
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మహిళలు బరువు పెరగడం సర్వసాధారణం. ఈ పెరిగిన బరువు మీ బిడ్డతో పాటు మీరు శ్రద్ధ వహించాల్సిన అనేక కొత్త విషయాలలో బరువు పెరగడం కూడా చేరి మీ పై ఒత్తిడిని పెంచుతుంది. సాధారణంగా ఒక స్త్రీ ప్రెగ్నెన్సీ సమయంలో 25-35 పౌండ్ల మధ్య బరువు పెరుగుతుంది.
సాధారణంగా ఈ బరువును క్రమంగా తగ్గించుకోవడానికి వైద్యులు నెలల తరబడి వ్యాయామం చేయాలని మరియు మీరు తినే ఆహారాన్ని చూసుకొని తినాలని సిఫార్సు చేస్తారు. అయితే మీరు పైన చెప్పిన దాని కంటే ఎక్కువ బరువు పెరిగినా లేదా త్వరగా తగ్గించుకోవాలనుకున్నా, మీరు ఈ క్రింది టిప్స్ నిఅనుసరించండి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: సి-సెక్షన్ తర్వాత బరువు తగ్గడం: తక్షణ చిట్కాలు మరియు డైట్ ప్లాన్
నీకు నమ్మశక్యం కాకపోయినప్పటికీ, మీ బిడ్డను ప్రసవించిన తర్వాత డైటింగ్ చెయ్యడం మీ శరీరానికి హానికరం. ఇది మీ రికవరీ వ్యవధిని పొడిగించడమే కాకుండా, మీకు ఇష్టమైన ఆహారాన్ని తినకపోవడం మరియు మీ కోరికలను అణచివేయడం వల్ల కలిగే ఒత్తిడిని కూడా పెంచుతుంది. అలా చెయ్యకుండా, క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకోండి మరియు మీ ఆహారంలో కార్బ్ (కార్బోహైడ్రేట్స్- పిండిపదార్థాలు) కంటెంట్‌ను పరిమితం చేయండి.
ప్రసవం తర్వాత, గడచిన తొమ్మిది నెలల ఒత్తిడిని ఎదుర్కోవడానికి స్త్రీ శరీరానికి చాలా పోషకాహారం అవసరం. అనేక పోషకాలతో కూడిన ఆహారాన్ని ఎంచుకోవడం వల్ల మీ శరీరానికి బలం వస్తుంది. అంతే కాకుండా మీకు రోజులో మరింత శక్తిని ఇస్తుంది. ఇది మీకు కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడమే కాకుండా మీ ఆకలిని కూడా అణిచివేస్తుంది. మీరు మాంసం, చికెన్, పాలతో చేసిన ఆహారాలు, చేపలు మొదలైనవి తినవచ్చు.
కొన్ని అధ్యయనాలు మీరు మీ బిడ్డకు చనుబాలు ఇవ్వడం మిమ్మల్ని మీ ప్రీ-ప్రెగ్నెన్సీ స్థాయికి త్వరగా తీసుకు రావడానికి సహాయపడతాయని సూచిస్తున్నాయి. కాకపోతే చనుబాలు ఇచ్చే స్త్రీలలో మరియు ఇవ్వని స్త్రీల మధ్య బరువు తగ్గడానికి మధ్య ఎటువంటి సంబంధం లేనప్పటికీ, ప్రయత్నించడం మంచిదే.
మంచి నీరు మీ శరీరాన్ని శుభ్రపరచడానికి మరియు మీ జీర్ణక్రియ మరియు జీవక్రియ రేటును మెరుగుపరచడానికి ఒక మంచి మార్గం. పగటిపూట పుష్కలంగా నీరు తాగడం వలన మూత్రవిసర్జన మరియు చమట రూపంలో నీటి బరువును త్వరగా తగ్గించడంలో మీకు సహాయపడుతుంది.
మీరు నడుస్తూ ఉండటం మరియు నిలబడి ఉండటం చాలా అవసరం. మీరు మీ నవజాత శిశువును జాగ్రత్తగా చూసుకోవాల్సినప్పుడు మీరెలాగూ నిలబడి అటు ఇటు నడవాల్సి ఉందనుకోండి. అయినప్పటికీ కేలరీలను బర్న్ చేయడానికి మరియు బరువు తగ్గడానికి కొన్ని తేలికపాటి కార్డియో మరియు ఏరోబిక్ ఎక్సర్సైజులు చేయడం చాలా అవసరం.
ఒత్తిడి తీసుకోవడం వల్ల స్ట్రెస్ హార్మోను విడుదలవుతుందని, ఇది మీ శరీరంలోని జీవక్రియను ప్రభావితం చేసి మిమ్మల్ని లావుగా మార్చుతుందని అందరికీ తెలిసిన విషయమే. మీ నవజాత శిశువు గురించి కంగారుపడకుండా ఉండటం అసాధ్యం అయినప్పటికీ, సరైన విశ్రాంతి తీసుకోవడం మరియు ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ప్రయత్నించడం చాలా అవసరం.
తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా మీ శరీరంలో కొవ్వు పెరుగుతుంది. ప్రతిరోజూ 8 గంటలు నిద్రపోవడం ముఖ్యం. నవజాత శిశువును చూసికోవడం అనేది ఫుల్ టైం పని అని మనందరికీ తెలుసు, అయితే మీరు 8 గంటల నిద్ర తీసుకునేందుకు మీ బిడ్డ నిద్రిస్తున్నప్పుడు నిద్రించడం చాలా ముఖ్యం.
మీరు ఈ టిప్స్ లలో ప్రతి ఒక్కటి అనుసరించి అప్పటికి బరువు తగ్గలేకపోతే, మీరు సహాయం కోరాలని ఆశించవచ్చు. ఒక డైటీషియన్‌ను సంప్రదించడం. మీ మీ శరీరం గురించి మరియు ఆ అదనపు పౌండ్‌లను తగ్గించడానికి ఏమి అవసరమో అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది. కొత్తగా తల్లి కావడం అనేది ఒత్తిడితో కూడుకున్న పని. కాకపోతే బలంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి మీ గురించి మరియు మీ బిడ్డ గురించి శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ఆపిల్ సిడార్ వెనిగర్ బరువు తగ్గడంలో సహాయపడుతుందా? ఇందులో వాస్తవం ఎంత?
Eight tips for losing weight after pregnancy in telugu, Eight tips for losing weight after pregnancy in English, Eight tips for losing weight after pregnancy in Hindi, Eight tips for losing weight after pregnancy in Tamil, Eight tips for losing weight after pregnancy in Bengali.

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest



Yes
No















It’s healthy.
Very nice
good taste👍

Influenza and boostrix injection kisiko laga hai kya 8 month pregnancy me and q lagta hai ye plz reply me
Hai.... My last period was in feb 24. I tested in 40 th day morning 3:30 .. That is faint line .. I conculed mylo thz app also.... And I asked tha dr wait for 3 to 5 days ... Im also waiting ... Then I test today 4:15 test is sooooo faint ... And I feel in ma body no pregnancy symptoms. What can I do .
Baby kicks KB Marta hai Plz tell mi
PCOD kya hota hai
How to detect pcos
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.


Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |