This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

శిశువుల వెయిట్ చార్ట్ ఇదీ: పుట్టినప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు | Ideal Baby Weight Chart: Birth to 1 Year in Telugu

Weight Gain
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Nov 28, 2023
శిశువుల వెయిట్ చార్ట్ ఇదీ: పుట్టినప్పటి నుంచి ఒక  సంవత్సరం వరకు | Ideal Baby Weight Chart: Birth to 1 Year in Telugu
Likes7 Likes|
Read time6 min

శిశువు బరువు గురించి తల్లిదండ్రులకు ఆందోళన, గందరగోళం సహజం. మొదటిసారి తల్లిదండ్రులు అయిన వారికి ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. శిశువు బరువు సాధారణంగా ఉన్నా కానీ ఒక్కోసారి తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. శిశువు పెరుగుతున్నపుడు అతడు ఎలా అభివృద్ధి చెందుతున్నాడో శరీర బరువు ద్వారానే తెలుస్తుంది. నవజాత శిశువు బరువు శిశువు ఆరోగ్యానికి సూచిక. ఏదేమైనప్పటికీ ఒక ఏడాది పాటు శరీరంతో పాటుగా బరువులో కూడా అనేక మార్పులు సంభవిస్తాయి.

శిశువు సరైన శరీర బరువు ఎంత (What is Ideal Body Weight for Your Baby in Telugu)

నవజాత శిశువుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించిన సగటు బరువు 7 నుంచి 7 ½ పౌండ్లు (3.2 నుంచి 3.4 కిలోలు). తక్కువ బరువుతో శిశువు జన్మించడం కింది కారణాల వల్ల సంభవిస్తుంది.

  • నెలలు నిండకముందే పుట్టిన శిశువులు తక్కువ బరువుతో ఉండవచ్చు. అదే సమయంలో నెలలు నిండిన తర్వాత పుట్టిన శిశువులు పెద్దగా ఉంటారు.
  • గర్భధారణ అనేది శిశువు బరువు తక్కువగా ఉండేందుకు మరొక కారణం.
  • గర్భవతిగా ఉన్నపుడు తల్లి ఎక్కువ పోషకాలను తీసుకోకపోవడం వల్ల శిశువు తక్కువ బరువుతో జన్మించేందుకు కారణం కావొచ్చు. అదే సమయంలో ఎక్కువ బరువున్న తల్లి నుంచి పెద్ద పరిమాణంలో శిశువు జన్మించొచ్చు.
  • లింగం(జెండర్) కూడా ఒక్కోసారి బేబీ పరిమాణాన్ని సూచిస్తుంది. బేబీ గర్ల్ వెయిట్ చార్ట్ మగపిల్లల కన్నా ఆడపిల్లలు బరువు తక్కువగా ఉంటారని చూపుతుంది.
  • గర్భధారణ సమయంలో ధూమపానం అనేది అనేక ప్రతికూలతలను కలిగిస్తుంది. వీటిల్లో తక్కువ బరువున్న పిల్లలు పుట్టడం ఒకటి.

శిశువు బరువు గురించి తెలుసుకునేందుకు చార్ట్ (Baby Weight Chart to Know About a Baby's Ideal Weight in Telugu)

బరువు చార్ట్ శిశువు పుట్టినప్పటి నుంచి సంవత్సరం వయసు వచ్చే వరకు ఏ సమయంలో ఎంత బరువు ఉండాలో సూచిస్తుంది. బేబీ గర్ల్, బేబీ బాయ్ వెయిట్ చార్ట్​ లింగ ఆధారిత వెయిట్​ను సూచిస్తుంది. కింద పేర్కొన్న టేబుల్ నెలల వారీగా బేబీ వెయిట్ చార్ట్​ను కిలోలు, అలాగే పౌండ్లలో కూడా సూచిస్తుంది.

వయసు

మగపిల్లలు (50 శాతం)

ఆడపిల్లలు (50 శాతం)

పుట్టినపుడు

7.8 పౌండ్లు (3.5 కిలోలు)

7.5 పౌండ్లు (3.4 కిలోలు)

1వ నెల

9 పౌండ్లు 14 ఔన్స్ (4.5 కిలోలు)

9 పౌండ్లు 4 ఔన్స్ (4.2 కిలోలు)

2వ నెల

12 పౌండ్లు 5 ఔన్స్ (5.6 కిలోలు)

11 పౌండ్లు 4 ఔన్స్ (5.1 కిలోలు)

3వ నెల

14 పౌండ్లు (6.4 కిలోలు)

12 పౌండ్లు 14 ఔన్స్ (5.8 కిలోలు)

4వ నెల

15 పౌండ్లు 7 ఔన్స్ (7.0 కిలోలు)

14 పౌండ్లు 2 ఔన్స్ (6.4 కిలోలు)

5వ నెల

16 పౌండ్లు 9 ఔన్స్ (7.5 కిలోలు)

15 పౌండ్లు 3 ఔన్స్ (6.9 కిలోలు)

6వ నెల

17 పౌండ్లు 8 ఔన్స్ (7.9 కిలోలు)

16 పౌండ్లు 2 ఔన్స్ (7.3 కిలోలు)

7వ నెల

18 పౌండ్లు 5 ఔన్స్ (8.3 కిలోలు)

16 పౌండ్లు 14 ఔన్స్ (7.6 కిలోలు)

8వ నెల

19 పౌండ్లు (8.6 కిలోలు)

17 పౌండ్లు 7 ఔన్స్ (7.9 కిలోలు)

9వ నెల

19 పౌండ్లు 10 ఔన్స్ (8.9 కిలోలు)

18 పౌండ్లు 2 ఔన్స్ (8.2 కిలోలు)

10వ నెల

20 పౌండ్లు 3 ఔన్స్ (9.2 కిలోలు)

18 పౌండ్లు 11 ఔన్స్ (8.5 కిలోలు)

11వ నెల

20 పౌండ్లు 12 ఔన్స్ (9.4 కిలోలు)

19 పౌండ్లు 4 ఔన్స్ (8.7 కిలోలు)

12వ నెల

21 పౌండ్లు 3 ఔన్స్ (9.6 కిలోలు)

19 పౌండ్లు 10 ఔన్స్ (8.9 కిలోలు)

గమనిక: 50 శాతం అంటే ఆ వయసులో ఉన్న 50 శాతం మంది పిల్లలు ఎక్కువ బరువును కలిగి ఉంటారు. మరో 50 శాతం మంది పిల్లలు తక్కువ బరువును కలిగి ఉంటారు. ఇది సగటు బరువు.

మొదటి ఏడాదిలో శిశువు బరువు పెరగడం ఎలా (Weight Gain of the Baby in the First Year in Telugu)

నవజాత శిశువు బరువు 2-నెలల శిశువు బరువు నుంచి భిన్నంగా ఉంటుంది. శిశువు మొదటి 12 నెలల ఎదుగుదల నుంచి మీరు ఇవి ఆశించవచ్చు.

  • నెల రోజుల నాటికి– వారు పుట్టిన ఒక నెల తర్వాత.. వారు సాధారణంగా ఫీడింగ్ విధానాన్ని అభివృద్ధి చేసుకోవడం వలన బరువు పెరుగుతారు.
  • 3-నెలలు, 4-నెలలు, 5-నెలలు, 6-నెలల శిశువు బరువులో పూర్తి వ్యత్యాసం ఉంది. కొందరిలో తక్కువ వ్యవధిలో వృద్ధి (గ్రోత్​), బిగ్ సర్జ్ (భారీగా పెరుగుదల) కనిపిస్తాయి. ఇవి పుట్టిన నుంచి ఆరునెలల వరకు ఎప్పుడైనా జరగొచ్చు. ఈ సమయంలో శిశువుకు ఎక్కువ పాలు అవసరం. దీనినే క్లస్టర్ ఫీడింగ్ అని కూడా అంటారు.
  • ఆరు నెలల వయసు, ఏడాది మధ్య బరువు పెరగడం మందగిస్తుంది. 7 నెలల శిశువు బరువు పుట్టిన బరువుతో దాదాపు రెట్టింపు ఉంటుంది. 8-నెలల శిశువు బరువు, 9-నెలల శిశువు బరువు దాదాపు సమానంగా ఉంటుంది. ఈ కాలంలో గరిష్ఠంగా 0.5 కేజీల నుంచి 1 కేజీ వరకు బరువు పెరుగుతారు.

మీరు శిశువు బరువు గురించి ఆలోచిస్తుంటే ఏమి చేయాలి (What to Do If you are Concerned About the Baby’s Weight in Telugu)

మీ శిశువు సాధారణ బరువుకు దగ్గరగా లేకపోతే వెంటనే శిశు వైద్యుడును సంప్రదించండి. శిశు వైద్యుడు శిశువు పెరుగుదల రేటును పరీక్షించి.. శిశువుకు కావాల్సిన పోషకాలను సూచిస్తాడు. తల్లిపాలతో శిశువు బరువు పెరగకుంటే శిశువు బరువు పెరిగే ఆహారం సిఫారసు చేస్తారు. డాక్టర్లు తల్లిపాలతో పాటుగా సప్లిమెంట్లు, ఫార్ములేషన్ (డబ్బా పాలు) రికమెండ్ చేస్తారు. మీ శిశువుకు చనుబాలు తాగడంలో సమస్య ఉంటే.. ఉత్తమ సూచనలను పొందేందుకు నిపుణుడిని సంప్రదించడం మంచిది. ఆరు నెలల తర్వాత సాలిడ్ ఫార్ములేషన్(డబ్బా పాలు) ఇవ్వమని సిఫారసు చేస్తారు.

చివరగా (Conclusion)

శిశువు పెరుగుదల, అభివృద్ధికి బరువే ప్రధాన సూచిక. మీ శిశువు తక్కువ బరువుతో ఉన్నా లేక అధిక బరువుతో ఉన్నా ఇది ఆందోళన కలిగిస్తుంది. అటువంటి సందర్భాల్లో వైద్యుడిని సంప్రదించండం ఉత్తమం.

Tags:

Baby weight chart in Telugu, Tips to weight gain in babies for Telugu, Baby weight chart for reference in Telugu, How much should be your baby in 6 months in Telugu, Ideal Baby Weight Chart: Birth to 1 Year in English Ideal Baby Weight Chart: Birth to 1 Year in Tamil, Ideal Baby Weight Chart: Birth to 1 Year in Bengali

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.