This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

ప్రెగ్నెన్సీ సమయంలో ఎకోస్ప్రిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? (Are There Any Side Effects Of Taking Ecosprin In Pregnancy in Telugu?)

Pregnancy
Written by - Swetha Raoచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
ప్రెగ్నెన్సీ సమయంలో ఎకోస్ప్రిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? (Are There Any Side Effects Of Taking Ecosprin In Pregnancy in Telugu?)
Read time11 min

చాలామంది మహిళలకు గర్భవతిగా ఉన్నప్పుడు ఎకోస్ప్రిన్ 75 వాడమని డాక్టర్లు చెబుతుంటారు. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ బ్లడ్ థిన్నర్‌లా పనిచేస్తుంది. వేర్వేరు డోసుల్లో ఉంటుంది. తక్కువ డోసుల్లో ఉపయోగిస్తే, యాంటీప్లేట్లెట్ ఏజెంట్ లేదా బ్లడ్ థిన్నర్‌లా పనిచేస్తుంది. స్ట్రోక్, గుండెపోటు లాంటి పలు రకాల హృదయ సమస్యల్ని నివారించడంలో ఇది చాలా అవసరం.

డోస్‌ను బట్టి ఎకోస్ప్రిన్ ఎలా ఉపయోగపడుతుంది? (How Is Ecosprin Useful According To Its Dose in Telugu?)

ఇకోస్ప్రిన్ ఎక్కువ డోసుల్లో తీసుకుంటే, నొప్పులు, జ్వరాల నుంచి ఉపశమనం కలిగించే అనాల్జేసిక్‌గా పనిచేస్తుంది. ఎవరైనా గుండెపోటుతో బాధపడితే వెంటనే వారికి ఎకోస్ప్రిన్ 75 ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఈ విధంగా, రక్తం గడ్డకట్టడం, గుండెపోటుతో మరణించడం లాంటి సమస్యల్ని వెంటనే నివారించవచ్చు. గుండెలో ధమని మూసుకుపోవడం వల్ల హార్ట్ ఎటాక్ వస్తుంది. ఇది గుండెలోకి రక్తప్రవాహాన్ని ప్రభావితం చేసి, కొలెస్ట్రాల్, కొవ్వు, ప్లేక్‌తో రక్తం ప్రవహించే మార్గాన్ని మూసేస్తుంది.

కాబట్టి, సర్వ సాధారణంగా ఎకోస్ప్రిన్ ను తక్కువ మోతాదుతో బ్లడ్ థిన్నర్‌గా, ఎక్కువ డోస్‌తో పెయిన్ కిల్లర్‌గా ఉపయోగిస్తారు. ఎకోస్ప్రిన్ రక్తంలో యాంటీప్లేట్లెట్ పనితీరును ప్రభావితం చేసి, గుండెలో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ విధంగా గుండెపోటును నివారిస్తారు. దీంతో పాటు, ఎకోస్ప్రిన్ ను సాధారణంగా బ్లడ్ థిన్నర్‌గా ఉపయోగిస్తారు కాబట్టి, ఇది రక్తంలో జిగటను తగ్గించి, స్ట్రోక్‌ను నివారించడంలో ఉపయోగపడుతుంది. ఎకోస్ప్రిన్ మాత్రలు సైక్లోక్సిజనేస్, ప్రోస్టాగ్లాండిన్స్ పనితీరును కూడా అడ్డుకుంటాయి. ఫలితంగా మంట, నొప్పి, వాపు తగ్గుతాయి.

ఇది కూడా మీకు నచ్చుతుంది: గర్భధారణ సమయంలో ఎకోస్ప్రిన్‌-150 తీసుకోవడం సురక్షితమేనా?

ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్స్ వాడటం వల్ల వచ్చే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? (What Are Some Of The Possible Side Effects Of Ecosprin Tablets in Telugu?)

ఎకోస్ప్రిన్ మాత్రల్ని ఆహారంతో లేదా ఆహారం లేకుండా ఉపయోగించవచ్చు. అయితే ఈ ట్యాబ్లెట్‌ను నమలడం లేదా చప్పరించడం చేయకూడదు. ఒక గ్లాస్ వెచ్చని నీళ్లతో వేసుకోవాలి. మీరు బాధపడుతున్న పరిస్థితిపై లేదా ప్రెగ్నెన్సీ స్టేటస్‌ను బట్టి ఈ మాత్రలు ఎలా తీసుకోవాలో వైద్యులు సూచిస్తారు. ఎకోస్ప్రిన్ మాత్రల్ని నోటిద్వారా, మలద్వారం ద్వారా, ఇంట్రావీనస్ ద్వారా కూడా అందిస్తారు.

వికారంగా ఉండటం, వాంతులు రావడం, మగతగా ఉండటం, చీలమండల వాపు లేదా తేలికపాటి తలనొప్పి లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నిద్రమత్తుగా ఉండటం సాధారణంగా కనిపించే సైడ్ ఎఫెక్ట్. అందుకే డ్రైవింగ్ చేయడం కన్నా ముందు ఈ ట్యాబ్లెట్ వేసుకోకూడదు. చాలావరకు సైడ్ ఎఫెక్ట్స్‌కు వైద్య సాయం అవసరం లేదు. కాలక్రమేణా తగ్గిపోతాయి. ఒకవేళ, తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.

గర్భవతిగా ఉన్నప్పుడు ఎకోస్ప్రిన్ వాడుతున్నట్టైతే మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి? (How Cautious Should You Be When Continuing The Ecosprin Medication During Pregnancy in Telugu?)

గర్భవతిగా ఉన్నప్పుడు ఎకోస్ప్రిన్ తీసుకుంటున్నట్టైతే, ఆల్కహాల్, పెయిన్ కిల్లర్స్, అబార్షన్ మాత్రల్ని తీసుకోకూడదు. ఇవి ట్యాబ్లెట్‌తో ప్రతిస్పందించి, గ్యాస్ట్రిక్ బ్లీడింగ్‌కు దారితీస్తాయి. ఈ మాత్రల్ని చికెన్ పాక్స్ లేదా జ్వరంతో బాధపడుతున్న పిల్లలకు వేయకూడదు. వైద్యుల సలహా మేరకే ఉపయోగించాలి.

పిల్లల్లో ఎకోస్ప్రిన్ 75 ట్యాబ్లెట్స్ వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయి. మెదడు, కాలేయం వాపు రావడానికి కారణం అయ్యే రెయెస్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, గర్భవతిగా ఉన్నప్పుడు చివరి ట్రమెస్టర్‌లో గర్భస్థ శిశువుపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ట్యాబ్లెట్ తీసుకోకపోవడమే మంచిది.

గర్భవతిగా ఉన్నప్పుడు ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే పిల్లలపై, తల్లి పాలపై ప్రభావం చూపిస్తుందా? (Can Ecosprin Tablets Affect Your Baby During Pregnancy Or While Breastfeeding in Telugu?)

కొన్నిసార్లు, ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్స్ తల్లిపాలలోకి ప్రవేశించి, చివరకు పిల్లలపై ప్రభావం చూపిస్తాయి. ఒకవేళ మీరు గర్భవతి అయినా, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా, వైద్యుల సలహా తీసుకోవాలి. ప్రత్యామ్నాయాల గురించి చర్చించాలి. అయితే ఇకోస్ప్రిన్ తీసుకుంటున్న గర్భవతుల్లో తీవ్రమైన దుష్ప్రభావాలు ఏవీ పెద్దగా కనిపించవు. కడుపు నొప్పి, బ్లీడింగ్, చెవుల్లో శబ్దాలు, నిరంతరం వికారంగా ఉండటం లాంటి, తీవ్రమైనవి కాని సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. కళ్లు లేదా చర్మాన్ని పసుపు రంగులోకి మార్చే జాండీస్ కూడా ఓ సైడ్ ఎఫెక్ట్.

ఇక ఎకోస్ప్రిన్ 75 మాత్రల వల్ల వచ్చే తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్‌లో గ్యాస్ట్రోఇంటెస్టినల్ బ్లీడింగ్ ఒకటి. ఇది కడుపు నుంచి లేదా ప్రేగుల నుంచి రావొచ్చు. ఇక మెదడులో ఇంట్రాక్రానియల్ బ్లీడింగ్ కూడా మరో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్. ఇది తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు ఎకోస్ప్రిన్ మాత్రల్ని ఉపయోగించాలంటే వైద్యుల్ని సంప్రదించడం చాలా ముఖ్యం.

ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్స్ తీసుకునేముందు ఏ అంశాలను గుర్తుంచుకోవాలి? (What Are A Few Things To Keep In Mind When Starting Out On Ecosprin in Telugu?)

మీరు మెడికేషన్ మొదలుపెట్టే ముందే, అసలు ఇది ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం ముఖ్యం. డాక్టర్ నుంచి ప్రిస్క్రిప్షన్ తీసుకున్న తర్వాతే ఈ మందుల్ని తీసుకోవాలన్న విషయం గుర్తుంచుకోండి. అంతేకాకుండా, వైద్యులు సూచించిన విధంగానే మాత్రల్ని తీసుకోవాలి. ఆహారంతో ఈ మాత్రల్ని తీసుకోవడం ఎక్కువ ప్రయోజనకరం. దీనివల్ల కడుపులో నొప్పి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఈ ట్యాబ్లెట్‌ను మింగడానికి ముందు చప్పరించడం, నమలడం, కొరకడం లాంటివి చేయకూడదు. వెచ్చని నీటితో ట్యాబ్లెట్ తీసుకోవాలి. ట్యాబ్లెట్‌ను చల్లగా, పొడిగా ఉండే ప్రదేశంలో మాత్రమే స్టోర్ చేయాలి. సూర్యకాంతి తాకకుండా చూడాలి.

ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్ వల్ల కలిగే దుష్ప్రభావాలను ఈ జాబితాలో తెలుసుకోండి.

1. కడుపునొప్పి

2. గుండెలో మంట.

3. రక్తస్రావం.

4. చెవిలో రింగింగ్ శబ్దాలు.

5. మూత్రం రంగు మారడం లేదా ఎక్కువ, తక్కువ మూత్రం రావడం.

6. తీవ్రమైన వాంతులు.

7. నీరసం.

8. ఆయాసం, అలసట.

9. మగత, నిద్రమత్తు.

10. ఇంట్రాక్రానియల్ బ్లీడింగ్.

11. జాండిస్ లేదా చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం.

12. గ్యాస్ట్రోఇంటెస్టినల్ బ్లీడింగ్.

మెడికల్ ల్యాబ్ టెస్టులకు ఎకోస్ప్రిన్ మాత్రలు స్పందిస్తాయా? (Can Ecosprin Tablets React With Your Medical Laboratory Tests in Telugu?)

మీరు ఏవైనా ల్యాబరేటరీ టెస్టులు చేయించాలనుకుంటే, వాటి ఫలితాలపై ఎకోస్ప్రిన్ మాత్రల ప్రభావం ఉంటుంది. ఈ మందుల జోక్యం వల్ల కొన్ని సార్లు మీ షుగర్ టెస్ట్ ఫలితాలు తప్పుగా రావొచ్చు. ఎకోస్ప్రిన్ కారణంగా మీ కడుపులో అల్సర్, ఆస్తమా, కాలేయ వ్యాధి, డయాబెటిస్, అలెర్జీ లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టైతే ఆ విషయం వైద్యులకు చెప్పాలి. ఒకవేళ మీరు సర్జరీ చేయించుకోబోతున్నా, ఎకోస్ప్రిన్ తీసుకోకూడదని సూచిస్తారు.

ఇతర డ్రగ్స్‌తో ఎకోస్ప్రిన్ కలిసినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? (Can Ecosprin Tablets Cause Side Effects After Interacting With Another Drug in Telugu)

ఇకోస్ప్రిన్ ట్యాబ్లెట్స్ పలు రకాల డ్రగ్స్‌తో కలవడం వల్ల చివరకు కడుపు నొప్పి, ఇతర సమస్యలు రావొచ్చు. వార్ఫరిన్, క్లోపిడోగ్రెల్, క్యాప్ట్రోపిల్, డిగోక్సిన్ లాంటి కొన్ని డ్రగ్స్‌తో ఎకోస్ప్రిన్ ప్రతిస్పందిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, రక్తాన్ని పలుచగా చేసే మందులు, ఇమ్యూన్ డ్రగ్స్, యాంటీడిప్రెస్సంట్స్, ఇతర స్టిరాయిడల్ మందులకు ఇకోస్ప్రిన్ రియాక్ట్ అవుతుంది. అంతేకాకుండా, అబార్షన్ మాత్రలు, డయాబెటిక్ మాత్రలు, ఆస్టియోపోరోసిస్ సంబంధిత డ్రగ్స్‌తో ప్రతిస్పందించే సామర్థ్యం కూడా ఉంటుంది. ఆల్కహాల్‌తో లేదా మూలికల సప్లిమెంట్స్‌తో కలిపి తీసుకోవడం వల్ల ఈ మందుల ప్రభావాన్ని అడ్డుకుంటుంది. తీవ్రమైన పరిస్థితుల్లో పేగులలో రక్తస్రావానికి కూడా కారణం కావొచ్చు. అందుకే ఈ మందులు ప్రారంభించాలన్నా, కొనసాగించాలన్నా వైద్యుల్ని సంప్రదించడం అవసరం.

మీరు ఏదైనా బ్లడ్ క్లాటింగ్ డిసార్డర్ అంటే రక్తం గడ్డకట్టే సమస్యతో బాధపడుతున్నట్టైతే, ఎకోస్ప్రిన్ లాంటి మాత్రలు మీకు ప్రమాదకరంగా మారవచ్చు. వాస్తవానికి, హీమోఫిలియా, ఇంటెస్టినల్ అల్సర్స్, గుండె సమస్యలు, ఆస్తమా లాంటివి ఉన్నవారికి ఎకోస్ప్రిన్ సూచించరు. ఎందుకంటే, ఈ మందులు పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశం ఉంది. ఇది మరిన్ని తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. శ్వాస సరిగ్గా ఆడకపోవడం కూడా సైడ్ ఎఫెక్ట్స్‌లో ఒకటి.

What Are A Few Safety Precautions To Remember When Continuing The Medication?

ఈ మందుల్ని తీసుకుంటున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?

ఎకోస్ప్రిన్ వాడాలనుకునేవారు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలున్నాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

  • మీరు గర్భవతి అయితే, ఎకోస్ప్రిన్ 150 తీసుకోవాలనుకుంటే వైద్యులు సూచించిన విధంగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలనే అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి.
  • మీరు పాలిచ్చే తల్లులు అయితే, ఎకోస్ప్రిన్ వాడకాన్ని వైద్యులు తగ్గించవచ్చు. ఎందుకంటే తల్లిపాల ద్వారా ఎకోస్ప్రిన్ శిశువులకు వెళ్లే అవకాశం ఉంది.
  • ఇక ఎకోస్ప్రిన్ తీసుకున్న తర్వాత డ్రైవింగ్ చేయకూడదు. ఎందుకంటే సాధారణంగా ఉండే దుష్ప్రభావాల్లో నిద్రమత్తు కూడా ఒకటి. అది మీ డ్రైవింగ్ సామర్థ్యంపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా రాత్రివేళల్లో అస్సలు డ్రైవ్ చేయొద్దు.
  • కాలేయ సమస్యలు ఉన్నట్టైతే ఎకోస్ప్రిన్ తీసుకునేముందు వైద్యుల్ని సంప్రదించి, డాక్టర్ సూచించిన డోస్ ప్రకారమే తీసుకోవాలి. జాగ్రత్తగా ఈ మందుల్ని తీసుకోవాలి. కిడ్నీ డిజార్డర్స్, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి కూడా ఇదే వర్తిస్తుంది.
  • ఎకోస్ప్రిన్ అలవాటును కలిగించే మందు కాదు. కానీ, మీ లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ మందు బాగా పనిచేసేలా చేయొచ్చు. మీ జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేయాలో తెలుసుకోండి.
  • కొలెస్ట్రాల్, కొవ్వు తక్కువగా ఉన్న డైట్ మాత్రమే ఫాలో కావాలి. మీ గుండె ఆరోగ్యానికి మేలు చేసే డైట్ మాత్రమే ఫాలో కావాలి.
  • తరచూ వ్యాయామం చేయాలి. మీరు గర్భవతి అయితే తేలికపాటి వ్యాయామాలు చేయొచ్చు.
  • ఎకోస్ప్రిన్ తీసుకున్నన్ని రోజులు ఆల్కహాల్ ముట్టకపోవడమే మంచిది. ఎందుకంటే ఆల్కహాల్, ఇకోస్ప్రిన్ కలిసాయంటే కడుపులో లేదా పేగుల్లో రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది.
  • జంక్ ఫుడ్ అస్సలు ముట్టుకోవద్దు. తప్పనిపరిస్థితుల్లో కొద్దిగానే తీసుకోవాలి. ఇంట్లో వండిన ఆహారపదార్థాలు మాత్రమే తీసుకోవాలి. గింజలు, ఫ్యాటీ ఫిష్, అవకాడో, ఆలీవ్ ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆహారపదార్థాల్లో ఉండే పోషకాలు మీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఎకోస్ప్రిన్ దుష్ప్రభావాలను పరిగణలోకి తీసుకుంటే, గర్భవతిగా ఉన్నప్పుడు ఇకోస్ప్రిన్ తీసుకోవడం అవసరమా? (Is It Important To Take Ecosprin During Pregnancy Considering Its Potent Side Effects in Telugu?)

గర్భవతులకు ప్రీ-ఎక్లాంప్సియా పరిస్థితుల్ని నివారించడానికి తక్కువ మోతాదు ఉన్న ఇకోస్ప్రిన్ వాడమని వైద్యులు సలహా ఇస్తారు. ఎక్కువ డోస్ ఉన్న ఇకోస్ప్రిన్ మాత్రల్ని సాధారణంగా సూచించరు. గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువ డోస్ ఉన్న ఇకోస్ప్రిన్ మందులు తీసుకుంటే శిశువు పెరుగుదల, అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఇకోస్ప్రిన్ బదులు పెయిన్‌కిల్లర్ ప్రత్యామ్నాయాలను ఫాలో కావాలి.

మీరు 30 వారాల గర్భం తర్వాత కూడా ఎకోస్ప్రిన్ తీసుకుంటున్నట్టైతే, ఆ విషయాన్ని వైద్యులకు చెప్పాలి. శిశువు ఆరోగ్యం, ఎదుగుదలను వైద్యులు పరిశీలిస్తారు. మీరు సంతానోత్పత్తి చికిత్స తీసుకుంటున్నట్టైతే, వైద్యులు తక్కువ డోస్ ఉన్న యాస్పిరిన్ సూచించవచ్చు. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మందులు వాడేముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.

పాలు ఇచ్చే తల్లులు ఇకోస్ప్రిన్ కొనసాగించడం సురక్షితమా? (Is It Safe For Breastfeeding Mothers To Continue Ecosprin in Telugu?)

మీరు పాలు ఇచ్చే తల్లులు అయితే, మీ వైద్యులు పెయిన్ కిల్లర్ కోసం ఎకోస్ప్రిన్ సిఫార్సు చేయరు. దాని బదులు ప్యారాసిటమాల్ లేదా ఇబుప్రోఫెన్ లాంటి మందుల్ని సూచిస్తారు. కొందరు వైద్యులు యాస్పిరిన్ సూచించినా, పాలిచ్చే తల్లులకు ఈ మందులు అంత శ్రేయస్కరం కాదు. ఈ మందులు పాల ద్వారా శిశువుకు వెళ్తాయి. అందుకే దీనిపై మరింత స్పష్టత కోసం వైద్యులను సంప్రదించడం మంచిది. రెయెస్ సిండ్రోమ్‌కు, యాస్పిరిన్‌కు మధ్య సంబంధం ఉందని చాలామంది పరిశోధకులు విశ్వసిస్తారు. మీరు పాలిచ్చే తల్లి అయితే, ప్రస్తుతం యాస్పిరిన్ తీసుకుంటున్నట్టైతే, మీ పిల్లల ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచండి. ఒకవేళ మీ బిడ్డ ఏదైనా ఇన్ఫెక్షన్ బారినపడి అనారోగ్యానికి గురైతే, కొన్ని రోజులపాటు లేదా బిడ్డ ఆరోగ్యం కుదుటపడే వరకు ఈ మందులు ఆపెయ్యండి.

ప్రత్యామ్నాయంగా, మీ పిల్లలకు ఫార్ములా మిల్క్ ఇవ్వొచ్చు. మీ పిల్లలకు తరచూ పాలు ఇవడం ద్వారా వారి ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చు. ఆ తర్వాత మీరు బ్రెస్ట్‌ఫీడింగ్ మళ్లీ ప్రారంభించవచ్చు. మీ శిశువుకు రక్తస్రావం అవుతున్నా, గాయాలు, దద్దుర్లలా కనిపించినా వెంటనే వైద్యుల్ని సంప్రదించండి. ప్రత్యామ్నాయ మందుల్ని వాడండి. సంతానోత్పత్తిపై ఎకోస్ప్రిన్ ప్రభావం చూపిస్తున్నట్టు ఎలాంటి నిరూపితమైన ఆధారాలు లేవు. ఒకవేళ మీరు గర్భవతి కావాలనుకుంటే ఓసారి వైద్యులతో మాట్లాడి స్పష్టత తీసుకోండి. ఈ విధంగా మీ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు.

ముగింపు (Conclusion)

చివరగా ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఏ మందులు తీసుకున్నా ఏదో విధంగా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. మీ శరీరానికి ఆ మందులు సరిపడకపోతే ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎకోస్ప్రిన్ విషయానికి వస్తే, ఈ మాత్రలు సమర్థవంతంగా పనిచేసినా, దీని వల్ల కలిగే దుష్ప్రభావాలను ఏమాత్రం అశ్రద్ధ చేయలేం. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చే దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. మీరు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు తీసుకోలేరు. ఎందుకంటే వీటిని సరిగ్గా వాడకపోతే గ్యాస్ట్రోఇంటెస్టినల్ బ్లీడింగ్, ఇంట్రాక్రానియల్ బ్లీడింగ్‌కు దారితీయొచ్చు. ఇక గర్భవతిగా ఉన్నప్పుడు ఎకోస్ప్రిన్ వాడుతుంటే మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే అది మీ బిడ్డపై ప్రభావం చూపించవచ్చు. అందుకే వైద్యులతో మాట్లాడి ప్రత్యామ్నాయాల గురించి చర్చించాలి.

Tags:

Ecosprin tablets uses in telugu, Ecosprin tablets during pregnancy in telugu, Ecosprin tablets side effects in telugu, Ecosprin tablets for breast feeding moms in telugu, Precautions to take while taking Ecosprintablets in telugu, Ecosprin tablets impact on babies in telugu.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.