This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

పాలిచ్చే తల్లుల కోసం ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్ కోసం కొన్ని ముఖ్యమైన టిప్స్ (Essential Tips for a Healthy Diet Plan for Breastfeeding Mothers in Telugu)

Written by - Dhanlaxmi RaoLast updated: Dec 27, 2025
పాలిచ్చే తల్లుల కోసం ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్ కోసం కొన్ని ముఖ్యమైన టిప్స్ (Essential Tips for a Healthy Diet Plan for Breastfeeding Mothers in Telugu)
Likes32 Likes|
Read time4 min

పిల్లల ఆరోగ్యానికి తల్లిపాలు చాలా ముఖ్యమైన విషయం.అప్పుడే పుట్టిన శిశువు ఎదుగుదల పూర్తిగా తల్లి పాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే పాలిచ్చే తల్లులు సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవాలి.

ప్రాథమిక దశలో ఉన్న శిశువు తల్లి పాల నుండే అన్ని పోషకాలను పొందుతుంది. అలాంటి పరిస్థితిలో తల్లి తినే ఆహారం తల్లి పాల నాణ్యతను ప్రభావితం చేస్తుంది. అందువలన తల్లి తన బిడ్డకు సరిగ్గా ఫీడ్ చెయ్యడం (పాలు ఇవ్వడం) మరియు ఆరోగ్యకరమైన మరియు పోషకమైన ఆహారం అందించడం కోసం తాను సరైన ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోవడం చాలా ముఖ్యం.

పాలిచ్చే తల్లులకు ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్ కోసం కొన్ని టిప్స్ (Essential Tips for a Healthy Diet Plan for Breastfeeding Mothers in Telugu):

సరైన ఆహారం తినడంతో పాటు, తల్లులు హైడ్రేటెడ్‌గా కూడా ఉండాలి అంటే పుష్కలంగా నీరు తాగాలి. దీనివల్ల మీలో శక్తి ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉంటుంది. అంతే కాకుండా జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడటంతో పాటు మనం తీసుకునే ఆహారం నుండి పోషకాలను మన శరీరం తీసుకోవడాన్ని పెంచుతుంది. మంచి నీటితో పాటు, మీరు తాజా పండ్ల రసాలు, సూప్‌లు మరియు కెఫిన్ లేని డ్రింక్స్ ను కూడా మీ ఆహారంలో తీసుకోవచ్చు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: కొత్తగా అమ్మ అయిన ప్రతి మహిళ గుర్తుంచుకోవాల్సిన టాప్ 5 విషయాలు

ఒక ఆదర్శవంతమైన ఆహారం ఈ క్రింది వాటిని కలిగి ఉండాలి (A Healthy Diet Must Have These)

• తృణధాన్యాలు. వీటిలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు పీచు ఉంటాయి. వోట్స్, గోధుమలు, బార్లీ తృణధాన్యాలు కొన్ని ఉదాహరణలు.

• పాలకూర, క్యాబేజీ మరియు మెంతికూర వంటి ఆకుకూరల్లో ఫైబర్, కాల్షియం మరియు విటమిన్ A, C, E మరియు K పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకుకూరలు అధిక పోషకాలు, తక్కువ కెలోరీలు ఉండే ఆహార పదార్థాలు.

• శాఖాహార ఆహరం తీసుకునే తల్లులు పప్పు దినుసులు మరియు బీన్స్ తమ ఆహారంలో తీసుకోవచ్చు. ఈ ఆహార పదార్థాలు కండరాలను పెంచడానికి, అలాగే ప్రసవం నుండి శరీరం కోలుకోవడానికి కావాల్సిన ప్రోటీన్ ను అందిస్తాయి. పప్పు దినుసులు మరియు బీన్స్ ఫైబర్, ఫైటోకెమికల్స్ మరియు అనేక ఖనిజాలను మనకు అందించే మూలాలుగా కూడా పనిచేస్తాయి.

• గింజలు మరియు విత్తనాలను తల్లులు చిరుతిండిగా స్వీకరించవచ్చు లేదంటే తల్లి అల్పాహారంలో తీసుకునే తృణధాన్యాల్లో వీటిని చేర్చవచ్చు. ఈ ఆహారాలు ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ఫైబర్ తో నిండి ఉంటాయి. గింజలు మరియు విత్తనాల్లోని ఫైబర్ కూడా కడుపుని నిండుగా ఉంచి ఆకలిని అణిచివేస్తుంది.

• బిడ్డలకు పాలిచ్చే తల్లులకు చేపలు చాలా మేలు చేసే ఆహరం. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శిశువు మెదడు మరియు కంటి చూపు పెరగడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ కొవ్వులు అప్పుడే ప్రసవించిన తల్లులకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు మరియు కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: డెలివరీ తర్వాత తీసుకోవలసిన స్నాక్స్ గురించి ఏమి తెలుసుకోవాలి?

మీ డైట్ లో ఏయే ఆహారపదార్థాలు తీసుకోవాలి అనే దాంతో పాటు ఏ ఆహార పదార్థాలు తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం (Let's See What to Take and What Not to Take in a Healthy Diet in Telugu)

• సాధ్యమైనంత వరకు, పాలిచ్చే తల్లులు మసాలాతో కూడిన ఆహారాన్ని మరియు నూనెతో చేసిన ఆహార పదార్థాలను, దాంతోపాటు కెఫిన్ నిండిన పానీయాలను తీసుకోకూడదు. కారంగా ఉన్న ఆహరం తీసుకుంటే అది శిశువులో గ్యాస్ పెంచగలదు. అలాగే చనుబాల ద్వారా శిశువు వ్యవస్థలోకి వెళ్ళే కెఫిన్ అతనికి/ఆమెకు చిరాకు కలిగిస్తుంది. మీరు ఈ సమయంలో మద్యపానం కూడా చెయ్యకూడదు.

బిడ్డకు చనుబాలు అందించడం ఒక అందమైన అనుభవం. ఇది తల్లి బిడ్డల బంధం పెరగడానికి అనువైన సమయం. ఈ సమయంలో మీరు సరైన ఆహారం తీసుకుంటే ఈ అనుభూతిని మరింత అందంగా మార్చుకోవచ్చు.

Tags:

Eight tips for losing weight after pregnancy in Telugu, Eight tips for losing weight after pregnancy in English, Eight tips for losing weight after pregnancy in Hindi, Eight tips for losing weight after pregnancy in Tamil, Eight tips for losing weight after pregnancy in Bengali

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.