hamburgerIcon
login

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article Continues below advertisement

  • Home arrow
  • మీ ముఖానికి ప్రతిరోజూ విటమిన్-సి ఫేస్ టోనర్ ఉపయోగించడం వల్ల వచ్చే టాప్ 5 లాభాలు (Top 5 Advantages Of Using A Vitamin C Face Toner On Your Face Every Day in Telugu) arrow

In this Article

    మీ ముఖానికి ప్రతిరోజూ విటమిన్-సి ఫేస్ టోనర్ ఉపయోగించడం వల్ల వచ్చే టాప్ 5 లాభాలు (Top 5 Advantages Of Using A Vitamin C Face Toner On Your Face Every Day in Telugu)

    Pregnancy

    మీ ముఖానికి ప్రతిరోజూ విటమిన్-సి ఫేస్ టోనర్ ఉపయోగించడం వల్ల వచ్చే టాప్ 5 లాభాలు (Top 5 Advantages Of Using A Vitamin C Face Toner On Your Face Every Day in Telugu)

    24 July 2023 న నవీకరించబడింది

    Article Continues below advertisement

    మన చర్మానికి హానికరంగా మారే అనారోగ్యకర జీవనవిధానాన్ని మనం అనుసరిస్తుంటాం. మరియు ఎండకు గురవ్వడం వలన మన చర్మం ఇంకా దెబ్బతింటుంది. దీనివల్ల చర్మ రంధ్రాలు పెద్దవి కావడం, చర్మం సాగిపోవడం వంటి సమస్యలకు లోనవుతాం. మనలో చాలా మందికి ఫేస్ టోనర్ గురించి తెలియదు. కేవలం జిడ్డు చర్మం ఉండే వారికి చర్మ రంధ్రాలను తగ్గించడానికే ఈ ఫార్ములా అనుకుంటాం. అయితే టోనర్స్ అనేవి అన్ని చర్మ రకాలకు సరిపోతాయి.మన ముఖాలను శుభ్రం చేశాక ఎక్కువగా ఉన్న ఆయిల్ ను మరియు మలినాలను తొలగించడానికి ఫేస్ టోనర్ రాస్తాము. మార్కెట్లో పలు రకాల టోనర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, విటమిన్-సి ఫేస్ టోనర్ మీ చర్మానికి మరికొన్ని అదనపు లాభాలను ఇస్తుంది. ఫేస్ టోనర్లు నీటి ఆధారిత చర్మ సంరక్షణ కలిగిన ఫార్ములా. ఇందులో గ్లిజరిన్ తో పాటు మాయిశ్చర్ ను నిలిపి ఉంచే ఏజెంట్లు ఉంటాయి. అవి మీ చర్మానికి మృదుత్వాన్ని, తడిని, కోమలాన్ని అందిస్తాయి. ఫేస్ టోనర్లను ఉపయోగించడం వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు:

    • చర్మ రంధ్రాను శుభ్రం చేసి తగ్గిస్తాయి. దాని వల్ల మొటిమలు పగిలే అవకాశం ఉండదు.
    • సబ్బుల్లో ఉండే ఆల్కలీన్ స్వభావం వల్ల మీ చర్మం పీహెచ్ (pH) దెబ్బ తినకుండా చూస్తుంది.
    • క్లెన్సర్ కూడా తొలగించలేని దుమ్ము, మేకప్ వంటి వాటిని తొలగిస్తుంది.
    • వాతావరణంలోని విషపూరిత పదార్థాలు మీ చర్మం వరకు చేరకుండా ప్రత్యేకమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది.

    స్కిన్ టోనర్ల లాభాలు ఇప్పుడు మనకు తెలిశాయి. ఇప్పుడు మనం చర్మానికి విటమిన్-సి ఫేస్ టోనర్లు ఇచ్చే లాభాలను చూద్దాం.

    ముడతలు మరియు గీతల మీద పోరాడుతుంది (Fights Wrinkles and Fine Lines)

    చర్మం అరిగిపోవడం వల్ల ఏర్పడే ముడుతలు మరియు గీతల పరిస్థితిని మనం ఎదుర్కొనే ఉంటాం. అలాంటి కేసుల్లో విటమిన్-సి ఫేస్ టోనర్లు సరైన ఏజెంట్లుగా పని చేస్తాయి. విటమిన్-సి టోనర్లలో చర్మ సమస్యలను ఎదుర్కొనే ప్రత్యేక రక్షణ పోషకాలు ఉంటాయి. అంతేగాక ఈ టోనర్లు మీ చర్మంపై ఉండే రాడికల్స్ ను తొలగించి పునర్జీవాన్ని ఇస్తాయి.

    ఎలాస్టిసిటీ (సాగేగుణం)ని పెంచుతుంది (Improves Elasticity)

    విటమిన్-సి మనంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మం బిగుతుగా ఉండటానికి మన శరీరం ఉత్పత్తి చేసే మూలకం అది. మన వయసు పెరిగే కొద్ది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అందుకే విటమిన్-సి టోనర్లు వాడటం వల్ల వయసు పెరగడం తగ్గుతుంది. సహజమైన గ్రీన్ టీ మరియు కీరదోసలోని గుణాల వల్ల విటమిన్-సి చర్మానికి తడిని అందిస్తూ ఎలాస్టిసిటీని పెంచుతుంది. రంధ్రాలను తగ్గించి మీ చర్మాన్ని ఫ్రెష్ గా మరియు యవ్వనంగా చూపిస్తుంది.

    మంటను తగ్గిస్తుంది (Reduces Inflammation)

    కొన్ని హానికారక ఏజెంట్ల మీద మన రోగనిరోధక వ్యవస్థ బలంగా పని చేయడం వల్ల చర్మంపై కొన్నిసార్లు ఎర్రని దద్దుర్లు, ఇన్ఫెక్షన్, అలర్జీ వచ్చిన అనుభూతి మనకు ఉండే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే వైద్య సలహా తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, కొన్ని పరిశోధనల ప్రకారం ఇలాంటి మొటిమలు, డెర్మటైటిస్, సొరియాసిస్ వంటివాటిపై విటమిన్-సి చక్కని హాయినిస్తుంది. విటమిన్-సి ఫేస్ టోనర్లలో ఉండే కీరదోస మండుతున్న మీ చర్మానికి చల్లదనాన్నిస్తుంది.

    Article continues below advertisment

    హైపర్ పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది (Reduces Hyperpigmentation)

    మనం చర్మం ఎక్కువగా మెలనిన్ ను ఉత్పత్తి చేయడం వల్ల వచ్చే నల్లటి ప్రదేశాలు లేదా హైపర్ పిగ్మెంటేషన్. విటమిన్-సి టోనర్ల వల్ల టైరోసినాస్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది మెలనిన్ ఉత్పత్తికి తోడ్పడే ఎంజైమ్ కావడం వల్ల చివరకు మెలనిన్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. నల్లని ప్రదేశాలను తగ్గించడంలో, రంగును పెంచడంలో, చర్మ సహజ స్వరూపాన్ని కాపాడటంలో విటమిన్-సి సహాయపడుతుంది.

    ఎండ వల్ల దెబ్బతిన్న చర్మానికి పునర్జీవం (Revitalizes Sun-damaged Skin)

    ఎక్కువ సమయం ఎండకు గురికావడం వల్ల చర్మానికి సన్ స్పాట్స్, గరుకుదనం, రోసాసియా, ఫ్లాకీనెస్ వంటి చర్మ సమస్యలు వస్తాయి. అయితే విటమిన్-సిని తరచుగా చర్మానికి రాయడం వల్ల ఈ సమస్యల నుంచి రక్షణ ఉంటుంది. మూడు నెలల కంటే ఎక్కువ కాలం విటమిన్-సి టోనర్లను వాడటం వల్ల మీ చర్మ రూపులో మార్పు ఉంటుంది. విటమిన్-సి టోనర్ తరచుగా వాడటం వలన అందులోని నారింజ, నిమ్మ గుణాలు మీ చర్మానికి హాని కలిగించే కారకాల నుంచి రక్షణ ఉంటుంది. రసాయనాలు, విషపూరితాలైన ఉత్పత్తులను వాడకుండా జాగ్రత్త పడండి. మైలో కేర్ విటమిన్-సి మాటిఫైయింగ్ స్కిన్ మిస్ట్ టోనర్ లో విటమిన్-సి, గ్రీన్ టీ, నారింజ, నిమ్మ మూలకాలు ఉన్నాయి. మీ చర్మం నుంచి ధూళికణాలు తొలగించి, చర్మ రంధ్రాలను బిగుతుగా చేసి, మీ చర్మాన్ని మృదువుగా మరియు కోమలంగా చేయడానికి ఇందులో లైట్ వెయిట్ ఫార్ములా ఉంది.

    విష రహిత, వేగన్-ఫ్రెండ్లీ (శాకాహార) మరియు క్రూయాల్టీ-ఫ్రీ (జంతు హింస చేయబడని) సర్టిఫైడ్ కంపెనీల ఉత్పత్తులను మాత్రమే చూడండి. టోనర్స్ తయారు చేయడంలో ఉపయోగించిన మూలకాలను పరిశీలించండి. పారబెన్స్, ఎస్ఎల్ఎస్, మినిరల్ ఆయిల్స్, ఫాతాలేట్స్, ఆల్కహాల్ వంటి రసాయనాలు లేని టోనర్స్ మాత్రమే ఎంచుకోండి. వీటితో పాటు సింథటిక్ రంగులు, నిల్వ ఉంచే పదార్థాలు ఉంటే అవి మీ చర్మానికి హాని కలిగిస్తాయి. కాబట్టి మంచి ఫలితాల కోసం, ఉత్తమమైన ఫలితాల కోసం కేవలం నాణ్యమైన ప్రాకృతిక పదార్థాల నుంచి చేసిన ఉత్పత్తులను మాత్రమే వాడండి.

    Tags:

    Vitamin C face toner uses in telugu, What is Vitamin C face toner in telugu, Advantages of using Vitamin C face toner in telugu, Can we apply Vitamin C face toner on oily skin in telugu.

    Article continues below advertisment

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.