
నవజాత శిశువు మెదడు బరువు దాని పరిపక్వ (యుక్తవయసులో) బరువులో కేవలం 25 శాతం మాత్రమే ఉంటుంది. మెదడు అనేది జీవితంలోని మొదటి మూడు సంవత్సరాల్లోనే ఎక్కువగా పెరుగుతుంది. న్యూరాన్లు మొదటి త్రైమాసికంలో ఏర్పడడం ప్రారంభిస్తాయి. కానీ ఎక్కవ భాగం మెదడు పెరుగుదల అనేది చివరి రెండు త్రైమాసికాల్లో జరుగుతుంది. ఈ కాలం చాలా ముఖ్యమైనది. న్యూరాన్స్ (మెదడు మరియు నాడీ వ్యవస్థ మధ్య సమాచార ప్రసారానికి ఉపయోగపడేవి) అనేవి శిశువు మెదడు అభివృద్ధి చెందేందుకు మరియు సక్రమంగా పని చేసేందుకు ఉపయోగపడతాయి.
తల్లిదండ్రులు తమ శిశువు మెదడు అభివృద్ధి చేసేందుకు ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఈ ఆర్టికల్‌లో మీకు శిశువు మెదడును అభివృద్ధి చేసేందుకు 10 యాక్టివిటీస్ (కార్యకలాపాలు) ఉన్నాయి. ఇవి పిల్లల్లో మెదడు అభివృద్ధిని ఎంతగానో ప్రోత్సహిస్తాయి.
కూస్ (పిల్లల చిన్న పిలుపులు) మరియు ఏడుపుల సమయంలో ప్రతిస్పందనలు, ఐ గేజింగ్ (సంరక్షుని చూపులను అనుసరించడం) మరియు గూఫీ ఫేసెస్ (గమ్మత్తైన ముఖాలు) లను తయారు చేయడం పిల్లల అభిజ్ఞా అభివృద్ధి (పిల్లలు ఎలా ఆలోచిస్తారనే విషయం)లో కీలకం. అంతే కాకుండా మనల్ని ఎక్కువుగా ప్రేమించేవారితో ఇంటరాక్షన్ (పరస్పర చర్య) అవసరం. గుడ్ ఇంటరాక్షన్(పరస్పర చర్య)లో శిశువు మరియు తల్లి మధ్యలో ఖచ్చితమైన బ్యాక్ అండ్ ఫోర్త్ డైలాగ్ (దేనిగురించైనా చర్చ) ఉంటుంది. నవజాత శిశువు కబుర్లు చెప్పినపుడు తల్లిదండ్రులు ఆ చర్చలో నిమగ్నమైనట్లు రిప్లై (ప్రత్యుత్తరం) ఇస్తారు.
మీ శిశువును స్పిన్ (ఇండోర్ సైక్లింగ్) క్లాస్‌కు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏదేమైనా ఫిజికల్ యాక్టివిటీలైన—టమ్మీ టైమ్, క్రాలింగ్ (పాకడం), వాకింగ్ ప్రాక్టీస్ (నడిచేందుకు ప్రయత్నించడం) లేదా పేరెంట్-చైల్డ్ స్విమ్మింగ్ వంటివి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి చాలా ప్రయోజకరంగా ఉంటాయని రుజువైంది. మరీ ముఖ్యంగా 1 సంవత్సరం వయసున్న పిల్లల మెదడు అభివృద్ధి యాక్టివిటీలకు ఉపయోగపడుతుంది. పిల్లల అభిజ్ఞా అభివృద్ధి (పిల్లలు ఎలా ఆలోచిస్తారనే విషయం) కోసం ఫిజికల్ యాక్టివిటీ ఎంతో ముఖ్యమైనది. పరిశోధన ప్రకారం.. మరీ ముఖ్యంగా కార్యనిర్వాహక విధులు, భాషా నైపుణ్యాల కోసం పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు మంచిది.
పుట్టిన వెంటనే పిల్లల ముఖాలను చూడడం అనేది బేబీ దృష్టి మరియు అభిజ్ఞా అభివృద్ధి (పిల్లలు ఎలా ఆలోచిస్తారనే విషయం)కి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. స్టాన్ఫోర్డ్ పరిశోధకులు తెలియజేసిన దాని ప్రకారం.. 4 సంవత్సరాల వయసులో పిల్లలు ముఖాలను గుర్తించే సామర్థ్యం పెద్దవారిలో ఉన్నట్లుగానే ఉంటుంది. బేబీకి 10–12 ఇంచుల దూరంలో ముఖాన్ని ఉంచడం.. తర్వాత వేరే వ్యక్తితో ముఖాన్ని మార్చడం.. బేబీల ప్రతిస్పందన కోసం వేచిచూడడం వంటి సింపుల్ గేమ్ పిల్లల్లో అభిజ్ఞా అభివృద్ధి (పిల్లలు ఎలా ఆలోచిస్తారనే విషయం) వంటి క్లిష్టమైన నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడంలో తోడ్పడుతుంది.
తల్లిదండ్రులు మరియు పిల్లలు కలిసి చదవడాన్ని బాగా ఆస్వాదిస్తారు. ఇది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్‌లో ముఖ్యమైన భాషా సామర్థ్యాలైన లయలు, శబ్దాలు, పదాల అర్థాలను మెదడు శోషించుకునేలా(అబ్సార్బ్) సహాయం చేస్తుంది. ఉదాహరణకు చాలా చిత్రాలు లేదా నర్సరీ రైమ్స్‌తో కూడిన పుస్తకంలోని సింపుల్ కథలను చదవండి.
పిల్లలు సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. పిల్లల మెదడు అభివృద్ధిలో సంగీతం సహాయం చేస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక రీసెర్చ్ (పరిశోధన) ప్రకారం... మ్యూజిక్ థెరపీ (సంగీత చికిత్స) పొందిన 6 నెలల పిల్లలు పగటిపూట నిద్ర అలవాట్లను మరియు ఏకాగ్రతను మెరుగుపర్చుకున్నారు. మరో పరిశోధన ప్రకారం.. మ్యూజిక్ క్లాసెస్ వల్ల 8 నెలల పిల్లల్లో మోటార్ డెవలప్మెంట్ స్కిల్స్ అభివృద్ధి చెందినట్లు గుర్తించారు. అందుకే ఆ చిట్టి పాదాలను ఓసారి తట్టండి.
శిశువుతో సంభాషించేందుకు మరియు మెదడు అభివృద్ధిని ప్రేరేపించేందుకు మరొక అద్భుతమైన విధానం సింగింగ్ (పాడడం). 2013లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. తల్లిదండ్రులతో కలిసి ప్రత్యక్ష మ్యూజిక్ సెషన్స్‌లో పాల్గొన్న పిల్లలు 6 నెలల వయస్సులోనే సామాజిక, భావోద్వేగ (ఎమోషనల్) మరియు అభిజ్ఞా అభివృద్ధి (పిల్లలు ఎలా ఆలోచిస్తారనే విషయం)ని మెరుగుపర్చుకున్నారు. కాబట్టి నర్సరీ రైమ్స్‌ను గట్టిగా పాడేందుకు (బెల్ట్ అవుట్) ఎటువంటి విధంగా భయపడకండి.
శిశువుల అభిజ్ఞా అభివృద్ధి (పిల్లలు ఎలా ఆలోచిస్తారనే విషయం)కి వారితో మాట్లాడడం ఎంతో సహకరిస్తుంది. ఒక శిశువు ఎన్ని ఎక్కువ పదాలను వింటే వారి పదజాలం అంత పెద్దదిగా ఉంటుంది. ఒక పరిశోధన ప్రకారం.. ఎక్కువ పదజాలం కలిగి ఉండడం వలన భవిష్యత్‌లో ఎక్కువగా చదివే అవకాశం ఉంది. కాబట్టి వారితో ప్రతి దాని గురించి మాట్లాడుతూ ఉండండి.
సంకేత భాషలను ఉపయోగించే పిల్లలు మెరుగైన కమ్యూనికేషన్(వివిధ మార్గాల ద్వారా సమాచారం పంపడం) సామర్థ్యాలను కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. అంతే కాకుండా ఇది తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య బంధాన్ని మెరుగుపరుస్తుంది. మరియు పిల్లల్లో అభిజ్ఞా అభివృద్ధి (పిల్లలు ఎలా ఆలోచిస్తారనే విషయం)ని పెంపొందిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం.. సంకేత భాషలో నిమగ్నమైన 6నెలల వయస్సు గల పిల్లలు సంకేత భాష గురించి తెలియని పిల్లల కంటే ఎక్కువ పద పరిజ్ఞాన్ని మరియు సమస్య పరిష్కార నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
సెన్సరీ ప్లే (ఇంద్రియాలతో ఆట) అనే యాక్టివిటీ సెన్సెస్ (ఇంద్రియాలు) ను ప్రేరేపిస్తుంది. శిశువు మెదడు అభివృద్ధికి ఇది ఒక అద్భుతమైన విధానం. మీ బేబీ పాదాల వద్ద వివిధ రకాల ఆకృతులు (టెక్చర్స్) ఉంచడం, లేదా షేక్, రోల్(తిప్పడం), ర్యాటిల్(సౌండ్ చేసేవి) చేసేందుకు వస్తువులను అందించడం వంటి సాధారణ విషయాలను ప్రయత్నించండి. మీ శిశువులు వీటిని ఇష్టపడతారు. ఇది పిల్లల్లో అభిజ్ఞా అభివృద్ధి (పిల్లలు ఎలా ఆలోచిస్తారనే విషయం), భాషా, మరియు మోటార్ స్కిల్స్ అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది.
బేబీ మెదడుని అభివృద్ధి చేసే క్రమంలో బేబీ యొక్క ఇంద్రియాలు అభివృద్ధి చెందేలా ఉత్తేజపరిచేందుకు నీటిలో ఆడుకోవడం ఒక విధానం. ఈ విధానం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నీటిలో ఆడుకోవడం అనేది చాలా అవసరాలకు ఉపయోగపడుతుంది. సమస్యల పరిష్కారం కోసం ఉపయోగపడే సోషల్ మరియు ఎమోషనల్ స్కిల్స్ ఇలా ప్రతిదానికి సహాయపడుతుంది. కాబట్టే కొలను (స్విమ్మింగ్ పూల్) కు వెళ్లండి. బాత్ టబ్‌లో స్ప్లాష్ (నిశ్చలంగా ఉన్న నీటిలో ఒకే సారి కదలిక) చేయనీయండి. లేదా కప్పులో వాటర్ పోసి దానితో ఆడుకోనివ్వండి. పిల్లలు ఈ ఆటలను ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే పజిల్స్ మరియు గేమ్స్ అనేవి అభిజ్ఞా అభివృద్ధి (పిల్లలు ఎలా ఆలోచిస్తారనే విషయం)కి చాలా ముఖ్యమని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అన్ని వయసుల వారికి అనేక ఆప్షన్లు లభిస్తాయి.
శిశువుల కోసం సింపుల్ మ్యాచింగ్ గేమ్స్ లేదా షేప్ స్టార్టర్స్ (ఒక రకమైన పిల్లల ఆట వస్తువు) ప్రయత్నించండి. వారి వయసు పెరిగే కొద్దీ మరింత ఎక్కువ చాలెంజింగ్‌గా (కష్టతరంగా) ఉండే పజిల్స్ మరియు గేమ్స్ ఆడించొచ్చు. ఈ గేమ్స్ వారిలో లాజిక్(తర్కం), ప్లానింగ్ (ప్రణాళిక), ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ (సమస్యను పరిష్కరించే నైపుణ్యం) పెంపొందిస్తాయి. పైన చెప్పుకున్న విధంగా శిశువు అభిజ్ఞా అభివృద్ధిని వివిధ రకాల బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టీవిటీస్తో ప్రోత్సహించవచ్చు. ఇవి మీరు మొదలు పెట్టేందుకు కొన్ని ఆలోచనలు మాత్రమే..
క్రియేటివ్నెస్ (సృజనాత్మకత) పొందండి. పెరుగుతున్న మీ శిశువుతో ప్రత్యేక బంధాన్ని ఏర్పాటు చేసుకుని నేర్చుకునేందుకు సహాయపడండి. పిల్లల్లో మెదడు వికాసం గురించి మరింత సమాచారం కోసం వెంటనే మీ వైద్యునితో మాట్లాడండి. లేదా స్థానిక ఎర్లీ ఇన్టర్వెన్షన్ ప్రోగ్రామ్‌ను సంప్రదించండి. (పిల్లల వికాసం సరిగ్గా లేకపోతే స్పీచ్ థెరపీ మొదలయిన వాటి ద్వారా నయం చేసే కేంద్రం)
Baby brain development in telugu, tips to baby brain activities in telugu, Top 10 Baby Brain Development Activities In English, Top 10 Baby Brain Development Activities In Hindi, Top 10 Baby Brain Development Activities In Tamil, Top 10 Baby Brain Development Activities In Bengali
Yes
No


















In. ,
.g rsjs.siis ar
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |