Lowest price this festive season! Code: FIRST10
Conception
3 November 2023 న నవీకరించబడింది
ఐయూఐ విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సంతానోత్పత్తి మందులతో కలిపి చికిత్స జరిగినప్పుడు. ఈ మందులు గర్భం దాల్చే అవకాశాన్ని 20% వరకు పెంచుతాయి.
సంతానలేమి అనేది చాలా మంది ఎదుర్కొంటున్న ఒక సవాలు; అయినప్పటికీ, వారికి సహాయపడటానికి అనేక పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. ఐయూఐ.. అలాంటి ప్రత్యామ్నాయాలలో ఒకటి. ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ (IUI) అనేది ఒక రకమైన కృత్రిమ గర్భధారణ. ఇది సంతానాన్ని పొందాలనుకునే మహిళ గర్భాశయంలోకి నేరుగా వీర్యాన్ని చొప్పించడం ద్వారా సంతానలేమికి చికిత్సను అందిస్తుంది. పిల్లల కోసం ఎదురుచూసే జంటలు, జీవిత భాగస్వామి లేకుండా బిడ్డను కోరుకునే వ్యక్తుల కోసం తరచుగా ఉపయోగపడే సంతానోత్పత్తి చికిత్స ఇది.
గర్భం సహజంగా జరగాలంటే, వీర్యం తప్పనిసరిగా యోని నుండి గర్భాశయ ముఖద్వారానికి, ఆపై గర్భాశయ ముఖద్వారం నుండి గర్భాశయానికి, చివరకు గర్భాశయం నుండి ఫెలోపియన్ ట్యూబ్‌లకు వెళ్లాలి. మొత్తం సంఖ్యలో, కేవలం ఐదు శాతం వీర్యం మాత్రమే యోని నుండి గర్భాశయం వరకు ప్రయాణిస్తుంది. అండాశయం ద్వారా విడుదలైన తర్వాత, అండం ఫెలోపియన్ ట్యూబ్‌కు చేరుకుంటుంది. ఫెలోపియన్ ట్యూబ్లలో వీర్యం, అండాలు ఒకదానితో ఒకటి కలుసుకున్నపుడు ఫలదీకరణం జరుగుతుంది. ఐయూఐ ప్రక్రియలో, వీర్యాన్ని సేకరించి, శుభ్రపరచి సమీకరిస్తారు. తద్వారా అత్యధిక నాణ్యత కలిగిన వీర్యం మాత్రమే మిగిలి ఉంటుంది. కాథెటర్ (ఒక సన్నని గొట్టం)ను ఉపయోగించి వీర్యాన్ని నేరుగా గర్భాశయంలోకి పంపస్తాయి. ఇది ఫెలోపియన్ ట్యూబ్‌లకు దగ్గరగా తీసుకువస్తుంది. ఐయూఐ అండాన్ని చేరుకోవడానికి వీర్యం ప్రయాణించాల్సిన సమయం, దూరాన్ని తగ్గిస్తుంది, ఇది అండం ఫలదీకరణం చేయడానికి వీర్యానికి చాలా సులభతరం చేస్తుంది. ఇది భవిష్యత్తులో స్త్రీ గర్భవతి అయ్యే అవకాశాలను పెంచుతుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: IUI(ఇంట్రా యుటెరైన్ సెమినేషన్)తో గర్భవతి కావడానికి ఎంత సమయం పడుతుంది
ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ను స్వలింగ సంపర్క మహిళా జంటలు లేదా జీవిత భాగస్వామి లేకుండా బిడ్డను కలిగి ఉండటానికి ఇష్టపడే, స్పెర్మ్ డోనర్ సహాయం తీసుకునే మహిళలు ఎక్కువగా ఎంచుకుంటారు.
ఈ ప్రక్రియ కింది సందర్భాలలో నిర్వహిస్తారు:
1. స్త్రీకి గర్భాశయ శ్లేష్మం లేదా ఆమె గర్భాశయ ముఖద్వారానికి సంబంధించిన ఇతర సమస్యలను కలిగి ఉంటే.
2. తక్కువ స్పెర్మ్ కౌంట్.
3. డోనర్ స్పెర్మ్ అనేది సంతానోత్పత్తి లేని స్త్రీలకు లేదా ఇతర మహిళలతో సంబంధాలలో ఉన్నవారి కోసం ఎంచుకున్నప్పుడు..
4. వీర్యం అలెర్జీ. చాలా అసాధారణమైన సందర్భాల్లో, ఒక వ్యక్తికి తన జీవిత భాగస్వామి వీర్యం వల్ల అలర్జీ కలగవచ్చు. ఇది మంట, వాపు, చర్మం ఎర్రగా అవ్వడంతో సహా వారి యోనిని చికాకు పెట్టవచ్చు. అటువంటి సందర్భాలలో ఐయూఐ విజయవంతం కావచ్చు.
5. కారణం తెలియని సంతానలేమి. ఒక జంటకు సంతానం కలగకపోవడానికి గల కారణాన్ని వైద్య నిపుణులు గుర్తించడంలో విఫలమైనప్పుడు ఇది ఉపయోగపడుతుంది..
ఐయూఐ ప్రక్రియ ప్రారంభం నుండి చివరి వరకు, దాదాపు నాలుగు వారాలు (లేదా దాదాపు 28 రోజులు) ఉంటుంది. ఇది సాధారణ రుతు చక్రం లాగా అదే వ్యవధిలో ఉంటుంది. ఐయూఐ ప్రక్రియను ప్రారంభించే ముందు, రక్త పరీక్ష, స్పెర్మ్‌ల అధ్యయనం, అల్ట్రాసౌండ్ లేదా ఇతర రోగనిర్ధారణ ప్రక్రియలతో కూడిన సమగ్ర వైద్య పరీక్షలను దంపతులు చేయించుకుంటారు.
కొంతమంది ఐదు రోజుల వ్యవధిలో నోటి ద్వారా సంతానోత్పత్తి చికిత్సను పొందుతారు. మరికొందరు రెండు వారాల వరకు ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే మందులను తీసుకుంటారు. ఇది అండోత్సర్గం సంభావ్యతను పెంచుతుంది. అయితే, ఈ ఔషధాలు అందరికీ అవసరం లేదు. దీని వల్ల ఇన్సెమినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. స్పెర్మ్‌ను చొప్పించడం పూర్తి కావడానికి కొన్ని నిమిషాలు పడుతుంది. ఇన్సెమినేషన్ తర్వాత రెండు వారాల తర్వాత మహిళలు గర్భ నిర్ధారణ పరీక్ష చేసుకోవచ్చు.
గర్భం దాల్చ లేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే, కారణం తెలియని సంతానలేమికి చికిత్స చేయడంలో ఐయూఐ అత్యంత విజయవంతమైన ప్రక్రియ. అయితే, ఎండోమెట్రియోసిస్, ఫెలోపియన్ ట్యూబ్ వ్యాధులు లేదా తీవ్రమైన స్పెర్మ్ బలహీనత వంటి అనేక వైద్య సమస్యలు ఉన్నాయి, వీటిలో ఐయూఐ విజయవంతం అయ్యే అవకాశం లేదు. అటువంటి సందర్భాలలో, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) వంటి చికిత్సలు మెరుగ్గా పని చేస్తాయి.
ఐయూఐ విజయానికి మంచి అవకాశం ఉంది, ముఖ్యంగా సంతానోత్పత్తి మందులతో కలిపి చికిత్స జరిగినప్పుడు. సంతానోత్పత్తి మందులతో, గర్భం దాల్చే అవకాశం 20% వరకు పెరుగుతుంది. సంతానలేమికి మూల కారణం, అసలైన తల్లిదండ్రుల వయస్సు ఐయూఐ చికిత్స సక్సెస్ రేటును నిర్ణయించే రెండు ముఖ్యమైన అంశాలు. సంతానోత్పత్తి రేటు సాధారణ గర్భధారణ (సుమారు 20 శాతం) రేటు లాగే ఉంటుంది కాబట్టి, ఐయూఐ గర్భవతి అయ్యే అవకాశాలను పెంచడంలో సహాయపడుతుంది.
ఐయూఐ జరిగిన దాదాపు రెండు వారాల తర్వాత, మీరు గర్భవతిగా ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు. కొంతమంది మహిళలు ముందస్తు గర్భ నిర్ధారణ పరీక్షకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. అయితే, మీరు గర్భవతిగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి, మీరు రక్త పరీక్ష కోసం తిరిగి వెళ్లాల్సి వచ్చినప్పుడు లేదా మీరు ఇంట్లో మూత్ర పరీక్ష చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆరోగ్య సంరక్షణ నిపుణులు సలహా తీసుకోవడం మంచిది.
ఐయూఐ విజయాన్ని నిర్ణయించడంలో అతి ముఖ్యమైన అంశం వయస్సు. మీరు గర్భవతి అయ్యే అవకాశాలను పెంచుకోవడానికి, వైద్య నిపుణులు 40 ఏళ్లలోపు ఈ చికిత్సను చేయించుకోమని సలహా ఇస్తారు. ఒక స్త్రీకి వయస్సు పెరిగే కొద్దీ, ఆమె ఉత్పత్తి చేసే అండాల సంఖ్య సహజంగా తగ్గిపోతుంది. ఆ అండాల నాణ్యత కూడా దెబ్బతింటుంది.
ఐయూఐ ప్రక్రియకు ముందు, తర్వాత మీకు లైంగిక కోరికలు ఉండవచ్చు. మీ చికిత్స జరిగిన రోజున లేదా మరుసటి రోజున మీరు లైంగిక చర్యలో పాల్గొంటే, మీరు గర్భవతి అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి.
సంతానలేమి సమస్యలతో బాధపడే వారికి, ఐయూఐ చికిత్స అనేది గొప్ప ప్రత్యామ్నాయం. ఈ చికిత్సలో గర్భం దాల్చడానికి కొన్ని ప్రయత్నాలు అవసరమైనప్పటికీ, ఇది గర్భం దాల్చే అయ్యే అవకాశాలను పెంచుతుంది. ప్రక్రియ సక్సెస్ రేటు అనేది, ఇతర వ్యాధులు, వయస్సు, సమయం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
How Long Does it Takes to Get Pregnant With IUI, What is IUI, Definition of IUI, Benefits of IUI, Babies born with IUI are normal in telugu, How Long Does it Takes to Get Pregnant With IUI in English, How Long Does it Takes to Get Pregnant With IUI in Hindi, How Long Does it Takes to Get Pregnant With IUI in Tamil, How Long Does it Takes to Get Pregnant With IUI in Bengali.
Yes
No
Written by
Sarada Ayyala
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |