hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Care for Baby arrow
  • పిల్లలు ఏడ్చినప్పుడు చేయవలసిన పనులు ఏమిటి? arrow

In this Article

    పిల్లలు ఏడ్చినప్పుడు చేయవలసిన పనులు ఏమిటి?

    Care for Baby

    పిల్లలు ఏడ్చినప్పుడు చేయవలసిన పనులు ఏమిటి?

    3 November 2023 న నవీకరించబడింది

    శిశువు ఎందుకు అంత బిగ్గరగా ఏడుస్తోంది? శిశువు ఏడుపు ఆపడం ఎలా? తల్లిదండ్రులకు, ముఖ్యంగా, కొత్త తల్లిదండ్రులకు ఎదురయ్యే అత్యంత సాధారణమైన ప్రశ్నలు ఇవి. నిజాయితీగా మాట్లాడితే.. ఏడుస్తున్న శిశువును సముదాయించడం పెద్ద సవాలుగా ఉంటుంది. తమ బిడ్డ ఏడుస్తున్నప్పుడు తల్లిదండ్రులు చేయగలిగే కొన్ని విభిన్న విషయాలను ఈ బ్లాగ్ విశ్లేషిస్తుంది.

    పిల్లలు ఎందుకు ఏడుస్తారు?

    పిల్లలు అనేక కారణాల వల్ల ఏడుస్తారు. కానీ అవన్నీ చివరికి ఒకే ప్రశ్నగా మారుతాయి. వారికి ఏమి కావాలి? పిల్లలు తమ అవసరాలు మరియు కోరికలను తెలియజేయడానికి అంతర్గత అవసరంతో జన్మించారు. కాకపోతే.. వారు వారి తల్లిదండ్రులతో కమ్యూనికేట్ చేయలేరు. కాబట్టి వారు దానికి బదులుగా ఏడుస్తారు. ఫలితంగా.. శిశువు ఎందుకు ఏడుస్తుందో అర్థం చేసుకోవడం ముఖ్యం.

    ఏడుస్తున్న శిశువు చాలా మంది తల్లిదండ్రులు ఎదుర్కొనే ఒక సాధారణ సవాలు. ఏడుస్తున్న శిశువును శాంతపరచడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ అవన్నీ ప్రతి శిశువుకు పని చేయవు. వాస్తవంగా శిశువు యొక్క ఏడుపును ఆపడానికి ఒకే ఒక పరిష్కారం అంటూ లేదు. వివిధ పద్ధతులతో ప్రయోగాలు చేయడం, మీ బిడ్డకు ఏది పని చేస్తుందో చూడటం ద్వారా ఏడుస్తున్న శిశువుకు ఏది సహాయపడుతుందో తెలుసుకోవడానికి ఉత్తమ మార్గం.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: నవజాత శిశువు ఏడుపు: దీని అర్థం ఏమిటి మరియు దానిని ఎలా ఎదుర్కోవాలి?

    ఏడుస్తున్న శిశువుకు ఏది సహాయపడుతుంది?

    పిల్లలు ఏడ్వడం సహజం, పెద్దలు తమ శిశువు ఏడుపు ఆపలేనప్పుడు, బిడ్డ ఏడుపుతో విసుగు చెందడం కూడా సహజమైనదే. శిశువు ఏడుపులో సహాయం చేయడానికి తల్లిదండ్రులు చేయగలిగే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి:

    • శిశువుతో ఊరటనిచ్చే స్వరంతో మాట్లాడండి
    • శిశువును ఊపుతూ దగ్గరకు తీసుకోండి
    • శిశువుకు పాసిఫైయర్ లేదా నీరు/పాలు బాటిల్ వంటి వాటిని చీకేందుకు ఇవ్వండి
    • సంగీతాన్ని ప్లే చేయండి లేదా ప్రశాంతంగా, సున్నితంగా ఉండే పాటలు పాడండి
    • వారి వీపు లేదా పొట్టపై రుద్దండి
    • వారిని స్ట్రోల్లర్ లేదా క్యారియర్‌లో బయట తిప్పేందుకు తీసుకెళ్లండి
    • లాలిపాటలను లేదా మృదువైన సంగీతాన్ని వినిపించేందుకు ప్రయత్నించండి
    • కాకపోతే, శిశువు యొక్క ఏడుపును మీరు హేండిల్ చేస్తున్నపుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి, ఉదాహరణకు, షేకెన్ బేబీ సిండ్రోమ్.

    షేకెన్ బేబీ సిండ్రోమ్ అంటే ఏమిటి?

    శిశువు లేదా చిన్న పిల్లవాడిని బలవంతంగా ఊపడం వల్ల కలిగే మెదడుకు గాయం కలిగే పరిస్థితిని షేకెన్ బేబీ సిండ్రోమ్ (SBS) అని అంటారు. వేగంగా ఊపడం అన్నది మెదడు పుర్రె లోపల ముందుకు వెనుకకు బౌన్స్ అయ్యేలా చేస్తుంది. దీనివల్ల గాయాలు, రక్తస్రావం మరియు (కొన్ని సందర్భాల్లో) మెదడు శాశ్వతంగా దెబ్బతినవచ్చు. ఇది మెదడుకు, మెదడు నుండి వచ్చే నరాలు మరియు రక్త నాళాలకు నష్టం కలిగించడంతో పాటు వాపును కూడా కలిగిస్తుంది.

    షేకెన్ బేబీ సిండ్రోమ్ మెంటల్ రిటార్డేషన్ మరియు అంధత్వం వంటి జీవితకాల సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో.. షేకెన్ బేబీ సిండ్రోమ్ ప్రాణాంతకం కావచ్చు. గాయం యొక్క కనిపించే సంకేతాలు లేనందున సిండ్రోమ్‌ను నిర్ధారించడం చాలా కష్టం. అయినప్పటికీ.. ఒకరికి SBS ఉందన్న అనుమానం ఉంటే, అంతర్గత రక్తస్రావం లేదా వాపు ఉందో లేదో తెలుసుకోవడానికి శిశువుకు మెదడు స్కాన్ లేదా MRI చేయాలి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: మీరు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి పిల్లలు మారాం చేయడానికి కారణాలు ఏమిటి?

    పిల్లలు ఏడ్చినప్పుడు చేయవలసిన పనులు

    1. డైపర్లు పొడిగా ఉన్నాయని నిర్ధారించుకోండి.

    పిల్లలు ఏడవడానికి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి మురికి డైపర్లు. మురికి నిండిన డైపర్లు వల్ల పిల్లలకు డైపర్ రాషెస్ వచ్చి శిశువులకు చాలా చికాకు కలిగించే పరిస్థితికి కారణమవుతాయి. శిశువు ఏడుస్తుంటే.. వారిని తనిఖీ చేసి డైపర్ మార్చడం వారిని ఏడుపు మాన్పించడంలో సహాయపడుతుంది.

    2. అవసరమైతే శిశువుకు ఆహారం ఇవ్వండి కానీ అతిగా తినిపించకండి.

    పిల్లల ఏడుపుకు ఒక సాధారణ కారణం ఆకలి. శిశువు ఏడుస్తూ ఉంటే.. మునుపటి ఫీడింగ్ నుండి కొంత సమయం అయినట్లయితే , వారికి ఒక సీసా లేదా తల్లిపాలు అందించడానికి ప్రయత్నించండి. అతిగా తినిపించడం వల్ల కలిగే అసౌకర్యానికి పిల్లలు కూడా ఏడుస్తారు.

    3. శిశువు యొక్క ఉష్ణోగ్రతను తనిఖీ చేయండి.

    డైపర్ శుభ్రంగా ఉంది అని దృకీకరించుకొని, శిశువుకు ఆహారం ఇచ్చినా కూడా శిశువు ఏడుస్తుంటే.. తల్లిదండ్రులు చేయవలసిన మొదటి మరియు ప్రధాన విషయం వారి ఉష్ణోగ్రత చూడటం. వారి ఉష్ణోగ్రత సగటుగా ఉందో లేదో, వారికి జ్వరం ఉందేమో అని తనిఖీ చేయండి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే.. వైద్య నిపుణుడిని సందర్శించండి.

    4. జీర్ణ సమస్యలు (గ్యాస్ సమస్యలు) కోసం తనిఖీ చేయండి.

    పాలు మాత్రమే తీసుకునే శిశువులకు కూడా గ్యాస్ ఉంటుంది. శిశువు ఏడుపు ఆగకుండా ఉంటే మరియు వారికి గ్యాస్‌ ఉందని తల్లిదండ్రులు భావిస్తే, వారికి బర్ప్ చేయడం లేదా కడుపు మసాజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇవి వారికి సహాయపడతాయి.

    5. ప్రశాంతమైన సంగీతాన్ని ప్లే చెయ్యండి.

    కొన్నిసార్లు పెద్ద శబ్దాల కారణంగా శిశువు ఏడుస్తుంది. శిశువు పెద్ద శబ్దాలతో ఆశ్చర్యపోయినట్లైతే, బ్యాక్‌గ్రౌండ్‌లో కొంచెం మృదువైన శబ్దాన్ని ప్లే చేయడానికి ప్రయత్నించండి. ప్రశాంతమైన, ఊరటనిచ్చే పాటలు శిశువును నిద్రపోయేలా చేస్తాయి.

    6. శిశువుతో పాడటం లేదా మాట్లాడటం చెయ్యండి.

    పిల్లలు అందరిలాగే విసుగు చెందుతారు. శిశువు ఏడుస్తుంటే, వారు విసుగు చెందుతారు. అప్పుడు వారితో మృదువుగా మాట్లాడటం లేదా మృదువైన పాట లేదా లాలిపాట పాడటానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు శిశువుకు శారీరకమైన సౌకర్యం, శ్రద్ధ అవసరం అవుతుంది. పిల్లలను ఎత్తుకుని, పాడేటప్పుడు లేదా వారితో మాట్లాడుతున్నప్పుడు మెల్లగా ముందుకు వెనక్కు ఊపండి.

    7. గది ఉష్ణోగ్రతను తనిఖీ చేయండి.

    గది చాలా చల్లగా లేదా చాలా వేడిగా ఉండటం వలన కూడా శిశువు ఏడుపు వస్తుంది. తల్లిదండ్రులు గది ఉష్ణోగ్రతను తనిఖీ చేయాలి. శిశువుకు చాలా వేడిగా లేదా చల్లగా లేకుండా చూసుకోవాలి. తరచుగా ఉష్ణోగ్రత లో జరిగే హెచ్చుతగ్గులు శిశువులు తట్టుకోలేకపోవచ్చు. శిశువు యొక్క ఏడుపు సాధారణంగా సంక్లిష్టంగా ఉండదు. తల్లిదండ్రులు మరియు కొత్త వారు కూడా కొద్ది సమయంలో బిడ్డను అర్థం చేసుకుంటారు. వారి దినచర్యను గమనిస్తూ ఉండటం, కొన్ని ట్రయల్-అండ్-ఎర్రర్‌లను ప్రయత్నించడం అనేవి తల్లిదండ్రులు తమ బిడ్డను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.