
ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ (IBS) అనేది కడుపులో, పేగులలో ఏర్పడే అనారోగ్య సమస్య. చాలావరకు లక్షణాలు జీర్ణాశయానికి సంబంధించినవే ఉంటాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధి. ఎక్కువ కాలం దీని ప్రభావం ఉంటుంది. దీర్ఘకాలిక చికిత్సలు, మందుల ద్వారా నియంత్రించవచ్చు. ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ లక్షణాలు మానవ శరీర తీరును బట్టి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలు తీవ్రంగా, మరికొన్ని సందర్భాల్లో తేలికపాటిగా ఉండవచ్చు. మనిషి తన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా ఈ రుగ్మత నుంచి బయటపడవచ్చు. ఒకవేళ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లయితే వైద్యుల్ని సంప్రదించి మందులు తీసుకోవడం మంచిది. కోలోరెక్టాల్ క్యాన్సర్, పేగులలో ఉండే కణజాల మార్పులకు ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ కారణం కాదు.
జీఐ ఫంక్షనల్ డిజార్డర్ అనేది జీర్ణాశయం బయట పేగులలో ఏర్పడే వ్యాధి. మానవుడి కడుపులో పదేపదే వస్తున్న రుగ్మతను బట్టి తీవ్రతను నిర్ధారిస్తారు. జీఐ ట్రాక్ట్ పనితీరు సరిగ్గా లేనప్పుడు, జీఐ ఫంక్షనల్ డిజార్డర్ అనే రుగ్మత ఏర్పడుతుంది. జీఐ ఫంక్షనల్ డిజార్డర్‌ను ఎన్నో రకాల పరీక్షలు జరిపినా నిర్ధారించడం కష్టం.
ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ రకాలు నిర్ధారించడానికి మానవుడి పేగులలోని కదలికలు, రోగి బాధపడుతున్న తీవ్రతను బట్టి పలు రకాలుగా విభజిస్తారు. ఐబీఎస్ రకాన్ని బట్టి చికిత్స ఉంటుంది.
ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ రకాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
ఎవరికైతే విస్కెరల్ లైనింగ్‌లో రక్తపోటు ఉంటుందో, అలాంటి వారిలో ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పేగు సమస్యలు వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. తీవ్రమైన ఒత్తిడితో బాధపడే వారిలో ధూమపానం, మద్యపానం ఎక్కువగా చేసేవారిలో సైతం ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది.
ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి . అవి ఈ కింది వాటిగా చెప్పుకోవచ్చు.
మానవుడిలో ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ లక్షణాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు తరచుగా పొత్తికడుపులో నొప్పి కలగడం, ఉబ్బరం, పదేపదే తిమ్మిర్లు రావడం లాంటివి ఐబీఎస్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. పేగుల కదలికలలో మార్పులు సంభవించినట్లయితే వెంటనే అనుభవజ్ఞులైన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ వైద్యుడిని సంప్రదించాలి.
ఇప్పటివరకు ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్‌ను నిర్ధారించడానికి సరైన పరీక్షలు ఏమీ లేవు. ఎవరికైనా ఐబీఎస్ అని అనుమానం ఉన్నట్లయితే వివిధ రకాలైన పరీక్షలు చేయించుకునేందుకు అనుభవజ్ఞులైన గ్యాస్ట్రియోఇంటరాలజిస్ట్ వైద్యులను సంప్రదించాలి. వైద్యుడు చేసిన పరీక్షల ద్వారా పరిస్థితిని బట్టి రోమ్ విధానాలను అనుసరించి, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్‌ను నిర్ధారిస్తారు. రోమ్ ప్రమాణాల ప్రకారం వారానికి ఒకసారి కనీసం మూడు నెలల పాటు పేగు కదలికలు కష్టతరమై.. కడుపు మళ్లీమళ్లీ వస్తుంటే ఐబీఎస్‌గా పరిగణించవచ్చు. దీంతో పాటు మల విసర్జన యొక్క ఫ్రీక్వెన్సీలో మార్పులు ఉంటాయి. లేదా మలం భిన్నంగా కనిపించవచ్చు. ఇది ఏ రకమైన ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్‌ని నిర్ధారిస్తారు. దీన్ని వ్యక్తి లక్షణాలు, కదలికలను బట్టి వైద్యులు ఏ రకమైన ఐబీయస్ అని పరిగణిస్తారు.
ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ తికిత్సలు చాలా రకాలుగా ఉన్నాయి. వ్యక్తుల భిన్న శరీర తత్వాలను బట్టి ఇది మారొచ్చు. కాబట్టి అందరికీ ఒకే రకమైన చికిత్స పనిచేయదు. అయితే ఐబీఎస్ లక్షణాలు ఉన్న వ్యక్తి అనుభవజ్ఞులైన గ్యాస్ట్రియోఎంట్రాలజిస్ట్ సలహాలు సూచనలు నిర్ధారణ చేయించుకోవాలి. రోగి యొక్క పరిస్థితిని మెరుగుపరచడానికి వైద్యులు ఆహారపు అలవాటు, జీవనశైలిలలో మార్పులు తీసుకురావాలని సూచిస్తారు. ఎక్కువగా నీరు తాగమని, ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉండేలా చూడాలని, కాఫీ టీ లాంటి పదార్థాలకు దూరంగా ఉండమని చెబుతారు. ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్‌కు గురైన వ్యక్తి ఆహారపు అలవాట్లను బెరీజు వేసుకొని వేసుకొని, రక్త పరీక్షలను కూడా చేయిస్తారు. ఉదాహరణకు వ్యక్తి లోపల లాక్టోస్ లోపం ఉన్నట్లయితే కాల్షియం లభించే ఆహారపదార్థాలు తినమని సలహా ఇస్తారు. పాలను వాడకూడదని చెప్తారు.
ఐబీఎస్ ఉన్న వ్యక్తి పైన చెప్పిన అలవాట్లను మార్చుకుంటూ, శరీరానికి కావాల్సిన వ్యాయామాలు కూడా క్రమం తప్పకుండా చేయాలి. ఒకవేళ తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతూ, ఐబీఎస్ తీవ్రంగా ప్రభావితం చేస్తుంటే, యాంటీ డిప్రెషన్, యాంటీ స్ట్రెస్ మందులు, సప్లిమెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్): చికిత్స, నిర్వహణ
ఒకవేళ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ లక్షణాలు ఉన్నట్లయితే, బొడ్డు కింద భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటే వైద్యుల్ని సంప్రదించాలి. ఐబీఎస్‌ను గుర్తించడంలో సమయం చాలా పడుతుంది. దీని నిర్ధారణకు ఎన్నో రకాల పరీక్షలను జరపాల్సి ఉంటుంది. ఐబీఎస్‌కు సరైన చికిత్స కోసం సరైన రోగ నిర్ధారణ చాలా ముఖ్యం.
Yes
No




Naku eppudu 7 months baby moments teliyadam ledhu...
Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada
Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz
Hii 34 weeks how many months
Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |