Lowest price this festive season! Code: FIRST10
Pregnancy Journey
3 November 2023 న నవీకరించబడింది
గర్భం దాల్చాక చాలా మంది మహిళలకు కష్టమయ్యే పని... కొన్ని ఆహారాలు తినకుండా ఉండడం. మనకు లభించే అనేక ఆహార పదార్థాలు గర్భిణీ శరీరానికి సరితూగవు. అటువంటి ఒక ఆహారమే కాఫీ. గర్భధారణ సమయంలో కాఫీ తాగడం వలన కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదలకు ఏవైనా ఆటంకాలు ఏర్పడతాయా అని ఏళ్ల నుంచి చర్చ నడుస్తోంది. గర్భిణీ స్త్రీలు కాఫీ తాగొచ్చా? ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది వ్యక్తులు తమ రోజుని కాఫీతోనే మొదలుపెడతారు. ఎంత చెప్పినా కానీ దానిని తాగడం మాత్రం వదిలేయరు. కానీ మీరు గర్భవతిగా ఉన్నపుడు ఎక్కువగా కాఫీపై ఆధారపడకూడదు. ఇక్కడ శుభవార్త ఏమిటంటే.. కెఫిన్‌ను తక్కువ మోతాదులో తీసుకోవడం వలన ఎటువంటి సమస్యలు రావు. గర్భిణీ స్త్రీలు తమకున్న కాఫీ అలవాటును పూర్తిగా వదులుకోవాల్సిన అవసరం లేదు. గర్భధారణ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని కాఫీ తాగితే మంచిదే. గర్భవతిగా ఉన్నపుడు నేను కాఫీ తాగవచ్చా? గర్భవతిగా ఉన్నపుడు కాఫీ తాగడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? నిపుణులు చెప్పిన దాని ప్రకారం.. గర్భిణీ స్త్రీలు రోజుకు 1-2 కప్పుల కాఫీని తాగొచ్చు. లేదా రోజుకు 200 గ్రాముల కాఫీని తీసుకోవచ్చు. గర్భధారణ సమయంలో కెఫిన్ తీసుకోవడం వల్ల వచ్చిన సమస్య ఏమిటంటే.. ఇది గర్భస్రావం వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. గర్భధారణ సమయంలో కాఫీ మంచిదే అనే విషయం ఖచ్చితంగా నిజం కావాల్సిన అవసరం లేదు. మరియు చాలా మంది డాక్టర్లు గర్భిణీలు తమ ప్రెగ్నెన్సీ జర్నీలో కెఫిన్ అలవాట్లను వదులుకోవాలని సిఫారసు చేస్తారు. గర్భధారణ సమయంలో కాఫీని చాలా తక్కువ పరిమాణంలో తీసుకున్నంత కాలం సురక్షితంగానే ఉంటుంది.
గర్భధారణ సమయంలో కెఫిన్ ఎందుకు నిషేధించబడింది? దీని వెనకున్న ప్రధాన కారణం ఏమిటంటే.. ఇది గర్భిణీ స్త్రీ శరీరం మీద ప్రభావాలను చూపిస్తుంది. సాధారణంగా చెప్పాలంటే.. కాఫీ నుంచి వచ్చే కెఫిన్ హృదయ స్పందనల రేటును పెంచుతుంది. శరీరంలో ఇది గందరగోళాన్ని కలిగిస్తుంది. ఇది తీవ్రమైన ఆందోళనలకు దారి తీస్తుంది. గర్భిణీ స్త్రీలు కూడా కెఫిన్‌ను నెమ్మదిగా జీర్ణం చేసుకుంటారు. (అరగడం) దీని వల్ల కెఫిన్ రక్తంలో ఎక్కువ సేపు ఉంటుంది. కెఫిన్‌ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన ఇది స్త్రీ శరీరంలోని ప్లాసెంటాను దాటుకుని శిశువు రక్తంలోకి కూడా చేరుతుంది. ఇది ఎదుగుతున్న శిశువు మీద హానికరమైన ప్రమాదాలను కలిగిస్తుంది. ఈ కారణాల వల్ల గర్భధారణ సమయంలో కెఫిన్‌ను తీసుకోకుండా దూరం పెడతారు.
కెఫిన్ అనేది పూర్తిగా లేకుండా చేయలేమా? మీరు కొద్ది మోతాదులో కెఫిన్ తీసుకున్న ఎటువంటి సమస్య లేదు. మీరు గర్భవతి అయితే మీ రోజు వారి దినచర్య నుంచి కెఫిన్‌ను పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేదు. చాలా మందికి కెఫిన్ లేకుండా తమ రోజును ప్రారంభించడం చాలా కష్టంగా ఉంటుంది. వివిధ రకాల అధ్యయనాలు, పరిశోధనల ప్రకారం.. గర్భవతిగా ఉన్నపుడు కూడా రోజుకు 200 మిల్లీగ్రాముల కెఫిన్ తీసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. 200 మిల్లీగ్రాములు అంటే 1 లేదా 2 కప్పుల కాఫీకి సమానం. అంటే 6 ఔన్సులన్న మాట. మరీ ముఖ్యంగా గర్భధారణ మొదటి త్రైమాసికంలో ఉన్నపుడు. దీని కంటే ఎక్కువ కెఫిన్ సురక్షితంగా పరిగణించబడదు. ఎందుకంటే ఇది కేవలం గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా కడుపులో ఉన్న శిశువు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
కెఫిన్ అనేది కేవలం కాఫీలో మాత్రమే లేదు. కేవలం కాఫీ ఒక్కటే కెఫిన్‌ను కలిగి ఉన్న పానీయం కాదు. ఇతర అనేక ఆహారపదార్థాలు మరియు పానీయాలలో కెఫిన్ ఉంది. గర్భవతులు తాము తీసుకునే ఆహారం గురించి అందులో వాడే పదార్థాల గురించి అవగాహన కలిగి ఉండాలి. అలాంటపుడు వారు ఎటువంటి ఆహారాలను తీసుకుంటున్నారు. ఒక వేళ వారు తీసుకునే ఆహారంలో కెఫిన్ ఉంటే.. వారు ఎంత కెఫిన్ తీసుకుంటున్నారు.. అది తినడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? అనే విషయాల మీద అవగాహన కలిగి ఉంటారు. గర్భధారణ సమయంలో కాఫీ తాగడం హానికరం కానప్పటికీ.. అది మనం ఎంత మోతాదులో తీసుకుంటున్నాం అనే విషయాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
కాఫీ కాకుండా తరచూ తినే ఆహారాలు.. పానీయాల్లో కూడా కెఫిన్ ఉంటుంది. అటువంటి పదార్థాలకు గర్భిణీ స్త్రీలు దూరంగా ఉండాలి. లేదా గర్భధారణ సమయంలో అటువంటి పదార్థాలను తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఈ కింది వాటిలో కెఫిన్ ఉంటుంది
కాఫీ అలవాటు ఎక్కువగా ఉన్న వారు కెఫిన్‌కు దూరంగా ఉండేందుకు ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో డీకేఫినేటెడ్ టీ మరియు డీకేఫినేటెడ్ కాఫీ అందుబాటులో ఉన్నాయి. వారు వాటినే తీసుకుంటే సరిపోతుంది. పొద్దున్నే లేవగానే కాఫీ తాగేందుకు గల ప్రధాన కారణం.. రోజును ఉత్సాహంగా ప్రారంభించడం, శరీర జీవక్రియను పెంచడం మరియు ఉత్పాదకతను మెరుగుపరచడం. డీకేఫినేటెడ్ టీ మరియు కాఫీ అచ్చంగా కాఫీలా ఉన్న పానీయాన్ని ఆస్వాదించేందుకు ఉన్న గొప్ప మార్గం. ఈ కాఫీ తాగడం వలన శరీరానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అధిక మోతాదులో కెఫిన్ కూడా రక్తంలోకి ఎంటరవదు. గర్భధారణ సమయంలో కెఫిన్ తీసుకోవడం తగ్గించేందుకు ఉన్న ఇతర ప్రత్యామ్నాయాలు.. రసం లేదా నీటిని తీసుకోవడం.
పైన వివరించిన విధంగా గర్భిణీ స్త్రీ రోజుకు 1-2 కప్పుల కంటే ఎక్కువ మోతాదులో కాఫీ తాగకూడదు. ఎందుకంటే ఇది శిశువు అభివృద్ధికి హానికరం. పుట్టబోయే బిడ్డను ఇది అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా కాఫీ వలన గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంది. ముందు జాగ్రత్తగా మీరు గర్భవతిగా ఉన్న సమయంలో తీసుకునే ఆహారాల్లో వాడే పదార్థాల జాబితాను ఒకసారి తనిఖీ చేయండి. ఎందుకంటే నేటి రోజుల్లో మనం తినే లేదా తాగే అనేక ఆహారపదార్థాలు, పానీయాల్లో కెఫిన్ ఉంటుంది. ఉదాహరణకు ఎవరూ కూడా ఎక్కువగా సోడాలు, ఎనర్జీ డ్రింక్స్, గ్రీన్ టీకి కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో కెఫిన్ ఉంటుంది. తక్కువ పరిమాణంలో వాటిని తీసుకుంటే పెద్ద సమస్య ఏం కాదు. మీకు కనుక కెఫిన్ ఎక్కువగా తీసుకున్నారని అనిపిస్తే.. మీ శరీరంలోకి వెళ్లిన కెఫిన్‌ను బయటకు తీసేందుకు ఉన్న ఉత్తమ మార్గం ఎక్కువగా నీళ్లు తాగడం. మీ శరీరంలో అతిగా ఉన్న కెఫిన్ బయటకు పోయిందని మీకు అనిపించే వరకు నీరు తాగుతూనే ఉండండి. గర్భధారణ సమయంలో కెఫిన్ ఎంత మోతాదులో తీసుకోవాలనే విషయం మీద మీకు ఏవైనా సందేహాలుంటే.. మీ వైద్యుడిని సంప్రదించండి.
Coffee during pregnancy in telugu, Can pregnants drink coffee during pregnancy in telugu, tips to reduce coffee during pregnancy in telugu, Effects of coffee during pregnancy in telugu, Coffee During Pregnancy: Effects & Precautions in English, Coffee During Pregnancy: Effects & Precautions in Hindi, Coffee During Pregnancy: Effects & Precautions in Tamil, Coffee During Pregnancy: Effects & Precautions in Bengali.
Yes
No
Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |