Pregnancy
24 May 2023 న నవీకరించబడింది
ప్లేసిబో ఎఫెక్ట్‌కు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఇది మానసిక అంశానికి సంబంధించింది. ప్లేసిబో ఎఫెక్ట్ గురించి వందల ఏళ్లుగా అనేక పరిశోధనలు, రికార్డులు ఉన్నాయి. అయినా దాని గురించి అర్థం చేసుకోవడానికి ఇంకా చాలా ఉంది. ఈ బ్లాగ్‌లో, ప్లేసిబో అంటే ఏంటీ? ప్లేసిబో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అని తెలుసుకోవడంతో పాటు ఇది ఎలా పనిచేస్తుంది? ఎందుకు పనిచేస్తుంది? అని కూడా తెలుసుకోండి.
ప్లేసిబో ఎఫెక్ట్ అనేది ఓ సంఘటనగా చెప్పాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓ వ్యక్తికి చికిత్స చేయకపోయినా, తనకు చికిత్స అందినట్టు భావించి, ఓ అనారోగ్య పరిస్థితి నుంచి బయటపడతాడు. అంటే మెడిసిన్ తీసుకుంటే లేదా చికిత్స పొందితే ఎలాంటి సత్ఫలితాలు వస్తాయో, ప్లేసిబో ఎఫెక్ట్‌లో సంప్రదాయ చికిత్స చేయకపోయినా అలాంటి ఫలితాలే వస్తాయి. "ప్లేసిబో" అనే పదం లాటిన్ పదమైన "placēre" నుంచి వచ్చింది. దీనర్థం "ఆనంద పర్చడం" అని. ప్లేసిబో ఎఫెక్ట్ ఎలా వస్తుందంటే, సదరు వ్యక్తి తనకు మెడిసిన్ లేదా చికిత్స పనిచేస్తుందని, నమ్మడం ద్వారా అతని ఆరోగ్యంలో సానుకూల మార్పులు వస్తాయి. చాలా అధ్యయనాల్లో ప్లేసిబో ఎఫెక్ట్ గురించి వివరించారు. అనేక ప్లేసిబో నియంత్రిత క్లినికల్ ట్రయల్స్ విజయవంతం కావడానికి ప్లేసిబో కీలక యంత్రాంగంలా పనిచేస్తుంది.
ప్లేసిబోలను ఉపయోగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అధ్యయనాల కోసం ప్లేసిబోను ఉపయోగిస్తారు. ఈ అధ్యయనాల్లో పాల్గొనే వారిని రెండు బృందాలుగా విభజిస్తారు. ఒక బృందానికి నిజమైన చికిత్స అందిస్తారు. రెండో బృందానికి ప్లేసిబో చికిత్స చేస్తారు. వచ్చే ఫలితాలు, కనిపించే ప్రభావాలు చికిత్స వల్ల ఉన్నాయా లేక ఈ అధ్యయనంలో పాల్గొన్నవారి అంచనాల వల్ల ఉన్నాయా అని పరిశోధకులు పరిశీలిస్తారు. ఇక ప్లేసిబోలను చికిత్సలో భాగంగా కూడా ఉపయోగిస్తారు. ఏదైనా అనారోగ్య పరిస్థితికి సమర్థవంతమైన చికిత్స లేనప్పుడు, ప్లేసిబో చికిత్సను ఉపయోగిస్తారు. క్రోనిక్ ఫెటీగ్ సిండ్రోమ్ లేదా ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ లాంటి వాటికి ఉపయోగిస్తుంటారు. ఇలాంటి కేసుల్లో, పేషెంట్లకు వారు మంచి అనుభూతి పొందడానికి, ఉపశమనం పొందుతున్నట్టు భావించడానికి ప్లేసిబో ఇస్తారు. అయితే ఇలాంటి అనారోగ్య పరిస్థితుల్ని ప్లేసిబోలు నయం చేస్తాయని ఎలాంటి ఆధారాలు లేకపోయినా, లక్షణాలను తగ్గించడానికి, పేషెంట్లు కాస్త కోలుకున్నట్టు కనిపించడానికి ఇవి పని చేస్తాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్: లక్షణాలు, కారణాలు & చికిత్స
ప్లేసిబో ఎఫెక్ట్‌లో 3 రకాల ప్రతిస్పందనలు ఉంటాయి: సానుకూలం, ప్రతికూలం లేదా తటస్థం. ప్లేసిబో కారణంగా సానుకూల ప్రతిస్పందనలో, ప్లేసిబో తీసుకున్న వ్యక్తి తమకు ఇక నయం అవుతుందని, ఆరోగ్యం కుదుటపడుతుందని భావించడం వల్ల వారి ఆరోగ్యం బాగుపడుతుంది. అంటే తనకున్న ఆరోగ్య సమస్య తగ్గిపోతుందని సదరు వ్యక్తి భావించడం వల్లనే సత్ఫలితాలు వస్తాయి. ఇక ప్రతికూల స్పందన కూడా ఉంటుంది. దీన్నే నోసీబో అంటారు. ప్లేసిబో తీసుకున్న వ్యక్తి పరిస్థితి ఇంకా దిగజారవచ్చు. ఇందుకు కారణం, తన ఆరోగ్యం కుదుట పడదని, ఈ సమస్య అలాగే ఉంటుందని సదరు వ్యక్తి మానసికంగా భావించడం వల్ల పరిస్థితి ఇంకా దిగజారుతుంది. ప్లేసిబోలో ఇక మూడో ప్రతిస్పందన తటస్థంగా ఉంటుంది. అంటే ప్లేసిబో ఇచ్చిన పేషెంట్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. ఇందుకు కారణం ప్లేసిబో తీసుకుంటున్న వ్యక్తికి, ఫలితాలపై ఎలాంటి అంచనాలు లేకుండా ఉండటమే.
ఏదైనా అనారోగ్య పరిస్థితికి ప్లేసిబో ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే, ముందుగా వైద్యుల్ని సంప్రదించాలి. సాధారణంగా ఎలాంటి చికిత్సకైనా కొన్ని రిస్కులు ఉంటాయి. ప్లేసిబో విషయానికి వస్తే ఈ రిస్క్ కాస్త తక్కువగా ఉంటుంది. ప్లేసిబో ప్రభావం చూపించిన కొన్ని పరిస్థితులు ఇవే:
డిప్రెషన్ ఒక మానసిక రుగ్మత. డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తిలకి దేనిపైనా ఆసక్తి ఉండదు. ఎప్పుడూ విచారంతోనే ఉంటారు. వారి ఆలోచనలు, అనుభూతులు, చర్యలపై దీని ప్రభావం ఉంటుంది. ఇది పలు రకాల మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తుంది.
స్లీప్ డిజార్డర్స్ కూడా ఒక రకమైన మానసిక వ్యాధే. ఒక వ్యక్తి జీవన నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నిద్రలేమి, స్లీప్ అప్నియా, నార్కోలెప్సీ లాంటి అనేక స్లీప్ డిజార్డర్స్ ఉన్నాయి. స్లీప్ డిజార్డర్స్‌తో అలసట, పగటి నిద్ర, ఏకాగ్రత లోపం, చికాకు లాంటి సమస్యలు వస్తాయి.
నొప్పి అనేది సర్వసాధారణం. అందరికీ ఏదో ఓ దశలో కలుగుతుంది. నొప్పిని తట్టుకోవడం కష్టంగా కూడా ఉంటుంది. నొప్పిని తగ్గించడానికి పెయిన్ కిల్లర్స్ ఉపయోగిస్తుంటారు. కానీ వీటి వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో, నొప్పిని తగ్గించడానికి ప్లేసిబోలు ఓ మంచి ఆప్షన్‌గా ఉంటాయి. అయితే ప్లేసిబో పనిచేసే మెకానిజం ఏంటో ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. కానీ, నొప్పి గురించి మెదడు గుర్తించే తీరును మార్చడం ద్వారా నొప్పి తగ్గిస్తుందని భావిస్తారు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ఈటింగ్ డిజార్డర్స్: అర్థం, కారణాలు, రకాలు & చికిత్స
ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ (IBS) పెద్ద పేగులను ప్రభావితం చేసే దీర్ఘకాల అనారోగ్యం. కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, అతిసారం, మలబద్ధకం లాంటి లక్షణాలు ఉంటాయి. దీని వల్ల బాధితులు స్కూల్‌కు, ఉద్యోగాలకు వెళ్లకుండా, రోజువారీ కార్యకలాపాలు సజావుగా నిర్వహించకుండా అడ్డంకి ఏర్పడుతుంది. ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్‌కు ఎలాంటి చికిత్స లేదు. లక్షణాల నుంచి ఉపశమనం పొందడానికి చికిత్సలు ఉంటాయి. తద్వారా బాధితులు పరిస్థితిని కొంత మెరుగుపర్చుకోవచ్చు.
మహిళ జీవితంలో రుతుక్రమం లేని కాలాన్ని మోనోపాజ్ అంటారు. ఇది 51 ఏళ్ల వయస్సులో వస్తూ ఉంటుంది. మోనోపాజ్ ఓ వ్యాధి కాదు. కానీ ఇది వేడి ఆవిర్లు, యోని భాగం పొడిగా మారడం లాంటి సాధారణ లక్షణాలకు దారితీస్తుంది. కొందరు మహిళల్లో మానసిక స్థితిలో మార్పులు ఉంటాయి లేదా నిద్రపోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మోనోపాజ్‌ను నయం చేయడానికి ఎలాంటి చికిత్స అవసరం లేదు. కానీ మోనోపాజ్ లక్షణాలు ఇబ్బంది పెడుతున్నాయంటే, కొన్ని రకాల చికిత్సలు పనిచేస్తాయి. హార్మోన్ థెరపీ, వెజైనల్ లూబ్రికెంట్స్, యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ ఉంటాయి.
చివరగా, ప్లేసిబో ఎఫెక్ట్ అనేది వైద్య పరిశోధన, క్లినికల్ ప్రాక్టీస్ కలయికతో ఉన్న శక్తివంతమైన చికిత్సా మార్గం అని చెప్పాలి. ప్లేసిబోలతో సాధించే ఆరోగ్య ఫలితాలు నిజమైనవి, కొలవగలిగినవి, వైద్యపరంగా సానుకూల మార్పులు తీసుకొచ్చేవిగా ఉన్నాయి. ప్లేసిబో ఎఫెక్ట్‌కు కారణమయ్యే మెకానిజం ఏంటో ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. అయితే ఇందులో మానసిక, జీవ సంబంధమైన కారకాలు కలిపి ఈ ఫలితాలకు కారణమవుతున్నాయని అనుకోవచ్చు.
Yes
No
Written by
swetharao62
swetharao62
మైండ్‌ఫుల్ పేరెంటింగ్: పద్ధతులు & ప్రయోజనాలు
శిశువు కడుపు మీద నిద్రపోవడం వలన వచ్చే ప్రమాదాలు ఏ విధంగా ఉంటాయి? ఈ విషయంలో ఎటువంటి సలహాలు పాటించాలి?
రెండో త్రైమాసికం ఫీటల్ అనోమలి స్కాన్ టెస్ట్: మీ ప్రెగ్నెన్సీ సమయంలో దీనివల్ల ఏమి తెలుస్తుంది?
ప్రెగ్నెన్సీ సమయంలో అధిక రక్తపోటు - లక్షణాలు & మేనేజ్మెంట్
1 వ వారంలో ప్రెగ్నెన్సీ లక్షణాలు
గర్భం దాల్చిన నాలుగో వారంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి అనుభూతి పొందుతారు?
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
Mylo is a master brand offering solutions through it's subsidiaries - Mylo Care and Mylo Baby.
Mylo Care offers science backed, expert led solutions across multiple health concerns.
Mylo Baby is a one stop solution for young parents for all their baby's needs.
Skin hydration | Shop By Ingredient | Kumkumadi | Ubtan | Vitamin C | Tea Tree | Aloe Vera | Skin - Hair | Hairfall | Dry and Damaged Hair | Shop By Ingredient | Onion | Aloe Vera Range For Hair | Coconut | Neelibrigandi | Skin - Bath & Body | By Ingredient | Skin - Pregnancy & New Mom | Stretch Marks | Skin - Health & Wellness |