This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

శిశువు మలం రంగు వారి ఆరోగ్యం గురించి ఏమి తెలియజేస్తుంది?|What Does Your Baby's Poop or Stool Color Say About Their Health in Telugu

Care for Baby
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: May 29, 2026
శిశువు మలం రంగు వారి ఆరోగ్యం గురించి ఏమి తెలియజేస్తుంది?|What Does Your Baby's Poop or Stool Color Say About Their Health in Telugu
Likes5 Likes|
Read time7 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • నవజాత శిశువు రోజుకు పది డైపర్లు అవసరం, మలం రంగు ప్రతిరోజూ మారుతూ వారి మొత్తం ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ స్థితిని సూచిస్తుంది.
  • నలుపు-ఆకుపచ్చ తారు లాంటి మెకోనియం ప్రారంభంలో సాధారణం, తల్లిపాలు పట్టే శిశువులలో పసుపు, ఫార్ములా పాలు పట్టే శిశువులలో పసుపు-గోధుమ రంగు మలం సాధారణం.
  • మలంలో రక్తం, తెలుపు రంగు మలం, ఎక్కువ శ్లేష్మం లేదా నీళ్లలా పలుచని విరేచనాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం.
  • శిశువు డైపర్ సంరక్షణకు ఏది ఉత్తమం? Explore our Adjustable & Reusable Cloth Diaper - Rainbow, Pet Love & Heart Doodles - Pack of 3.
Airprime Premium Diaper Pants S (5–9 kg, 26 Count) + 100% Plant-Based Baby Wipes (Pack of 2)
Airprime Premium Diaper Pants S (5–9 kg, 26 Count) + 100% Plant-Based Baby Wipes (Pack of 2)
Rating4.6
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Rating3.9

నవజాత శిశువుకు రోజుకు కనీసం పది డైపర్లు అవసరామౌతాయి. వారి ప్రేగులలో జరిగే కదలికలు వారి ఆరోగ్యాన్నిసూచించడంలో కీలకమైనవి. శిశువు పూప్ రంగు ప్రతిరోజూ మారుతుంది. ఇది సాధారణం అనిపించినప్పటికీ, పూప్ రంగు కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా సూచిస్తుంది.

శిశువు పూప్ రంగు శిశువు మొత్తం ఆరోగ్యాన్ని సూచిస్తుంది. తల్లిదండ్రులు గమనించగలిగే అత్యంత సాధారణ బేబీ పూప్ రంగులు ఇంకా అవి ఏమి సూచిస్తాయో క్రింద ఇవ్వబడ్డాయి.

బేబీ పూప్ కలర్ చార్ట్ (Baby poop color chart in Telugu)

శిశువు మలం రంగు కాలానుగుణంగా మారవచ్చు. ఇది వారి మొత్తం ఆరోగ్యాన్ని సూచిస్తుంది. దిగువ ఇచ్చిన గైడ్ బేబీ పూప్ రంగుల మధ్య తేడాను తెలుసుకొనేందుకు తల్లిదండ్రులకు సహాయకారిగా ఉంటుంది.

శిశువు పూప్ రంగు

నలుపు

ఆకుపచ్చ

ఎరుపు

తెలుపు

పసుపు

బ్రౌన్ లేదా ఆరెంజ్

స్థితి

నవజాత శిశువులలో సాధారణం

సాధారణ సంకేతం

జాగ్రత పడాల్సిన సంకేతం

జాగ్రత పడాల్సిన సంకేతం

సాధారణ సంకేతం

సాధారణ సంకేతం

సూచిక

పెద్ద పిల్లలలో అంతర్గత రక్తస్రావానికి సంకేతాలు

తరచుగా ఆహారం, అలెర్జీలు లేదా మందులు కారణం

మలంలో రక్తం కారణం

కాలేయం ఇన్ఫెక్షన్ కారణం

తల్లిపాలు పట్టే శిశువులలో సాధారణం

ఫార్ములా పాలు పట్టే శిశువులలో సాధారణం

వైద్యుడిని సంప్రదించాలి

అవును

అవును

అవసరం లేదు

అవసరం లేదు

శిశువు మలం రంగు వారి ఆరోగ్యం గురించి ఏమి తెలుపుతుంది? (What does the baby's boop colour say about their health in Telugu)

1. నల్లని లేదా ముదురు ఆకుపచ్చ రంగు పూప్ (Black or dark greenish poop)

ప్రారంభ రోజులలో శిశువు మలం నలుపు-ఆకుపచ్చ తారు లాంటి జిగట పదార్థంలా కనిపిస్తుంది. ఇది పిత్తం, ఉమ్మ నీరు మరియుపేగు గ్రంధుల నుండి జరిగిన కొన్ని స్రావాల మిశ్రమం. ఇది దుర్వాసనను కలిగించనప్పటికీ, సాధారణ పూప్‌తో పోలిస్తే శుభ్రపరచడం కాస్త కష్టం. అయితే, రెండు రోజుల తర్వాత, శిశువు మలం అనేక రకాల మార్పులను కలిగి ఉంటుంది. శిశువు పూప్ రంగు ముదురు ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోకి మారి కాస్త జిగటగా ఉండవచ్చు. శిశువు ఆహారాన్ని బాగా తీసుకోవడం ప్రారంభించే వరకు ఈ రకమైన బేబీ పూప్ రంగు కొనసాగుతుంది.

2. పసుపు రంగు పూప్(Yellow baby poop)

శిశువు పుట్టిన ఒక వారం తర్వాత, చాలా మంది పిల్లలు సాధారణ పద్ధతిలో ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం ప్రారంభిస్తారు. శిశువు మలం పిత్తం, బ్యాక్టీరియా ఇంకా పాలలోని కొన్ని జీర్ణంకాని పదార్థాలను కలిగి ఉంటుంది. తల్లి పాలివ్వడం ఉంటే, శిశువు మలం రంగు ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉంటుంది. దానికి నీరు, ఈస్ట్ లాంటి వాసన ఉంటుంది. ఈ వాసన కాటేజ్ చీజ్ లేదా గిలకొట్టిన గుడ్లు లాగా కూడా ఉండవచ్చు.

3. పసుపు-గోధుమ రంగు పూప్ (Yellow-brown baby poop)

శిశువుకి ఫార్ములా పాలను అందిస్తుంటే.. మొదటి లేదా రెండవ వారంలో శిశువు పూప్ పసుపు-గోధుమ లేదా ఆకుపచ్చ-తాన్ రంగులో ఉంటుంది. ఈ పూప్ చూసేందుకు పీనట్ బటర్ వలె మందంగా ఇంకా కొంచెం గట్టిగా ఉంటుంది. ఫార్ములా పాలలో ఉండే చక్కెర పులియడం వల్ల ఇది ఈస్ట్ లాంటి వాసన రావోచ్చు. అయితే, శిశువు తల్లి పాలు ఇంకా ఫార్ములా పాలను పడుతూ ఉంటే.. శిశువు పూప్ రంగు ముదురు పసుపు రంగులో ఉంటుంది.

4. గోధుమ రంగు పూప్ (Brown baby poop)

ఘనపదార్థ ఆహారాన్ని తినడం మొదలుపెట్టిన తర్వాత శిశువు ప్రేగులలో అనేక రకాల ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. దీని ఫలితంగా గోధుమ రంగు మరియు దుర్వాసన వస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమి తినిపిస్తున్నారనే దానిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. శిశువు మలం రంగు ఇప్పుడు ఎరుపు, నారింజ, ఆకుపచ్చ, పసుపు లేదా నీలం, ఇలా ఏ రంగుకైనా మారవచ్చు.

5. ఆకుపచ్చ-గోధుమ రంగు పూప్(Green-brown baby poop)

కొన్నిసార్లు శిశువుకు వైరల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు లేదా వారు డయేరియాకు గురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో.. శిశువు మలం పసుపు-గోధుమ లేదా ఆకుపచ్చ రంగులో నీళ్లలా పలుచగా కనిపిస్తుంది. యాంటీబయాటిక్స్ లేదా కొన్ని ఆహార పదార్థాల పట్ల విముఖత వల్ల కూడా ఇది సంభవించవచ్చు. దంతాలు వచ్చే సమయంలో లాలాజలం మింగడం లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా కూడా విరేచనాలు సంభవించవచ్చు.

6. ముదురు గోధుమ రంగు పూప్ (Dark brown baby poop)

శిశువుకు మలబద్ధకం ఉంటే శిశువు మలం కొంచెం గట్టిగా ఉంటుంది. ఇంకా ముదురు గోధుమ రంగులో కనిపిస్తుంది. ఇది చిన్న గుళికలు లేదా గోళీల లాగా ఉండవచ్చు. శిశువు ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోలేకపోతే లేదా కొన్ని ఆహార పదార్థాల పట్ల విముఖత ఉంటే శిశువు మలం ముదురు గోధుమ రంగులో కనిపిస్తుంది.

7. ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు పూప్ (Bright green baby poop)

శిశువు జీర్ణ వ్యవస్థ ద్వారా ఆహారం చాలా వేగంగా కదులుతున్నట్లయితే శిశువు మలం రంగు ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. శిశువు రొమ్ము లేదా సీసా నుండి పాలను చాలా వేగంగా తాగినప్పుడు, వారి మలం ఆకుపచ్చగా కనిపిస్తుంది. ఇది కూరగాయలు లేదా ఏదైనా ఐరన్ ఎక్కువ ఉన్న ఆహారం లేదా సప్లిమెంట్లను జీర్ణం చేసుకున్న కారణంగా కూడా సంభవించవచ్చు.

పూప్ ఆకృతి అంటే ఏమిటి? (What does the poop texture mean in Telugu)

ఆరోగ్యకరమైన ప్రేగు కదలిక కోసం, శిశువు మలం ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిపోవాలి. దాని ఆకృతి మృదువు నుండి గట్టిగా మారవచ్చు. మలం ఒకే ముక్కగా లేదా కొన్ని చిన్న ముక్కలుగా ఉంటే.. అది ఆరోగ్యకరమైన ప్రేగులకు సంకేతమని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. నీళ్లలా అవుతుంటే అది అతిసారాన్ని సూచిస్తాయి.

మలంలో శ్లేష్మం కలిసున్నట్లయితే? (What if you see mucus in the stool in Telugu)

శిశువు మలంలో చిన్న మొత్తంలో శ్లేష్మం కనిపిస్తే అది సాధారణం. తల్లిదండ్రులు దానిపట్ల ఆందోళన చెందకూడదు. అయినప్పటికీ.. శ్లేష్మం ఎక్కువైనప్పుడు అది అసాధారణ సంకేతం. అలాంటప్పుడు వైద్యుడిని సందర్శించాలని సిఫార్సు చేయబడింది.

మలంలో రక్తం కనిపిస్తే? (What if you see blood in the stool in Telugu)

శిశువు మలంలో రక్తం కనబడటం మలబద్ధకానికి సంకేతం కావచ్చు. కానీ కొన్నిసార్లు ఇది అనారోగ్య పరిస్థితి కూడా కావచ్చు. మలంలో రక్తం కనిపించిన శిశువుకు తక్షణ వైద్య సంరక్షణ అవసరమని సంకేతం.

మలంలో ఆహారపు ముక్కలు కనబడినట్లయితే? (What if I see food pieces in the stool in Telugu)

కొన్నిసార్లు శిశువు మలంలో గుర్తించదగిన ఆహారపు ముక్కలుంటాయి. మామూలుగా శిశువుకు పాలు మాన్పించిన తర్వాత ఇలా కనిపిస్తుంది. అంటే శిశువు ఇంకా నమలడం నేర్చుకుంటున్నదని ఇంకా తన జీర్ణవ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందుతుందని దీని అర్థం. ఆహారంలోని కొన్ని ముక్కలు పూర్తిగా జీర్ణం కాకుండా జీర్ణవ్యవస్థ గుండా బయటపడటం సహజం.

పిల్లలు ఎంత తరచుగా మలవిసర్జన చేయాలి? (How often should babies poop in Telugu)

అది వారు తీసుకొనే ఆహారాన్ని బట్టి ఉంటుంది. ఇది పెద్దగా ఆందోళన కలిగించే పరిస్థితి కాదు. ఫార్ములా పాలు అందించే శిశువులతో పోలిస్తే తల్లిపాలు త్రాగే శిశువులు తరచుగా మాలవిసర్జన చేస్తారు. పాలు తాగడం ఇంకా పూపింగ్ అనేవి ఒకదానితో ఒకటి సమాంతరంగా జరిగే ప్రక్రియలు. అందువల్ల, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమి తినిపిస్తున్నారో తెలుసుకోవాలి ఇంకా పూప్ రంగుపై ఒక కన్నేసి ఉంచాలి.

సూచన (Reference)

Lee M, Chen SC, Yang HY, Huang JH, Yeung CY, Lee HC. (2016) Infant Stool Color Card Screening Helps Reduce the Hospitalization Rate and Mortality of Biliary Atresia: A 14-Year Nationwide Cohort Study in Taiwan. Medicine (Baltimore)

Tags

Baby's Poop or Stool Color Say About Their Health in Bengali

శిశు సంరక్షణ తల్లుల ఎంపికైన నమ్మకమైన ఉత్పత్తులు

మీ చిన్నారి డైపర్ మార్పులు, మృదువైన చర్మ సంరక్షణ కోసం సురక్షితమైన, సున్నితమైన ఉత్పత్తులు మీకు సహాయపడతాయి.

Airprime Premium Diaper Pants S (5–9 kg, 26 Count) + 100% Plant-Based Baby Wipes (Pack of 2)

Airprime Premium Diaper Pants S (5–9 kg, 26 Count) + 100% Plant-Based Baby Wipes (Pack of 2)

Rash-free | Paediatrician Tested | Dermatologically Tested | Breathable | Expert Approved | No Harsh Bleaching Chemicals | Super-Saver Combo

₹849₹129735% Off
Rating
4.6
(55)
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

419 Moms bought
₹999₹154535% Off
Rating
3.9
()

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.