Updated on 12 September 2023
మీ పాల సీసా స్టెరిలైజర్లో బూజు (మోల్డ్ లేదా ఫంగస్) పేరుకుని ఉంటే అది పూర్తిగా తొలగించేవరకూ మీరు దానిని వాడటం సురక్షితం కాదు. కొన్నిసార్లు ఆ బూజుని తొలగించి శుభ్రపరిచిన తర్వాత కూడా, దాని మరకలు నిలిచిపోతాయి. ఈ మరకలు అపాయకరం కావు, కానీ తిరిగి బూజు పేరుకోకుండా చెక్ చేస్తూ ఉండండి. ఈ బూజు (ఫంగస్ లేదా మోల్డ్) తడి ఉపరితలాలపై పెరుగుతుంది. ఇంకా దీని ఫంగస్ బీజాలు వ్యాప్తి చెందవచ్చు. బూజు పట్టిన సీసా స్టెరిలైజర్ ను వాడటం వలన ఈ ఫంగస్ బీజాలు సీసాలలోకి కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.
బూజు విషపూరితం కాదు. కానీ కొన్ని రకాల బూజు విషపదార్థాలను ఉత్పత్తి చేయగలవు. ఈ విషపదార్థాలను తినడం ప్రమాదకరం కావచ్చు. వీటి వల్ల మీ పాపాయికి కడుపునొప్పి, విరేచనాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఫంగస్ బూజుని పీలిస్తే అలెర్జీలు, శ్వాస సమస్యలు కూడా రావచ్చు. అసలు సీసాల స్టెరిలైజర్లో బూజు పట్టకుండా ముందుగానే నివారించడం మంచిది.
బూజు ముఖ్యంగా తడి అలాగే తేమ పరిస్థితులలో అనుకూలంగా పెరుగుతుంది. కాబట్టి, మీ ఇంటిని. వంటింటిని శుభ్రంగా పొడిగా ఉండేలా చూసుకోండి. ఇంటి లోపలికి వీలైనంత గాలి, సూర్యకాంతి వచ్చేలా చూసుకోండి. స్టెరిలైజర్‌ను అలాగే పాపాయికి సంబంధించిన ఇతర పరికరాలను శుభ్రంగా, పొడిగా ఉంచండి. మీరు శుభ్రపరిచేటప్పుడు, దాన్ని తాజా, శుభ్రమైన గుడ్డతో లేదా టిష్యూ పేపర్ టవళ్లతో పొడిగా తుడవండి లేదా గాలికి పూర్తిగా ఆరేలా పెట్టండి.
ఈ నివారణ చర్యలు అన్నీ చేశాక కూడా, మీకు స్టెరిలైజర్లో బూజు కన్పిస్తే, మళ్లీ వాడేటప్పుడు తప్పకుండా దాన్ని తొలగించండి. అదే సమయంలో, మీ బేబీ పాల సీసాలు స్టెరిలైజ్ చేయడానికి ఇతర పద్ధతులు కూడా ప్రయత్నించవచ్చు. పాల సీసాను మరగపెట్టడం కూడా ఎక్కువగా వాడే పద్ధతుల్లో ఒకటి. మీరు వాడే స్టెరిలైజర్‌కు ప్రత్యేకమైన శుభ్రపరిచే సూచనలు ఏవైనా ఉంటే వాటిని అనుసరించండి. బూజుని తొలగించడానికి చల్లని నీటితో కూడిన స్టెరిలైజింగ్ ద్రవం లేదా టాబ్లెట్లు వాడవచ్చు. కానీ, ఇవి కేవలం కొన్ని ప్రత్యేకమైన దుకాణాలలో మాత్రమే లభిస్తాయి. మీరు తెలుపు వెనిగర్‌తో పాటూ అప్పుడే మరగబెట్టిన నీటిని వాడవచ్చు; ఇవి కూడా పొరలా పట్టిన సున్నాన్ని తొలగించడంలో సాయపడతాయి.
స్టెరిలైజర్‌ను శుభ్రపరచడానికి ముందు, తర్వాత కూడా మీ చేతులు కడుక్కోవాలని గుర్తుంచుకోండి. స్టెరిలైజర్లో బూజు పట్టిన ప్రదేశం లేదా చేత్తో ముట్టుకోవడానికి కష్టమైన ప్రదేశంలో శుభ్రం చేయడానికి, సీసా బ్రష్ లేదా టూత్ బ్రష్‌ను ఉపయోగించండి. బూజుని తొలగించాక స్టెరిలైజర్‌ను బాగా కడిగి, తోమి, ఆరబెట్టండి. సీసా బ్రష్‌ను కూడా సరిగ్గా శుభ్రపరిచి ఆరబెట్టండి.
Yes
No
Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips
Endometrial Thickness for IVF: The Ultimate Guide to Successful IVF Outcomes
Normal Endometrial Thickness: A Key Indicator of Female Fertility
Uterine Artery Embolization: A Non-Invasive Solution for Fibroids
Deviry 10mg for Menstrual Disorders: Is It the Right Choice for You
Hyperprolactinemia: How High Prolactin Levels Can Affect Your Chances of Conception
Myomectomy: A Comprehensive Guide to Uterine Fibroid Removal Surgery
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |