
గర్భధారణ కాలం ప్రతీ మహిళకు భిన్నంగా ఉంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు రావడం సాధారణమే. అలాంటి వాటిలో జాండీస్ కూడా ఒకటి. దీన్నే కామెర్లు అని అంటారు. రక్తప్రవాహంలో బిలిరుబిన్ స్రావం అధికంగా ఉండటం వల్ల కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారతాయి. గర్భవతులకు తేలికపాటి లక్షణాలతో జాండీస్ వస్తుంది. కొన్ని కేసుల్లో ఇది తీవ్రం కూడా కావొచ్చు. వైద్య సహాయం అవసరం అవుతుంది. గర్భధారణ సమయంలో జాండీస్ రావడానికి అనేక అంశాలు కారణం. అయితే సరైన కారణం ఏంటో తెలుసుకొని చికిత్స చేయడం అవసరం. మరి గర్భధారణ సమయంలో జాండీస్ రావడానికి కారణాలేంటీ? లక్షణాలు ఎలా ఉంటాయి? చికిత్స ఎలా చేయాలి? అని తెలుసుకోండి.
రక్తపరీక్ష ద్వారా రక్తప్రవాహంలో బిలిరుబిన్ స్రావం ఎంత ఉందని తెలుసుకోవచ్చు. బిలిరుబిన్ స్థాయి అధికంగా ఉండటం వల్ల కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారతాయి. గర్భధారణ సమయంలో ఈ సమస్య వస్తుంది. చాలామందిలో బిలిరుబిన్ స్థాయి 0.1 నుంచి 1.2 mg/dl ఉంటుంది. గర్భవతికి ఈ స్థాయి 2mg/dl దాటితే జాండీస్ లక్షణాలు కనిపించవచ్చు. కళ్లు, చర్మం, మూత్రం పసుపు రంగులోకి మారతాయి. గర్భవతుల్లో బిలిరుబిన్ స్థాయి ఎక్కువగా కనిపిస్తుంది. గర్భవతులు కాని మహిళలతో పోలిస్తే గర్భవతుల్లోనే ఈ స్థాయి ఎక్కువగా ఉంటుంది.
గర్భధారణ సమయంలో జాండీస్‌కు ఇన్ఫెక్షన్ లేదా వైరల్ హెపటైటిస్ ప్రధాన కారణం కావొచ్చు. హెపటైటిస్ ఏ, బీ, సీ, డీ లేదా ఇ వైరస్‌లు వైరల్ హెపటైటిస్ అని పిలిచే తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌కి కారణం కావచ్చు.
ఇవి మంటకు, లివర్ సెల్స్ దెబ్బతినడానికి కారణమౌతాయి. ఫలితంగా రక్తంలో బిలిరుబిన్ స్థాయి పెరగుతుంది.
గర్భవతుల్లో జాండీస్ రావడానికి మరిన్ని కారణాలు ఇవే:
గర్భవతిగా ఉన్నప్పుడు మొదటి ట్రమిస్టర్‌లో ఈ లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన, అపరిమితమైన వాంతులు వస్తాయి. తేలికపాటి లక్షణాలతో జాండీస్ రావడం, కాలేయం పనిచేయకపోవడం ఈ పరిస్థితికి సంకేతంగా భావించవచ్చు.
కాలేయంలో పైత్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా రక్తప్రవాహంలోకి పిత్త లవణాలు అధికంగా చేరతాయి. మూడవ ట్రమిస్టర్‌లో గర్భవతుల్లో అరచేతులు, అరికాళ్లలో దురద వస్తుంది.
ఇది చాలా అరుదైన పరిస్థితి. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది జాండీస్, వికారం, వాంతులు, కడుపు నొప్పికి కారణమవుతుంది.
ఈ పరిస్థితికి రక్తపోటు, ప్రోటీన్యూరియా రెండు లక్షణాలు కారణం. కొన్ని సందర్భాల్లో, కాలేయం దెబ్బతినడానికి, లివర్‌లో ఎంజైమ్స్ అధిక స్థాయిలో పెరగడానికి, జాండీస్ రావడానికి ఈ పరిస్థితి కారణం కావచ్చు.
గర్భవతుల్లో జాండీస్ లక్షణాలు వెంటనే కనిపించకపోవచ్చు. ముందుగా కళ్లు పసుపు రంగులోకి మారతాయి. దీన్నే ప్రాథమిక సంకేతంగా భావిస్తారు. గర్భధారణ సమయంలో జాండీస్ లక్షణాలు మరిన్ని ఉంటాయి:
గర్భవతుల్లో ఒక్కొక్కరికి జాండీస్ లక్షణాలు వేర్వేరుగా ఉండొచ్చు. ఈ లక్షణాలను మీరు గమనించినట్టైతే వైద్యుల్ని సంప్రదించాలి.
రక్తంలో బిలిరుబిన్ లెవెల్స్‌ని వైద్యులు పరిశీలించి జాండీస్ ఉందో లేదో నిర్ధారిస్తారు. ఒకవేళ రక్తంలో బిలిరుబిన్ లెవెల్స్ 2mg/dl కన్నా ఎక్కువ ఉంటే జాండీస్ వచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. మరిన్ని లక్షణాలను తెలుసుకోవడం కోసం వైద్యులు భౌతిక పరీక్ష కూడా చేస్తారు. ఈ వ్యాధికి గల కారణాలను తెలుసుకోవడం కోసం మరిన్ని పరీక్షల్ని సూచించవచ్చు. ఒకవేళ వైరల్ హెపటైటిస్ సోకినట్టు అనుమానం ఉంటే, వైద్యులు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించమని సూచించవచ్చు. రక్తంలో పెరిగిన ఎంజైమ్స్ స్థాయిల్ని తెలుసుకోవడం కోసం పరీక్షలు అవసరం.
డాక్టర్లు సూచించే వేర్వేరు పరీక్షలు ఇవే:
గర్భధారణ సమయంలో జాండీస్‌ను ఎలా నివారించాలో, గర్భవతికి జాండీస్ వస్తే ఎలాంటి చికిత్స అందించాలో చాలామందికి తెలియదు. ముందుగా జాండీస్‌కు గల కారణాలను గుర్తించి.. అందుకు తగ్గట్టుగా చికిత్స చేయాలి. పరిస్థితిని నియంత్రించడం, వైద్య సమస్యలను నివారించడం, సరైన కారణాలను గుర్తించడం చికిత్స ఉద్దేశం. వైద్యులు మందులతో పాటు, సహాయక చికిత్స సూచించవచ్చు.
గర్భధారణ సమయంలో జాండీస్ వస్తే ఈ కింది చికిత్సా మార్గాలు ఉన్నాయి:
గర్భవతిగా ఉన్నప్పుడు జాండీస్ వస్తే సమతుల్యమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన పోషకాలు, విటమిన్స్ ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం అవసరం. నిండు ధాన్యాలు, లీన్ ప్రొటీన్స్, ఆకుకూరలు, చిక్కుళ్లు, లో ఫ్యాట్ పాల ఉత్పత్తులు, పండ్లు తీసుకోవాలి. ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకుంటూ నిత్యం హైడ్రేట్‌గా ఉండాలి. నీళ్లు, కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు తీసుకుంటూ ఉండాలి.
జాండీస్‌కు సంబంధించి పైన వివరించిన లక్షణాలు ఏవైనా ఉంటే.. వైద్యుల్ని, ఆరోగ్య నిపుణుల్ని సంప్రదించడం తప్పనిసరి. సురక్షితమైన గర్భధారణ కోసం వైద్యులు జాండీస్‌ను సరిగ్గా నిర్ధారించి చికిత్స అందిస్తారు. గర్భవతికి జాండీస్ వచ్చినప్పుడు వారికి కావాల్సిన యాంటీబయాటిక్ మందుల్ని వైద్యులు సూచిస్తారు. భవిష్యత్తులో జాండీస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారు.
1. Lunzer MR. (1989). Jaundice in pregnancy. Baillieres Clin Gastroenterol.
2. Changede P, Chavan N, Raj N, Gupta P. (2019). An Observational Study to Evaluate the Maternal and Foetal Outcomes in Pregnancies Complicated with Jaundice. J Obstet Gynaecol India.
Tags
Jaundice in pregnancy in Telugu, What causes of Jaundice in pregnancy in Telugu, Symptoms of Jaundice in pregnancy in Telugu, Treatment of jaundice in pregnancy in Telugu, Jaundice in Pregnancy in English, Jaundice in Pregnancy in Hindi, Jaundice in Pregnancy in Tamil, Jaundice in Pregnancy in Bengali
Yes
No














Influenza and boostrix injection kisiko laga hai kya 8 month pregnancy me and q lagta hai ye plz reply me
Hai.... My last period was in feb 24. I tested in 40 th day morning 3:30 .. That is faint line .. I conculed mylo thz app also.... And I asked tha dr wait for 3 to 5 days ... Im also waiting ... Then I test today 4:15 test is sooooo faint ... And I feel in ma body no pregnancy symptoms. What can I do .
Baby kicks KB Marta hai Plz tell mi
PCOD kya hota hai
How to detect pcos
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |