This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

కుంకుమపువ్వు - ప్రయోజనాలు, దోషాలు ఇంకా మరికొన్ని వివరాలు | Saffron - Benefits, Drawbacks, and More in Telugu

Diet & Nutrition
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
కుంకుమపువ్వు - ప్రయోజనాలు, దోషాలు ఇంకా మరికొన్ని వివరాలు | Saffron - Benefits, Drawbacks, and More in Telugu
Read time7 min

వాట్ ఐస్ సాఫ్ర్న్ ? (What is Saffron in Telugu)

కుంకుమపువ్వు అనేది ఆసియాలో లభించే ఒక సుగంధ ద్రవ్యము. దీనిని శాస్త్రీయనామం క్రోకస్ సాటివస్. ఇది ఔషధ మొక్కగా మంచి చరిత్రను కలిగి ఉంది. ఇది తరచుగా తీపి వంటలలో రంగు ఇంకా సువాసన ఇచ్చే దినుసుగా ఉపయోగించబడుతుంది.

కుంకుమపువ్వు ఉపయోగాలు (Saffron Uses in Telugu)

కుంకుమపువ్వు చాలా మృదువుగా ఉంటుంది. ఇంకా సున్నితమైన రుచిని కాస్తంత సువాసనను కలిగి ఉంటుంది. ఇది ప్రధానంగా రుచికరమైన వంటకాలకు రుచిని కోసం ఇంకా లేత పసుపు రంగు కోసం ఉపయోగిస్తారు. ఇది పెల్లా, రిసోట్టోస్ మరియు బిర్యానీ వంటి వంటకాలలో వాడినప్పుడు అవి చక్కగా తయారవుతాయి. కుంకుమపువ్వు వల్ల ఇతర ఉపయోగాలు ఏమిటంటే.. తీపి వంటలలో సహజ సుగంధ ద్రవ్యంలా ఉపయోగించడం. దాని మృదువైన సువాసన కస్తూరి లాంటి రుచినిచ్చే కేకులు, కుకీలు, కస్టర్డ్స్ వంటి కాల్చిన వస్తువులకు మంచి రుచిని తీసుకొస్తుంది. వంటకు అద్భుతమైన సువాసనను అందించడానికి పాకశాస్త్ర నిపుణులు తరచుగా ఈ కుంకుమ పువ్వుపైనే ఆధారపడతారు.

అద్భుతమైన కుంకుమపువ్వు ఆరోగ్య ప్రయోజనాలు (Impressive Saffron Health Benefits in Telugu)

పాకశాస్త్ర ప్రపంచములోనే కాకుండా, కుంకుమపువ్వు అందించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం దానిని విరివిగా ఉపయోగిస్తారు. పుష్పంలోని సన్నని ఒక కేసరం డిప్రెషన్ మరియు మూడ్ స్వింగ్‌(మానసిక అస్థిరత)లకు చికిత్స చేసే శక్తిని కలిగి ఉంటుంది. కుంకుమపువ్వులో ఉండే పదార్థాలు శరీరంలోని వాత, పిత్త మరియు కఫ దోషాలను సమతుల్యపరుస్తాయి. ఆయుర్వేదాన్ని అనుసరించి.. ఈ దోషాలలో అసమతుల్యత వలన అనారోగ్యాలు కలుగుతాయి. ఈ కారణంగానే కుంకుమపువ్వు ఔషధ పరంగా ఎంతో విలువైనది.

కుంకుమపువ్వు వల్ల కలిగే కొన్ని సాధారణ ఔషధ ఉపయోగాలు ఏమిటంటే

1. సమర్థవంతమైన యాంటీఆక్సిడెంట్ (An effective antioxidant)

ఇది శరీర కణాల స్వస్థతకు సహాయపడుతుంది. ఇంకా నొప్పి నివారిణి లక్షణాలను కలిగి ఉంటుంది. కుంకుమపువ్వులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు కణాలను ఫ్రీ రాడికల్స్ బారినుండి రక్షిస్తాయి. ఇవి ప్రధానంగా మెదడు కణాలను దెబ్బతినకుండా రక్షించడమే కాక, బరువు తగ్గెందుకు సహాయం చేస్తుంది. ఆకలిని తగ్గించడం ఇంకా యాంటిడిప్రెసెంట్ లాంటి ఇతర లక్షణాలను కలిగి ఉంటుంది.

2. మనోభావాల మెరుగుదలకు ఇంకా నిరాశ, నిస్పృహలను తగ్గించడంలో సహాయపడవచ్చు (May enhance feelings and help ease depressive symptoms)

కుంకుమపువ్వును “సన్‌షైన్ స్పైస్" అని కూడా పిలుస్తారు. చాలా అధ్యయనాలు కుంకుమపువ్వు రేకులు ఇంకా కేసరాలు తేలికపాటి నుండి ఒక మాదిరి డిప్రెషన్ లక్షణాల చికిత్సలో అత్యంత ప్రభావవంతంగా ఉన్నాయని సూచిస్తున్నాయి. కేవలం 30 గ్రాముల కుంకుమపువ్వు రోజువారీ ఫ్లక్సెటైన్ లేదా సిటోప్రామ్ వంటి డిప్రెషన్‌కు వాడే ప్రామాణిక మందుల కంటే మెరుగ్గా పనిచేస్తుంది. కుంకుమపువ్వు సప్లిమెంట్లుగా ఇచ్చిన వ్యక్తులు కూడా తక్కువ దుష్ప్రభావాల బారినపడ్డారు.

3. క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉండవచ్చు (Might possess anti-cancer properties)

కుంకుమపువ్వులోని అధిక యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్ వల్ల జరిగే హానిని తగ్గిస్తాయి. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు హానికరమైన ఈ రాడికల్స్ కారణమని తెలిసింది. అలాగే.. కుంకుమపువ్వులో ఉండే సమ్మేళనాలు పెద్దప్రేగులోని క్యాన్సర్ కణాలను నశింపజేసి, అణిచివేస్తాయి. మరొక అధ్యయనం ప్రకారం.. కుంకుమపువ్వు అతి ముఖ్యమైన ఉపయోగాలలో ఒకటి, ఇది క్యాన్సర్‌తో పోరాడుతుంది. కుంకుమపువ్వులోని క్రోసిన్స అనే సమ్మేళనం క్యాన్సర్ కణాలను కీమోథెరపీ ఔషధాలకు మరింత ఎక్కువగా స్పందించేలా చేస్తుంది.

4. పి ఎం ఎస్ (నెలసరి వచ్చే ముందు బాధించే లక్షణాలు)లక్షణాలను తగ్గించవచ్చు (Could lessen PMS symptoms)

20 నిమిషాల పాటు కుంకుమపువ్వు వాసన చూడడం లేదా ప్రతిరోజూ 30 మి.గ్రా తీసుకోవడం వల్ల చిరాకు, తలనొప్పి ఇంకా తిమ్మిరి వంటి వివిధ PMS లక్షణాలను తగ్గించవచ్చని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఇది PMS సమయంలో కలిగే ఆందోళనను తగ్గిస్తుంది. అంతేకాక శరీరంలో ఉత్పత్తి అయ్యే కార్టిసాల్ (స్ట్రెస్ హార్మోన్) స్థాయిలను కూడా తగ్గిస్తుంది.

5. కామోద్దీపన కలిగించే లక్షణాలను కలిగి ఉండవచ్చు (Might have aphrodisiac properties)

ఎన్నో తరాలుగా, కుంకుమపువ్వు కామోద్దీపన లక్షణాల గురించి అందరికీ తెలుసు. పాలలో కుంకుమపువ్వు కలుపుకుని రాత్రిపూట సేవించేందుకు కారణం ఇదే. ప్రతిరోజూ కనీసం 30 మి.గ్రా కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల పురుషులలో అంగస్తంభన, లైంగిక వాంఛ ఇంకా సంపూర్ణ సంతృప్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. మహిళల్లో, కుంకుమపువ్వు మెరుగైన లూబ్రికేషన్ ఇంకా లైంగిక వాంఛను పెంచుతుంది.

6. ఆకలి మందగించేలా చేసి బరువు తగ్గేందుకు సహకరిస్తుంది (Could lessen appetite and promote weight loss)

సహజమైన బరువు తగ్గించే అనేక సప్లిమెంట్లలోని ప్రధాన పదార్ధాలలో కుంకుమపువ్వును కూడా కలిగి ఉంటాయి. ఎందుకంటే రోజువారీ కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల ఆకలిని సహజంగా అరికట్టవచ్చు. ఇంకా త్వరగా బరువు తగ్గవచ్చు. కుంకుమపువ్వు మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. దీని ఫలితంగా చిరుతిండ్లు తినడం తక్కువవుతుంది. బరువు తగ్గాలనుకునేవారు కుంకుమపువ్వును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వారి బాడీ మాస్ ఇండెక్స్ విలువ తగ్గుతుంది ఇంకా శరీరంలోని కొవ్వు శాతం తగ్గుతుంది.

7. అదనంగా ఒనకూరే సానుకూల ఆరోగ్య ప్రయోజనాలు (Additional positive health benefits)

కుంకుమపువ్వు ఇతర ఔషధ ఉపయోగాలు ఏమిటంటే ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం. ఇందులోని యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు దీనిని గుండె ఆరోగ్యానికి అనుకూలమైన పదార్ధంగా మార్చుతాయి. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం ద్వారా అల్జీమర్స్‌ సమస్య ఉన్న వ్యక్తులకు సహాయపడుతుంది.

8. దీనిని ఆహారంలో చేర్చుకోవడం ఎంతో సులభం (Simple to include in the diet)

ఆహారంలో సులువుగా చేర్చుకోగల సాధారణ దినుసు ఈ కుంకుమపువ్వు. దీని సున్నితమైన రుచి ఆహారపు రుచిని మార్చదు. అంతేకాక.. ఇది అందమైన పసుపు రంగును మాత్రమే దానికి ఇస్తుంది. ఇంకా ఆ పదార్థాపు పోషక విలువను పెంచుతుంది. ఇది ఖరీదైనది అయినప్పటికీ.. అందులోని అనేక ప్రయోజనాలను ఆస్వాదించడానికి ఒక వంటలో చిటికెడు వేసినంత మాత్రమే సరిపోతుంది.

జరిగే హాని, జాగ్రత్తలు ఇంకా తీసుకోవలసిన మోతాదు (Risks Precautions and Dosage in Telugu)

కుంకుమపువ్వు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ, దానిని తగు జాగ్రత్తలతో తీసుకోవాలి. చాలా సహజ పదార్ధాల వలె, కుంకుమపువ్వులో చెప్పుకోదగ్గ దుష్ప్రభావాలు ఉండవు. అయితే.. అనుసరించాల్సిన కొన్ని మోతాదుల పరిమితులు ఉన్నాయి. కుంకుమపువ్వు ఉపయోగం ద్వారా సానుకూల ప్రయోజనాలను పొందడానికి, రోజుకు 30 మి.గ్రా కంటే ఎక్కువ తీసుకోకూడదని సిఫార్సు చేయబడింది. అధిక మోతాదులు తీసుకుంటే ఇది విషపూరితం కావచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఇది గర్భస్రావాలకు దారితీస్తుంది. అలాగే, కుంకుమపువ్వును నమ్మకాస్తుల నుండి కొనడం చాలా అవసరం. కల్తీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున కుంకుమపువ్వు పొడిని కొనడం మానుకోవాలి.

సరైన పద్ధతిలో తీసుకుంటే కుంకుమపువ్వు ఒక అద్భుతమైన మూలిక. సహజ పదార్థాలు వేర్వేరు వ్యక్తులపై వేర్వేరు ప్రభావాలను చూపిస్తాయి. కొన్ని రకాల ఆహారాల పట్ల సున్నితత్వం కలిగి ఉన్నవారు తమ ఆహారంలో దీనిని చేర్చుకునే ముందు ఒకసారి వైద్యుడిని సంప్రదించడం మంచిది.

References

1. Omidkhoda SF, Hosseinzadeh H. (2022). Saffron and its active ingredients against human disorders: A literature review on existing clinical evidence. Iran J Basic Med Sci.

2. Jackson PA, Forster J, Khan J, Pouchieu C, Dubreuil S, Gaudout D, Moras B, Pourtau L. (2021).Effects of Saffron Extract Supplementation on Mood, Well-Being, and Response to a Psychosocial Stressor in Healthy Adults: A Randomized, Double-Blind, Parallel Group, Clinical Trial. Front Nutr.

Tags

What is Saffron in Telugu, What are benefits of Saffron in Telugu, What are the uses of Saffron in Telugu, What are the risk of Saffron in Telugu, Saffron-Benefits, Drawbacks, and More in English, Saffron-Benefits, Drawbacks, and More in Hindi, Saffron-Benefits, Drawbacks, and More in Tamil, ⁠Saffron-Benefits, Drawbacks, and More in Bengali

Pure Kashmiri Saffron (Kesar) - 2g

Pure Kashmiri Saffron (Kesar) - 2g

Improves Digestion | Reduces Pain & Cramps | Improves Sleep | Clinically Tested

5891 Moms bought
₹754₹7996% Off
Rating
4.6
(956)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.