Updated on 3 November 2023
ప్రెగ్నెన్సీ సమయంలో టమాటాలు తినడం సురక్షితమే, కానీ, మితంగా కొద్దికొద్దిగా మాత్రమే తింటూ ఉంటే తల్లి కాబోతున్న మహిళలు అలాగే వారి పుట్టబోయే పిల్లలు టమాటాలలోని విటమిన్ A, C, ఫోలేట్, లైకోపీన్ అలాగే ఐరన్ల నుండి లాభాన్ని పొందుతారు. విటమిన్ C, గర్భవతిగా ఉన్న మహిళలకి అవసరమైన ఐరన్ ని పీల్చుకోవడాన్ని మెరుగుపరుస్తుంది. కడుపుతో ఉన్నప్పుడు, మీ డాక్టరు ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవాలని సూచించినట్టయితే, టమాటాలు తినడం వల్ల ఒంట్లోకి ఐరన్ పీల్చుకోబడటం మెరుగుపడుతుంది.
ఒక మధ్య సైజులో ఉన్న టమాటాలో 22 కేలరీలు, 5 గ్రాముల కార్బోహైడ్రేట్లు (3 గ్రాముల చక్కెర ఇంకా 1.5 గ్రాముల పీచుపదార్థం) ఉంటాయి. ఇందులో తక్కువ కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఉన్నా కూడా, టమాటాల వలన చాలా ఆరోగ్య లాభాలు ముడిపడి ఉన్నాయి.
ఒక చిన్న, 100 గ్రాముల పచ్చి టమాటాలో కింద విధంగా పోషకాలు ఉంటాయి:
గర్భవతిగా ఉన్నప్పుడు టమాటాని తినడం అనేది చాలా ఆరోగ్య లాభాలని అందించటంతోపాటు, ఏ డైట్ కి అయినా రుచికరమైన పదార్థంగా జతవుతుంది.
ఒక మధ్య సైజు టమాటాలో రోజువారీ కావలసిన విటమిన్ C లో దాదాపు 40% అలాగే విటమిన్ A లో 20% ఉంటుంది.
అదనంగా బరువును మోయాల్సి రావడం వల్ల, గర్భవతిగా ఉన్న మహిళ అలసిపోతూ ఉండవచ్చు. ఇది కూడా ప్రెగ్నెన్సీ యొక్క తరచుగా వచ్చే లక్షణాలలో ఒకటి. టమాటాలలోని తక్కువ క్యాలరీల పదార్థం, గర్భవతిగా ఉన్న మహిళల బలాన్ని పెంచి, అలసటని దూరం చేయడానికి సరిపోతుంది.
టమాటాలలో పీచు పదార్థం ఎక్కువగా ఉండి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండడంలో సహాయపడుతుంది. పీచు పదార్థం మలం యొక్క పరిమాణాన్ని పెంచుతుంది, జీర్ణ ప్రక్రియ జరిగేటప్పుడు (పెరిస్టాలసిస్) కండరాల సంకోచ వ్యాకోచాలు మృదువుగా జరిగేలా ప్రోత్సహిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ యొక్క ఎంజైమ్లు ఎక్కువగా స్రవించబడేలా చూస్తుంది.
ప్రీఎక్లాంప్సియా లేదా అధిక బిపి ప్రెగ్నెన్సీ సమయంలో తరచుగా వస్తూ ఉంటుంది. అయితే, ప్రెగ్నెన్సీ సమయంలో టమాటాలని క్రమం తప్పకుండా తినడం వల్ల ఈ ప్రమాదం తగ్గుతుంది. వీటిల్లో ఉండే పొటాషియం గుండె నాళాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది
టమాటాలలో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ ని కలిగించే ఫ్రీ రాడికల్ పదార్థాలకి వ్యతిరేకంగా, ప్రభావవంతంగా పనిచేస్తుంది.
రోజువారీ తీసుకోవలసిన ఫోలిక్ యాసిడ్ అందటానికి టమాటాలు తినటం అద్భుతమైన మార్గం అని చెప్పవచ్చు. పిండంలో న్యూరల్ ట్యూబ్ అలాగే ఇతర పుట్టుక సమయంలో వచ్చే అసాధారణ లోపాలని నివారించడానికి కూడా ఫోలిక్ యాసిడ్ అవసరం.
వడదెబ్బలని నివారించటానికి, చర్మం పైన టమాటా రసాన్ని రాసి చూడండి. ఎందుకంటే అందులో విటమిన్ E ఉంటుంది.
కడుపుతో ఉన్న సమయంలో టమాటాలని ఎక్కువ మొత్తంలో తినడం వలన, ఇతర ఏ ఆహర పదార్థాలు ఎక్కువగా తిన్నా వచ్చే నెగటివ్ ప్రభావాలు దీనికి కూడా వస్తాయి. గర్భ సమయంలో టమాటాని తినడం చాలా లాభాలని అందించినప్పటికీ, మరీ ఎక్కువగా తినడం వలన ఈ కింది పరిస్థితులు ఎదురవ్వచ్చు:
ఏదైనా వంటకంలో టమాటాలని కూడా జత చేయడం అనేది ఆ వంటకానికి దాని యొక్క ఒక ప్రత్యేకమైన రుచిని అందించటానికి అద్భుత మార్గం అని చెప్పవచ్చు. రోజువారీ భోజనాలలో వాటి రుచి అలాగే పోషణని ఎలా జతచేయవచ్చో కింద ఇవ్వబడింది:
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో ఏం తినాలి?
టమాటా రసంలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది, అందుకని గర్భవతిగా ఉన్నప్పుడు టమాటా రసాన్ని తాగవచ్చు. అలా చేయటం వలన ఒంట్లో జీవశక్తి పెరిగి, అలసట, బలహీనతలు తగ్గుతాయి. వాటితోపాటు, రక్తపోటు క్రమబద్ధీకరించబడుతుంది, రక్తం శుద్ధి చేయబడుతుంది.
క్యానులలో నిల్వచేసి అమ్మబడే టమాటాలలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉండి, బోట్యులిజం లేదా ఇతర వ్యాధులకి దారితీయవచ్చు. సూక్ష్మజీవులని చంపడానికి ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద చేసే క్యానింగ్ ప్రక్రియ సమయంలో టమాటాలలోని పోషకాలు, ఎంజైమ్లు నాశనమయిపోతాయి. ఆహార డబ్బాల లైనింగ్లలో ఉపయోగించే ప్రమాదకర రసాయన పదార్థం బిస్ఫెనాల్ A (BPA) తల్లి, పుట్టబోయే బిడ్డ ఇద్దరికీ హానికరం.
కడుపుతో ఉన్నప్పుడు టమాటా కెచప్ అలాగే సాస్ లని తక్కువ మొత్తాలలో తీసుకుంటూ ఉండటం మంచిది. టమాటా కెచప్ అలాగే సాస్ లలో మోనోసోడియం గ్లుటామేట్ (MSG) ఎక్కువగా ఉంటుందనే ఆందోళన కూడా ఉంటుంది. కానీ ఈ మధ్య MSG యొక్క GRAS (సాధారణంగా సురక్షితమని ప్రకటించడం) స్థాయి ప్రకటన వలన, వాణిజ్యపరంగా మార్కెట్లో దొరికే ప్యాక్ చేయబడిన టమాటా కెచప్ అలాగే సాస్ తినవచ్చు.
Tags:
Tomato during pregnancy in telugu, uses of tomato during pregnancy in telugu, Tomato During Pregnancy: Benefits & Risks In English, Tomato During Pregnancy: Benefits & Risks In Hindi, Tomato During Pregnancy: Benefits & Risks In Tamil, Tomato During Pregnancy: Benefits & Risks In bengali
Yes
No
Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips
গর্ভাবস্থায় আলুবোখরা: উপকারিতা ও ঝুঁকি | Prunes During Pregnancy: Benefits & Risks in Bengali
গর্ভাবস্থায় হিং | ঝুঁকি, সুবিধা এবং অন্যান্য চিকিৎসা | Hing During Pregnancy | Risks, Benefits & Other Treatments in Bengali
স্তনের উপর সাদা দাগ: লক্ষণ, কারণ এবং চিকিৎসা | White Spots on Nipple: Causes, Symptoms, and Treatments in Bengali
গর্ভাবস্থায় পোহা: উপকারিতা, ধরণ এবং রেসিপি | Poha During Pregnancy: Benefits, Types & Recipes in Bengali
গর্ভাবস্থায় মাছ: উপকারিতা এবং ঝুঁকি | Fish In Pregnancy: Benefits and Risks in Bengali
গর্ভাবস্থায় রেড ওয়াইন: পার্শ্ব প্রতিক্রিয়া এবং নির্দেশিকা | Red Wine During Pregnancy: Side Effects & Guidelines in Bengali
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |