చేస్తారంటే.. గర్భం దాల్చిన స్త్రీలకు గర్భకోశంపై ఎక్కువగా జీవనాడుల ఒత్తిడి అవసరం అవుతుంది. azచేతులలో ఉన్న నరాలకు, గర్భకోశం వద్ద నరాలకు అవినాభావ సంబంధం ఉండడం వలన చేతులకు ఎక్కువ సంఖ్యలో గాజులు తొడిగిస్తారు. ఈ గాజుల వలన గర్భకోశం వద్ద ఉన్న జీవనాడులపై కూడా ఒత్తిడి పడి సుఖ ప్రసవం జరుగుతుంది. అంతర్లీనంగా ఎన్నో మంచి ఉద్దేశ్యాలతోనే పెద్దలు ఇటువంటి వేడుకలకు నాంది పలికారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

బిడ్డ పుట్టకుండానే ఈ వేడుకని ఎందుకు జరపాలి?

బిడ్డ జాతక ప్రభావం బిడ్డ ఆరోగ్యంపైనా, తల్లి తండ్రుల పైనా పడకుండా ముగ్గురి క్షేమాన్ని ఆశించి ఈ వేడుకని జరిపిస్తారు. అయితే.. బిడ్డ పుట్టిన తరువాత కదా జాతకం తెలిసేది.. ఈ వేడుకని ముందే ఎందుకు జరిపిస్తారు అన్న సందేహం కలగొచ్చు. పెళ్లి అయిన తరువాత భార్య భర్తలకు శోభనం అనే వేడుకని చేస్తారు. వారిద్దరూ భార్య-భర్త అన్న పిలుపు నుంచి అమ్మ-నాన్న అన్న పిలుపుకు చేరుకోవాలి అనే ఉద్దేశ్యంతో మంచి ముహుర్తాన్ని నిర్ణయించి శోభనం జరిపిస్తారు.

కానీ.. అనుకోకుండా ఈ ముహుర్తాలలో ఉండే పొరపాట్లు తల్లి-తండ్రి-బిడ్డ పాలిట ప్రమాద హేతువుగా మారే అవకాశం ఉంటుంది. ఇటువంటి దోషాలకు శాంతి జరిపించే దిశగా.. తల్లికి మంచి ఆరోగ్యం, తండ్రికి ఆర్ధిక ఉన్నతి, బిడ్డకు బాల పీడలు లేకుండా ఉండాలని భావిస్తూ సీమంతం వేడుక జరిపిస్తారు.

గర్భిణీ తల్లుల ప్రత్యేక సంరక్షణకు నమ్మకమైన తోడు

ఈ ప్రత్యేక సమయంలో మీ ఆరోగ్యం, చర్మ సంరక్షణ, సౌకర్యం కోసం రూపొందించిన ఉత్పత్తులతో మీ ప్రయాణాన్ని సులభం చేసుకోండి.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.