This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో రీయూజబుల్ నర్సింగ్ ప్యాడ్‌లను ఉపయోగించడం సురక్షితమేనా?

Health Tips
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
గర్భధారణ సమయంలో రీయూజబుల్ నర్సింగ్ ప్యాడ్‌లను ఉపయోగించడం సురక్షితమేనా?
Likes10 Likes|
Read time5 min

అనేక రకాల నర్సింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్‌లు నేడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో డిస్పోజబుల్ లేదా ఒక్కసారి ఉపయోగించే బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్‌లు లేదా నర్సింగ్ ప్యాడ్‌లు, రీయూజబుల్ బ్రెస్ట్ ఫీడింగ్ లేదా నర్సింగ్ ప్యాడ్‌లు ఉన్నాయి. ఈ రెండింటిలో రీయూజబుల్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్‌లు ఉపయోగించడానికి చాలా సురక్షితమైనవి.

రీయూజబుల్ బ్రెస్ట్ ప్యాడ్‌లు గర్భధారణ సమయంలో ఉపయోగించడం సురక్షితమేనా?

రీయూజబుల్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్‌లు లేదా నర్సింగ్ ప్యాడ్‌లను కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన వాటిని అర్థం చేసుకున్న తర్వాత.. ఈ రీయూజబుల్ బ్రెస్ట్‌ఫీడింగ్ ప్యాడ్‌లు లేదా నర్సింగ్ ప్యాడ్‌లు ఉపయోగించడం సురక్షితమేనా అనేది తెలుసుకుందాం. అవును! రీయూజబుల్ బ్రెస్ట్‌ఫీడింగ్ ప్యాడ్‌లు ఉపయోగించడం సురక్షితం. అయితే ఉపయోగించిన తర్వాత వాటిని సురక్షితంగా, శుభ్రంగా ఉంచడం ద్వారా మీరు వాటి భద్రతను నిర్ధారించుకోవాలి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో మరియు తల్లి పాలిచ్చే సమయాల్లో మెటర్నిటీ నర్సింగ్ మౌల్డ్డ్ స్పేసర్ కప్ బ్రా కొనడానికి టాప్ 5 ఒప్పించే కారణాలు

మీ రీయూజబుల్ బ్రెస్ట్ ప్యాడ్‌లు, నర్సింగ్ ప్యాడ్‌లు సురక్షితంగా, శుభ్రంగా ఉన్నాయని ఎలా నిర్ధారించుకోవాలి?

1. మీ చనుమొనల చుట్టూ స్థిరమైన తేమను ఉండకుండా, మీ బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్‌లు లేదా నర్సింగ్ ప్యాడ్‌లు తడిగా ఉన్నప్పుడల్లా మార్చండి.

2. వెచ్చని, తేమతో కూడిన వాతావరణాలు బ్యాక్టీరియా, ఫంగస్ అభివృద్ధి చెండానికి అనువైనవి. కాబట్టి మీ చనుమొనల చుట్టూ ఉన్న ప్రాంతం ఎల్లప్పుడూ పొడిగా, శుభ్రంగా, తేమ లేకుండా ఉండేలా చూసుకోండి.

3. రీయూజబుల్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్‌లు, నర్సింగ్ ప్యాడ్‌లను పరిశుభ్రంగా ఉంచడానికి, వాటిని ఎల్లప్పుడూ కాచిన నీటితో కడిగి, వెంటనే చల్లని నీటిని ఉపయోగించి కడగాలి. బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్‌లు, నర్సింగ్ ప్యాడ్‌లను ఇతర వస్త్రాలతో పాటు కలిపి ఉతకకుండా ప్రయత్నించండి. మీరు వాటిని ఇతర వస్త్రాలతో పాటు ఉతుకుతున్నట్లయితే, వాటిని లాండ్రీ పౌచ్‌లో వేసి, ఆపై వాషింగ్ మెషీన్ లోపల ఉంచండి.

4. రీయూజబుల్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్‌లు, నర్సింగ్ ప్యాడ్‌లను మళ్లీ ఉపయోగించే ముందు బాగా ఆరబెట్టండి.

ప్రతి వినియోగం తర్వాత సరిగ్గా శ్రద్ధ వహించి, శుభ్రం చేసినట్లయితే, రీయూజబుల్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్‌లు పర్యావరణ హితమైనవి, మన్నికైనవి. అలాగే ఖరీదైన డిస్పోజబుల్ నర్సింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్‌లకు ఇవి చక్కటి ప్రత్యామ్నాయం. ప్రతి వినియోగం తర్వాత బ్రెస్ట్‌ ఫీడింగ్ ప్యాడ్‌లు, నర్సింగ్ ప్యాడ్‌లను బాగా శుభ్రపరచడం, ఆరబెట్టడం ద్వారా మీ గర్భధారణ సమయంలో, ప్రసవానంతర కాలంలో మీరు మీ బిడ్డకు పాలు ఇస్తున్నప్పుడు వాటిని ఉపయోగించడం ఎల్లప్పుడూ సురక్షితం అవుతుంది.

నర్సింగ్ ప్యాడ్‌లను కొనుగోలు చేసేటప్పుడు ఏమి దృష్టిలో పెట్టుకోవాలి?

నర్సింగ్ లేదా బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్‌లను కొనుగోలు చేసే ముందు.. మంచి బ్రెస్ట్ ఫీడింగ్ లేదా నర్సింగ్ ప్యాడ్‌లో ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

1. సౌకర్యవంతమైన & మృదువైన

మీరు ధరించడానికి సౌకర్యంగా ఉండే బ్రెస్ట్ ఫీడింగ్ లేదా నర్సింగ్ ప్యాడ్‌లను కొనుగోలు చేయండి. బ్రెస్ట్ ప్యాడ్‌లు మీ రొమ్ములకు రెండవ చర్మంలా పనిచేస్తాయి. బ్రెస్ట్ ప్యాడ్‌లు చాలా మృదువుగా ఉండాలి. తడిగా ఉన్నప్పుడు అవి మీ చనుమొనలకు అంటుకోకూడదు.

2. పీల్చుకునే గుణం

బ్రెస్ట్ ప్యాడ్‌లను రూపొందించడానికి ముఖ్య ఉద్దేశ్యం పాలు కారుతున్నప్పుడు తల్లి దుస్తులు తడి అవ్వకుండా కాపాడటం. ఈ విధమైన రక్షణ పొందడానికి.. ఎక్కువగా పీల్చుకునే గుణం ఉండే బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్‌లు లేదా నర్సింగ్ ప్యాడ్‌లను ఎంచుకోండి.

3. పూర్తి కవరేజీ

బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్‌లు లేదా నర్సింగ్ ప్యాడ్‌లు మీ రొమ్ములలో కొంత భాగాన్ని కప్పి ఉంచాలి. లేకపోతే మీ దుస్తుల గుండా అవి బయటకి కనిపిస్తాయి.

4. రొమ్ము ఆకృతికి అనుగుణంగా ఉండాలి

బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్‌లు, నర్సింగ్ ప్యాడ్‌లు మీ రొమ్ములను బ్రా లాగా కప్పుకు సరిపోయేంత ఆకృతిలో ఉండాలి. సరిగ్గా సరిపోయే బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్‌లు లేదా నర్సింగ్ ప్యాడ్‌లు మీ బ్రా లోపల కదలకుండా, నలగకుండా ఉండేలా చేస్తుంది. చక్కటి ఆకృతి గల బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్ లేదా నర్సింగ్ ప్యాడ్ మీకు ఇబ్బంది కలిగించే సంఘటనలను జరగకుండా నివారిస్తుంది.

మీరు మై లో అందించే రీయూజబుల్, ఉతికగలిగే, పొడిగా ఉండే నర్సింగ్‌ ప్యాడ్‌లను ప్రయత్నించవచ్చు.

మీరు నమ్మదగిన రీయూజబుల్ బ్రెస్ట్ ఫీడింగ్, నర్సింగ్ ప్యాడ్‌ల కోసం చూస్తున్నట్లయితే.. మీరు మై లో అందించే పునర్వినియోగపరచదగిన( రీయూజబుల్), ఉతకగలిగే, పొడిగా ఉండే నర్సింగ్ ప్యాడ్‌లను ప్రయత్నించవచ్చు. వీటిని మూడు పొరలు కలిగి ఉండేలా రూపొందించారు.

బయటి పొర సులభంగా శ్వాస తీసుకునేందుకు, మధ్య పొర అధిక పీల్చుకునే గుణంతో, లోపలి పొర అత్యంత మృదువుగా ఉంటుంది. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్‌లు, నర్సింగ్ ప్యాడ్‌లు ఉపయోగించడానికి సులభమైనవి. సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. మై లో అందించే బ్రెస్ట్ ఫీడింగ్, నర్సింగ్ ప్యాడ్‌ల 3D ఆకృతి వాటిని ధరించడానికి చాలా సౌకర్యంగా ఉండేలా చేస్తుంది. ఇవి మీ రొమ్ములను సహజంగా కనిపించేలా కూడా చేస్తాయి. 4.5 అంగుళాల వ్యాసంతో.. మై లో అందించే బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్‌లు, నర్సింగ్ ప్యాడ్‌లు తల్లికి లీక్‌ప్రూఫ్ కవరేజీని అందిస్తాయి. ఇవి B నుండి D వరకు ఉండే కప్పు సైజ్‌లకు సులభంగా సరిపోతాయి. మై లో మీకు రెండు జతల బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్‌లు, నర్సింగ్ ప్యాడ్‌లను అందిస్తుంది. వాటితో పాటు నర్సింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్‌లను ఉతికేటప్పుడు ఉపయోగించగల కాంప్లిమెంటరీ లాండ్రీ పౌచ్‌ను కూడా అందిస్తుంది.

గర్భిణీ స్త్రీలు కనీసం ఆరు జతల రీయూజబుల్ బ్రెస్ట్‌ఫీడింగ్ ప్యాడ్‌లు, నర్సింగ్ ప్యాడ్‌లను కొనుగోలు చేయాలని సిఫార్సు చేస్తారు. ఒకటి లేదా రెండు జతల ఉతకడానికి వేసి ఉంటే, మిగిలిన మూడు జతలు రోజంతా ఉపయోగించడానికి అందుబాటులో ఉంటాయి. ఒక అదనపు జతను అత్యవసర వినియోగం కోసం ఉంచుకోవచ్చు. కాబట్టి భద్రత గురించి చింతించకండి. ఈరోజే వెళ్లి మీ రీయూజబుల్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్‌లు, నర్సింగ్ ప్యాడ్‌లను కొనుగోలు చేయండి!

32C - Maternity Bras Non-Wired, Non-Padded- Classic White (Buy 2 Get 1 Free)

32C - Maternity Bras Non-Wired, Non-Padded- Classic White (Buy 2 Get 1 Free)

Supports Growing Breasts | Eases Pumping & Feeding

45 Moms bought
₹293₹2992% Off
Rating
4.8
(56)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.