

Pregnancy
5 April 2023 న నవీకరించబడింది
ఎన్నో సంప్రదాయాలు కల భారత దేశంలో హిందూ సంప్రదాయానికి చాలా విశిష్టత ఉంది. అయితే.. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న తరువాత స్త్రీలు తమ భర్త చేత కాలికి మెట్టెలు తొడిగించుకుంటారు. వివాహం అయిన తరువాత స్త్రీలు ఈ మెట్టే ధరించడాన్ని తప్పని సరి చేసుకుంటారు. పెళ్లి అయిన స్త్రీలలో చాలా మంది తమ కాళ్ళకి మెట్టెలు ధరించి ఉండడం మీరు చూడవచ్చు.
ప్రస్తుతం మారిన జెనరేషన్ కాలానుగుణంగా తాళిని ధరించడం లేదు. కానీ మెట్టెలని ధరించడం మాత్రం కొనసాగిస్తున్నారు. అయితే.. మెట్టెలు ఆడవారు మాత్రమే ధరించడానికి కారణం లేకపోలేదు. కొందరు శాస్త్ర రీత్యా ఈ మెట్టెలను ధరిస్తూ వస్తున్నారు. కానీ.. ఈ మెట్టెలు ధరించడంలో ఆడవారి ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉంది. ఆ రహస్యం ఏమిటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
ఆడవారి గర్భ కోశంలోని నరాలకు మరియు కాలి వేళ్ళకు సంబంధం ఉందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. కాలి వేళ్ళకు మెట్టెలు పెట్టడం వలన అక్కడ నుంచి ఇతర శరీర భాగాలకు కనెక్ట్ అయిన నరాల ద్వారా గర్భ సంబంధమైన వ్యాధులు తలెత్తకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
బొటన వేలి పక్కన ఉండే కాలి వేళ్ళకు ఉండే నరాలను బాల చేరు నరాలు అంటారు. గర్భధారణ సమయంలో ఈ నరాలు మరింత యాక్టివ్ గా మారతాయట. కాలికి మెట్టెలు ఉండడం వలన ఇవి ఆ నేరాలపై ఒత్తిడి చేసి మసాజ్ చేస్తాయట. ఆ ఒత్తిడి కారణంగా కడుపులో ఉండే శిశువుకు కదలికలు బాగుంటాయట. కదలికలు సక్రమంగా ఉంటె.. బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
ఇలా మెట్టెలు ధరించడం స్త్రీలకు మాత్రమే కాదు పురుషులకు కూడా ఆరోగ్యం చేకూరుస్తుంది. రాగి తీగను వేలికి చుడుతూ మెట్టెలా ధరిస్తే వారికి కూడా ఈ నరాలపై ఒత్తిడి పడి లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న పురుషులు ఇలా చేయడం ద్వారా త్వరలోనే సంతానాన్ని పొందవచ్చు.
ఓ విదేశీ సర్వేలో కాలికి మెట్టెలు ధరించడం గురించి ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సర్వే ప్రకారం మగ వారి కంటే ఆడవారికి కామ వాంఛ ఎక్కువగా ఉంటుంది అని, మెట్టెలు ధరించడం వలన వారి కోరికలు అదుపులో ఉంటాయని తేలింది. అంతేకాకుండా మనలో ఉండే ఒత్తిడి కూడా అదుపులో ఉంటుందట.
హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం వెనుక, ప్రతి ధర్మం వెనుకా సైన్స్ కు తెలియని నిగూడార్ధాలు దాగి ఉన్నాయి. కొన్ని సంప్రదాయాల అర్ధాలు సైన్స్ కూడా ఆమోదించినప్పటికీ చాలా వరకు ఉద్దేశ్యాలను మనం తెలుసుకోలేదు. శరీర ఆరోగ్యాన్ని కాపాడే ఇటువంటి సంప్రదాయాలను ఆచరించడం ప్రతి ఒక్కరికీ ఆవశ్యకమే.
Yes
No

Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips











మీ ప్రీ స్కూలర్ (3-5సంవత్సరాల పిల్లలు) మరియు వారి బెడ్ టైమ్

ఆండ్రాలజి: అర్థం మరియు నిర్ధారణ పరీక్షలు

పర్ఫెక్ట్ నైట్-టైమ్ మేకప్ కోసం సులువైన 8 బ్యూటీ టిప్స్

గర్భధారణ సమయంలో ఎకోస్ప్రిన్ ఎందుకు సిఫారసు చేయబడుతుంది?

పిలోనిడల్ సిస్ట్ (తిత్తి) అంటే ఏమిటి? కారణాలు, చికిత్స మరియు లక్షణాలు

బారసాల అంటే ఏమిటి..? ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు జరిపించాలి?