hamburgerIcon
login
STORE

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Getting Pregnant arrow
  • ఇంట్లో బాడీ పాలిషింగ్: ఇదిగో మీ పూర్తి గైడ్ arrow

In this Article

    ఇంట్లో బాడీ పాలిషింగ్: ఇదిగో మీ పూర్తి గైడ్

    Getting Pregnant

    ఇంట్లో బాడీ పాలిషింగ్: ఇదిగో మీ పూర్తి గైడ్

    3 November 2023 న నవీకరించబడింది

    బాడీ పాలిషింగ్ అంటే ఏమిటి?

    బాడీ పాలిషింగ్ ఎపిడెర్మల్ ఔట్‌లుక్‌ను మెరుగుపరచడంలో సహాయపడి, చర్మాన్ని కాంతివంతంగా చేసి స్క్రబ్బింగ్ తో మెరుగు పరుస్తుంది. ఇది ఒక అద్భుతమైన చర్మ సంరక్షణ చికిత్స.

    ఇప్పటివరకు, బాడీ పాలిషింగ్ కోసం ప్రొఫెషనల్ సెలూన్ కి వెళ్ళవలసి వచ్చేది. అయితే, అది గతం. బాడీ పాలిషింగ్ కోసం ఇప్పుడు ఎవరూ ప్రొఫెషనల్ సెలూన్ లేదా స్పా సెంటర్‌కు వెళ్ళే పని లేదు, ఎందుకంటే మీరు ఇంట్లోనే కొన్ని మామూలు వస్తువులతో బాడీ పాలిషింగ్‌ చేసుకోవచ్చు.

    ఇంటిలోనే బాడీ పాలిషింగ్‌ చేయడానికి ఏమి కావాలో, ఏమి తెలుసుకోవాలో ఇక్కడ చూడండి.

    ఇంట్లో బాడీ పాలిష్ చేయడానికి స్టెప్‌ వైజ్ గైడ్

    బాడీ పాలిషింగ్‌కు ఉప్పు, చక్కెర లేదా రవ్వతో తయారు చేసిన తేలికపాటి స్క్రబ్ క్రీమ్ అవసరం, ఇది సున్నితమైన రాపిడితో చర్మంపై ఉన్న మృత కణాలను శుభ్రం చేస్తుంది. ఈ ట్రీట్‌మెంట్ కి క్రీమ్ బేస్ స్కిన్ మాయిశ్చరైజేషన్, సున్నితంగా మసాజ్‌ చేయడం రెండూ అవసరం, ఇవి మృదువైన చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

    కేవలం ఈ క్రింది ముఖ్యమైన వస్తువులతో ఇంట్లోనే మృదువైన బాడీ పాలిషింగ్ ట్రీట్‌మెంట్‌ చేసుకోవచ్చు:

    • ఆలివ్ నూనె (3-4 టేబుల్ స్పూన్లు)
    • ఇంట్లో తయారు చేసిన బాడీ పాలిష్
    • సింథటిక్ లేదా సహజమైన లూఫా
    • ఒక ప్యూమిక్ స్టోన్

    ఈ పదార్ధాలను తీసుకున్న తర్వాత, ఇంటి వద్దనే బాడీ పాలిషింగ్ చేయడానికి స్టెప్స్ ఇవి:

    1. ముందుగా చర్మాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. దీనివల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. దీనివల్ల బాడీ పాలిషింగ్ ప్రభావవంతంగా పనిచేస్తుంది.

    2. తడి చర్మాన్ని తుడిచి ఆరబెట్టి, ఆపై లోతైన మాయిశ్చరైజేషన్ కోసం ఏడు నుండి పది నిమిషాల వరకు గోరువెచ్చని ఆలివ్ నూనెతో పూర్తిగా మసాజ్ చేయాలి.

    3. తర్వాత ఇంట్లో తయారు చేసిన బాడీ పాలిష్‌ని చర్మంపై ఒకేలా వ్యాపించేలా సున్నితంగా మసాజ్ చేయాలి. లోతైన చర్మాన్ని శుభ్రపరచడం కోసం 15 నిమిషాల వరకు మసాజ్ చేయడం కొనసాగించాలి. లూఫా ఉపయోగించి గుండ్రంగా తిప్పుతూ చర్మాన్ని మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    4. మోచేతులు, మోకాళ్ళు, మడమలు వంటి చర్మం దళసరిగా ఉన్న చోట ఎక్స్‌ఫోయిలేషన్ చేయడానికి ప్యూమిక్ స్టోన్ ఉపయోగించడం చాలా మంచిది. చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి రాపిడి అవకుండా ఉండటానికి ప్యూమిక్ స్టోన్‌తో సున్నితంగా రాయాలి.

    5. శరీరాన్ని పూర్తిగా స్క్రబ్ చేసిన తర్వాత, స్నానం చేయడం ఈ అప్లికేషన్‌ పూర్తిగా పోవడానికి సహాయపడుతుంది. బాడీ పాలిష్ తొలగించిన తర్వాత, రిఫ్రెష్ షవర్ చేయాలి.

    ఇంట్లో తయారు చేసే బాడీ పాలిషింగ్ క్రీమ్ కోసం ఉపయోగించాల్సిన పదార్థాలు

    సులువుగా దొరికే ఈ కింది పదార్థాలతో ఇంట్లో బాడీ పాలిషింగ్‌ ఎంతో సులువుగా తయారు చేసుకోవచ్చు. మృదువైన పాలిష్‌ను ఆస్వాదించడానికి కింది ఆయిల్ బేస్‌లలో ఒకదాన్ని ఎంచుకోవాలి:

    • ఆలివ్ నూనె
    • కొబ్బరి నూనే
    • జోజోబా నూనె

    జిడ్డుగల చర్మం కలవాళ్ళు, నూనెను వాడటం ఇష్టం లేకపోతే ప్రత్యామ్నాయంగా తేనెను ఉపయోగించవచ్చు.

    తరువాత, ఈ క్రింది జాబితా నుండి మీ చర్మానికి సరిగ్గా సరిపోయే ఎక్స్‌ఫోయిలెంట్‌ను ఎంపిక చేసుకోండి:

    • చక్కెర
    • ఉప్పు
    • కాఫీ పొడి
    • వాల్‌నట్‌లు, పిస్తాపప్పులు లేదా నేరేడు పండు లేదా అప్రికాట్ పీచ్ వంటి రాతి పండ్ల గింజలు
    • వరి ఊక (రైస్ బ్రాన్)

    ఇలాంటి వాటిని జోడించడం ద్వారా శరీరానికి పోషకాలు అధికంగా అందేలా చేయవచ్చు:

    • మూలికలు
    • ఎసెన్షియల్ ఆయిల్స్
    • కలబంద
    • తేనె
    • పండ్ల సారం
    • ఎండబెట్టి పొడిచేసిన పూల రేకులు

    ఈ పదార్ధాలను ఎన్నుకునేటప్పుడు, చర్మం ఏ రకమో తెలుసుకొని చక్కనిది, ఎక్కువసేపు పట్టే బాడీ పాలిషింగ్ ట్రీట్‌మెంట్‌ చేసుకోవాలి.

    ఇంట్లో బాడీ పాలిషింగ్ ట్రీట్‌మెంట్ చేసుకునే సమయంలో చేయవలసినవి, చేయకూడనివి

    • ట్రీట్‌మెంట్ సమయంలో చర్మాన్ని చక్కగా సిద్ధం చేసుకుని, ఈ విధంగా బాడీ పాలిష్‌ను బాగా ఉపయోగించాలి:
    • మూసుకుపోయిన చర్మ రంధ్రాలు తెరుచుకోవడానికి గోరు వెచ్చని నీటితో గానీ ఆవిరి స్నానం గానీ చేయాలి. దీనివల్ల బాడీ పాలిషింగ్‌ మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
    • చర్మానికి పోషకాలను అందించే నూనెలను ఉపయోగించడం.
    • చర్మంపై మృదువుగా మసాజ్ చేయడం కోసం లూఫాను వెచ్చగా చేయడం.
    • బాడీ పాలిష్ పూర్తిగా తొలగించడం కోసం పూర్తిగా శుభ్రపరచడం.
    • పాలిష్ తర్వాత స్నానం అయ్యాక చర్మంపై తేలికపాటి, నూనె లేని మాయిశ్చరైజర్‌ను అప్లై చేయడం.

    ఇంట్లో బాడీ పాలిషింగ్ ట్రీట్‌మెంట్‌ చేసుకునేటప్పుడు కొన్ని పనులు అస్సలు చేయకూడదు.

    • శుభ్రపరచడానికి సబ్బును ఉపయోగించకూడదు, ఎందుకంటే దీనివల్ల చర్మం పొడిబారిపోతుంది.
    • పాలిష్ ముందు స్నానం చేసే నీరు గోరువెచ్చగా ఉండాలి. చర్మం దెబ్బతినకుండా ఉండాలంటే చాలా వేడిగా ఉండకూడదు.
    • జిడ్డు చర్మం కానట్లయితే చక్కెరకు దూరంగా ఉండాలి.
    • ఎక్స్‌ఫోయిలేట్ చేయబడిన సున్నితమైన చర్మం సెటిల్ అవ్వడానికి కొంచెం సమయం పట్టవచ్చు. కాబట్టి కనీసం మూడు నుండి నాలుగు గంటల వరకు ఎండ తగలనివ్వకూడదు.
    • ఎప్పుడైనా సరే చర్మాన్ని అతిగా స్క్రబ్ చేయకూడదు.

    ఇంట్లో బాడీ పాలిషింగ్‌ చేసుకునే ముందు, ఇంట్లో చేసిన పాలిష్‌ని కొంతమేర రాసి పరీక్షించడం మంచిది. దీనివల్ల ఇబ్బందులు లేవని నిర్దారణ చేసుకోవచ్చు. ఉపయోగించిన పదార్థాలను బట్టి, ఒకటి, రెండు వారాల పాటు బాడీ పాలిష్‌ను నిల్వ చేయవచ్చు. మెరిసే మృదువైన చర్మాన్ని నిలుపుకోవడానికి ఈ ట్రీట్‌మెంట్ తరచుగా చేసుకుంటూ ఉండాలి.

    మైలో బ్లాగ్ లో , ప్రెగ్నెన్సీ, మదర్‌కేర్ బేబీకేర్ చిట్కాలతో పాటు సొంతంగా చేసుకొనే ఇలాంటి ఎన్నో స్కిన్ కేర్, పర్సనల్ కేర్ చిట్కాలను తెలుసుకోవచ్చు.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Sarada Ayyala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.