

Baby Care
19 January 2026 న నవీకరించబడింది
గెలాక్టోరియా అంటే మహిళ చనుమొనల నుంచి పాలలాంటి ద్రవం కారడం. కొత్తగా తల్లైన మహిళలు నవజాత శిశువుకు తల్లిపాలు ఇచ్చే సమయంలో కాకుండా.. ఇతర సందర్భాల్లో ఇలా జరుగుతుంది. ఇది వ్యాధి కాదు. కానీ వ్యాధికి సంకేతం కావచ్చు. ఇప్పటివరకు సంతానం కలగని మహిళలకు, మోనోపాజ్ దశలోకి వెళ్తున్నవారికి ఇలా జరుగుతుంది. ఈ పరిస్థితి పురుషుల్లో, పిల్లల్లో కూడా వస్తుంది. శరీరంలో గెలాక్టోరియా రావడానికి అనేక కారణాలు ఉంటాయి.
తల్లిపాలిస్తున్న సమయంలో కాకుండా.. ఇతర సందర్భాల్లో రొమ్ము నుంచి పాలు వస్తుండటాన్నే గెలాక్టోరియా అంటారు. శరీరంలో ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయిన సందర్భంలో ఇలా జరుగుతుంది. ఈ హార్మోన్ క్షీర గ్రంథుల నుంచి పాలు ఉత్పత్తి చేసి, విడుదల చేస్తుంది. కొన్నిసార్లు, గెలాక్టోరియా రావడానికి కారణాలు అస్పష్టంగా ఉంటాయి. అనేక సందర్భాల్లో.. ఇది దానంతట అదే తగ్గిపోతుంది.
రొమ్ము అధికంగా ప్రేరణ పొందడం, కొన్ని మందుల దుష్ప్రభావాల వల్ల కూడా గెలాక్టోరియా రావొచ్చు. పాల ఉత్పత్తిని ప్రేరేపించే ప్రొలాక్టిన్ అధిక స్థాయిలో ఉన్నప్పుడు కూడా గెలాక్టోరియా వస్తుంది.
గెలాక్టోరియాకు ప్రధాన లక్షణాలు చూస్తే:
పిట్యూటరీ గ్రంథిపై ఉండే నిరపాయమైన కణితి, గెలాక్టోరియాకు ప్రధాన కారణం. ప్రోలాక్టిన్ అధికంగా ఉత్పత్తి కావడమే ఈ కణితి రావడానికి కారణం. ఫలితంగా పాలనాళాలు ఏర్పడి, పాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్ పాలు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని మీ శరీరాన్ని నమ్మేలా చేస్తుంది. పాలను విడుదల చేస్తుంది. మరిన్ని కారణాలు ఇవే:
గెలాక్టోరియా ఎక్కువగా పునరుత్పత్తి వయస్సులో ఉన్న మహిళలపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో పురుషులపైనా ప్రభావం ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యతకు గెలాక్టోరియా అభివృద్ధి సంకేతం. ఇలాంటి పరిస్థితుల్లో.. మీరు గైనకాలజిస్ట్ లేదా సెక్సాలజిస్టును సంప్రదించాలి. గెలాక్టోరియా బారినపడటం ప్రాణాంతకం కాదు. కానీ ఇబ్బందికరంగా ఉంటుంది.
అయితే శుభవార్త ఏంటంటే ఈ పరిస్థితికి చికిత్స ఉంది. మీరు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టైతే వైద్యుల్ని సంప్రదించేవరకు పాల ప్రవాహాన్ని నియంత్రించడానికి బ్రెస్ట్ ప్యాడ్‌లను ధరించవచ్చు. మీరు వైద్యుల దగ్గరకు వెళ్లినప్పుడు కూడా, పరిస్థితిని వివరించడానికి ఏమాత్రం ఇబ్బంది పడకూడదు.
చాలా కేసుల్లో.. ఇది కొన్ని రకాల మానసిక సమస్యలకు ముడిపడి ఉండవచ్చు. సరైన చికిత్స, కౌన్సెలింగ్‌తో బయటపడొచ్చు. నెమ్మదిగా పరిస్థితి చక్కబడుతుంది. ప్రసవంతో సంబంధం లేకుండా.. రొమ్ముల నుంచి పాలు బయటకు వస్తున్నట్టైతే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటీ? దీన్ని ఎలా నయం చేయాలి?
వైద్యులు పలు రకాలుగా గెలాక్టోరియాను నిర్ధారిస్తారు:
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో రీయూజబుల్ నర్సింగ్ ప్యాడ్‌లను ఉపయోగించడం సురక్షితమేనా?
గెలాక్టోరియా అసౌకర్యంగా ఉన్నా, ఈ వ్యాధి ప్రాణాపాయం కాదు. చికిత్సతో ఈ పరిస్థితి మెరుగు అవుతుంది. గెలాక్టోరియా సాధారణ పరిస్థితి. కాబట్టి మీకు గెలాక్టోరియా లక్షణాలు ఉన్నట్టైతే వైద్యసాయం పొందడానికి ఏమాత్రం వెనకాడవద్దు.
Yes
No
Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips





రొమ్ము వాపు గురించి మరింత తెలుసుకోండి- కారణాలు, చికిత్స, లక్షణాలు (Know More About Breast Engorgement- Causes, Treatment & Symptoms in Telugu)

గర్భధారణ సమయంలో క్యారెట్: ప్రయోజనాలు & నష్టాలు | Carrot During Pregnancy: Benefits & Disadvantages in Telugu

పసిబిడ్డతో ప్రయాణాలు: ముఖ్యమైన భద్రతా చిట్కాలు (Traveling with a Newborn: Important Safety Tips in Telugu)

గర్భధారణప్పుడు యాపిల్ : గర్భధారణప్పుడు యాపిల్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు (Apple In Pregnancy: Benefits of Eating Apples During Pregnancy)

బేబీ బాత్ టైమ్‌ని సరదాగా ఇంకా ఆనందించేలా చేయడానికి 5 మార్గాలు (5 Ways to Make Baby Bath Time Fun & Enjoyable for the Little One in Telugu)

గర్భధారణ సమయంలో ఎకోస్ప్రిన్ ఎందుకు సిఫారసు చేయబడుతుంది?

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |