
పుట్టినప్పుడు శిశువు మెదడులో సుమారు 100 బిలియన్ న్యూట్రాన్లు ఉంటాయి. అంటే ఇంచుమించు మన నక్షత్ర మండలంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని అన్నమాట. శిశువు పుట్టిన మొదటి కొన్ని సంవత్సరాల పాటు వారి మెదడులోని కణాల మధ్య సంబంధాలు వృద్ధి అవుతూ, మానసిక వికాసం చాలా త్వరితంగా జరుగుతుంది. అయితే ఈ పెరుగుదల చక్కగా సాగాలంటే, వారి ఎదుగుదల అర్థవంతంగా తీర్చిదిద్దబడాలంటే, దానికి మంచి మార్గదర్శనం అవసరం అవుతుంది. అక్కడే తల్లిదండ్రులు, ఇంట్లోవారు శ్రద్ధ వహించవలసి ఉంటుంది.
పసిపిల్లల మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడానికి, భాషను నేర్చుకోవడానికి తయారుగా ఉంటుంది. దానిని మనం శ్రద్ధగా గమనిస్తూ, వారు అవన్నీ నేర్చుకునేలా వారికి శిక్షణను ఇవ్వాలి. వారితో కూడా ఉంటూ, వారికి నచ్చే ఆటపాటలతో వారిలోని నైపుణ్యాన్ని పెంపొందింప చేయడం చాలా ముఖ్యం.
మీకు ఇది కూడా నచ్చుతుంది: మీ శిశువుని ఇంకా పసిబిడ్డని సంతోషకరంగా ఎలా పెంచాలి : పుట్టుక నుండి 12 నెలల వరకూ
పసిపిల్లలతో ఉన్నప్పుడు వారు చేసే శబ్దాలకు స్పందిస్తూ, వారు చేసే శబ్దాలకు అనుగుణంగా మన ముఖ కవళికలను మారుస్తూ, వారిని భాషకు అలవాటు చెయ్యాలి. నెమ్మది నెమ్మదిగా వారు గమనించేలా చిన్న చిన్న పదాలను పలుకుతూ, వారిచేత పలికిస్తూ ఉండాలి. ఇలా చేయడంవల్ల వారు చిన్నచిన్నగా భాషను వినడం, అర్థం చేసుకోవడం, పలకడం సాధిస్తారు. క్రమంగా వారు భాషను నేర్చుకునే ప్రక్రియ సులభం అవుతుంది.
చేతులతో కళ్ళు మూసి ఆడే దోబూచులు, తోలుబొమ్మలాటలు లాంటివి పిల్లలను బాగా ఆకర్షిస్తాయి. ఇలా చేతులను ఉపయోగించి వారికి బాగా నవ్వు తెప్పించే చిన్న చిన్న ఆటలను ఆడుతూ, వారిచేత ఆడిస్తూ, వారిని వాటితో మమేకం చేయాలి.
పెద్ద పెద్ద బొమ్మలు, రంగురంగుల బొమ్మలు ఉన్న కథల పుస్తకాలను ఎంచుకుని, వారిని కూర్చోపెట్టుకుని చదివి కథను చెప్పాలి. ఒక్కో బొమ్మనూ వేలితో చూపిస్తూ, ఆయా పాత్రలను పరిచయం చేస్తూ, అవి ఎలా శబ్దం చేస్తాయో అనుకరించి చెప్పాలి. ఉదాహరణకు కుక్క, పిల్లి, సింహం, ఏనుగు ఇలా ఆయా జంతువుల శబ్దాలను అనుకరిస్తూ కథ చెప్పడం ద్వారా పిల్లలకు కథలపట్ల, పుస్తకాలను చదవటం పట్ల ఇష్టం పెరుగుతుంది.
కొన్ని బొమ్మలు నిర్మాణాలు చెయ్యడానికి అనుగుణంగా ఉంటాయి. అటువంటి వాటితో అంతస్తులను నిర్మించేలా ప్రోత్సహించడం చేయాలి. తద్వారా వారు అవి కట్టడం, ఒకవేళ పడిపోతే మళ్ళీ నిలబెట్టడం వంటివి నేర్చుకుంటారు. అందువల్ల ఒక నిర్మాణాత్మకమైన పనిని ఎలా చెయ్యవచ్చో, ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో, వాటిని సరిదిద్దడం ఎలాగో ఇలాంటివన్నీ వారంతట వారికే అర్థం అయిపోతాయి.
కాళ్ళు, చేతులు, వేళ్ళు కదుపుతూ చిన్న పిల్లల పాటలను పాడి పిల్లలకు వినిపించాలి. అవి వారికి ఆకర్షణీయంగా ఉండి, వారి ఎదుగుదలకు, మానసిక వికాసానికి చక్కగా దోహదపడతాయి. పాటకు, దానిలోని లయకు, అందులోని భావాలకు, దానికి తగిన విన్యాసాలకు వారు అలవాటు పడతారు. అంతేకాక, తమ భావాలను మాటలతోనే కాకుండా, హస్త విన్యాసాల ద్వారా ఎలా తెలపవచ్చునో కూడా నేర్చుకుంటారు.
ఇంట్లోని పెద్దవారు కూడా పసిపిల్లలతో సమానంగా, సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉండాలి.. శబ్దాలు, శారీరక విన్యాసాలు, పాడటం ఇలా అన్నింటినీ కలగలపడం ద్వారా పిల్లలకు మరింత ఆకర్షణీయంగా ఉండి, వారికి ఆనందాన్ని కలిగించి వారిని ప్రభావితం చేస్తాయి.



This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |