This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భవతిగా ఉన్నప్పుడు చామదుంప తినడం మంచిదా? కాదా? | Arbi In Pregnancy: Is It Safe Or Not in Telugu

Diet & Nutrition
Written by - Swetha Raoచివరిగా నవీకరించబడింది: May 28, 2026
గర్భవతిగా ఉన్నప్పుడు చామదుంప తినడం మంచిదా? కాదా? |  Arbi In Pregnancy: Is It Safe Or Not in Telugu
Likes1 Likes|
Read time6 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • చామదుంప (అర్బీ/టారో రూట్)లో పీచు పదార్థాలు, ఐరన్, క్యాల్షియం, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సీ వంటి పోషకాలు పుష్కలంగా ఉండి గర్భవతులకు మేలు చేస్తాయి.
  • చామదుంప తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది, మలబద్ధకం తగ్గుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, కాళ్ల తిమ్మిరి తగ్గి ఎముకలు ధృడంగా మారతాయి.
  • చామదుంపను బాగా ఉడికించి, మితంగా తినాలి. పచ్చిగా తినడం వల్ల బ్యాక్టీరియా ప్రభావం, ఆక్సలేట్స్ వల్ల కిడ్నీ రాళ్ల ప్రమాదం ఉండొచ్చు.
  • గర్భధారణలో పోషణ కోసం ఏ ఉత్పత్తులు సహాయపడతాయి? Explore our MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes).
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
Rating4.3
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Rating4.9
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
Organic Aloe Vera (300 ml)
Organic Aloe Vera (300 ml)
Rating4.4

గర్భధారణ సమయంలో చామదుంప తినడం మంచిదేనా కాదా అన్న అంశంపై మహిళలకు అనేక సందేహాలు ఉంటాయి. చామదుంపను అర్బీ, టారో రూట్ అని కూడా పిలుస్తారు. ఇది అనేక సంస్కృతుల్లో సంప్రదాయ వంటకం. అయితే గర్భధారణ సమయంలో చామదుంప తినవచ్చా అని గర్భవతుల్లో కొన్ని సందేహాలు ఉంటాయి. గర్భధారణ సమయంలో చామదుంప తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, కలిగే దుష్ప్రభావాల గురించి ఈ బ్లాగ్‌లో వివరిస్తాం. చామదుంపలోని పోషక విలువలతో పాటు, మీ శిశువు అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కూడా చర్చిస్తాం. అంతేకాదు.. దీని వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి, చామదుంప తినాలనుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాల గురించి కూడా వివరిస్తాం. చివరగా గర్భధారణ సమయంలో అనవసరమైన ఇబ్బందులు తెచ్చుకోకుండా, చామదుంపను ఎలా తినాలో కూడా వివరిస్తాం.

చామదుంపలోని పోషక విలువలు (Nutritional value of arbi in Telugu)

దక్షిణాసియాలో భూమి లోపల పండే కూరగాయల్లో చామదుంప కూడా ఒకటి. దీన్నే టారో రూట్, కోలోకాసియా రూట్, ఎడ్డో అని పిలుస్తారు. ఇందులో పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఐరన్, క్యాల్షియం, పొటాషియం చామదుంపలో లభిస్తాయి. ఇక ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రియంట్స్‌తో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. చామదుంపలోని పోషక విలువల్ని పరిగణలోకి తీసుకుంటే గర్భవతులకు మంచి ఆహారంగా భావించవచ్చు. ఇక ఇందులో పీచు పదార్థాలు ఎక్కువ స్థాయిలో ఉన్నందున.. గర్భవతులకు సాధారణంగా వచ్చే మలబద్ధక సమస్యను నివారించడానికి చామదుంపలు ఉపయోగపడతాయి. ఇక చామదుంపలోని యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీసి, పలు రకాల వ్యాధులకు దారితీస్తుందన్న సంగతి తెలిసిందే.

గర్భవతిగా ఉన్నప్పుడు చామదుంప తినడం సురక్షితమేనా? (Is arbi safe to eat during pregnancy in Telugu)

అయితే ప్రతీ ఆహార పదార్థం లాగానే, గర్భవతిగా ఉన్నప్పుడు చామదుంప తినే విషయమై వైద్య నిపుణులను సంప్రదించి వారి సలహాలు తీసుకోవాలి. అయితే గర్భవతులు చామదుంప తినడం సురక్షితమా, కాదా అన్న అంశంపై ఖచ్చితమైన సమాధానం లేకపోయినప్పటికీ.. చాలామంది నిపుణులు చామదుంప తినడం సురక్షితమేనని నమ్ముతుంటారు. చామదుంపలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ అధిక స్థాయిలో ఉంటుంది. ఇవి గర్భవతులకు చాలా అవసరం. పీచుపదార్థం గర్భవతుల జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అయితే ఇందులో ఉండే ఆక్సలేట్స్ కిడ్నీలో రాళ్లు పెరిగేందుకు కారణం అవుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి. గర్భవతిగా ఉన్నప్పుడు నేను చామదుంప తినొచ్చా అని మీరు ఆలోచిస్తున్నారా? అయితే ముందుగా మీ డాక్టర్‌ను సంప్రదించాలి. భూమిలో పండే ఈ కూరగాయను మీరు తినొచ్చా లేదా అన్న విషయంపై వైద్యులు స్పష్టత ఇస్తారు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భిణీ స్త్రీ ఫోలిక్ యాసిడ్ ఎప్పుడు తీసుకోవాలి?

గర్భవతిగా ఉన్నప్పుడు చామదుంప తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటీ? (What are the benefits of eating arbi during pregnancy in Telugu)

చామదుంప ఆసియాతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా వినియోగించే కూరగాయల్లో ఒకటి. ఇందులో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు. చామదుంపలో పీచుపదార్థం ఉంటుందని చెప్పుకున్నాం. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి గర్భవతులకు అవసరం. ఇక చామదుంపలో కేలరీలు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. గర్భవతులకు ఆరోగ్యకరమైన ఆహార పదార్థంగా ఇది లిస్ట్‌లో ఉంటుంది. చామదుంపలో విటమిన్ సీ కూడా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో.. కణజాలాన్ని పెంచడంలో విటమిన్ సీ బాగా పనిచేస్తుంది. చామదుంపలో ఉండే పొటాషియం శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడటంతో పాటు, కాళ్లల్లో వచ్చే తిమ్మిరిని నివారిస్తుంది. ఇక ఇందులో ఉండే క్యాల్షియంతో ఎముకలు, పళ్లు ధృడంగా మారతాయి. గర్భవతులు చామదుంప తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తల్లితో పాటు కడుపులో పెరుగుతున్న శిశువు అభివృద్ధికీ మేలు చేస్తుంది.

గర్భధారణ సమయంలో చామదుంప తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటీ? (What are the risks of eating arbi during pregnancy in Telugu)

అయితే గర్భవతులు చామదుంప తినడం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

  • మొదటగా, చామదుంప తినడానికి ముందు సరిగ్గా వండాలి. ఎందుకంటే అందులో ఉండే బ్యాక్టీరియా, కడుపులో పెరిగే పిండంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.
  • రెండోది, అన్ని కూరగాయల లాగానే, చామదుంపలో గర్భిణీ స్త్రీలపై ప్రతిచర్యలను ప్రేరేపించే కొన్ని సమ్మేళనాలు ఉంటాయి. చామదుంప తిన్న తర్వాత ఏదైనా అసౌకర్యం అనిపిస్తే, వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.

గర్భవతిగా ఉన్నప్పుడు చామదుంప ఎలా తినాలి? (How to consume Arbi during pregnancy in Telugu)

గర్భవతిగా ఉన్నప్పుడు చామదుంప తినడం సురక్షితమే. కానీ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.

  1. చామదుంప బాగా ఉడికించి వండాలి. వండే ముందు చామదుంపను బాగా కడగాలి. వాటిపై ఉండే మురికి, మలినాలను తొలగించాలి.
  2. పచ్చిగా లేదా సరిగ్గా ఉడకని చామదుంపను గర్భవతులు తినకూడదు. సరిగ్గా వండడం, ఉడికించడం లేదా ఫ్రై చేయడం లాంటి పద్ధతుల్లో చామదుంప తీసుకోవచ్చు.
  3. చామదుంప అతిగా తీసుకుంటే మలబద్ధకానికి దారితీయొచ్చు. అందుకే గర్భధారణ సమయంలో చామదుంప తినేవాళ్లు మితంగా తీసుకోవాలి. మలబద్ధకాన్ని నివారించేందుకు ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో గ్యాస్ & ఉబ్బరం సమస్యలతో డీల్ చేయడం

ముగింపు (Conclusion)

చామదుంపలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గర్భవతులు తినొచ్చు. ఇందులో విటమిన్స్, ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే గర్భధారణ సమయంలో మితంగానే చామదుంప తీసుకోవాలన్న విషయం గుర్తుంచుకోండి. ఇతర పండ్లు, కూరగాయల ద్వారా లభించే పోషకాలకు ఇది ప్రత్యామ్నాయం కాదు. ఎందుకంటే ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ గర్భధారణ సమయంలో చామదుంప తినడంపై మీకు ఏవైనా ప్రశ్నలు, సందేహాలు ఉంటే, వైద్యుల్ని సంప్రదించడం మంచిది. సరైన ప్రణాళికతో కాబోయే తల్లులు చామదుంపను తినొచ్చు. లక్షలాది మంది తల్లిదండ్రులు వారి నవజాత శిశువుల అవసరాల కోసం మైలో ఫ్యామిలీని విశ్వసిస్తున్నారు.

References

1. Mitharwal S, Kumar A, Chauhan K, Taneja NK. (2022). Nutritional, phytochemical composition and potential health benefits of taro (Colocasia esculenta L.) leaves: A review. Food Chem.

2. Li F, Sun H, Dong HL, Zhang YQ, Pang XX, Cai CJ, Bai D, Wang PP, Yang MY, Zeng G. (2022). Starchy vegetable intake in the first trimester is associated with a higher risk of gestational diabetes mellitus: a prospective population-based study. J Matern Fetal Neonatal Med.

Tags

Is arbi safe during pregnancy in Telugu, What are the benefits of arbi during pregnancy in Telugu, what are the risks of arbi during pregnancy in Telugu, Arbi In Pregnancy: Is It Safe Or Not in English, Arbi In Pregnancy: Is It Safe Or Not in Hindi, Arbi In Pregnancy: Is It Safe Or Not in Tamil, Arbi In Pregnancy: Is It Safe Or Not in Bengali

గర్భిణీ తల్లుల పోషణలో నమ్మకమైన తోడుగా

చామదుంపతో పాటు మీ గర్భధారణ పోషక అవసరాలను తీర్చే సురక్షిత ఉత్పత్తులు మీకు మరింత ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest

3701 Moms bought
₹499₹64923% Off
Rating
4.3
(88)
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress

531 Moms bought
₹917₹129829% Off
Rating
4.9
(50)
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2005 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
Organic Aloe Vera (300 ml)

Organic Aloe Vera (300 ml)

Nurtures Skin & Hair | Reduces Suntan | Soothes Burns | Enhances Hair Resilience

4133 Moms bought
₹289₹32912% Off
Rating
4.4
(45)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.