This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

ప్రెగ్నెన్పీ సమయంలో బార్లీ వాటర్: ప్రయోజనాలు, ప్రమాదాలు మరియు ఎలా తయారు చేయాలి? ( Barely Water During Pregnancy : Benefits and Risks & How to Prepare It in Telugu?

Diet & Nutrition
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
ప్రెగ్నెన్పీ సమయంలో బార్లీ వాటర్: ప్రయోజనాలు, ప్రమాదాలు మరియు ఎలా తయారు చేయాలి? ( Barely Water During Pregnancy : Benefits and Risks & How to Prepare It in Telugu?
Likes54 Likes|
Read time9 min

మీలో ఎదుగుతున్న ఒక చిన్న పాపను కలిగి ఉండటం అనేది అత్యంత సంతోషకరమైన అనుభూతి కావచ్చు. అదే సమయంలో ఎక్కువ భయపెట్టేది మరియు విపరీతమైనది కూడా. ఈ సమయంలో మీరు ఏమి తినాలి మరియు మీరు ఏమి తినకూడదు అనే దాని గురించి మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి నుండి టన్నుల కొద్దీ టిప్స్ పొందడం ప్రారంభిస్తారు. కాబట్టి హెల్దీ, పోషకమైన ఆహార ఎంపికను ఎంచుకోవడం చాలా సవాలుగా మారుతుంది. ప్రజల నుండి వచ్చిన మిశ్రమ అభిప్రాయాలతో అటువంటి ఒక ఆప్షన్ ప్రెగ్నెన్సీలో బార్లీ నీటిని తీసుకోవడం. ప్రాచుర్యం పొందిన నమ్మకం ప్రకారం, రెకమండ్ చేసిన మొత్తంలో బార్లీ నీటిని గర్భిణీ స్త్రీలు తమ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతారు. బార్లీ వినియోగం అనేది అపార్థాలు మరియు అపోహలతో నిండి ఉంది. తల్లికి ఏది ఉత్తమమో ఖచ్చితంగా తెలియనప్పుడు గర్భధారణ సమయంలో ఏమి తినాలో తెలుసుకోవడం సవాలుగా ఉండవచ్చు. బార్లీ నీటిని గర్భిణీ స్త్రీలకు సరైన మొత్తంలో తీసుకున్నప్పుడు అద్భుతమైన అనుబంధంగా (సప్లిమెంట్) ఉంటుంది. ఈ టాపిక్ గురించి మనం ఈ కింద మరింత చర్చిద్దాం!

బార్లీ అంటే ఏమిటి? (What is Barley in Telugu?)

వరి మరియు గోధుమల తరువాత బార్లీ ప్రపంచ వ్యాప్తంగా తృణధాన్యాల ధాన్యం వినియోగ జాబితాలో మూడో స్థానంలో ఉంది. తవుడు కారణంగా బార్లీ గింజలు వరి గింజల కంటే ముతక అనుభూతిని కలిగి ఉంటాయి. బార్లీ గింజలు వండినప్పుడు గంజిలా మరియు వగరుగా మారతాయి. బార్లీ బ్రెడ్ ముక్కలు, సలాడ్లు, మాల్ట్స్‌తో సహా అనేక వంటకాల్లో ఒక సాధారణ పదార్ధం. ఫైబర్, ఇతర పోషకాలు అధికంగా ఉండటమే కాకుండా, హోల్ గ్రెయిన్ బార్లీ కూడా ప్రోటీన్ యొక్క మంచి మూలం. అందువల్ల గర్భిణీ స్త్రీలు తక్కువ మొత్తంలో బార్లీ వాటర్ తాగాలని డాక్టర్లు రెకమండ్ చేస్తారు. బార్లీకి కాస్త ప్రత్యేకమైన రుచి ఉంటుంది. కానీ ఇది ఫైబర్, విటమిన్లు, మెగ్నీషియం, నియాసిన్, రాగి మరియు ఇతర పోషకాల యొక్క అద్భుతమైన మూలం. ఈ ఉత్పత్తి ఒకరి రోజువారీ మాంగనీస్, సెలీనియం అవసరాలలో ఎక్కువ భాగాన్ని తీర్చగలదు. ఇందులో ఉత్తమమైనది ఏమిటంటే, బార్లీలో కొలెస్ట్రాల్ పూర్తిగా ఉండదు.

మెడికల్ న్యూస్ టుడే ప్రకారం, సుమారు 184 గ్రాములు ఉన్న ఒక కప్పు బార్లీ వీటిని కలిగి ఉంది:

పోషకాలు

విలువ

క్యాలరీలు

651

కార్బోహైడ్రేట్లు

135గ్రాములు

డైటరీ ఫైబర్

31.8 గ్రాములు

ప్రోటీన్

22.96 గ్రాములు

ఫ్యాట్ (కొవ్వు)

4.23 గ్రాములు

పొటాషియం

832 మిల్లీగ్రాములు

ఫాస్పరస్

486 మిల్లీగ్రాములు

మెగ్నీషియం

245 మిల్లీగ్రాములు

క్యాల్షియం

61 మిల్లీగ్రాములు

నియోసిన్

8.5 మిల్లీగ్రాములు

ఐరన్

6.62 మిల్లీగ్రాములు

జింక్

5.1 మిల్లీగ్రాములు

థయామిన్

1.2 మిల్లీగ్రాములు

విటమిన్ బి6

0.585 మిల్లీగ్రాములు

రైబో ఫ్లావిన్

0.524 మిల్లీగ్రాములు

ఫోలెట్

35 మైక్రోగ్రామ్

ప్రెగ్నెన్సీ సమయంలో బార్లీ నీటిని తాగడం సురక్షితమేనా? (Is it Safe to Drink Barley Water During Pregnancy in Telugu?)

తరచుగా 'బార్లీ కంజీ' అని పిలుచుకునే బార్లీ నీటిని తాగడం ఆరోగ్యకరమైన అలవాటు. గర్భిణీ స్త్రీకి బార్లీ వాటర్ ప్రయోజనాలు చాలానే ఉంటాయి! బార్లీ వాటర్ వగరు రుచిని కలిగి ఉంటుంది. మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో క్రమం తప్పకుండా బార్లీ నీటిని తాగడం ద్వారా వివిధ రకాల ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. శరీరానికి పోషణను అందించవచ్చు. సలాడ్లు, సూప్(స్టివ్)లతో పాటు, మీరు వాటిని ఆవిరి ద్వారా వండిన (స్టీమ్) కూరగాయలకు కూడా జోడించవచ్చు.

మలబద్దకం, కడుపు నొప్పితో సహా వివిధ రకాల సమస్యలకు నివారణిగా గర్భిణీ స్త్రీలు బార్లీ నీటిని తాగాలి. మూత్రవిసర్జన.. కాబోయే తల్లులకు కొంత అసౌకర్యాన్ని కలిగించవచ్చు. ప్రెగ్నెన్సీ చివరి దశల్లో బార్లీ నీటి వినియోగం చాలా ద్రవాన్ని తొలగించగలదు (డయురిటిక్ ఎఫెక్ట్). ఇది గర్భాశయంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది అల్ట్రాసౌండ్‌‌లో అసాధారణ పరిస్థితులకు దారితీస్తుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో బార్లీ నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు (Advantages of Drinking Barley Water During Pregnancy in Telugu?)

  • బార్లీ వాటర్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని బార్లీ వాటర్ ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం:
  • ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలకు బార్లీ వాటర్ అద్భుతమైన వనరు. ఈ పోషకాలన్నీ తల్లి శరీరాన్ని ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉంచడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. బార్లీ వాటర్ మీ మూత్రవిసర్జన రేటును పెంచుతాయి. ఇది మీ శరీరం అదనపు ద్రవాలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.
  • బార్లీ నీరు గర్భిణీ స్త్రీలకు వారి కడుపు మంటను తగ్గించడం ద్వారా సహాయపడుతుంది.
  • బార్లీ వాటర్ ప్రేగు కదలికలను నియంత్రించడంలో, హెమోరాయిడ్స్, మలబద్ధకాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. బార్లీ వాటర్‌లో ఉండే ఫైబర్ వల్ల ఇది సాధ్యమవుతుంది. అయినా ఎక్కువగా బార్లీ నీటిని తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో జీర్ణశాయాంతర (గ్యాస్ట్రోఇంటస్టినైల్) సమస్యలను కూడా తీవ్రతరం చేస్తుంది.
  • బార్లీ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ మరియు వికారం యొక్క ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది ఆహారంతో తీసుకున్నప్పుడు కడుపు నొప్పి, చికాకుల తీవ్రతను కూడా తగ్గిస్తుంది. బార్లీలో కనిపించే కాపర్ మీ కీళ్లు, ఎముకలు, రక్త నాళాలను సాధ్యమైనంత సరళంగా ఉంచడానికి సహాయపడుతుంది.
  • బార్లీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, గర్భిణీ స్త్రీలలో గర్భధారణ మధుమేహం అభివృద్ధిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
  • బార్లీలో కనిపించే ఫోలెట్, ప్రెగ్నెన్సీ సమయంలో స్పినా బిఫిడా వంటి కొన్ని రకాల ప్రినాటల్ అస్వస్థతలకు గురికాకుండా బిడ్డను కాపాడుతుంది.
  • ఈ తృణధాన్యాలలో నియాసిన్ ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీల జీర్ణవ్యవస్థలను సజావుగా నడపడానికి సహాయపడుతుంది. యాంటీకోగ్యులెంట్ అని కూడా పిలువబడే నియాసిన్, పరిస్థితులను బట్టి సిజేరియన్ లేదా బిడ్డ సాధారణ డెలివరీ సమయంలో ఇది అత్యవసరం.
  • బార్లీ వాటర్ కణజాలాల పెరుగుదల, మరమ్మత్తుకు సహాయపడుతుంది. మీ బిడ్డను మీ గర్భంలో క్షేమంగా ఉంచడానికి చాలా ముఖ్యం.
  • బోనస్‌గా ప్రెగ్నెన్సీ సమయంలో బార్లీ నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల్లో పాల ఉత్పత్తి, పాలిచ్చే తల్లుల్లో స్రావం (సిక్రిషన్) కూడా ఉంటాయి.
  • గర్భిణీ స్త్రీలు బార్లీ నీటిని తాగడం ద్వారా వారి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించవచ్చు. ఫలితంగా గర్భిణీ స్త్రీలలో గుండెజబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుంది.
  • ఇది శరీరం నుండి విషాన్ని బయటకు విసర్జించడానికి సహాయపడుతుంది. కడుపు వాపులు లేదా అనారోగ్యాలు సంభవించకుండా నిరోధిస్తుంది.
  • ఒక అధ్యయనం ప్రకారం, గర్భిణీ స్త్రీ అధిక మొత్తంలో కెఫిన్ తీసుకుంటే ఆమె ఆరోగ్యానికి ప్రమాదం ఉంది. ఇది చాలా తక్కువ మొత్తంలో కెఫిన్ కలిగి ఉన్నందున, బార్లీ టీ గర్భిణీ స్త్రీలకు అద్భుతమైన ఎంపిక.
  • గర్భిణీ స్త్రీలు సాధారణంగా ఒక సాధారణ అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు. అది కాళ్ల వాపు. అదృష్టవశాత్తూ బార్లీ వాటర్ ఈ అసౌకర్యాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

గర్భిణీ స్త్రీలకు బార్లీ వినియోగం సాధారణ రిస్కులు (Common Risks Of Barley Consumption For Pregnant Women in Telugu?)

ప్రెగ్నెన్సీ సమయంలో బార్లీ నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పటికే చర్చించాం. గర్భిణీ స్త్రీ బార్లీని అధికంగా తింటే ఎదుర్కొనే కొన్ని సాధారణ రిస్కులను కూడా మనం తెలుసుకోవాలి.

  • ప్రెగ్నెన్పీ సమయంలో బార్లీ నీటిని తాగిన మహిళలు దద్దుర్లు, దురద పెరడగం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు రిపోర్ట్ చేశారని మీరు అర్థం చేసుకోవాలి.
  • బార్లీ నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలలో పుట్టుకతో వచ్చే అసాధారణతలు ఎదురవ్వొచ్చు. గర్భస్రావం కూడా జరగవచ్చు.
  • బార్లీ ధూళి వల్ల కంటి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, సైనస్ సమస్యలు వస్తాయి.
  • ఫంగస్ సోకిన బార్లీ ఎముకలకు హాని కలిగిస్తుంది.
  • దీనిలో అధిక గ్లూటెన్ కంటెంట్ ఉన్నందున, గ్లూటెన్ అలెర్జీలు ఉన్నవారు బార్లీని నివారించాలి.
  • ప్రెగ్నెన్సీ సమయంలో బార్లీ నీటిని అధికంగా తీసుకోవడం వల్ల పురీషనాళ రక్తస్రావం సంభవించవచ్చు.

బార్లీ వాటర్ ఎలా తయారు చేయాలి? (How To Prepare Barley Water in Telugu?)

చక్కెర మరియు అలక్టివ్స్ (సంకలిత)లతో నిండిన కమర్షియల్ బార్లీ వాటర్ తో పోలిస్తే, ఇంట్లో తయారుచేసిన కంజి మీ ఆరోగ్యానికి చాలా మంచి ఎంపిక. బార్లీ నీటిని తయారు చేయడంపై దశలవారీ గైడ్ ఫాలో చేయండి.

1. బార్లీ గింజలను శుభ్రంగా కడిగిన తర్వాత వాటిని నాలుగు గంటలపాటు నీటిలో నానబెట్టాలి.

2. వడకట్టిన నీటిలో 3 నుంచి 4 కప్పుల నీటిని కలపండి.

3. ఈ మిశ్రమాన్ని మరిగించండి. తరువాత మూతను తీసివెయ్యండి.

4. గింజలు మెత్తబడే వరకు ఒక గంట సేపు ఉడకనివ్వండి.

5. మిశ్రమాన్ని పూర్తిగా చల్లబరచండి.

6. జల్లెడ ద్వారా వడకట్టడానికి ముందు మిశ్రమాన్ని పూర్తిగా చల్లబరచడం తరువాతి దశ.

7. ఆ మిశ్రమాన్ని పోయగానే గింజలు ఒక కప్పు అడుగున మునుగుతున్నాయో లేదో చూడండి.

8. రోజూ ఒక కప్పు లేదా రెండు కప్పుల చొప్పున తాగాలి. రుచి కోసం నిమ్మరసం లేదా తేనెను కలుపుకోవచ్చు.

9. మీరు మిగిలిపోయిన బార్లీ నీటిని కూడా రిఫ్రిజిరేటర్‌లో ఉంచి మూడు రోజుల వరకు నిల్వ చేయవచ్చు.

10. బార్లీ గింజలు సూప్స్, పులుసులు, స్మూతీలను కూడా తమంతట తాముగా చిక్కగా మార్చగలవు.

ముగింపు (Conclusion)

ప్రెగ్నెన్సీ సమయంలో బార్లీ నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అపారమైనవి, వాటిని కాదనలేం. బార్లీలో చాలా పోషకాలు ఉన్నాయి. ఇవి గర్భిణీ స్త్రీకి అద్భుతంగా పనిచేస్తాయి. మీరు ఎల్లప్పుడూ ఇంట్లోనే బార్లీ నీటిని తయారు చేయడానికి ఎంచుకోవాలి. తాగడానికి సిద్ధంగా ఉన్న (రెడీ టు డ్రింక్) బార్లీ నీటిని విస్మరించాలి. ఇది మీరు తాజా బార్లీ నీటిని మాత్రమే త్రాగడానికి దోహదపడుతుంది. బార్లీ నీటిని ఎక్కువగా తీసుకోరాదని గుర్తుంచుకోండి. ఏదైనా అసౌకర్యం కలిగినట్లయితే మీ డాక్టర్‌ని సంప్రదించడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించవద్దు!

Tags:

Barely Water in telugu, Can pregnants drink barely water in telugu, Benefits of pregnants drinking barely water in telugu, Risks of drinking barely water during pregnancy in telugu, Preparation of barely water in telugu.

Barley Water in Pregnancy in English, Barley Water in Pregnancy in Bengali, Barley Water in Pregnancy in Tamil

Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Article Posted Under

Helpful Tools & Calculators

undefined icon
Pregnancy Calendar
See baby growth week by week
arrow_right
undefined icon
Mylo Store
Shop for mom & baby
arrow_right
undefined icon
Pregnancy Diet Chart
Trimester & region-wise diet plan
arrow_right
undefined icon
Mamasutra
Safe positions for pregnancy
arrow_right
undefined icon
Save Memories
Store baby's photos & firsts
arrow_right
undefined icon
Weight Tracker
Monitor your weight
arrow_right
undefined icon
Zordar Dadi Ke Nuskhe
Gharelu nushke that work
arrow_right
undefined icon
My Calendar
Predict periods & record symptoms
arrow_right
undefined icon
Ovulation Calendar
Know your monthly cycle
arrow_right
undefined icon
Pill Reminder
Get reminded for medicines
arrow_right
undefined icon
Vaccination Tracker
Never miss a vaccine date
arrow_right
undefined icon
Make Baby Sleep
Play white noise & sleep music
arrow_right
undefined icon
Pregnancy Music
Play calming music for baby
arrow_right
undefined icon
Baby Diet Chart
Age-wise food plans for baby
arrow_right
Kakarla Sirisha
Kakarla Sirisha

Related Articles

Questions about this article

  • Asked by 39 weeks pregnant

    Iam 9 th month pregnant and age is 30 years, my delivery date is next October 14,my height is 4.5 and iam gained weight is 15 kgs during pregnency total weight is 59 kgs my baby weight is 3.5 is possible to normal delivery or not? What can i do now for normal delivery plz... Sugges me

Related Topics

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.