


Pregnancy Best Foods
11 January 2026 న నవీకరించబడింది
ప్రెగ్నెన్సీ అనేది చాలా రకాల కష్టాలతో కూడుకున్న ప్రయాణం. గర్భధారణ సమయంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఎంచుకోవడం చాలా కష్టతరమైన పనుల్లో ఒకటి. ప్రెగ్నెన్సీ సమయంలో ఆశిస్తున్న తల్లి తన డైట్లో విటమిన్స్, న్యూట్రియంట్స్, మినరల్స్ వంటి పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఆమె కేవలం తన కోసం మాత్రమే కాకుండా తనలో పెరుగుతున్న పిండం కోసం కూడా తినాల్సి ఉంటుంది. గర్భధారణ సమయంలో పీచెస్ (మకరంద పండ్లు) తినడం మంచిదేనా? అని మనలో ప్రశ్న తలెత్తుతుంది.
పీచెస్ (మకరంద పండ్లు) అనేవి ఫైబర్స్, విటమిన్స్, మినరల్స్ తో కూడిన పవర్ హౌజ్. వీటిలో ఎక్కువగా కేలరీలు మరియు కొవ్వులు ఉండవు. గర్భిణీ స్త్రీ తన ఆహారంలో వీటిని తీసుకోవడం అద్భుతమైన ఎంపిక. గర్భధారణలో పీచెస్ (మకరంద పండ్లు) తినడం వల్ల మీకు మరియు మీలో పెరుగుతున్న బిడ్డకు అనేక ప్రయోజనాలను కలిగిస్తుందని ప్రతీతి. ఒక స్త్రీ తన గర్భధారణ ప్రయాణంలో ఆహారంలో పీచెస్(మకరంద పండ్లు) చేర్చుకోవాలని సిఫారసు చేయబడింది. ప్రెగ్నెన్సీ సమయంలో పీచెస్ (మకరంద పండ్లు) తినవచ్చా అని మీరు ఆలోచిస్తుంటే అవును అనే సమాధానమే వస్తుంది. అయితే పీచెస్ (మకరంద పండ్లు) ను మితంగా (తక్కువ మోతాదులో) తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో పీచెస్ తినడం వల్ల కలిగే లాభాలు వాటి ప్రయోజనాలు, ప్రభావాల గురించి మొత్తం తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలు తమ ప్రెగ్నెన్సీ డైట్‌కు పీచెస్ (మకరంద పండ్లు) ఎలా చేర్చుకోవచ్చో కూడా మేము వివరిస్తాం.
సాధారణంగా చెప్పాలంటే.. గర్భధారణ సమయంలో పీచెస్(మకరంద పండ్లు) తినడం చాలా సురక్షితం. పీచెస్ (మకరంద పండ్లు) ప్రొటీన్స్, షుగర్, జింక్ మరియు పెక్టిన్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిని ఎవరు ఆహారంలో తీసుకున్నా ఆరోగ్యంగా పరిగణించబడతాయి. పీచెస్ (మకరంద పండ్లు)లో విటమిన్ C కూడా ఉంటుంది. ఇది ఐరన్‌ను శోషించుకోవడంతో పాటు పిండం అభివృద్ధి, ఎముకలు మరియు దంతాలు, మృదులాస్థి, కండరాలు మరియు రక్తనాళాల అభివృద్ధికి ముఖ్యపాత్ర పోషిస్తాయి. పీచెస్ (మకరంద పండ్లు) తీసుకోవడం వల్ల పిండంలో న్యూరల్ ట్యూబ్ లోపాలు డెవలప్ కాకుండా ఉంటాయి.
పోషక విలువల పరంగా చూసుకుంటే పీచెస్ (మకరంద పండ్లు) లో కేలరీలు తక్కువగా ఉంటాయి. చెక్కెర, ఫైబర్, ప్రొటీన్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ A మరియు విటమిన్ C లను గణనీయమైన మోతాదులో కలిగి ఉంటాయి. మరియు తక్కువ సంఖ్యలో కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వుని కలిగి ఉంటాయి.
గర్భధారణ సమయంలో పీచెస్ (మకరంద పండ్లు) తీసుకోవడం వలన గర్భిణీ స్త్రీలకు పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
పైన పేర్కొన్నవే కాకుండా పీచెస్ (మకరంద పండ్లు) ఫోలిక్ యాసిడ్‌కు మంచి సోర్స్. వీటిలో బీటా కెరోటిన్ మరియు ఫాస్పరస్ కూడా అధిక మోతాదులో ఉంటుంది. గర్భవతులు తమ బరువును అదుపులో ఉంచుకోవడానికి కూడా పీచెస్ (మకరంద పండ్లు) సహాయం చేస్తాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో ఆప్రికాట్స్ తీసుకోవడం
ఒక మహిళ గర్భవతిగా ఉన్నపుడు తన వీక్లీ డైట్లో పీచెస్ (మకరంద పండ్లు) చేర్చేకునేందుకు ప్రయత్నించాలి. గర్భిణీ స్త్రీ ప్రతి రోజు 500 గ్రాముల కంటే లేదా రోజుకు రెండు పీచెస్ (మకరంద పండ్లు) కంటే ఎక్కువగా తినకూడదు.
పీచెస్(మకరంద పండ్లు) తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ వాటి వినియోగం వల్ల కొన్ని రకాల దుష్ప్రయోజనాలు కూడా ఉండవచ్చు. పీచెస్ (మకరంద పండ్లు)లో షుగర్ ఉంటుంది. కావున షుగర్ ప్రాబ్లంతో బాధపడే వారు పీచెస్‌ను తీసుకోవడం తక్కువ చేయాలి. పీచెస్ (మకరంద పండ్లు) రక్తస్రావానికి దారి తీయొచ్చు. అందుకోసమే వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. అంతే కాకుండా శరీర అంతర్గత ఉష్ణోగ్రతను కూడా పీచెస్ (మకరంద పండ్లు) పెంచుతాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: 8 వారాల ప్రెగ్నెన్సీలో రక్తస్రావం - మీరు వైద్యుడిని సంప్రదించాలా?
ఉత్తమమైన పీచెస్ (మకరంద పండ్లు) ఎలా ఎంచుకోవాలని ఆలోచిస్తున్నారా? మీరు పీచ్‌ను (మకరంద పండు) ఎంచుకునేటపుడు అది మీ చేతిలో దృఢంగా ఉన్న ఫీల్ మీకు రావాలి. అదే సమయంలో అది మృదువుగా ఉండాలి. ఆకుపచ్చ రంగులో ఉండే పీచెస్, లేదా ఎక్కువ గాయాలు ఉన్న పండ్లు లేదా మచ్చలు ఉన్న పండ్లను ఎంచుకోవడం మానేయాలి.
పిచెస్ను అనేక విధాలుగా గర్భధారణ ఆహారంలో చేర్చవచ్చు. వాటిని జ్యూస్‌గా లేక మిల్క్షేక్లుగా తయారు చేసుకోవచ్చు. ఫ్రూట్ సలాడ్‌లో భాగంగా వేరే ఇతర రకాల పండ్లతో కలపవచ్చు. అంతే కాకుండా తృణధాన్యాలతో అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు. తినడానికి ముందు పీచ్ ఫ్రూట్‌ను బాగా కడగాలని నిర్దారించుకోండి.
Peach fruit during pregnancy in telugu, peach fruit juice during pregnancy, can pregnants eat peach fruit in telugu, benefits of peach fruit during pregnancy in telugu, how to add peach fruit to your diet in telugu
Yes
No

Written by
Sri Lakshmi
Get baby's diet chart, and growth tips











గర్భధారణ సమయంలో పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వలన ప్రయోజనాలు, ప్రమాదాలు (Sunflower Seeds in Pregnancy: Advantages, Risks in Telugu)

ప్లాసెంటా: అసలు ప్లాసెంటా అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? (Placenta: What is Placenta and How Does it Work in Telugu?)

మీ శిశువు కోసం డిస్పోజబుల్ డైపర్ ప్యాంట్లను ఎన్నుకునేటపుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు (Things to Remember While Choosing Disposable Diaper Pants for Your Baby in Telugu)

ప్రెగ్నెన్సీకి సంబంధించిన టాప్ 10 డేంజర్ సంకేతాలు

తామర నుండి ఉపశమనం - కారణాలు, లక్షణాలు మరియు చికిత్స

గైడ్: మీ ప్రెగ్నెన్సీ మూడవ త్రైమాసికంలో శాకాహారా డైట్ ని పాటించడం (Guide: Following A Vegetarian Diet During Your Third Trimester Of Pregnancy in Telugu)

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |