This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

ప్రెగ్నెన్సీ సమయంలో దాలియా యొక్క 10 ప్రయోజనాలు (10 Benefits of Eating Dalia During Pregnancy in Telugu)

Written by - Swetha RaoLast updated: Nov 3, 2023
ప్రెగ్నెన్సీ సమయంలో దాలియా యొక్క 10 ప్రయోజనాలు (10 Benefits of Eating Dalia During Pregnancy in Telugu)
Likes4 Likes|
Read time9 min

మీరు ఒక తల్లి అవుతున్నారని తెలిసిన వెంటనే మీ ఆరోగ్యం పట్ల మీకు ప్రాధాన్యత మారిపోతుంది! నిజమే, మీరు మీ ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే మీలో ప్రాణం పెరుగుతోంది. ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ కోసం మీరు ఏమి తింటున్నారు మరియు ఎంత పరిమాణంలో శ్రద్ధ వహించాలనేది చాలా అవసరం. సరైన మరియు సమతుల్య ఆహారం మీ బిడ్డ మంచి ఎదుగుదల మరియు అభివృద్ధికి అవసరమైన అన్ని పోషకాలను పొందేలా చేస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మీకు అద్భుతంగా సహాయపడే ఒక ప్రసిద్ధ ఆహారం దాలియా లేదా గోధుమ రవ్వ. ప్రెగ్నెన్సీ సమయంలో దాలియా అనేక ఆరోగ్య సంబంధిత సవాళ్లను అధిగమించడంలో మీకు సహాయపడే విలువైన గుప్త నిధి కావచ్చు.

దాలియా అంటే ఏమిటి? (What is Dalia in Telugu?)

దాలియా అనేది గోధుమ రవ్వ నుంచి తయారుచేయబడేది, దీన్ని శతాబ్దాలుగా తింటున్నాం. ఇది ఫైబర్ మరియు మాంగనీస్ అధికంగా ఉండే ఒక పోషక శక్తి కేంద్రం. దాలియా యొక్క సంక్లిష్ట పిండి పదార్థాలు మరియు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ బరువు తగ్గడానికి మరియు డయాబెటిస్ ఉన్నవారికి తగినది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించే గ్లూకోజ్ క్రమం తప్పకుండా విడుదలయ్యేలా ప్రోత్సహిస్తుంది. పెద్దప్రేగును శుభ్రపరచడానికి మరియు జీర్ణక్రియను మెరుగుపరచడానికి దాలియా ఉపయోగపడుతుంది. అలాగే దాలియా వల్ల బరువు తగ్గడం మరియు మలబద్ధకం సమస్య తీరుతుంది. పాలతో కలిపిన దాలియా కండరాలను పెంచుతుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. దాలియా మీకు మరియు మీ బిడ్డకు ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో వర్ణించడానికి ఇది ఒక ఫాన్సీ మార్గం. మ్యాజిక్ దాలియా మీ శరీరంపై పనిచేయగలదు మరియు మీ బిడ్డకు ఎంతో శక్తిని ఇస్తుంది. ఇది బాగా పని చేస్తుందని మీ పెద్దలు, కుటుంబం మరియు స్నేహితుల ద్వారా ఇప్పటికే మీ మనస్సులలో బాగా పాతుకుపోయింది. కాబట్టి మొత్తం మీద దాలియా చాలా గొప్పది, మరియు మీరు దీనిని రోజువారీగా మీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

దాలియాలో పోషక విలువ ( Nutrient Value of Dalia in Telugu)

బరువు తగ్గడానికి లేదా పెరగడానికిప్రయత్నించే వ్యక్తిగా, ఒక నిర్దిష్ట భోజనంలో ఎన్ని కేలరీలు మరియు పోషకాలు ఉన్నాయో ట్రాక్ చేయడం సాధారణం. దాలియాలో ఎన్ని కేలరీలు, పోషకాలు ఉన్నాయో తెలుసుకుందాం.

  • ప్రతి 100 గ్రాములకు పోషక విలువ
  • శక్తి - 152 కిలో క్యాలరీలు
  • కొవ్వు - 3.41గ్రాములు
  • సంతృప్త కొవ్వులు - 1.615 గ్రా
  • ట్రాన్స్ ఫ్యాట్స్ - 0గ్రా
  • మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ - 0.893గ్రా
  • పాలీఅన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ - 0.478గ్రా
  • కార్బోహైడ్రేట్లు - 27.7 గ్రా
  • చక్కెర - 0.97 గ్రా
  • ఫైబర్ - 1.4గ్రా
  • ప్రోటీన్ - 5.03గ్రా
  • సోడియం - 143మిల్లీగ్రాములు
  • కొలెస్ట్రాల్ - 6మిల్లీగ్రాములు
  • పొటాషియం - 193 మిల్లీగ్రాములు

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో రాగి: ప్రయోజనాలు మరియు పోషక విలువలు

ప్రెగ్నెన్సీ సమయంలో దాలియా యొక్క 10 ప్రయోజనాలు (10 Benefits of Dalia During Pregnancy in Telugu)

దాలియా ఎంత ప్రయోజనకరమో మన పెద్దలు ఎల్లప్పుడూ మనకు చెప్పినదానితో పాటు, ప్రెగ్నెన్సీ సమయంలో దాలియా యొక్క ప్రయోజనాల గురించి వివరంగా మాట్లాడుకుందాం.

1. ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగడానికి సహాయపడుతుంది ( Helps in Weight Gain During Pregnancy in Telugu)

ప్రెగ్నెన్సీ అంటే ఫిట్ గా ఉండటం మరియు మీ ఎదుగుదల మరియు మీ బిడ్డ యొక్క ఎదుగుదల ఒకదానికొకటి కలిసి ఉండేలా చూసుకోవడం. గర్భవతిగా ఉండటం అంటే అవసరానికి మించి తినడం లేదా అనవసరమైన బరువును పెంచడం కాదు. అయినప్పటికీ కొంతమంది మహిళలు ఎటువంటి బరువు పెరగరు పైగా దాని గురించి ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో దాలియాను మీ ఆహారంలో క్రమం తప్పకుండా భాగం చేసుకోవడం అనేది, తల్లికి నిజంగా ఆరోగ్యకరమైన ఎంపిక అవుతుంది. స్వీట్ దాలియా, మిక్స్ వెజ్ దాలియా వంటి వివిధ రూపాల్లో దాలియాను తినగలిగినప్పటికీ, దాలియాను పాలతో మరిగించడం వల్ల ఆరోగ్యంగా బరువు పెరగడానికి సహాయపడుతుంది!

మీకు ఇది కూడా నచ్చుతుంది: మహిళలు బరువు తగ్గేందుకు డైట్ ప్లాన్

2. ప్రెగ్నెన్సీ డయాబెటిస్‎ను అదుపులో ఉంచుతుంది (Keeps Pregnancy Diabetes in Check)

సంక్లిష్ట పిండి పదార్థాల యొక్క అధిక కంటెంట్ మరియు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా, దాలియా వల్ల డయాబెటిక్ రోగులకు ప్రయోజనం జరుగుతుంది. దాలియా జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పట్టడంతో పాటూ, దాలియాలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల రక్తప్రవాహంలోకి గ్లూకోజ్ క్రమంగా విడుదలయ్యేందుకు దోహదపడుతుంది. దాలియా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని ఆరోగ్యకరంగా నిర్వహించేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా షుగర్ తో బాధపడుతున్న తల్లులకు, దాలియా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. ప్రెగ్నెన్సీ సమయంలో దాలియా మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అందువల్ల అనవసరమైన మందులు మరియు చికిత్స నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

3. విటమిన్లతో నిండింది (Packed With Vitamins)

ప్రెగ్నెన్సీ సమయంలో సరిగా తినాలని అనిపించదు, అది మంచి ఆహారమైనప్పటికీ, జంక్ ఫుడ్ లేదా పండ్లు మరియు కూరగాయలు అయినా సరే ఏదైనా తినాలని అనిపించని ఉంటాయి. ఇలాంటి సమయంలో దాలియా మీకు రక్షణనిస్తుంది. దాలియా గోధుమలతో తయారు చేయబడింది మరియు గోధుమ ధాన్యం యొక్క ప్రతి ముక్క మీ శరీరంలో అవసరమైన మరియు లోపించిన విటమిన్లను భర్తీ చేయడం కోసం కావాల్సిన అన్ని విటమిన్లతో నిండి ఉంటుంది.

4. మీ హిమోగ్లోబిన్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది (Helps in Improving Your Hemoglobin)

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళ యొక్క హిమోగ్లోబిన్ కౌంట్ వేగంగా తగ్గడానికి మరియు పెరగడానికి అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీ సమయంలో దాలియా తీసుకోవడం వల్ల మీ హిమోగ్లోబిన్ ను అదుపులో ఉంచుకోవడంలో మీకు సహాయపడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మీ హిమోగ్లోబిన్ 12 ఉండాలి మరియు దాలియా ఈ సంఖ్యను సాధించడంలో మీకు సహాయపడుతుంది. ఇది చాలా ప్రభావవంతమైన మార్గం!

5. మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడుతుంది (Helps in Getting Rid of Constipation)

దాలియా అంటే గోధుమ మరియు పొట్టు తప్ప మరేమీ కాదు. పొట్టు కారణంగా ఈ ఆహారంలో సహజంగా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ప్రేగులను ఆరోగ్యంగా మరియు మలబద్ధకం లేకుండా ఉంచడానికి సహాయపడుతుంది. మంచి ప్రయోజనం కోసం పాలు లేదా కూరగాయలతో దాలియాను ప్రతిరోజూ మీ ఆహారంలో భాగంగా చేయాలి. ప్రెగ్నెన్సీ సమయంలో మలబద్ధకం అనేది చాలా అసౌకర్యంగా అనిపించే ఫీలింగ్ మరియు ప్రతి మహిళ దాని నుంచి ఉపశమనం పొందాలని చూస్తుంది. మలబద్ధకాన్ని నివారించడానికి ఉత్తమ మార్గం ప్రెగ్నెన్సీ సమయంలో దాలియా తినడం, అది అల్పాహారమైనా, భోజనమైనా లేదా విందైనా కావచ్చు.

6. వండడం సులభం (Easy to Cook)

దాలియా గురించి బెస్ట్ పార్ట్ ఏమిటంటే, వండడం చాలా సులభం మరియు ఇతర ఆహారాల కంటే తక్కువ సమయం పడుతుంది. ప్రెగ్నెన్సీ మూడ్ స్వింగ్స్ మరియు సోమరితనంతో నిండి ఉంటుంది. మీరు అంతటా చురుకుగా ఉండకపోవచ్చు మరియు సులభమైన ఇంకా పోషక విలువలు కలిగిన దాన్ని వండాలని అనుకోవచ్చు. అలాంటి సమయాల్లో దాలియా మీరు తప్పకుండా ప్రయత్నించాల్సిన ఆహారం.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ కోరికలు (ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్): అవి ఎప్పుడు ప్రారంభమవుతాయి

7. కొలెస్ట్రాల్ స్థాయిలను మెయింటెన్ చేస్తుంది (Maintains Cholesterol Levels)

ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్య సమస్యలు ఉండాలని ఏ తల్లి కోరుకోదు. మీకు కొలెస్ట్రాల్ ఉన్నట్లు నిర్ధారణ అయితే, మీ ఆహారంలో ఎక్కువ ఫైబర్ తినకపోతే దానిని మెయింటెన్ చేయడం సవాలుగా ఉంటుంది. దాలియాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది వ్యర్థాలు మరియు మలినాలను తొలగించడానికి శరీరానికి సహాయం చేస్తుంది. LDL (చెడు కొలెస్ట్రాల్) తగ్గించడం ద్వారా మరియు HDL (మంచి కొలెస్ట్రాల్) పెంచడం ద్వారా ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను (మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు) స్థిరీకరించడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో దాలియా హార్ట్-హెల్దీ ఆప్షన్.

8. మీ బిడ్డ ఎదుగుదలకు దోహదపడుతుంది (Helps in the Growth of Your Child)

ఒక స్త్రీ గర్భం దాల్చిన వెంటనే, ఆమె ఎల్లప్పుడూ ఆలోచించే మొదటి విషయం తనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం మరియు అభివృద్ధి. ప్రెగ్నెన్సీ సమయంలో దాలియా తినడం వల్ల తల్లికి మాత్రమే కాకుండా బిడ్డకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దాలియాను మీ బెస్ట్ ఫ్రెండ్ గా చేసుకోవడం వల్ల మీ బిడ్డ ఎముకల ఆరోగ్యానికి మరియు మీ పుట్టబోయే బిడ్డ యొక్క సంపూర్ణ ఎదుగుదలకు ప్రయోజనం చేకూరుతుంది. దాలియా ద్వారా మీ బిడ్డకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు ఇతర పోషకాలు లభిస్తాయి. మీ రెగ్యులర్ డైట్ లో దాలియాను చేర్చుకోవడానికి ఇది తగిన కారణం.

9. ప్రెగ్నెన్సీ సమయంలో చురుకుగా ఉండటానికి మీకు సహాయపడుతుంది ( Helps You in Staying Active During Pregnancy)

దాలియా ఐరన్ మరియు మెగ్నీషియంతో సమృద్ధిగా ఉంటుంది- ప్రెగ్నెన్సీ సమయంలో మీకు ఖచ్చితంగా అవసరమైన 2 విషయాలు. మీ చివరి త్రైమాసికంలో మీకు సోమరితనం లేదా బలహీనంగా అనిపించే అవకాశం ఉంది. మీరు దాలియా తీసుకున్నప్పుడు, మీ శరీరానికి ఎక్కువ మెగ్నీషియం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం లభిస్తుంది. ఇది మీ శరీరాన్ని శక్తివంతం చేస్తుంది మరియు అలసిపోయినట్లు అనిపించదు. నిజానికి ప్రెగ్నెన్సీ సమయంలో దాలియా ఒక వరం.

10. పాలివ్వడంలో సహాయపడుతుంది (Helps in Lactation)

తల్లిపాలు ఇవ్వడం అనేది మహిళలు మాత్రమే చేయగలిగేది మరియు ఇది నిజంగా ఒక ఆశీర్వాదం. దాలియా యొక్క ఉత్తమ ప్రయోజనాలలో ఒకటి ఏమిటంటే, ఇది మీ బిడ్డకు పాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. దాలియా తినడం ద్వారా ఏర్పడే పాలు అద్భుతంగా, నాణ్యతను కలిగి ఉంటాయి మరియు మీ బిడ్డకు అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఈ పాలు మీ బిడ్డకు సులభంగా జీర్ణం అవుతాయి. ఇది మీ బిడ్డకు విరేచనాలు లేదా మలబద్దకానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే శక్తిని అందిస్తుంది. అందువల్ల మీ చివరి త్రైమాసికంలో మీరు క్రమం తప్పకుండా దాలియాను తింటే, అది పాల ఉత్పత్తిని పెంచుతుంది. మీరు మరియు మీ బిడ్డ దాని నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతారు.

Tags:

Dalia during pregnancy in telugu, Dalia benefts during pregnany in telugu, Dalia recipes in telugu, Is Dalia safe during pregnancy in telugu, can pregnants eat dalia in telugu, 10 Benefits of Eating Dalia During Pregnancy in English, 10 Benefits of Dalia in Pregnancy In Tamil, 10 Benefits of Dalia in Pregnancy In Bengali

Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Helpful Tools & Calculators

undefined icon
Make Baby Sleep
Play white noise & sleep music
arrow_right
undefined icon
Mylo Store
Shop for mom & baby
arrow_right
undefined icon
Baby Diet Chart
Age-wise food plans for baby
arrow_right
undefined icon
My Calendar
Predict periods & record symptoms
arrow_right
undefined icon
Vaccination Tracker
Never miss a vaccine date
arrow_right
undefined icon
Zordar Dadi Ke Nuskhe
Gharelu nushke that work
arrow_right
undefined icon
Feeding Tracker
Baby's feeding schedule made easy
arrow_right
undefined icon
Baby Names
Search names with meanings
arrow_right
undefined icon
Save Memories
Store baby's photos & firsts
arrow_right
undefined icon
Pregnancy Calendar
See baby growth week by week
arrow_right
undefined icon
Mamasutra
Safe positions for pregnancy
arrow_right
undefined icon
Pregnancy Diet Chart
Trimester & region-wise diet plan
arrow_right
undefined icon
Weight Tracker
Monitor your weight
arrow_right
undefined icon
Pill Reminder
Get reminded for medicines
arrow_right
undefined icon
Ovulation Calendar
Know your monthly cycle
arrow_right
Swetha Rao
Swetha Rao

Related Articles

Questions about this article

  • Asked by 28 weeks pregnant

    Naku eppudu 7 months baby moments teliyadam ledhu...

  • Asked when 35 weeks pregnant

    Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada

  • Asked when 39 weeks pregnant

    Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz

  • Asked when 34 weeks pregnant

    Hii 34 weeks how many months

  • Asked when 14 weeks pregnant

    Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me

Related Topics

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.