hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Exercise & Fitness arrow
  • స్టామినా ఎలా పెంచుకోవాలి? ప్రయత్నించి, పరీక్షించిన పద్ధతులు arrow

In this Article

    స్టామినా ఎలా పెంచుకోవాలి? ప్రయత్నించి, పరీక్షించిన పద్ధతులు

    Exercise & Fitness

    స్టామినా ఎలా పెంచుకోవాలి? ప్రయత్నించి, పరీక్షించిన పద్ధతులు

    3 November 2023 న నవీకరించబడింది

    జీవితంలో అనేక పనులు పూర్తి చేయడానికి, ఫిట్‌గా ఉండటానికి స్టామినా చాలా అవసరం. స్టామినా పెంచుకోవడం ద్వారా మీరు ఎక్కువకాలం శారీరక శ్రమ, మానసిక శ్రమను భరించగలరు. అయితే ప్రధానంగా వచ్చే ప్రశ్న- స్టామినా ఎలా పెంచుకోవాలి? అని. అందులోనూ సహజంగా స్టామినా ఎలా పెంచుకోవాలి? అని తెగ ఆలోచిస్తుంటారు. ప్రజల నమ్మకాలకు విరుద్ధంగా ఇంట్లోనే మంచి వ్యాయామం, డైట్, లైఫ్‌స్టైల్‌తో స్టామినా పెంచుకోవచ్చన్న విషయం మీకు తెలుసా?

    వ్యాయామం ద్వారా స్టామినా ఎలా పెంచుకోవాలి?

    వ్యాయామం ద్వారా బలం, స్టామినా ఎలా పెంచుకోవాలి? ఈ ప్రశ్న మిమ్మల్నీ వేధిస్తోందా? వ్యాయామాన్ని సమర్థవంతంగా ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ఇంట్లోనే రోజూ 30 నిమిషాల శారీరక వ్యాయామం భారీ మార్పు వైపు దారీ తీస్తుంది. ఈ కింద ఇచ్చిన వ్యాయామాలు మీ స్టామినాను పెంచుతాయి-

    • బెంచ్ ప్రెస్
    • సైక్లింగ్
    • పుష్-అప్స్
    • జంపింగ్ జాక్స్
    • మెట్లు ఎక్కడం
    • స్విమ్మింగ్
    • హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్

    ఆహారంతో స్టామినా ఎలా పెంచుకోవాలి?

    మంచి పోషకాలు ఉన్న ఆహారంతో దీర్ఘకాలంలో స్టామినా పెంచుకోవడంతో పాటు ఆరోగ్యాన్నీ పెంపొందించుకోవచ్చు.

    1. అరటిపండ్లు అరటి పండ్ల నుంచి మంచి శక్తి వస్తుంది. ఇందులో విటమిన్లు, కార్బోహైడ్రేట్స్, పొటాషియం, ఫైబర్, ప్రొటీన్, ఫ్యాట్స్ ఉంటాయి.
    2. బ్లాక్ కాఫీ కెఫైన్‌తో ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ వస్తుంది. ఇది మీ డైట్‌లో అదనంగా కేలరీలను యాడ్ చేయకుండానే మీ మెదడును, శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది.
    3. బ్రౌన్ రైస్ తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్ తయారు చేసేప్పుడు మెషీన్ ప్రాసెసింగ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి అందులోని పోషకాలు అలాగే ఉంటాయి. దీంతో పాటు బ్రౌన్ రైస్‌లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్లడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి మీరు ఎక్కువ సమయం శక్తితో ఉండొచ్చు.
    4. చేపలు మెదడు అభివృద్ధికి ఉపయోగపడే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల మీ రోజువారీ డైట్‌లో చేపలను తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇవి సహజంగానే స్టామినా పెంచుకోవడం కోసం ఉపయోగపడతాయి. DHA, EPA ఉంటే టూనా లేదా సాల్మన్ లాంటి చేపలు తింటే, ఎండ్యూరెన్స్ పెంచే ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి.
    5. చికెన్, గుడ్లు ఈ రెండింటిలో ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. గుడ్లల్లో విటమిన్ బి, అమినో యాసిడ్స్ కూడా లభిస్తాయి. శరీరంలో శక్తి ఉత్పత్తిని ప్రేరేపించడానికి ఉపయోగపడుతుంది.

    బలం, స్టామినాను ఎలా పెంచుకోవాలి అని తెలుసుకుంటున్న మీరు, ఇందుకోసం ఏఏ ఆహారపదార్థాలను వదిలేయాలో కూడా తెలుసుకోవాలి:

    • ఆల్కహాల్
    • పాలు
    • పొగాకు
    • వేయించిన ఆహారపదార్థాలు
    • బయట తినే ఫుడ్

    ఇంట్లోనే స్టామినా ఎలా పెంచుకోవాలి? – ఈ ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి

    స్టామినా ఎలా పెంచుకోవాలి అని తెలుసుకునేవారు ఇంట్లోనే స్వయంగా ఇదంతా ఎలా చేయాలో తెలుసుకోవాలి. డైట్, ఎక్సర్‌సైజ్ కాకుండా మరిన్ని విషయాలను గుర్తుంచుకోవడం అవసరం.

    1. నిదానమే ప్రధానం

    సహజంగా స్టామినా పెంచుకోవాలనుకుంటే, ముందుగా మీ శరీరంలోని ఎండ్యూరెన్స్ లెవెల్ ఎంతో మర్చిపోకూడదు. రాత్రికి రాత్రే స్టామినా పెరగదు. నిదానంగా మార్పులు వస్తాయి. నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది. తొందరపడితే మీ శరీరానికి మీరే హాని చేసుకుంటారు. ఒక్కోసారి ఆ నష్టాలను తిరిగి పూడ్చుకోలేరు.

    2. బ్యాలెన్స్‌డ్ డైట్ ఫాలో కావాలి

    ఇంట్లోనే స్టామినా పెంచుకునే ప్రయత్నంలో కేవలం ప్రొటీన్స్ లేదా ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలపై ఆధారపడకూడదు. మీ శరీరానికి అవసరమైన బ్యాలెన్స్‌డ్ డైట్ రూపొందించుకోవాలి. ప్రతీసారి మంచి పోషకాలు ఉన్న భోజనం చేయాలి.

    3. ఆనందంతో ప్రారంభించండి

    స్టామినా పొందాలన్న మీ లక్ష్య సాధన మీకు బాధగా లేదా బోరింగ్‌గా ఉండకూడదు. యోగా ఇష్టమైతే యోగా, లేదా పుషప్స్, HIIT ఇలా మీకు ఏది ఇష్టమైతే అది ఆనందంతో చేయండి. ఈ ప్రాసెస్ మీకు ఆనందం కలిగించాలి తప్ప ఒత్తిడి కాదు.

    4. ఎక్కువ సేపు ఇనాక్టీవ్‌గా ఉండకూడదు

    మీరు విరామం తీసుకునే సమయాన్ని తగ్గించండి. మీ శరీరం రికవర్ కావడానికి విరామం అవసరం. అలాగని ఇనాక్టీవ్‌గా కాకూడదు. స్టామినా పెంచే యాక్టీవ్ లైఫ్‌స్టైల్‌కు మీ శరీరాన్ని అలవాటు చేయాలి.

    5. కార్బోహైడ్రైట్లను వదిలేయడం పెద్ద తప్పు

    కార్బోహైడ్రేట్స్ ఆరోగ్యానికి మంచివి కావన్న అపోహ చాలామందిలో ఉంది. శరీరానికి అధికంగా కొవ్వును యాడ్ చేస్తుందని, దీని వల్ల వ్యాయామం చేసినా వృథానే అన్న అపోహలున్నాయి. ఇది అపోహ మాత్రమే. నిజం కాదు. ప్రొటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్ లాగానే కార్బోహైడ్రోట్స్ కూడా అవసరం. ఇందులో బాడీ స్టామినా పెంచడానికి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రొటీన్ ఫాలో కావడం ద్వారా మీ స్టామినాను సహజంగా ఎలా పెంచుకోవాలన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ఎమోషనల్ వెల్ బీయింగ్ అంటే ఏమిటి | దాని ప్రాముఖ్యత & లక్షణాలను అర్థం చేసుకోవడం

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Sarada Ayyala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.