hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Illnesses & Infections arrow
  • గర్భధారణ సమయంలో టైఫాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి? దానికి ఎలా చికిత్స తీసుకోవాలి? | Typhoid In Pregnancy: Symptoms & Treatment in Telugu arrow

In this Article

    గర్భధారణ సమయంలో టైఫాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి? దానికి ఎలా చికిత్స తీసుకోవాలి? | Typhoid In Pregnancy: Symptoms & Treatment in Telugu

    Illnesses & Infections

    గర్భధారణ సమయంలో టైఫాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి? దానికి ఎలా చికిత్స తీసుకోవాలి? | Typhoid In Pregnancy: Symptoms & Treatment in Telugu

    3 November 2023 న నవీకరించబడింది

    టైఫాయిడ్ అనేది గర్భధారణ సమయంలో వచ్చే తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, గర్భిణీ స్త్రీలు దాని లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోవాలి. ఈ శీర్షికలో, గర్భధారణ సమయంలో టైఫాయిడ్ లక్షణాలు, రోగ నిర్ధారణ, చికిత్స, నివారణ గురించి మేము వివరిస్తాం.

    గర్భధారణ సమయంలో టైఫాయిడ్ అంటే ఏమిటి? (What Is Typhoid In Pregnancy in Telugu)

    టైఫాయిడ్ అనేది సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటూ వ్యాధి. ఇది కలుషితమైన ఆహారం, నీరు ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. టైఫాయిడ్ యొక్క లక్షణాలు జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, మలబద్దకం లేదా అతిసారం. తీవ్రమైన సందర్భాల్లో, టైఫాయిడ్ శరీరం లోపల రక్తస్రావం, పేగులు పాడవడం వంటి సంక్లిష్టమైన సమస్యలకు దారితీయొచ్చు.

    గర్భధారణ సమయంలో టైఫాయిడ్ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది? (How Does Typhoid Illness Spread During Pregnancy in Telugu)

    గర్భధారణ సమయంలో టైఫాయిడ్ ముఖ్యంగా కలుషితమైన ఆహారం, నీరు ద్వారా వ్యాపిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పారిశుధ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి టైఫాయిడ్ సర్వ సాధారణం. ఈ వ్యాధి ఒకరికొకరు దగ్గరగా ఉండటం వల్ల త్వరగా వ్యాపిస్తుంది, అంటే చుట్టుపక్కల ఎవరికైనా టైఫాయిడ్ ఉంటే తొందరగా ఇంకొకరికి వచ్చే ప్రమాదం ఉంటుంది.

    గర్భధారణ సమయంలో టైఫాయిడ్ లక్షణాలు ఏమిటి? (What Are The Symptoms Of Typhoid In Pregnancy in Telugu)

    గర్భధారణ సమయంలో టైఫాయిడ్ లక్షణాలు గర్భిణీ స్త్రీలకు, మామూలు స్త్రీలకు ఒకేలా ఉంటాయి. వీటితో పాటు:

    1. జ్వరం (Fever)

    ఇది టైఫాయిడ్ యొక్క సాధారణ లక్షణం. అధిక జ్వరం 104 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు రావచ్చు.

    2. తలనొప్పి (Headache)

    టైఫాయిడ్‌తో బాధపడుతున్న చాలా మందికి తలనొప్పి కూడా వస్తుంది.

    3. పొత్తికడుపు నొప్పి (Abdominal pain)

    టైఫాయిడ్ వల్ల కడుపు నొప్పి వస్తుంది, పొత్తి కడుపులో ఎక్కువగా వస్తుంది.

    4. మలబద్ధకం లేదా అతిసారం (Constipation or diarrhoea)

    చాలా మందికి టైఫాయిడ్ వచ్చినప్పుడు మలబద్ధకం మరి కొందరికీ అతిసారం వస్తుంది.

    టైఫాయిడ్ యొక్క ఇతర లక్షణాలు నీరసం, ఆకలి వేయకపోవడం, ఛాతి లేదా పొట్ట మీద దద్దుర్లు రావడం.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో మలేరియా: కారణాలు, ప్రభావాలు & చికిత్స

    గర్భధారణ సమయంలో టైఫాయిడ్‌ను కనుక్కోవడం ఎలా? (How Is Typhoid Diagnosed In Pregnancy in Telugu)

    గర్భధారణ సమయంలో టైఫాయిడ్‌ను కనుగొనడానికి వైద్యులు శారీరక పరీక్ష చేసి రోగి యొక్క వైద్య చరిత్ర లక్షణాలు అడిగి తెలుసుకుంటారు. రోగ నిర్ధారణ కోసం వైద్యులు రోగికి రక్తపరీక్ష, మలం నమూనా పరీక్షకు పంపమని చెప్పొచ్చు.

    గర్భధారణ సమయంలో టైఫాయిడ్ చికిత్స (Treatment Of Typhoid In Pregnancy in Telugu)

    గర్భధారణ సమయంలో టైఫాయిడ్ చికిత్సకు యాంటీబయాటిక్స్ వాడతారు. వీటిని నోటి ద్వారా గానీ ఇంట్రావీనస్ ద్వారా గానీ ఇవ్వచ్చు. రోగి పరిస్థితి, రోగ తీవ్రత బట్టి నిర్దిష్ట యాంటీబయాటిక్ వాడతారు. ఇన్ఫెక్షన్‌ను పూర్తిగా నిర్మూలించడానికి చికిత్సను పూర్తి చేయడం అవసరం.

    గర్భధారణ సమయంలో టైఫాయిడ్ సంక్రమణ ఎక్కువ అవుతుందా? (During Pregnancy Will It Worsen My Typhoid Infection in Telugu)

    గర్భధారణ సమయంలో టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ సాధారణంగా ఎక్కువ వ్యాప్తి చెందదు. ఏదేమైనా, గర్భం దాల్చిన స్త్రీలకి టైఫాయిడ్ వల్ల కలిగే ఇబ్బందులు ఎక్కువ ఉండొచ్చు. గర్భధారణ సమయంలో వచ్చే శారీరక మార్పుల వల్ల శరీరంలో నీరు తగ్గుతుంది, దీని వల్ల టైఫాయిడ్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది.

    నాకు గానీ, నాకు పుట్టబోయే బిడ్డకు గానీ టైఫాయిడ్ వల్ల హాని జరుగుతుందా? (Can Typhoid Affect My Pregnancy Or My Unborn Child in Telugu)

    చాలా సందర్బాల్లో, టైఫాయిడ్ వల్ల గర్భిణీలకు గానీ, పుట్టబోయే బిడ్డ గానీ ఎక్కువ సమస్యలు కలిగించదు. అయినప్పటికీ, గర్భిణీ స్త్రీలు టైఫాయిడ్ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైతే, వ్యాధి గర్భంపై ప్రభావం చూపించగలదు. టైఫాయిడ్‌తో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలకి శరీరంలో నీరు తగ్గడం, నెలలు నిండకుండానే ప్రసవం అవ్వడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాంటప్పుడు గర్భిణీ స్త్రీలు టైఫాయిడ్‌కి సురక్షితమైన తక్షణ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

    గర్భధారణ సమయంలో టైఫాయిడ్‌ను నివారించడం ఎలా? (How To Prevent Typhoid In Pregnancy in Telugu)

    గర్భధారణ సమయంలో టైఫాయిడ్‌ని నివారించడానికి మంచి పరిశుభ్రతను పాటించాలి. కలుషిత ఆహారం, నీరు తీసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం. గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా టైఫాయిడ్ వ్యాక్సిన్‌తో పాటు ఇతర వ్యాక్సిన్లు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలకు టైఫాయిడ్ వ్యాక్సిన్ సురక్షితమైంది, ఇంకా వ్యాధి సంక్రమణ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.

    నాకు, నా పుట్టబోయే బిడ్డకి టైఫాయిడ్ మందులు సురక్షితమేనా? (Are Typhoid Medications Safe For Me And My Unborn Child in Telugu)

    టైఫాయిడ్ చికిత్సకు ఉపయోగించే యాంటీబయాటిక్స్ చాలా వరకు గర్భధారణ సమయంలో వేసుకోవడం సురక్షితమే. అయిన సరే, వాటి వల్ల జరిగే హాని, ఉపయోగాలు గురించి వైద్యులను ‌సంప్రదించిన తర్వాతే మందులు వాడడం మొదలుపెట్టాలి.

    టైఫాయిడ్ మళ్ళీ వస్తుందా? (Can Typhoid Infection Recur in Telugu)

    కొన్ని సందర్భాల్లో, చికిత్స తీసుకున్న తర్వాత కూడా టైఫాయిడ్ వస్తుంది. టైఫాయిడ్ పూర్తిగా నిర్మూలించబడనప్పుడు లేదా మళ్లీ బ్యాక్టీరియాకి గురైనప్పుడు ఇన్‌ఫెక్షన్ మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది. టైఫాయిడ్ మళ్ళి వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి వైద్యులు ఇచ్చిన మందులు పూర్తిగా వాడాలి. తిరిగి బ్యాక్టీరియాకి గురవకుండా మంచి పరిశుభ్రతను పాటించాలి.

    ముగింపు (Conclusion)

    గర్భిణీ స్త్రీలు మంచి పరిశుభ్రతను పాటించాలి, కలుషితమైన ఆహారం, నీరు తీసుకోకూడదు. టైఫాయిడ్‌ రాకుండా నివారించడానికి వ్యాక్సిన్ తీసుకోవాలి. తీవ్రమైన సందర్భాల్లో, టైఫాయిడ్ వల్ల అంతర్గత రక్త స్రావం, ప్రేగు పాడటం వంటి సమస్యలు ప్రాణాంతకం కావచ్చు. గర్భిణీ స్త్రీలో టైఫాయిడ్ లక్షణాలు కనిపిస్తే, సరైన రోగ నిర్ధారణ, చికిత్స కోసం వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం. టైఫాయిడ్ చికిత్సకు వాడే యాంటీబయాటిక్స్ గర్భధారణ సమయంలో సురక్షితమే. అయిన సరే, వాటి వల్ల జరిగే హాని, ఉపయోగాలు గురించి వైద్యులను సంప్రదించిన తర్వాతే మందులు వాడడం మొదలుపెట్టాలి.

    References

    1. Touchan F, Hall JD, Lee RV. (2009). Typhoid fever during pregnancy: case report and review. Obstet Med.

    2. Buongiorno R, Schiraldi O. (1984). Treatment of typhoid fever in pregnancy. Chemioterapia.

    3. Seoud M, Saade G, Uwaydah M, Azoury R. (1988). Typhoid fever in pregnancy. Obstet Gynecol.

    Tags

    Typhoid in Pregnancy in Telugu, What are the symptoms of Typhoid in Pregnancy in Telugu, Can Typhoid affect the pregnancy in Telugu, Treatment of typhoid in pregnancy in Telugu, Typhoid in Pregnancy in English, Typhoid in Pregnancy in Hindi, Typhoid in Pregnancy in Tamil, ⁠Typhoid in Pregnancy in Bengali

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.