This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో గుడ్లు: ప్రయోజనాలు, అందులోని పోషక విలువలు | Eggs During Pregnancy in Telugu

Diet & Nutrition
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
గర్భధారణ సమయంలో గుడ్లు: ప్రయోజనాలు, అందులోని పోషక విలువలు | Eggs During Pregnancy in Telugu
Likes1 Likes|
Read time8 min

గర్భవతులు గుడ్లు తినవచ్చా? ఇది మామూలుగా కలిగే సందేహం. గుడ్లను ఉడికించి, గిలకొట్టిన, వేయించి లేదా ఎండలో వేడిచేయడంతో సహా వివిధ పద్ధతుల్లో తయారు చేసుకొని తీసుకోదగ్గ మంచి అల్పాహారం. గుడ్లు సాధారణంగా ఉదయపు భోజనానికి మంచి పోషకాలను చేర్చుతుంది. అయితే, గర్భవతిగా ఉన్నప్పుడు గుడ్లు తీసుకోవడం సురక్షితమేనా అని మీరు తెలుసుకోవాలనుకోవచ్చు. మంచి విషయమ ఏమిటంటే, గుడ్లను చక్కని పద్ధతుల్లో సిద్ధం చేసినప్పుడు నిరభ్యంతరంగా తినవచ్చు. గర్భధారణ సమయంలో గుడ్లు తీసుకోవడం గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతీ విషయం ఇక్కడ ఉంది.

గర్భధారణ సమయంలో మహిళలు గుడ్లు తినవచ్చా (Can Women Eat Eggs During Pregnancy in Telugu)

అవును, గర్భధారణ సమయంలో గుడ్లు తినడం మంచిది, అయితే వాటిని సరిగ్గా ఉడికించాలి లేదా పాశ్చరైజ్ చేయాలి. ఉడికించని లేదా పచ్చి గుడ్లలో ఫుడ్ పాయిజనింగ్ కలిగించే సాల్మొనెల్లా బ్యాక్టీరియా లాంటి వ్యాధికారక క్రిములు ఉండవచ్చు. గర్భవతులకు ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధుల అవకాశం అధికం, ఎందుకంటే గర్భధారణ వల్ల శరీర రోగనిరోధక వ్యవస్థ పనితీరును తాత్కాలికంగా మందగిస్తుంది. సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ల వల్ల అధిక జ్వరం, వాంతులు, విరేచనాలు ఇంకా శరీర డీహైడ్రేషన్ ను కలిగిస్తాయి. ఈ లక్షణాల తీవ్రత ఎక్కువైనట్లయితే, కొన్ని తీవ్రమైన కేసుల విషయంలో అది అకాల ప్రసవానికి దారితీయవచ్చు లేదా గర్భస్రావం కూడా కావచ్చు. అన్ని బ్యాక్టీరియాలు నిర్మూలించబడ్డాయని నిర్ధారించుకోవడానికి, గర్భధారణ సమయంలో పూర్తిగా ఉడికించిన లేదా పాశ్చరైజ్ చేసిన గుడ్లను మాత్రమే తీసుకోవడం ఎంతో ముఖ్యం. గర్భధారణ సమయంలో ఉడికించిన గుడ్లు తినడం కూడా మంచిదే.

మీకు ఇది కూడా నచ్చుతుంది: తెలియకుండా అబార్షన్: దీనికి కారణాలు ఏమిటి? ఈ పరిస్థితి లక్షణాలు ఎలా ఉంటాయి?

గర్భధారణ సమయంలో గుడ్డు తీసుకోవడం వల్ల ప్రయోజనాలు (Benefits of Eggs During Pregnancy in Telugu)

గుడ్లలో అధిక ప్రోటీన్ సారం ఉంటుంది. అంతేకాక, గర్భధారణ మొదటి త్రైమాసికంలో గుడ్లు తీసుకోవడం వల్ల ఆహారంలో పోషకాలను పెంచుకొనేందుకు ఇదొక మంచి పద్ధతి. గుడ్లలో అధిక కోలిన్ సారం ఉంటుంది, ఇది కొవ్వు ఇంకా ఖనిజాల మంచి సమ్మేళనం, అందువల్ల ఇది గర్భవతులకు అద్భుతమైనది. దీనితో పాటు, గుడ్లలో సెలీనియం, జింక్, విటమిన్ ఎ, విటమిన్ డి ఇంకా విటమిన్ బి కాంప్లెక్స్ లాంటివి ఉన్నాయి, ఇవి గర్భధారణ సమయంలో ఎంతో ఆవశ్యకమైనవి. గర్భధారణ సమయంలో గుడ్లు తీసుకొంటే, ఈ పోషకాలు మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

1. పిండం ఎదుగుదలకు గుడ్లు దోహదపడతాయి (Eggs Aid Fetal Development)

గుడ్డు తినడం వల్ల అది గర్భస్థ శిశువు మెదడు ఇంకా నరాల వృద్ధికి సహాయపడుతుంది. బిడ్డ ఎదుగుదలకు గుడ్లు ఎంతగానో సహకరిస్తాయి కాబట్టి గర్భధారణ సమయంలో గుడ్లు తీసుకోవడం మంచిది. గర్భిణీ స్త్రీలు గుడ్లను తీసుకొన్నప్పుడు, వారికి అనేక ప్రయోజనాలు చేకూర్చే పోషకమైన కోలిన్ లభిస్తుంది.

2. గుడ్డు శరీర కణాలను రిపేర్ చేస్తుంది (Eggs Repair Body Cells)

గర్భిణీ స్త్రీలు అనారోగ్యం లేదా అలాంటి పరిస్థితులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, శరీర కణాలు దెబ్బతిన్నట్లయితే, అవి గర్భిణీ స్త్రీ శరీరం లోపల పిండం పెరుగుదలను కూడా ఆటంకపరచవచ్చు. గర్భధారణ సమయంలో ఉడికించిన గుడ్లు తినడం వల్ల చక్కని పోషక విలువలను అందుకొనేందుకు ఇదొక మంచి మార్గం.

3. గుడ్లు పిల్లలలో కలిగే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అవకాశాలను తగ్గిస్తాయి (Decrease Neural Tube Abnormalities in Children)

నవజాత శిశువులలో 72% లేదా అంతకంటే తక్కువ మందికి పిండ దశలో లేదా పుట్టిన తర్వాత కూడా అసాధారణతలు ఉండే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు తెలిపాయి. ఇది ఎక్కువగా గర్భిణీ స్త్రీలలో కోలిన్ లోపం వల్ల వస్తుంది. గర్భధారణ మొదటి త్రైమాసికంలో గుడ్లు తినడం వల్ల, అది ఈ సమస్యను కలగకుండా చేసే అద్భుతమైన నివారణోపాయం.

4. గర్భవతులకు కలిగే ఆందోళన, డిప్రెషన్ ను అధిగమించేందుకు గుడ్లు దోహదపడతాయి (Helps to Overcome Anxiety, Depression)

గర్భవతులు చాలా సార్లు ఆందోళన ఇంకా నిరాశకు గురవుతుంటారు. గర్భవతులు గుడ్లు తీసుకోవడం వల్ల అందులోని కోలిన్ శరీరంలోని DNA ఇంకా హార్మోన్ల కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది. కోలిన్ ఎక్కువగా తీసుకునే గర్భిణీ స్త్రీలు వారి బిడ్డలు పిండ దశ నుండి యుక్తవయస్సు వరకు ఎంత చక్కగా ఎదుగుతారో ఆ మార్పులను కూడా గమనించవచ్చు.

5. శిశువు అనారోగ్యంతో జన్మించే అవకాశాలను గుడ్లు తగ్గిస్తాయి (Lowers Risk of Illness in Babies)

నవజాత శిశువులు ఎక్కువసార్లు అనారోగ్యానికి గురవుతువుంటారు. పుట్టిన తర్వాత, పిల్లలు తమ పరిసరాలకు అనుగుణంగా తమను తాము అనుకూల పరచుకోవాల్సివుంటుంది. ఎందుకంటే శిశువులు గర్భం నుండి బయటి ప్రపంచానికి వచ్చినపుడు వారికి ఏవైనా ఆటంకాలు లేదా అనారోగ్యాలు కలగకుండా, తల్లి కడుపులో ఉన్నప్పుడూ అందుకున్న కోలిన్ ఇలాంటి ప్రభావాలు శిశువుపై పడకుండా ఆసరాగా ఉంటుంది.

గర్భధారణ సమయంలో గుడ్లను ఎంచుకోవడం, వండటం ఎలా? (How to Choose and Prepare Eggs in Pregnancy in Telugu)

గర్భవతులు గుడ్లు తినవచ్చా అనే సందేహం ఉంటే, దానికి అవుననే సమాధానం వస్తుంది.

  • పాశ్చరైజ్ చేసిన గుడ్లను మాత్రమే కొనాలి. గుడ్లను కొనేటప్పుడు, ఆ గుడ్లు పాశ్చరైజ్ చేయబడి ఉన్నాయని నిర్ధారించుకోవడానికి లేబుల్‌ని తనిఖీ చేయాలి.
  • శీతలీకరించిన గుడ్లను ఎంచుకోవాలి.
  • గుడ్లను 40°F వద్ద లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద శీతలీకరించండి. వాటిని గది ఉష్ణోగ్రత వద్ద ఉండనిస్తే, వాటిలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరిగే అవకాశం అధికమవుతుంది.
  • చేతులతో సహా వండని గుడ్లు తాకిన అన్ని ఉపరితలాలను శుభ్రపరచాలి.
  • గుడ్డు పెంకు మురికిగా ఉన్నా లేదా వాటిపై పగుళ్లు ఉంటే అప్రమత్తంగా ఉండాలి.
  • గుడ్లను ఇతర ఆహారాలకు దూరంగా ఉంచాలి ఇంకా వాటిని ఇతర వస్తువులు ఉంచిన గిన్నెలో నిల్వ చేయకూడదు.
  • తాజా గుడ్లనే కొనేలా చూడాలి. గుడ్లు తాజాగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి, వాటిని ఒక గిన్నె నీటిలో ఉంచాలి; గుడ్లు తేలినట్లయితే, అవి తాజావి కావు. గుడ్లు మునిగిపోయింట్లయితే అవి తాజా గుడ్లని తెలుసుకోవాలి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: కుంకుమపువ్వు - ప్రయోజనాలు, దోషాలు ఇంకా మరికొన్ని వివరాలు

గర్భధారణ సమయంలో మహిళలు ఎన్ని గుడ్లు తినవచ్చు? (How Many Eggs can a Woman Eat During Pregnancy in Telugu)

వారి కొలెస్ట్రాల్ స్థాయిని బట్టి, సిఫార్సు చేయబడిన గుడ్లను తీసుకోవడం మంచిది, అది ప్రతిరోజూ ఒకటి నుండి రెండు గుడ్లు వరకు ఉంటుంది. ప్రతి గుడ్డులో 185 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది మరియు శరీరానికి ప్రతిరోజూ 300 మిల్లీ గ్రాములు అవసరమవుతుంది. గర్భధారణ సమయంలో గుడ్డులోని పచ్చసొన కూడా తినవచ్చు కానీ పచ్చిగా కాదు; దానిని సరిగ్గా ఉడికించాల్సివుంటుంది.

ఉడికించిన గుడ్డు గర్భధారణకు మంచి చేస్తుందా? (Is Boiled Egg Good for Pregnancy in Telugu)

అవును, గర్భిణీ స్త్రీలు ఉడికించిన గుడ్లను తినవచ్చు, ఎందుకంటే వాటిలో విటమిన్లు, ఖనిజాలు ఇంకా మంచి కొవ్వు ఉంటుంది. గర్భవతులు ఉడికించిన గుడ్లు తీసుకోవడం వల్ల తల్లీబిడ్డలకు ఆవశ్యకమైన పోషకాలన్నీ అందుతాయి. సిఫార్సు చేయబడినన్ని గుడ్లను తీసుకోవడం తల్లి కొలెస్ట్రాల్ స్థాయిని బట్టి రోజుకు 1-2 గుడ్ల వరకు మారుతుంది. గర్భధారణ సమయంలో ఉడికించిన గుడ్లు తినడం ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారమవుతుంది. గర్భవతిగా ఉన్నప్పుడు, కొన్ని చేయవలసినవి ఇంకా చేయకూడని విషయాలు ఉన్నాయి; సాధారణ ఆహార పదార్థాలు కూడా అకస్మాత్తుగా అనారోగ్య కారకంగా మారవచ్చు. అలాంటి ఆహారంలో గుడ్డు కూడా ఒకటి. బాక్టీరియాను మానవ శరీరాలు సులభంగా జీర్ణించుకోగలిగినప్పటికీ, గర్భధారణ సమయంలో రోగనిరోధక వ్యవస్థ మందగిస్తుంది, తద్వారా గర్భవతులు సునాయాసంగా వ్యాధుల బారిన పడతారు. ఈ కారణంగా, గర్భవతిగా ఉన్నప్పుడు పచ్చి గుడ్లను తీసుకోకపోవడమే మంచిది.

References

1. Christifano DN, Chollet-Hinton L, Hoyer D, Schmidt A, Gustafson KM. (2023). Intake of eggs, choline, lutein, zeaxanthin, and DHA during pregnancy and their relationship to fetal neurodevelopment. Nutr Neurosci.

2. Schnefke CH, Lutter CK, Thuita F, Webale A, Flax VL, Bentley ME. (2019). Is It Possible to Promote Egg Consumption During Pregnancy? Findings From a Study on Knowledge, Perceptions, and Practices in Kenya. Food Nutr Bull.

Tags

Eggs during pregnancy in Telugu, Benefits of eggs during pregnancy in Telugu, Risk of eating eggs during pregnancy in Telugu, Eggs During Pregnancy: Benefits And Nutrition Value in English, Eggs During Pregnancy: Benefits And Nutrition Value in Hindi, Eggs During Pregnancy: Benefits And Nutrition Value in Tamil, Eggs During Pregnancy: Benefits & Nutrition Value in Bengali

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.