hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Healthy Eating arrow
  • డెలివరీ తర్వాత తీసుకోవలసిన స్నాక్స్ గురించి ఏమి తెలుసుకోవాలి? arrow

In this Article

    డెలివరీ తర్వాత తీసుకోవలసిన స్నాక్స్ గురించి ఏమి తెలుసుకోవాలి?

    Healthy Eating

    డెలివరీ తర్వాత తీసుకోవలసిన స్నాక్స్ గురించి ఏమి తెలుసుకోవాలి?

    3 November 2023 న నవీకరించబడింది

    కొత్తగా తల్లి అయిన వారికి ప్రసవానంతర కాలం చాలా కీలకమైనది. అంతే కాదు.. ప్రసవానంతరం తల్లి తీసుకునే ఆహారం బిడ్డపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. పౌష్టికాహారం తినడం అనేది శారీరక బలాన్ని తిరిగి పొందేందుకు, తల్లికి, బిడ్డకి ఇద్దరికీ ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో అవసరమైనది. కానీ ఇది అందరికీ తెలియదు. డెలివరీ తర్వాత ఆరోగ్యకరమైన స్నాక్స్ తిని ఆహారం పట్ల ఉన్న కోరికను తీర్చుకోవచ్చు. మీ డైట్ ప్లాన్‌కు అమూల్యమైన పోషకాహారాన్ని జోడించవచ్చు. కాబట్టి, ఆరోగ్యంగా.. డెలివరీ తర్వాత దృఢంగా ఉండటానికి ఎలాంటి స్నాక్స్ తినాలనే దానిపై ఇక్కడ కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

    ప్రసవానంతర పోషణ ఎందుకు ముఖ్యమైనది?

    పోషకాలు అధికంగా ఉండే ప్రసవానంతర ఆహారం యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి. డెలివరీ తర్వాత తీసుకొనే స్నాక్స్ కూడా ఆరోగ్యకరమైనది అయితే మంచిది. ప్రసవానంతరం తీసుకోవలసిన పోషకాహారం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇవి -

    • వేగవంతమైన రికవరీ: ప్రసవానంతర సంరక్షణలో ప్రెగ్నెన్సీ నుండి త్వరగా కోలుకునేలా చేసే అలవాట్లదే పెద్దపీట. ఈ సమయంలో ప్రధానంగా పీచు పదార్థాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లతో సమృద్ధిగా ఉండే పోషకాహారాన్ని తినవలసి ఉంటుంది. ఇది శరీరాన్ని నయం చేయడానికి, ఎముకలకు కలిగే నష్టాన్ని నిరోధించడానికి, శరీరంలో ఐరన్ కంటెంట్‌ను తిరిగి రప్పించడానికి, రక్తపు గడ్డలను నివారించడానికి కూడా సహాయపడుతుంది.

    • ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తి: తల్లి తీసుకునే ఆహారం శరీరంలో పాలు ఉత్పత్తి చేసే పరిమాణాన్ని, నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఇది చాలా ముఖ్యం ఎందుకంటే పసిపిల్లలు తల్లి నుండి మొదట పొందే ఏకైక పోషకాహారం ఇది.

    • ఆరోగ్యం: డెలివరీ తర్వాత తీసుకునే డైట్‌లో ఆరోగ్యకరమైన స్నాక్స్‌, పోషకాహారం తీసుకోవడం శక్తిని గణనీయంగా మెరుగుపరచి, మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

    పోషకాలతో కూడిన స్నాక్ అంటే ఏమిటి?

    ఒక పోషకాలతో కూడిన స్నాక్స్‌లో పిండి పదార్థాలు, ప్రోటీన్లు కలిసి ఉంటాయి. కాబట్టి, తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అన్నీ కలిపి తీసుకుంటే.. అవి మంచి పోషకాలను అందిస్తాయి! కొన్ని ఆరోగ్యకరమైన స్నాక్స్ ఈ క్రింద ఉన్నాయి -

    • గుడ్లు, పాల ఉత్పత్తులు: డెలివరీ తర్వాత తీసుకొనే స్నాక్స్ తినాలనే కోరిక తీరేలా చీజ్, తాజా కూరగాయల ముక్కలను కలిపి తీసుకోవచ్చు. సాధారణ చెడ్దర్ చీజ్, కాటేజ్ చీజ్ లేదా పెరుగుతో సహా రకరకాల చీజ్‌లు అందుబాటులో ఉన్నాయి. గుడ్లను ఆమ్లెట్ లేదా మరేదైనా రూపంలో తీసుకోవచ్చు. కానీ ఎక్కువ నూనెలో వండకుండా ఉండటం మంచిది.

    • విత్తనాలు, గింజలు: వేరుశెనగ, బాదం లేదా వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల గింజలు గల బటర్‌లను ఎంచుకోవచ్చు. తృణధాన్యాలు లేదా కీర దోసకాయలు లేదా యాపిల్స్‌తో కూడిన తాజాగా తయారు చేసిన సలాడ్‌లతో దానిని తీసుకోవచ్చు. ఈ గింజలను సలాడ్‌లలో కూడా వేసుకోవచ్చు.

    • బీన్స్, కూరగాయలు: సెలెరీ లేదా క్యారెట్ వంటి వెజ్జీ డిప్‌లతో పిటాస్, హమ్ముస్ తినవచ్చు. నచ్చిన కూరగాయలు, తరిగిన బీన్ సలాడ్‌ను కూడా సిద్ధం చేసుకోవచ్చు.

    డెలివరీ తర్వాత తినడానికి స్నాక్స్

    డెలివరీ తర్వాత సులభంగా తినగలిగే ఆరోగ్యకరమైన రుచికరమైన స్నాక్స్ ఎక్కువగా సిఫార్సు చేయబడేవి, ఇవిగో మీ కోసం:

    1. బాదం

    బాదంపప్పులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి పసిపిల్లల మెదడు అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తాయి. బాదంపప్పును రాత్రంతా నీటిలో నానబెట్టిన తర్వాత లేదా ఏదైనా ఆహార పదార్థాలలో చేర్చి ఉదయాన్నే తీసుకోవచ్చు.

    2. సొరకాయ

    సొరకాయలో 95% నీరు ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి, పాల ఉత్పత్తికి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో భాస్వరం, ఇనుము, విటమిన్లు, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ప్రసవానంతర సంరక్షణలో కీలకమైన పోషకాలు. దీనిని డెజర్ట్‌గా గానీ వేయించి గానీ గింజలతో కలిపి గానీ తీసుకోవచ్చు.

    3. మునగాకు

    మునగాకులలో ఎ, బి, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మునగ ఆకులలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్ వంటి ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. ఈ ఆకులను వంటకాలలో చేర్చవచ్చు లేదా సూప్‌లలో ఉపయోగించవచ్చు.

    4. మొలకెత్తిన ధాన్యాలు

    రాగులు లేదా సజ్జల వంటి మొలకెత్తిన ధాన్యాలలో పొడి వాటి కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. వాటిని కలిసి తీసుకోవచ్చు లేదా అల్పాహారం కోసం జావ తయారు చేసుకోవచ్చు.

    5. గింజలతో మొత్తం పండు

    మలా ఫలాలు లేదా బత్తాయి వంటి సిట్రస్ పండ్లను గింజలతో కలిపి, సలాడ్ గిన్నెలో కలిపి తీసుకోవచ్చు. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే విటమిన్ల యొక్క గొప్ప వనరులు.

    6. పండ్లు, గింజలతో తయారు చేసిన బార్లు

    కొబ్బరి, మెత్తగా ఉడికించిన ఓట్స్ లేదా పంచదార పాకంలో వేసిన ఆపిల్ - ఒక టన్ను పోషకాలు కలిగి ఉన్న పండ్లు, గింజలు గల హెల్త్ బార్‌లను తీసుకోవచ్చు. డెలివరీ తర్వాత అవి తీసుకోవడం వల్ల కడుపు నిండుతుంది. అవి ఆరోగ్యకరమైన స్నాక్ కూడా.

    7. కూరగాయలు, హమ్మస్

    హమ్మస్ అనేది ఒక రుచికరమైన వంటకం. దీనిని దేనితోనైనా తీసుకోవచ్చు. కూరగాయలతో కలిపి తీసుకోవడం వల్ల డెలివరీ తర్వాత తినదగిన ఆరోగ్యకరమైన స్నాక్‌గా మారుతుంది.

    8. తాజాగా పాప్‌కార్న్‌తో కలిపిన డ్రైఫ్రూట్

    ఎండుద్రాక్ష, బాదం వంటి డ్రైఫ్రూట్స్‌తో తాజా పాప్‌కార్న్‌ను కలిపి తీసుకోవచ్చు. అది రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్ అవుతుంది!

    చివరిగా.. ప్రసవానంతర సంరక్షణ అనేది తల్లులు, తమ ఆరోగ్యంపైన, తమ పిల్లల ఆరోగ్యంపైన పెట్టుబడి పెట్టడానికి ఎంతగా ఇష్టపడుతున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇవి "రుచికరమైన" ఆహారం కానప్పటికీ, ఖచ్చితంగా ఆరోగ్యకరమైనవి. డెలివరీ తర్వాత తీసుకోదగిన ఆరోగ్యకరమైన స్నాక్స్.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.